విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర – డొమెస్టిక్ క్రికెట్ సిరీస్ లో భాగంగా మనం చివరి ఆర్టికల్లో సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ ఆర్టికల్లో మన ఇండియా డొమెస్టిక్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టోర్నమెంట్స్ అయినా విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర గురించి తెలుసుకుందాం.
విజయ్ హజారే ట్రోఫీ అంటే ఏమిటి?
విజయ్ హజారే ట్రోఫీ అనేది ఒక లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్. ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ ఐదు జోన్లుగా విడిపోయి ఈ విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర కోసం పోటీపడతాయి. ఒన్డే (ODI) ఫార్మాట్లో అంటే టీంకు 50 ఓవర్లు చెప్పున ఆడే ఈ టోర్నమెంట్ ను రంజీ ఒన్డే ట్రోఫీ అని కూడా అంటారు. సో ఈ విజయ్ హజారే ట్రోఫీ అనేది లిస్ట్ ఏ క్రికెట్ కిందకు వస్తుంది.
మనం అల్రెడీ లాస్ట్ ఆర్టికల్లో చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే టెస్ట్ క్రికెట్ అని. సో అదే విధంగా 50 ఓవెర్స్ ఫార్మాట్లో డొమెస్టిక్ లెవెల్లో జరిగే మ్యాచులను లిస్ట్ A క్రికెట్ మ్యాచ్స్ అంటారు. ఈవెన్ అంతర్జాతీయ ఒన్డే మ్యాచ్లను కూడా లిస్ట్ A క్రికెట్ అనే అంటారు. బట్ అవి ఇంటర్నేషనల్ గా జరుగుతాయి కాబట్టి స్టాట్స్ లో డిఫర్నెస్ చూపించడం కోసం వాటిని ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్స్ అని పిలుస్తారు. సో ఒన్డే క్రికెట్ కు మరో పేరు లిస్ట్ A క్రికెట్.
Also Read – Syed Mushtaq Ali Trophy History In Telugu (సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర)
విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర
విజయ్ హజారే ట్రోఫీను 2002వ సంవత్సరంలో బీసీసీఐ స్టార్ట్ చేసింది. అయితే నిజానికి ఈ ట్రోఫీ 1993వ సంవత్సరంలోనే స్టార్ట్ అయ్యింది. బట్ 2001వ సంవత్సరం వరకు ఈ టోర్నీ కు ఫైనల్ మ్యాచ్ ఉండేది కాదు. మనం స్మాట్ ఆర్టికల్లో చెప్పుకున్న 5 జోన్స్ లో ఉండే టీమ్స్ తమలో తాము పోటీ పడి చివరికి 5 టీంలు విన్నర్స్ గా నిలిచేవి. అయితే 2002వ సంవత్సరం నుండి ఈ టోర్నీ ఫార్మాట్ ను చేంజ్ చేసి కేవలం ఒక్క టీంను మాత్రమే ఛాంపియన్స్ గా ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇక ఈ టోర్నీకు ఆ పేరు ఎలా వచ్చిదంటే 1946వ సంవత్సరం నుండి 1953వ సంవత్సరం వరకు మన టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్ ఆడిన విజయ్ హజారేకు ట్రిబ్యూట్ గా బీసీసీఐ ఈ ట్రోఫీ కు విజయ్ హజారే ట్రోఫీ అని పేరు పెట్టింది. ఈయన అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్. అలాగే ఒకే టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్సమెన్ విజయ్ హజారే.
1948వ సంవత్సరం జనవరి 23వ తేదీన అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో హజారే ఈ ఘనత సాధించారు. ఇక మన టీమిండియా తరుపున 30 మ్యాచ్లాడిన విజయ్ హజారే 47.65 ఏవరేజ్ లో 2192 పరుగులు సాధించారు. సో ఈయన సాధించిన ఈ అచివ్మెంట్స్ కు గుర్తుగా ఈ టోర్నీకు అయితే విజయ్ హజారే ట్రోఫీ అని పేరు పెట్టారు.
విజయ్ హజారే ట్రోఫీ జరిగే పద్ధతి
మనం పైన చెప్పుకున్నట్టు ఈ టోర్నీను అయితే మొదట్లో ఫైనల్ మ్యాచ్ లేకుండా నిర్వహించేవారు. అంటే ఒక సీజన్ కు ఐదుగురు ఛాంపియన్స్ ఉండేవారు. అయితే 2002వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు మొత్తం 27 టీంలను ఐదు జోన్లగా డివైడ్ చేసి, ఒక్కో టీం తమ గ్రూప్ లో మిగిలిన జట్లతో ముందు లీగ్ మ్యాచ్స్ ఆడేవారు.
ఇక ఆ తరువాత ఈ ఐదు గ్రూపుల నుండి ప్రతి గ్రూప్ లో టాప్ 2 లో నిలిచిన 10 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు రీచ్ అయ్యేవి. అయితే ఈ పది టీమ్స్ లో టాప్ 6 నిలిచిన ఆరు టీంలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు ఎంటర్ అయితే మిగతా రెండు స్థానాల కోసం మిగిలిన నాలుగు జట్లు రెండు ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ ఆడేవి.
సో రెండు మ్యాచ్ల్లో గెలిచిన రెండు టీమ్స్ మిగతా ఆరు జట్లతో జాయిన్ అయ్యి 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ ఆడేవారు. ఇక ఆ తరువాత సెమీ ఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్స్ ఉండేవి. అయితే 2015వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు మొత్తం అన్ని టీంలు 4 గ్రూప్లగా విడిపోయి ఈ టోర్నీను అయితే ఆడారు.
ఇక ఆ తరువాత 2020వ సంవత్సరం నుండి విజయ్ హజారే ట్రోఫీను కూడా సేమ్ స్మాట్ ఏ ఫార్మాట్లో ఆడుతున్నారో ఆ ఫార్మాట్లోనే ఆడుతున్నారు. సో ప్రెసెంట్ అయితే మొత్తం 38 టీంలు మొత్తం 6 గ్రూపులు గా విడిపోయి ఈ టోర్నమెంట్ ను ఆడుతున్నారు. వీటిలో 5 ఎలైట్ గ్రూప్స్ కాగా మరొకటి ప్లేట్ గ్రూప్. అంటే మనం స్మాట్ ఆర్టికల్లో చెప్పుకున్నట్టే ఒక్కో ఎలైట్ గ్రూప్ లో 6 టీంలు ఉంటె, ప్లేట్ గ్రూప్ లో మాత్రం 8 టీంలు ఉంటాయి.
సో ఈ గ్రూప్స్ లో ఉన్న అన్ని టీమ్స్ తమ లీగ్ స్టేజిలో మొత్తం 5 మ్యాచ్స్ ఆడతాయి. ఇక ఆ తరువాత నాకౌట్ స్టేజ్ ఉంటుంది. సో స్మాట్ ట్రోఫీలాగానే ముందు మూడు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ జరిగిన తర్వాత నాలుగు మెయిన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ జరుగుతాయి. అయితే నాకౌట్ స్టేజికు క్వాలిఫికేషన్ సినారియో వేరేలా ఉంటుంది.
మొత్తం 5 ఎలైట్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సో లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఈ 5 గ్రూప్స్ లో టాపర్స్ గా నిలిచిన ఐదు టీంలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్తాయి. అయితే నార్మల్ గా క్వార్టర్ ఫైనల్స్ అంటే 8 జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరగాలి. బట్ ఇక్కడ ఐదు టీంలే ఉన్నాయి కాబట్టి మిగతా మూడు స్థానాల కోసం 6 జట్ల మధ్య 3 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ నిర్వహిస్తారు.
అయితే ఈ 3 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ కోసం ఆరు టీంలను ఎలా సెలెక్ట్ చేస్తారు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, మనం ముందు చెప్పుకున్న 5 గ్రూప్స్ నుండి 1st ప్లేస్ లో నిలిచిన ఐదు టీమ్స్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు వెళితే 2nd ప్లేస్ లో నిలిచిన 5 టీమ్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్తాయి. ఇక ఐదు జట్లతో పాటు ప్లేట్ గ్రూప్ లో టాపర్ గా నిలిచిన టీం కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్తుంది. సో మొత్తం ఈ ఆరు టీంలు మూడు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఆడి ఆ తరువాత మెయిన్ క్వార్టర్ ఫైనల్స్ కు క్వాలిఫై అవుతాయి.
విజయ్ హజారే ట్రోఫీ గణాంకాలు
2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జరుగుతున్న ఈ విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర ఇప్పటివరకు మొత్తం 20 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ 20 సీజన్స్ లో తమిళనాడు టీం మొత్తం 5 సార్లు ఈ విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుని మోస్ట్ సక్సెస్ఫుల్ టీంగా ఉంది. ఈవెన్ సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తమిళనాడు టీంనే ఎక్కువ సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకుంది.
ఇక తమిళనాడు టీం తరువాత కర్ణాటక మరియు ముంబై జట్లు చెరో నాలుగు సార్లు ఈ విజయ్ హజారే ట్రోఫీ ను గెలుచుకుని సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా ఉన్నాయి. అలాగే లాస్ట్ 2021-22 సీజన్ లో హిమాచల్ ప్రదేశ్ కప్ గెలుచుకుని వాళ్ళు ప్రస్తుత ఛాంపియన్స్ గా ఉన్నారు.
ఇక ప్లేయర్స్ స్టాట్స్ విషయానికొస్తే సర్వీసెస్ టీంకు చెందిన యాశ్పాల్ సింగ్ ఆల్ టైం టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 72 మ్యాచ్లాడిన యాశ్పాల్ సింగ్ 60.24 సగటుతో మొత్తం 3193 పరుగులు సాధించాడు.
ఇక టాప్ వికెట్ టేకర్ విషయానికొస్తే ఓవరాల్ స్టాట్స్ అయితే దొరకలేదు. బట్ 2018వ సంవత్సరంలో బీహార్ కు చెందిన షాబాజ్ నదీమ్ 24 వికెట్లు పడగొట్టి ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డును క్రియేట్ చేసాడు. అలాగే 2017వ సంవత్సరంలో కర్ణాటక బాట్స్మన్ మయాంక్ అగర్వాల్ ఒకే సీజన్లో 633 పరుగులు సాధించి ఒక సరికొత్త రికార్డును నమోదు చేసాడు.
ఇక 2020-21 సీజన్లో ముంబై యంగ్ సెన్సేషన్ ప్రిద్వి షా పాండిచ్చేరి టీం పై ఏకంగా 227 పరుగులు సాధించి ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బాట్స్మన్ గా రికార్డును క్రియేట్ చేసాడు. అలాగే బీహార్ బౌలర్ షాబాజ్ నదీమ్ 2018వ సంవత్సరంలో రాజస్థాన్ టీం పై 10 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీ హిస్టరీలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేసాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలంటే ఏం చేయాలి
ఫ్రెండ్స్ ఇది బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ట్రోఫీ కాబట్టి, స్మాట్ లానే ఈ టోర్నీలో కూడా బాగా ఆడిన ఆటగాళ్లకు మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇది ఐపీఎల్ కు స్ట్రయిట్ రూట్ అని చెప్పలేం. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్స్ ఫార్మాట్ కాబట్టి ఐపీఎల్ కు డైరెక్ట్ గా కన్సిడర్ చెయ్యరు. బట్ స్టిల్ ఈ టోర్నమెంట్ లో బాగా ఆడితే మీ స్టేట్ తరుపున జరిగే అన్ని టోర్నీల్లో ఆడే అవకాశం వస్తుంది. సో విజయ్ హజారే ట్రోఫీ కూడా ఐపీఎల్లో కి ఎంటర్ ఇవ్వడానికి ఒక ఇన్ డైరెక్ట్ ప్లాట్ ఫామ్.
ఒకవేళ ఇదే టోర్నమెంట్ లో 120+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ నిలకడగా ఆడిన కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్ ను కొనేందుకు ఎగబడతాయి. ఇక ఇండియాలో డొమెస్టిక్ లెవెల్లో జరిగే అతి పెద్ద ఒన్డే టోర్నమెంట్ ఇదే కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే మన టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్ ఆడుతూ ఉంటారు. బట్ ఈ టోర్నీలో ఆడాలంటే ఆ ప్లేయర్ ఖచ్చితంగా తన స్టేట్ బోర్డులో ఒక మెంబెర్ అయ్యి ఉండాలి.
అంటే తమ స్టేట్ టీం తరుపున రెగ్యులర్ గా క్రికెట్ ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది. సో ఈ టోర్నీ కూడా స్మాట్ అండ్ రంజీ ట్రోఫీ లనే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీ స్టేట్ టీంలో మెంబెర్ అయ్యి ఉంటేనే ఈ టోర్నమెంట్ లో ఆడగలరు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి అయితే ఈ టోర్నమెంట్ ఆడలేరు.
సో ఫ్రెండ్స్ నేనైతే ఈ స్టాట్స్ కోసం చాలా సెర్చ్ చేసి దొరినంత వరకు మీకు చెప్పను. అలాగే ఇది ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ కాబట్టి స్టాట్స్ అంత ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎనీ వే విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర అయితే ఇది.
Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)