Batting Guard In Cricket – మనం జనరల్ గా గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టంప్స్ కు అడ్డుగా నిలబడి బ్యాటింగ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బౌలర్ కవరింగ్ ఇవ్వు కవరింగ్ ఇవ్వు అని మన మీద అరుస్తాడు. సో బౌలర్ అలా అడిగినప్పుడు మనం అతనికి రెస్పెక్ట్ ఇచ్చి కవరింగ్ ఇస్తే నో ప్రాబ్లెమ్. అలా కాకుండా బౌలర్ కవరింగ్ అడిగాక కూడా మనం పదే పదే స్టంప్స్ కు అడ్డంగా నిలబడితే కొంతమంది కోపంతో బంతిని మన మొహంపైకి విసిరేస్తారు. ఇది గల్లీ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికి ఎక్సపీరియెన్స్ అయ్యే ఉంటుంది.
What Is Batting Guard In Cricket
మరి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇలా ఉంటుందా అంటే అవును ఉంటుంది. కానీ బౌలర్ ఎప్పుడు బ్యాట్సమెన్ ను కవరింగ్ ఇవ్వమని అడగడు. ఎందుకంటే గల్లీ క్రికెట్ లో lbw ఔట్స్ మాక్సిమం ఉండవు. అందుకే మనం మన వికెట్ ను కాపాడుకోడానికి స్టంప్స్ మొత్తం కవర్ చేసి బ్యాటింగ్ చేస్తాం. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో lbw ఔట్స్ ఉంటాయి. దింతో బ్యాట్సమెన్ క్రీజ్ లో ఎక్కడ నిలబడి బ్యాటింగ్ చేసిన బౌలర్ క్వశ్చన్ చెయ్యడు.
అయితే బ్యాట్సమెన్ మాత్రం తాను స్టంప్స్ ముందు ఎక్కడ నిలుచుని బ్యాటింగ్ చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం క్రీజ్ లోకి రాగానే అంపైర్ కు తన వేళ్ళను చూపించి బ్యాట్ తో వైట్ లైన్ పై మార్క్ చేసుకుని బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇలా మార్క్ చేసుకునే వాటినే బ్యాటింగ్ గార్డ్స్ అంటారు.
Also Read – 5 Most Unlucky Cricketers Of India (క్రికెట్ లో దురదృష్టవంతులు)
Why Batting Guard Is Important In Cricket
అయితే ఒక బ్యాట్సమెన్ ఇలా క్రీజ్ లోకి వచ్చాక ఎందుకు బ్యాటింగ్ గార్డ్ తీసుకుంటాడంటే మనం పైన చెప్పుకున్నట్టు ఒక బ్యాట్సమెన్ స్టంప్స్ ముందు ఎక్కడ నిలబడి బ్యాటింగ్ చేస్తున్నాడో అతనికి తెలియాలి. అప్పుడే ఏ బాల్ ఆడాలో ఏ బాల్ వదిలేయాలో అతనికి ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే బాల్ ను అంచనా వెయ్యలేక క్లీన్ బౌల్డ్ అవ్వడమే లేదా lbwగా అవుట్ అవ్వడమే జరుగుతుంది. అందుకే ఒక బ్యాట్సమెన్ క్రీజ్ లోకి రాగానే అంపైర్ ను అడిగి తన బ్యాటింగ్ టెక్నిక్ కు సరిపోయే గార్డ్ ను తీసుకుంటాడు.
అయితే ఇక్కడ బ్యాట్సమెన్ అంపైర్ ను ఇలా ఎందుకు అడుగుతాడంటే, బ్యాట్సమెన్ కు అపోజిట్ డైరెక్షన్ లో స్ట్రెయిట్ గా నిలుచున్న అంపైర్ కు మాత్రమే బ్యాట్ ను ఏ స్టంప్ దగ్గర పెడుతున్నాడో క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే బ్యాట్సమెన్ క్రీజ్ లోకి వస్తాడు. వైట్ లైన్ పై బ్యాట్ పెట్టి అంపైర్ కు తన ఫింగర్స్ ను సిగ్నల్ గా చూపిస్తాడు. ఆ సిగ్నల్ బట్టి బ్యాట్సమెన్ తను అనుకున్న బ్యాటింగ్ గార్డ్ తీసుకున్నాడో లేదో అని అంపైర్ చెక్ చేసి చెప్తాడు.
ఒకవేళ బ్యాట్సమెన్ సరిగ్గా తను అనుకున్న గార్డ్ దగ్గరే బ్యాట్ ను పెడితే అంపైర్ థంబ్స్ అప్ చెప్పి క్యారీ ఆన్ అంటాడు. అదే బ్యాట్సమెన్ తను అనుకున్న బ్యాటింగ్ గార్డ్ దగ్గర తన బ్యాట్ ను కరెక్ట్ గా పెట్టకపోతే అప్పుడు అంపైర్ నీ బ్యాట్ ను కుంచెం అటు జరుపు ఇటు జరుపు అంటూ సిగ్నల్స్ ఇచ్చి దాన్ని సరిచేస్తాడు. ఆ తరువాత బ్యాట్సమెన్ ఆ వైట్ లైన్ పై తన షూ స్పైక్స్ తో మార్క్ చేసుకుని బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు.
Types Of Batting Guard In Cricket
ఇక జనరల్ గా బ్యాటింగ్ గార్డ్స్ అనేవి ఐదు రకాలుగా ఉంటాయి.
- Leg Stump Guard
- Leg & Middle Stump Guard
- Middle Stump Guard
- Middle & Off Stump Guard
- Off Stump Guard
Leg Stump Guard
బ్యాట్సమెన్ లెగ్ స్టంప్ గార్డ్ తీసుకోవాలనుకుంటే అంపైర్ కి ఒక ఫింగర్ ని చూపిస్తాడు. ఇక చాలా మంది బ్యాట్సమెన్ lbw ను అవాయిడ్ చెయ్యడం కోసం లెగ్ స్టంప్ దగ్గర నిలబడి ఆడటానికే ఎక్కువుగా మొగ్గు చూపుతారు.
Also Read – 286 Runs Off 1 Ball Is Real or Fake Story (1 బంతికి 286 పరుగులు నిజంగానే కొట్టారా)
Leg & Middle Stump Guard
అయితే డిఫన్స్ బాగా వచ్చిన కొంత మంది బ్యాట్సమెన్ మాత్రం లెగ్ అండ్ మిడిల్ స్టంప్ గార్డ్ తీసుకుని లెగ్ స్టంప్ కు మిడిల్ స్టంప్ కు మధ్యలో నిలబడి బ్యాటింగ్ చేస్తారు. సో బ్యాట్సమెన్ ఇప్పుడు ఈ గార్డ్ తీసుకోవడం కోసం అంపైర్ కు రెండు నెంబర్ ను తన ఫింగర్స్ ద్వారా చూపించి సిగ్నల్ ఇస్తాడు.
Middle Stump Guard
ఇక లెగ్స్ పైకి వచ్చే బాల్స్ ను ఎవరైతే తమ మణికట్టును బాగా ఉపయోగించి ఆడతారో అలాంటి బ్యాట్సమెన్ మిడిల్ గార్డ్ తీసుకుని మిడిల్ స్టంప్ దగ్గర నిలబడి ఆడతారు. సో ఈ గార్డ్ కోసం బ్యాట్సమెన్ తన త్రీ ఫింగర్స్ ను చూపిస్తాడు.
ఇక మిగిలిన మిడిల్ అండ్ ఆఫ్ మరియు ఆఫ్ స్టంప్ గార్డ్స్ ను పెద్దగా ఎవరు యూస్ చెయ్యరు. ఎందుకంటే స్టంప్స్ మొత్తం కవర్ చేసి బ్యాటింగ్ చేస్తే lbw అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుగా ఉంటాయి. అయితే టీ20 క్రికెట్ లో హార్దిక్ పాండ్య లాంటి హిట్టర్లు డెత్ ఓవర్స్‌లో వైడ్ గా వేసే బాల్స్ ను రీచ్ అయ్యి ఆడేందుకు ఈ రెండు గార్డ్స్ ను చూస్ చేసుకుంటారు.
ఇక బ్యాట్సమెన్ ఈ గార్డ్ తీసుకునే ముందు అంపైర్ ను ప్లీజ్ అని అడగడంతో పాటు తీసుకున్నాక థాంక్స్ అని చెప్పడం మర్చిపోకూడదు.
Also Read – 5 Rare Cricketers Who Won Man Of The Match For Fielding