Night Watchman In Cricket – 2006వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ వాళ్ళ మొదటి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక రెండో రోజు మూడో సెషన్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీం 67 పరుగులు వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. అయితే డే ను ముగించేందుకు ఎన్నో ఓవర్లు లేవు పైగా లైట్ కూడా అంత బాగోలేదు. దింతో ఆస్ట్రేలియా వాళ్ళ పేస్ బౌలర్ జేసన్ గిలెస్పీ ను నైట్ వాచ్మాన్ గా పంపింది. అండ్ అలా నెంబర్ 3 లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ బౌలర్ ఆ మ్యాచులో ఏకంగా 201 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. దింతో ఆస్ట్రేలియా టీం ఆ మ్యాచ్ ను చాలా సునాయాసంగా గెలిచింది. అయితే అసలు నైట్ వాచ్మాన్ అంటే ఏంటి?
Who Called As A Night Watchman In Cricket?
ఒక టెస్ట్ మ్యాచులో ఏదైనా టీం తమ ఇన్నింగ్స్ ను ఆ రోజు మూడో సెషన్ లో ప్రారంభించినప్పుడు ఆ టీం తమ ఓపెనర్ వికెట్ ను కోల్పోతే ఆ తరువాత వెంటనే ఒక ప్రొపెర్ బ్యాట్సమెన్ ను పంపకుండా లోయార్డర్ లో ఎవరయినా ఆటగాన్ని ఎక్కువ సందర్భాల్లో ఒక బౌలర్ ను బ్యాటింగ్ కు పంపుతారు. అతన్నే నైట్ వాచ్మాన్ అంటాం.
Why Does A Lower Batsman Send As Night Watchman In Cricket?
అయితే ఒక టీం ఇలా ఎందుకు ఒక బౌలర్ ని నెంబర్ 3 or 4 లో పంపుతుందంటే, మనం పైన చెప్పుకున్న మ్యాచులో ఆస్ట్రేలియా కు ఆ రోజులో ఇంకా ఎన్నో ఓవర్లు మిగిలిలేవు. పైగా లైట్ కూడా మందగించింది. అంతే కాకుండా అపొనెంట్ టీం కొత్త బంతితో మంచిగా స్వింగ్ రాబడుతూ ఫుల్ ఎనర్జీ తో ఉంటారు.
ఇలాంటి టైంలో ఒక వికెట్ పడ్డాక ఇంకో ప్రధాన బ్యాట్సమెన్ ను పంపితే అతని వికెట్ కూడా కోల్పోయే ప్రమాదముంది. పైగా ఆటగాళ్లంతా ఆ రోజు మొత్తం ఫీల్డింగ్ చేసి అలసిపోయి ఉంటారు. దింతో ఇలాంటి పరిస్థితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 3 బ్యాట్సమెన్ ను పంపడం కుంచెం రిస్క్. ఎలానూ మిగిలుంది కొంత సమయమే కాబట్టి ఆ సమయాన్ని జాగ్రత్త గా నెగోషియేట్ చేసి ఆ రోజును ముగించేందుకు బాల్ ను కుంచెం డిఫెండ్ చెయ్యగలిగే బౌలర్ ను పంపుతారు. ఇక్కడ లాజిక్ ఒక్కటే వరుసగా రెండు మెయిన్ వికెట్లను కోల్పోవడం కన్నా ఒక బాట్స్మన్ మరియు బౌలర్ వికెట్ ను కోల్పోతే టీంకు తక్కువ డామేజ్ అవుతుంది.
Also Read – Early Retirement In Cricket – 5 Legendary Cricketers Who Retired When They Were In Their Prime
What Is The Role Of Night Watchman In Cricket?
ఇక ఈ నైట్ వాచ్మాన్ రోల్ ఏంటంటే విధ్వంసకర బ్యాటింగ్ చెయ్యమని కాదు. ఆ రోజులో మిగిలిన సమయం జాగ్రత్తగా నెగోషియేట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తన టీం బ్యాట్సమెన్ కు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసేలా అవకాశం కల్పించడం. అందుకే ఇలా నెంబర్ 3 వచ్చే బౌలర్ ను నైట్ వాచ్మాన్ అంటారు. ఇక ఈ నైట్ మ్యాచ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంత వరకు బ్యాటింగ్ చేసి నెక్ట్ వచ్చే బాట్స్మన్ కు పరిస్థితుల పై ఒక అంచనా వేసేందుకు హెల్ప్ చేస్తాడు.
అయితే ఇదంతా ఆ నైట్ వాచ్మాన్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అలా కాకుండా తాను వచ్చి రాగానే అవుట్ అయితే టీం మళ్లి కుంచెం రిస్క్ లో పడుతుంది. దీనివల్లే చాలా మంది కెప్టెన్లు ఈ పద్దతని ఎక్కువుగా వాడారు. ఎవరికైతే వాళ్ళ బౌలర్ యొక్క బ్యాటింగ్ డిఫెన్సె స్కిల్ మీద కుంచెం నమ్మకం ఉంటుందో అతన్ని మాత్రమే నైట్ వాచ్మాన్ గా పంపుతారు.
Who Is Best Night Watchman In Cricket?
మనం పైన చెప్పుకున్న జేసన్ గిలెస్పీ ను ఆల్ టైం బెస్ట్ నైట్ వాచ్మాన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఆ మ్యాచులోనే కాకుండా చాలా సార్లు నైట్ వాచ్మాన్ గా వచ్చి తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అంతే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక నైట్ వాచ్మాన్ జేసన్ గిలెస్పీ.
Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)
అదే మన టీమిండియా తరుపున బెస్ట్ నైట్ వాచ్మాన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా ఇషాంత్ శర్మనే. ఇప్పటివరకు నైట్ వాచ్మాన్ గా 12 ఇన్నింగ్సలాడిన ఇషాంత్ 345 బాల్స్ ను ఎదుర్కొని 105 పరుగులు సాధించాడు. అంటే ఒక ఇన్నింగ్స్ కు ఎవరేజ్ గా దాదాపు 30 బంతులను నెగోషియేట్ చేసాడు.