What Is Two Paced Wicket In Cricket (క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి)

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి – జనరల్ గా మనం మ్యాచ్ చూస్తున్న టైంలో ఒక్కోసారి బాట్స్మన్ బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఒక బాల్ బ్యాట్ మీదకు స్ట్రెయిట్ గా వస్తే ఇంకో బాల్ లేట్ గా వస్తుంది. అలాంటప్పుడు మ్యాచ్ చూస్తున్న కామంటేటర్స్ బాట్స్మన్ బాల్ యొక్క పేస్ ను అంచనా వెయ్యడంలో ఫెయిల్ అయ్యాడని పిచ్ క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ గా ఉందని అంటుంటారు. అయితే అసలు క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ లేదా క్రికెట్ లో టూ పేస్డ్ పిచ్ అంటే ఏంటి? ఎందుకు బాట్స్మన్ అలాంటి పిట్చెస్ మీద బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతారో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి?

పేరులోనే ఉంది క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్. అంటే పిచ్ లో వేగం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి భయ్యా పిచ్ లో వేగం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని క్లియర్ చేయడానికి ఒక ఉదాహరణ చెప్తా వినండి.

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి
క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ (Image Credit)

Also Read – What Is Dew Factor In Cricket (క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి?)

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ వివరణ (ఉదాహరణతో)

ఇప్పుడు మీరొక సిమెంట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి. అలాగే ఒక బౌలర్ గంటకి 100 కిలోమీటర్స్ వేగంతో బాల్ రిలీజ్ చేసాడనుకోండి. సో అది మీ దగ్గరకు వచ్చేటప్పటికి కుంచెం వేగాన్ని మాత్రమే కోల్పోతుంది. అంటే పిచ్ పై బౌన్స్ అయినా తర్వాత రిలీజ్ చేసినప్పుడు 100 కిలోమీటర్ల వేగం ఉన్న బాల్ కాస్త 90 కిలోమీటర్స్ వేగంతో బాల్ మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే సిమెంట్ పిచ్ గట్టిగా ఉంటుంది. బ్రేక్ చెయ్యడం కష్టం. బాల్ దాని పై పిచ్ అయినా తర్వాత ఎక్కువ పేస్ కోల్పోదు. అలాగే పేస్ అండ్ బౌన్స్ కూడా ఉంటుంది కాబట్టి బాల్ వేగంగా బ్యాట్స్మన్ దగ్గరికి వస్తుంది.

ఇక ఇప్పుడు మీరు అదే స్పీడ్ ఉన్న బాల్ ను ఒక మట్టి నెల మీద ఎదుర్కొంటే అది మీ దగ్గరకు వచ్చే సరికి దాని స్పీడ్ 70 కిలోమీటర్స్ కు పడిపోతుంది. అంటే మట్టి నెల పై బౌన్స్ అయిన తరువాత బాల్ దాని స్పీడ్ కుంచెం ఎక్కువగా కోల్పోతుంది. ఎందుకంటే మట్టి నెలకు చీలిపోయే తత్త్వం ఉంటుంది. అంటే ఏదైనా వస్తువును మట్టి నేలపై పడేస్తే మనం పడేసిన ఆ వస్తువు యొక్క ఎనర్జీను టాప్ లేయర్ అబ్సర్వ్ చేసుకుంటుంది. దీని ప్రకారం వేగంగా వచ్చే బాల్ మట్టి నేల పై పడినప్పుడు టాప్ లేయర్ కొంతవరకు బ్రేక్ అయ్యి బాల్ యొక్క స్పీడ్ ను తగ్గిస్తుంది. దీని వల్ల బాల్ అనేది బౌన్స్ అయ్యాక ఆగి కుంచెం స్లో గా బ్యాట్ పైకి వస్తుంది. దీన్నే క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటారు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.

ఇక్కడ రెండు కేసుల్లో కూడా బౌలర్ బాల్ ను ఒకే స్పీడ్ తో రిలీజ్ చేసాడు. బట్ బాట్స్మన్ ఆడే పిచ్ కారణంగా బాల్ యొక్క పేస్ అనేది మారిపోయింది. ఇక ఇప్పుడు ఒకసారి మీరే ఊహించుకోండి ఈ సిమెంట్ పిచ్ మరియు బ్లాక్ సాయిల్ పిచ్ ను కలిపి ఒక ప్రత్యేకమైన పిచ్ గా తాయారుచేస్తే ఎలా ఉంటుంది. ఆ పిచ్ లో సిమెంట్ ఎక్కువగా ఉన్న ఏరియా లో బాల్ పిచ్ అయితే అది బాగా బౌన్స్ అయ్యి బ్యాట్ మీదకు స్పీడ్ గా వస్తుంది. అలాకాకుండా సాయిల్ ఎక్కువగా ఉన్న చోట బాల్ పిచ్ అయితే కుంచెం స్లో గా బ్యాట్ మీదకు వస్తుంది. బట్ బౌలర్ వేసిన బాల్ యొక్క స్పీడ్ మాత్రం ఒకటే.

Also Read – About “Sir” Title In Cricket (క్రికెట్ ఆడే ఆటగాళ్లకు “సర్” అనే బిరుదు ఎలా వస్తుంది?)

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ వల్ల బ్యాట్సమెన్ పడే ఇబ్బందులు

ఒకవేళ మీరు ఈ రెండు బాల్స్ కు ఒకే స్పీడ్ తో బ్యాట్ ను ఊపారనుకో సెకండ్ బాల్ ఆడినప్పుడు మీరు సరిగ్గా టైం చెయ్యలేరు. బౌలర్ హ్యాండ్ నుండి మీరు అది ఏ బాలో అని ముందే పిక్ చేసిన పిచ్ మీద పడ్డాక స్పీడ్ మారిపోతుంది కాబట్టి షాట్స్ ను మంచి టైమింగ్ తో ఆడలేరు. సో క్రికెట్ లో ఎప్పుడైతే ఒక పిచ్ ఇలా రెండు రకాలుగా బిహేవ్ చేస్తుందో దాన్ని క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటారు. అంటే క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేసినప్పుడు ఒక బాల్ బ్యాట్ మీదకు వస్తుంది మరో బాల్ బ్యాట్ మీదకు రాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ ఈక్వల్ టూ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ పిచ్ అండ్ డస్టి పిచ్.

ఇక ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో. అయితే ఇప్పుడు క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ మీద బ్రావో లాంటి బౌలర్ వచ్చి బౌలింగ్ చేసాడంటే బాట్స్మన్ కు చుక్కలు కనపడతాయి. ఎందుకంటే నార్మల్ పేస్ బౌలర్ వేసినప్పుడే బాల్ బౌన్స్ అయ్యాక స్పీడ్ పెరుగుద్దో లేదో అంచనా వెయ్యడం కష్టం. అలాంటిది చేంజ్ ఆఫ్ పేస్ లో మాస్టారి చేసిన బ్రేవో వచ్చి బౌలింగ్ చేస్తే బాట్స్మన్ ఆడే షాట్స్ లో అస్సలు టైమింగ్ కుదరదు. దింతో రన్స్ రావు అలాగే వికెట్లు కూడా పడిపోతాయి.

క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్
క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ – బ్రావో

మీకు ఇంకా బెస్ట్ ఎక్సమ్పుల్ ఏంటంటే ఒక్కోసారి బాట్స్మన్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని అవుట్ అవుతాడు. అంటే బాల్ రాకముందే ఎర్లీగా షాట్ ఆడటం వల్ల అది బ్యాట్ ఎడ్జ్ కు తగిలి గాల్లోకి లేస్తుంది. సో అక్కడ బాట్స్మన్ బాల్ యొక్క పేస్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయాలంటే బ్యాట్ ను అడ్డంగా ఊపకుండా బౌలర్ హెడ్ పై నుండి బాల్ వెళ్లేలా స్ట్రెయిట్ బ్యాట్ షాట్స్ ఆడాలి. అప్పుడు కుంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. ఎనీవే క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అసాధారణ స్కిల్స్ ఉన్న బాట్స్మన్ మాత్రమే పిచ్ యొక్క పేస్ కు తగట్టు తమ షాట్స్ లో టైమింగ్ ను సెట్ చేసుకుని బ్యాటింగ్ చేస్తారు. అలాంటాప్పుడు ఆ ఒక్క బాట్స్మన్ వేరే పిచ్ పై బ్యాటింగ్ చేస్తునట్టు అనిపిస్తుంది.

45
క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ – విరాట్ కోహ్లీ

Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)