What Is Sight Screen In Cricket Telugu

Sight Screen In Cricket Telugu – సాధారణంగా ఒక బ్యాట్సమెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి బాల్ డెలివర్ చెయ్యబోతున్న బౌలర్ ను ఆపేసి అంపైర్ కు తన వెనుక ఎదో ప్రాబ్లెమ్ ఉందని చేతితో సైగ చేస్తూ చెప్తాడు. అప్పుడు కామ్ బాక్స్ లో ఉన్న కామెంటేటర్లు సైట్ స్క్రీన్ లో ఎదో సమస్య వచ్చినట్టుంది అని చెబుతారు. అయితే అసలు ఆ సైట్ స్క్రీన్ అంటే ఏమిటి? దాన్ని ఎందుకు యూస్ చేస్తారు? ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Sight Screen In Cricket Telugu
Sachin was telling about the sight screen problem to Ricky Ponting

What Is Sight Screen In Cricket Telugu

సైట్ స్క్రీన్ ను క్రికెట్ లో వాడే ఒక టూల్ గా పరిగణిస్తారు. దీన్ని చెక్కతో లేదా వేరే ఏ మెటల్ తో అయినా తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన దాన్ని ఫ్రేమ్ అంటారు. ఇక ఈ ఫ్రేమ్ కు చాలా సందర్భాల్లో ఒక గుడ్డను కట్టి వేలాడదీస్తారు. అయితే కొన్ని స్టేడియాల్లో మాత్రం క్లాత్ ప్లేస్ లో పాలీ కార్బోనేట్ స్లాట్స్ ను ఉపయోగిస్తారు. ఇక ఇలా తయారు చేసిన పరికరాన్ని బాట్స్మన్ కు ఎదురుగా అంపైర్ వెనకాల ఉండే బౌండరీ లైన్ అవతల ఈ సైట్ స్క్రీన్ ను అమరుస్తారు. అయితే అసలు ఈ సైట్ స్క్రీన్ ఎందుకు? దీని వల్ల ఉపయోగం ఏంటి?

Also Read – What Is Night Watchman In Cricket Telugu (క్రికెట్ లో నైట్ వాచ్మాన్ అంటే ఏంటి?)

Sight Screen In Cricket Telugu
Traditional Sight Screen In Cricket Telugu (Image Credit)

What Is The Use Of Sight Screen In Cricket Telugu

ఈ సైట్ స్క్రీన్ ఉపయోగం ఏంటంటే ఒక బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు తను వెయ్యబోయే బాల్ బ్యాట్సమెన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకాగ్రతతో చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఎందుకంటే కేవలం 9 అంగుళాల చుట్టుకొలత కలిగిన ఒక బాల్ ను 140 కిలోమీటర్ల వేగంతో మన వైపుగా విసిరినప్పుడు దాన్ని నార్మల్ గా చూడటం అంటే చాలా కష్టం. సో అలాంటి క్రికెట్ బాల్ ను మనం ఇబ్బంది లేకుండా చూడాలంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ గా ఉండాలి. అందుకే బ్యాట్సమెన్ కు అపోజిట్ డైరెక్షన్ లో బౌండరీ లైన్ అవతల ఈ సైట్ స్క్రీన్ ను అమరుస్తారు.

Also Read – What Is Batting Guard In Cricket Telugu (క్రికెట్ లో బ్యాటింగ్ గార్డ్ అంటే ఏంటి?)

ఇక బ్యాట్సమెన్ బ్యాటింగ్ చేసినప్పుడు ఈ సైట్ స్క్రీన్ మొత్తం ఒకే కలర్ లో ఉండాలి. అలాగే దాని ముందుకు గానీ లేదా దాని దగ్గరలోకి గాని అభిమానులు ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే సైట్ స్క్రీన్ దగ్గర ఏదైనా వేరే కలర్ లో కదులుతూ ఉంటే బ్యాట్సమెన్ బాల్ ఫై సరిగ్గా కాన్సంట్రేట్ చెయ్యలేడు. అందుకే ఆ సైట్ స్క్రీన్ దగ్గర ఏదైనా కుంచెం గందరగోళంగా అనిపించినా వెంటనే బ్యాట్స్మన్ బౌలెర్ ను ఆపేసి అంపైర్ కు పిర్యాదు చేస్తాడు.

ఇక సాధారణంగా ప్రతి గ్రౌండ్ లో రెండు సైట్ స్క్రీన్ లు ఉంటాయి. ఒకటేమో బ్యాట్సమెన్ కు అపోజిట్ డైరెక్షన్ లో అంపైర్ వెనకాల ఉంటే మరొకటి కీపర్ వెనకాల ఉంటుంది. అండ్ ఇలా ఎందుకంటే బౌలింగ్ ఎప్పుడు కూడా ఒకే ఎండ్ నుండి వెయ్యరు. ప్రతి ఓవర్ కు బౌలింగ్ ఎండ్ ను మారుస్తూ ఉంటారు.

Color Of The Sight Screen In Cricket Telugu

లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో అంటే వన్డే మరియు టీ20 క్రికెట్ లో ఈ సైట్ స్క్రీన్ నలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ఫార్మట్స్ లో వాడే బంతి అనేది తెలుపు రంగులో ఉంటుంది. దింతో తెల్లగా ఉండే బాల్ నలుపు బాక్గ్రౌండ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఈ సైట్ స్క్రీన్ తెలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో రెడ్ లేదా పింక్ బాల్ ను వాడుతూ ఉంటారు. దింతో ఈ రెండు రకాల బాల్స్ లైట్ కలర్ అయినా వైట్ బాక్గ్రౌండ్ లో స్ఫష్టంగా కనిపిస్తాయి కాబట్టి టెస్ట్ క్రికెట్ లో సైట్ స్క్రీన్ తెలుపు రంగులో ఉంటుంది. ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక సైట్ స్క్రీన్ ను బ్యాట్సమెన్ ఉపయోగించుకుంటే అతని వెనకాల ఉండే మరో సైట్ స్క్రీన్ మీద యాడ్స్ ను డిస్ప్లే చేస్తారు.

Also Read – 286 Runs Off 1 Ball Is Real or Fake Story (1 బంతికి 286 పరుగులు నిజంగానే కొట్టారా)

Sight Screen In Cricket Telugu
Two most prominent colors of the Sight Screen in cricket

Size Of The Sight Screen In Cricket Telugu

ఈ సైట్ స్క్రీన్ పరిమాణం విషయానికి వస్తే, నిర్దిష్ట నియమాలు అంటూ ఏమి లేవు. ప్రతి మైదానం బట్టి ఈ సైట్ స్క్రీన్ సైజు మారుతూ ఉంటుంది. అయితే, మీరు స్థానిక మైదానాల్లో చూసే సైట్ స్క్రీన్లు 4.5 x 4.25 మీటర్లు ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ క్రికెట్‌లో, మైదానాలు విస్తృతంగా ఉంటాయి. అలాగే అవుట్‌ఫీల్డ్ కూడా చాలా పొడవుగా ఉంటుంది. దింతో MCG లాంటి ముఖ్యమైన క్రికెట్ గ్రౌండ్స్ లో ఆడుతున్నప్పుడు బ్యాట్స్‌మన్‌కు పెద్ద సైట్ స్క్రీన్ అవసరం. కాబట్టి సాధారణంగా, అంతర్జాతీయ మైదానాల్లోని సైట్ స్క్రీన్ సైజ్ అనేది 200 స్క్వేర్ మీటర్స్ (36మీ x 6మీ) కంటే ఎక్కువగా ఉంటుంది.

Also Read – 5 Middle Order Batsmen Who Became Great Openers (మిడిలార్డర్ బ్యాట్సమెన్ నుండి ఓపెనర్స్ గా మారిన టాప్ 5 ప్లేయర్స్)