ఐపీఎల్లో మాజీ ఛాంపియన్స్ అయినా రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే ఆరోపణతో రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్ నుండి నిషేదించబడ్డాయి. 2016 మరియు 2017వ సంవత్సరాలలో ఈ రెండు టీంలు బ్యాన్ అవ్వడం కారణంగా మరో రెండు కొత్త టీంలు ఐపీఎల్లో పాల్గున్నాయి. అయితే అసలు ఈ రెండు జట్లు ఎందుకు ఐపీఎల్ నుండి బ్యాన్ అయ్యాయి. ఈ రెండు టీమ్స్ లో ఎవరు అవినీతికి పాల్పడ్డారు?
Why CSK And RR Banned For 2 Years From IPL
2013వ సంవత్సరం May 15వ తేదీ
ఐపీఎల్ 6వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 66వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ టీం 14 పరుగులు తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది.
2013వ సంవత్సరం May 16వ తేదీ
ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అప్పటి రాజస్థాన్ రాయల్స్ CEO అయినా రఘు అయ్యర్ కు ఒక కాల్ వచ్చింది. రాజస్థాన్ టీం స్టే చేస్తున్న హోటల్ మేనేజర్ ఒకరు రఘు అయ్యర్ కు కాల్ చేసి మీ కోసం ఢిల్లీ నుండి అసిస్టెంట్ కమీషనర్ వచ్చారు. మీతో మాట్లాడాలంట హోటల్ కు రండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. దింతో రఘు అయ్యర్ హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకుని అసిస్టెంట్ కమీషనర్ ను కలిసాడు. అప్పుడు ఆ కమీషనర్ రఘు అయ్యర్ తో మాట్లాడుతూ మీ టీంలో ఉన్న ముగ్గురు ఆటగాళ్లను అరెస్ట్ చేసేందుకు ఇక్కడకి వచ్చా అని షాకింగ్ న్యూస్ చెప్పాడు.
మీ టీం సభ్యులైన శ్రీశాంత్, అజిత్ చండీలా మరియు అంకిత్ చవాన్ లు స్పాట్ ఫిక్సింగ్ చేసారని మా దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు వచ్చా అని ఒక బాంబ్ విసిరారు. అంతేకాకుండా ఒక 45 నిమిషాల పాటు తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ను రఘు అయ్యర్ కు ఎక్సప్లయిన్ చేసిన ఆ కమీషనర్ ఆల్రెడీ మేము శ్రీశాంత్ మరియు అజిత్ చండీలాను అరెస్ట్ చేసి కారులో కూర్చోబెట్టం, ఇక ఇప్పుడు అంకిత్ చవాన్ ను అరెస్ట్ చేసి తీసుకువెళతాం అని రఘు అయ్యర్ కు చెప్పారు. సో 2013వ సంవత్సరం May 16వ తేదీన రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆధారాలు చూపించి పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు. అయితే అసలు ఈ ముగ్గరు ఆటగాళ్లు ఏం చేసారు? వాళ్ళ గురించి ఎలాంటి ఆధారాలు చూపించి పోలీసులు అరెస్ట్ చేసారు.
సో ఆ రోజు కమీషనర్ చూపించిన ఆధారాలు ప్రకారం ఈ ముగ్గురు ఆటగాళ్లు మినిమం మూడు మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. అబ్రాడ్ కు చెందిన బుకీలతో కలిసి ఈ ముగ్గురు ఒక ఒప్పందం చేసుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఓవర్ కు ఇన్ని పరుగులు ఇవ్వాలని దానికి బహుమతిగా మీకు 60 లక్షల రూపాయిలు క్యాష్ ఇస్తామని ఆ ముగ్గురి ఆటగాళ్లు బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే అనుకున్నట్టే ఈ ముగ్గురు ఆటగాళ్లు వేరువేరు మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసారని ఆ పోలీస్ కమీషనర్ రఘు అయ్యర్ కు చెప్పాడు.
Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)
ఇక ఆధారాలన్ని చూసి అవాక్కయిన రఘు అయ్యర్ ఈ విషయాన్ని వెంటనే రాజస్థాన్ టీం ఓనర్ అయినా రాజ్ కుంద్రాతో పాటు అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు చెప్పాడు. దింతో వీళ్లంతా కలిసి వెంటనే ఈ విషయాన్ని ప్రెస్ కు రిలీస్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇక అనుకున్నట్టే ఈ వార్త న్యూస్ లోకి వచ్చింది. అంతేకాకుండా చాలా తక్కువ టైములో కరోనా పాకినట్టు మొత్తం క్రికెట్ ప్రపంచమంతా ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ టీం ఈ ముగ్గురు ఆటగాళ్లను తమ ఫ్రాంచైజ్ నుండి సస్పెండ్ చేస్తునట్టు ఒక ప్రకటన విడుదల చేసారు. బీసీసీఐ కూడా ఈ ముగ్గురి ఆటగాళ్లను బ్యాన్ చేస్తునట్టు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
ఇక అదే రోజు ఈ ముగ్గురి ఆటగాళ్లతో పాటు పదకొండు మంది బుకీలను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదం పై పట్టుబిగించారు. ముఖ్యంగా ఈ పదకొండు బుకీస్ లో శ్రీశాంత్ కజిన్ జనార్దన్ కూడా ఉండటం అందరిని షాక్ చేసింది. అంతేకాకుండా వీళ్ళందర్ని విచారిస్తున్న టైంలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హర్షద్ మెహత స్కాములో ఒక్కో పెద్ద శాల్తీ పేరు బయటకొచ్చినట్టు చాలా మంది బిగ్ షాట్స్ పేర్లైతే ఈ స్పాట్ ఫిక్సింగ్ విచారణలో బయటకొచ్చాయి.
2013వ సంవత్సరం May 24వ తేదీ
అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రిన్సిపాల్ అయినా గురునాథ్ మేయప్పన్ ఈ బెట్టింగ్ సంస్థలతో లింక్స్ పెట్టుకున్నాడని అలాగే దీనికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని పోలీసుల అతన్ని కూడా అరెస్ట్ చేసారు. అయితే ఈ గురునాథ్ మేయప్పన్ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ తో CSK ఓనర్ అయినా N శ్రీనివాసన్ అల్లుడు. దింతో ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదం కాస్త మరింత పెద్దదిగా మారి రాజస్థాన్ తో పాటు చెన్నై టీంను కూడా చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం ఏదైనా ఐపీఎల్ టీం కు సంభందించిన వ్యక్తులు ఎవరైనా బుకీలతో సంబంధం పెట్టుకుని ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్ట్ అయితే ఆ టీంను కన్విక్ట్ చేసే అధికారం బీసీసీఐ కు ఉంటుంది.
2013వ సంవత్సరం May 26వ తేదీ
కానీ బీసీసీఐ మాత్రం ఈ విషయం పై తొందరపడకుండా మేరియప్పన్ కేసు గురించి విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యింది.
2013వ సంవత్సరం May 31వ తేదీ
అయితే ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజులకే బీసీసీఐ కు షాక్ తగిలింది. ఉన్నట్టుండి అప్పటి బీసీసీఐ సెక్రటరీ అయినా సంజయ్ తో పాటు ట్రేసరర్ అజయ్ షిర్కే తమ పదవులకు రాజీనామా చేసారు. దింతో ఒక్కసారిగా బీసీసీఐతో పాటు ఐపీఎల్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి.
2013వ సంవత్సరం June 1వ తేదీ
సరిగ్గా ఇదే టైములో జూన్ 1వ తేదీన IPL చైర్మన్ అయినా రాజీవ్ శుక్లా కూడా ఈ లీగ్ పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ తన చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. అలాగే CSK ఓనర్ గా ఉండీ ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న N శ్రీనివాసన్ కూడా బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించి జగ్మోహన్ దాల్మియా ను కొత్త బీసీసీఐ ప్రెసిండెట్ గా నియమించారు.
2013వ సంవత్సరం June 6వ తేదీ
ఇక ఇదంతా ఇలా ఉండగా జూన్ 6వ తేదీన ఢిల్లీ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. రాజస్థాన్ కో ఓనర్ అయినా రాజ్ కుంద్రా కూడా కొన్ని బెట్టింగ్ మూటలతో సంబంధం పెట్టుకున్నాడనని ఒక స్టేట్మెంట్ ను రిలీజ్ చేసారు. దింతో రాజ్ కుంద్రా తన ఓనర్ షిప్ ను కోల్పోయాడు.
2013వ సంవత్సరం June 10వ తేదీ
అయితే జూన్ 10వ తేదీన ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు ఆటగాళ్లకు కూడా కోర్ట్ బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ ఇష్యూ పై కుంచెం సీరియస్ అయినా బీసీసీఐ ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది.
2013వ సంవత్సరం September 13వ తేదీ
ఇక ఈ వివాదం పై పూర్తిగా విచారణ జరిపిన బీసీసీఐ ఆ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన ఈ కేస్ లో నేరస్థులుగా రుజువైన ఆటగాళ్ల పై బ్యాన్ విధించింది. ముఖ్యంగా శ్రీశాంత్ మరియు అంకిత్ చవాన్ పై లైఫ్ టైం బ్యాన్ విధిస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే వీరితో పాటు ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో దోషులని రుజువైన మరికొంత మంది డొమెస్టిక్ ఆటగాళ్లకు కొన్ని సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది.
2013వ సంవత్సరం October 8వ తేదీ
అయితే ఈ కేస్ ను కుంచెం సీరియస్ గా తీసుకున్న గవర్నమెంట్ మాత్రం సుప్రీమ్ కోర్ట్ వరకు తీసుకెళ్లింది. దింతో అదే ఏడాది అక్టోబర్ 8వ తేదీన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ గురించి లోతుగా విచారణ చెయ్యాలని ముకుల్ ముద్గల్ ఆధ్వర్యంలో సుప్రీమ్ కోర్ట్ ఒక స్పెషల్ కమిటీను ఏర్పాటు చేసింది. ఇక ఈ స్పెషల్ కమిటీ దాదాపు ఒక ఐదు నెలల పాటు ఈ ఇష్యూ పై ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసింది.
2014వ సంవత్సరం February 10వ తేదీ
క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఈ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో CSK ప్రిన్సిపాల్ అయినా మేయప్పన్ తప్పు చేసినట్టు రుజువైయింది. దింతో అతను జైలుకు వెళ్ళాడు. అలాగే అదే ఏడాది తన అల్లుడు విషయంలో కొన్ని తప్పులు చేసిన N శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ పదవి నుండి తొలగించారు. అయితే ముద్గల్ కమిటీ మాత్రం తమ ఇన్వెస్టిగేషన్ ను ఆపలేదు. ఈ కేసు గురించి పూర్తిగా విచారణ చేసి 2014వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన తమ ఫైనల్ రిపోర్ట్ ను సుప్రీమ్ కోర్ట్ కు సబ్మిట్ చేసింది.
ఇక ఈ రిపోర్ట్ లో ముద్గల్ కమిటీ చెప్పిందేంటంటే, మేయప్పన్ తో పాటు రాజ్ కుంద్రా కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో దోషులని, బుకీలతో సంబంధం పెట్టుకుని స్పాట్ ఫిక్సింగ్ చేయడం మరియు బెట్టింగ్ మూటలతో కలిసి అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అలాగే వీళ్ళిద్దరితో పాటు అప్పటి ఐపీఎల్ COO సుందర్ రామన్ కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో దోషి అని ముద్గల్ కమిటీ నిరూపించింది.
2015వ సంవత్సరం జూన్ 22వ తేదీ
అయితే సుప్రీం కోర్ట్ మాత్రం ఈ స్పాట్ ఫిక్సింగ్ లో దోషులైన వాళ్ళకి ఎలాంటి శిక్ష విదించాలనే దాని పై ఒక స్పష్టత కావాలని చెప్పి 2015వ సంవత్సరం జూన్ 22వ తేదీన RM లోధా ఆధ్వర్యంలో ఒక కమిటీను ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ అయితే IPL గవర్నింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఒక టీం యొక్క ఆఫీసియల్ మెంబెర్ బుకీలతో సంబంధం పెట్టుకుని తప్పు చేసినట్టు రుజువైంది కాబట్టి ఆ కోడ్ ప్రకారం RR మరియు CSK టీంలను బ్యాన్ చెయ్యాలని చెప్పారు.
2015వ సంవత్సరం జూలై 14వ తేదీ
దింతో 2015వ సంవత్సరం జూలై 14వ తేదీన RR మరియు CSK జట్ల యొక్క ఓనర్స్ తప్పు చేసారు కాబట్టి ఆ రెండు జట్ల పై రెండు సంవత్సరాల బ్యాన్ విధించారు. అంటే ఓనర్స్ గ్రూప్ లో ఉన్న కొంత మంది మెంబెర్స్ తప్పు చేయడం వల్ల ఈ రెండు టీంలు బ్యాన్ అయ్యాయి గానీ, ప్లేయర్స్ కు దింతో ఎలాంటి సంబంధం లేదు. ఇక బీసీసీఐ మేయప్పన్ తో పాటు రాజ్ కుంద్రా పై లైఫ్ టైం బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే బీసీసీఐ ఆధ్వర్యంలో ఉండే ఏ క్రికెట్ టీంతో కూడా వీళ్ళు ఆఫీసియల్ గా ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. జస్ట్ ఒక కామన్ మాన్ లా మ్యాచ్ చూడాలి అంతే.
ఇక అదే ఏడాది జూలై 26వ తేదీన ఈ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ప్లేయర్స్ తప్పు లేదని గ్రహించిన ఢిల్లీ హై కోర్ట్ శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా మరియు అంకిత్ చవాన్ లను నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే 2019వ సంవత్సరంలో బీసీసీఐ కూడా శ్రీశాంత్ పై ఉన్న బ్యాన్ ను ఎత్తివేసింది. అయితే సుప్రీమ్ కోర్ట్ మాత్రం బీసీసీఐ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని చెప్పి లోధా కమిటీను కంటిన్యూ చేస్తూ వచ్చింది. దింతో బీసీసీఐ మరియు లోధా కమిటీ కు కొన్ని సార్లు గొడవ జరిగిన కూడా మరల ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ లాంటి సంఘటనలు జరగలేదు. ఇక రెండేళ్ల తరువాత తిరిగి ఇపాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన RR మరియు CSK జట్లు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేకుండా తమ జర్నీను కొనసాగిస్తున్నాయి.
Also Read – Ambati Rayudu Biography In Telugu (అంబటి రాయుడు బయోగ్రఫీ)