ఒక మనిషి యొక్క తెలివి తేటలను IQ తో సూచిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషికి ఎంత ఎక్కువ IQ ఉంటే అతను అంత ఎక్కువ తెలివైన వాడు అని అర్ధం. కాగా క్రికెట్ లో తమ IQ మిగతా ప్లేయర్స్ IQ తో పోల్చుకుంటే చాలా ఎక్కువని నిరూపించిన టాప్ 10 తెలివైన క్రికెటర్లు గురించి తెలుసుకుందాం.
Top 10 High IQ Moments In Cricket (10 తెలివైన క్రికెటర్లు)
10. Steve Smith Special Signal
ఒకసారి ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు స్టీవ్ స్మిత్ తన కెప్టెన్సీ స్కిల్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూపించాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ మార్టిన్ గప్టిల్ ను అవుట్ చెయ్యడం కోసం క్రాస్ సీమ్ బాల్ ను స్టంప్స్ లైన్ లో వెయ్యమని ఫ్యాట్ కమిన్స్ కు తన చేతులతోనే సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ నెక్స్ట్ బాల్ ఏం జరిగిందో మీరే చూడండి. తన కెప్టెన్ చెప్పిన బాల్ నే కమిన్స్ వెయ్యడం అండ్ ఆ బాల్ ను సరిగ్గా ఆడలేక గప్టిల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది.
9. Younis Khan Brilliant Set Up
2017వ సంవత్సరంలో పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య ఒక థ్రిల్లింగ్ టెస్ట్ మ్యాచ్. ఆఖరి అర్దగంటలో ఒక్క వికెట్ పడగొడితే పాకిస్థాన్ దే విజయం. కానీ అప్పటికే ఒక ఎండ్ లో రోస్టన్ చేస్ సెంచరీ మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే నెంబర్ 11 లో బ్యాటింగ్ కు వచ్చిన షానోన్ గేబ్రియెల్ పాకిస్థాన్ బౌలర్స్ ను జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ను చివరివరకు తెచ్చాడు. పెనాల్టిమేట్ ఓవర్ చివరి బాల్ కు గేబ్రియెల్ అవుట్ అవ్వకుండా ఉంటే లాస్ట్ ఓవర్లో చేస్ స్ట్రైక్ మీదకి వచ్చి మ్యాచ్ ను డ్రా చేస్తాడు. అయితే సరిగ్గా ఈ టైంలోనే స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న యూనిస్ ఖాన్ బౌలర్ కు ఆఫ్ సైడ్ వైపు బాల్ వెయ్యమని సిగ్నల్ ఇచ్చాడు.
Also Read – Virat Kohli Top 5 Revenge Moments (విరాట్ కోహ్లీ టాప్ 5 రివెంజ్ మూమెంట్స్)
కానీ ఇది కుంచెం రిస్కీ. ఎందుకంటే వికెట్ పైకి వేస్తే క్యాచ్ ఇవ్వడమో లేదా lbw అవ్వడమే జరుగుతుంది. బట్ యూనిస్ ఖాన్ బాట్స్మన్ మైండ్ ను సరిగ్గా రీడ్ చేసి ఆఫ్ సైడ్ వైపు బాల్ వెయ్యమని యాసిర్ షా కు చెప్పాడు. అండ్ థెన్ ఇలా జరిగింది. గేబ్రియెల్ ఆఫ్ సైడ్ వచ్చిన జూసీ బాల్ ను స్లాగ్ చెయ్యబోయే తన వికెట్ ను కోల్పోయాడు. దింతో డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ లో పాకిస్థాన్ టీం 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.
8. Jos Buttler Done Goal Keeping
బట్లర్ అంటే సిక్సలు ఫోర్లే కాదు తన బుర్రతో 97 పరుగుల మీద సెటిల్ అయ్యి ఆడుతున్న బాట్స్మన్ ను కూడా చాలా ఈజీగా అవుట్ చెయ్యగలడు. ఒకసారి ఇంగ్లాండ్ మరియు పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఒన్డే మ్యాచులో బట్లర్ తన గోల్ కీపింగ్ స్కిల్స్ చూపించాడు. మొయిన్ అలీ వేసిన బాల్ ను థర్డ్ మెన్ వైపు గ్లైడ్ చేసిన సర్ఫరాజ్ సింగిల్ కోసం క్రీజ్ వదిలి బయటికి వెళ్ళాడు. అయితే అహ్మద్ ఆడబోయే షాట్ ను ముందుగానే పసిగట్టిన బట్లర్ తన కాలును అడ్డుపెట్టి బాల్ ను స్టాప్ చేసాడు. అంతే కాదండోయ్ వెంటనే కింద పడిన బాల్ ను కలెక్ట్ చేసి సర్ఫరాజ్ ను రన్ అవుట్ కూడా చేసాడు.
దింతో సెంచరీ సాధించి తన టీంను గెలిపిద్దామనుకున్న సర్ఫరాజ్ అహ్మద్ 97 పరుగుల వద్ద అవుట్ అయ్యి నిరాశగా పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. బ్రో బట్లర్ కదా సర్ఫరాజ్ ను అవుట్ చేసింది. సో అది స్టంప్ అవుట్ కిందకి వస్తుంది కదా మరి నువ్వెంటి రన్ అవుట్ అంటున్నావ్. దీనికి ఆన్సర్ అక్కడ సర్ఫరాజ్ బాల్ ను బ్యాట్ తో కొట్టి రన్ తియ్యడం కోసం ఒక క్లియర్ అట్టెంప్ చేసాడు. బట్ లా 39 ప్రకారం ఒక బాట్స్మన్ ను స్టంప్ అవుట్ గా ప్రకటించాలంటే అతను ఆ బాల్ ను ఇంటెన్షనల్ గా పరుగు తీయడం కోసం ప్రయత్నించి ఉండకూడదు. అప్పుడే మాత్రమే స్టంప్ అవుట్ ఇస్తారు. అలా కాకుండా రన్ తీయడం కోసం ప్రయత్నిస్తే కీపర్ అవుట్ చేసిన కూడా అది రన్ ఔట్ కిందకే వస్తుంది.
7. MS Dhoni Produced 2 From Nothing
ఈ పాయింట్ MS Dhoni IQ కు బిగినింగ్ లాంటింది. కంక్లూషన్ తరువాత చూద్దాం. సో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక ఒన్డే మ్యాచ్ లో ధోని లెగ్ గ్లన్స్ ఆడబోయే బాల్ ను మిస్ అయ్యాడు. అండ్ అక్కడ సింగిల్ తియ్యడానికి ఎలాంటి స్కోప్ లేదు. కానీ కంగారులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ధోని సింగిల్ ఏమైనా తీస్తాడని చెప్పి వెంటనే వికెట్ల వైపు బాల్ విసిరాడు. అండ్ ఆ బాల్ వికెట్లకు తగిలి అక్కడే పడింది. బట్ ధోని క్రీజ్ లోనే ఉన్నాడు.
అయితే బాల్ వికెట్ల ను తాకక దాని దగ్గరలో ఎవరు లేకపోవడం గమనించి మన ధోని ఫాస్ట్ గా ఒక సింగిల్ తీసాడు. కానీ కీపర్ మాత్రం బాల్ దగ్గరకు రాలేదు. సర్లే సింగిలే కదా అనుకున్నాడు. కానీ ధోని ఊరుకుంటాడా అక్కడ మరో రన్ తీసేందుకు ఛాన్స్ ఉందని గమనించి రెండో రన్ కూడా తీసాడు. అది కూడా 2.7 సెకండ్స్ లో. ఇప్పటివరకు వికెట్ల మధ్య ఒక బాట్స్మన్ పరిగెత్తినా ఫాస్టెస్ట్ రన్ ఇదే. సో ధోని క్రీజ్ లో ఉన్నప్పుడు అన్ని దగ్గర పెట్టుకుని చాలా అలర్ట్ గా ఉండాలి. కాదని రిలాక్స్ అయితే బొచ్చే మిగులుతుంది.
6. The Leg Side Saviors
నార్మల్ గా స్పిన్ బౌలింగ్ బాగా బాట్స్మన్ కు పేడల్ స్వీప్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఈజీగా లెగ్ సైడ్ వైపు ఒక ఫోర్ కొట్టచ్చు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఇలాంటి షాట్ ఆడాలంటే బాట్స్మన్ చాలా భయపడుతున్నారు. ఎందుకంటే బాట్స్మన్ ఈ షాట్ ఆడటానికి ట్రై చేస్తున్నాడు అని తెలియగానే వికెట్ల వెనుకాల ఆఫ్ సైడ్ ఉన్న ఫీల్డర్స్ తమ iq ఉపయోగించి ముందుగానే లెగ్ సైడ్ వైపు వచ్చేస్తున్నారు.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
అంతే కాకుండా బాట్స్మన్ కొట్టిన బాల్ ను క్యాచ్ పట్టి మరి తమ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో బౌలర్స్ కు వికెట్లు సంపాదించి పెడుతున్నారు. ఈవెన్ వికెట్ కీపర్స్ కూడా సేమ్ ఫార్ములా వాడి బాట్స్మన్ ను అవుట్ చేస్తున్నారు. ఇక ఇలా అవుట్ చేసిన వాటిలో టాప్ 3 ప్లేయర్స్ చూస్కుంటే, స్టీవ్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్ అండ్ కుమార్ సంగక్కార. ఈ ముగ్గరు అయితే తమ తెలివిని ఉపయోగించి బాట్స్మన్ కలలో కూడా ఊహించని విధంగా వాళ్ళని అవుట్ చేసారు.
5. Misbah Stuns Leg Side Saviors
మనం పైన లెగ్ సైడ్ సేవియర్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. అయితే పాకిస్తాన్ బ్యాట్సమన్ మిసబబుల్ హాక్ ఈ తెలివైన ఫీల్డర్స్ కంటే నేను మహా తెలివైనవాడినని ఒకసారి ప్రూవ్ చేసాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో మిస్బా స్వీప్ షాట్ ఆడటం చూసి కీపర్ తో పాటు స్లిప్ ఫీల్డర్ కూడా లెగ్ సైడ్ వైపు మూవ్ అవ్వడం మొదలుపెట్టారు.
ఇది గమనించిన మిస్బా లాస్ట్ మినిట్ లో తన షాట్ ను మార్చుకుని స్లిప్స్ నుండి బాల్ వెళ్లేలా జస్ట్ అలా గ్లైడ్ చేసాడంతే ఆ బాల్ బౌండరీకి వెళ్ళిపోయింది. ఇలాంటోళ్లే గురించే మన తెలుగులో ఒక సామెత ఉంది. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు. ఎనీ వే కొంతమంది అతి తెలివైన వాళ్ళు కామెంట్ చెయ్యొచ్చు. బాల్ డైరెక్షన్ మారింది అందుకే మిస్బా షాట్ మార్చాడని. బ్రో మిస్బా ఆడిన అదే షాట్ కు స్లిప్ ఫీల్డర్ లెగ్ సైడ్ వెళ్లకపోతే మనోడు క్యాచ్ అవుట్ అయిపోతాడు కదా. అర్ధం కాకపోతే వీడియో మళ్లీ చూడండి.
4. The Combination Catches
బౌండరీ లైన్ దగ్గర ఇద్దరు ఫీల్డర్స్ కాంబినేషన్ లో క్యాచులు పట్టడం ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయింది. బట్ ఒక దశాబ్దం వెనక్కి వెళ్తే ఇలాంటి క్యాచేస్ పట్టే ఫీల్డర్స్ ను చాలా తెలివైన వాళ్ళగా పరిగణించేవారు. ముఖ్యంగా బౌండరీ రోప్ ఎక్కడ సరిగ్గా అంచనా వేసి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో కొంతమంది ఫీల్డర్స్ అద్భుతమైన క్యాచులు పడుతుంటారు. నిజంగా మన వెనకాల బ్లైండ్ సైడెడ్ గా ఉండే బౌండరీ రోప్ ను జడ్జ్ చేస్తూ క్యాచులు పట్టడం అంటే అంత సులువైన పని కాదు.
ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో పాటు సరైన టైమింగ్ ఉంటేనే ఇలాంటి క్యాచులు పట్టడంలో సక్సెస్ అవుతారు. అండ్ ఇలాంటి క్యాచేస్ నుండి బెస్ట్ మూమెంట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఎనీవే నేనైతే నాకు దొరికిన కొన్ని బెస్ట్ బౌండరీ లైన్ క్యాచేస్ ను మీకు ఇప్పటివరకు ప్లే చేసి చూపించా. మరి వీటి నుండి ఫేవరేట్ క్యాచ్ ఎదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
3. Quinton de Kock The Living Statue
డికాక్ తెలివితేటలు అనగానే అందరికి గుర్తొచ్చేది ఫకర్ జామన్ రన్ అవుట్ ఇన్సిడెంట్. డబుల్ సెంచరీకు దగ్గరలో ఉన్న ఫకర్ ను డికాక్ బురిడీ కొట్టించి రన్ అవుట్ చేసాడు. అయితే అప్పట్లో దీని పై కొన్ని విమర్శలు వస్తే మరికొంత మంది తెలివితేటలు అన్నారు. పాకిస్థాన్ వాళ్ళైతే డికాక్ ఫేక్ ఫీల్డింగ్ చేసాడని నాన్ స్టాప్ గా ట్రోల్ చేసారు. కానీ డికాక్ 2019వ సంవత్సరంలో ఈ ఇన్సిడెంట్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్ చూపించాడు.
MSL లో భాగంగా జరిగిన ఒక మ్యాచులో బాట్స్మన్ కొట్టిన ఇచ్చిన క్యాచ్ ను లాంగ్ ఆఫ్ ఫీల్డర్ నేలపాలు చేసాడు. అయితే ఆ ఫీల్డర్ త్రో వేసినప్పుడు డికాక్ వికెట్ల దగ్గర ఒక బొమ్మలా నిలబడిపోయాడు. దింతో వికెట్ కీపర్ ఎండ్ కు త్రో రావట్లేదని భావించి బాట్స్మన్ చాలా కూల్ గా రన్నింగ్ చేస్తూ క్రీజ్ దగ్గరకు వచ్చాడు. బట్ తన సైలెన్స్ తో బాట్స్మన్ ను కన్ఫ్యూజ్ చేసిన డికాక్ ఫీల్డర్ విసిరిన త్రోను లాస్ట్ సెకండ్ లో పట్టుకుని బాట్స్మన్ ను రన్ అవుట్ చేసాడు.
2. Rohit Football Sharma
రూల్స్ ప్రకారం బౌలర్ వేసిన బాల్ ను చేత్తో ఆపితే ఆ బాట్స్మన్ ను అవుట్ అని ప్రకటిస్తారు. కానీ ఒక బాట్స్మన్ తన వికెట్ ను కాపాడుకోవడం కోసం బాల్ ను ఇంటెన్షనల్ గా కాలుతో తన్నచ్చు. బట్ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఒకసారి ఐపీఎల్లో రోహిత్ బాల్ ను ఆడేందుకు క్రీజ్ వదిలి బయటికి వచ్చాడు. దింతో బౌలర్ చాలా తెలివిగా లెగ్ సైడ్ వైపు బాల్ వేసి రోహిత్ ను స్టంప్ అవుట్ చేద్దాం అని ట్రై చేసాడు.
కానీ రోహిత్ ఇంకా తెలివిగా లెగ్ సైడ్ వైపు వెళ్తున్న ఆ బాల్ ను స్క్వేర్ లెగ్ వైపు తన కాలుతో కిక్ చేసి అవుట్ అవ్వకుండా తప్పించుకున్నాడు. అండ్ ఇంతకముందు చెప్పుకున్నట్టే ఇది వంద శాతం రూల్స్ కు విరుద్ధం కాదు. సేమ్ lbw లానే కన్సిడర్ చేస్తారు. అయితే ఇలా కావాలని బాల్ ను తన్నినప్పుడో లేదా షాట్ అట్టెంప్ట్ చేయనప్పుడు బాల్ బాడీ కి తగిలి బౌండరీకి వెళ్తే ఆ రన్స్ కౌంట్ అవ్వవు. ఈవెన్ రోహిత్ ఇలా బాల్ కిక్ చేసినప్పుడు అతనికి సింగిల్ తీసే అవకాశం ఉన్న గానీ రన్ తియ్యలేదు. ఎందుకంటే రన్స్ తీసిన గానీ అవి ఎక్సట్రాస్ గా కౌంట్ అవ్వవు. ఎనీవే రోహిత్ మాత్రం తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో ఎలాంటి రూల్స్ బ్రేక్ చెయ్యకుండా తన వికెట్ ను కాపాడుకున్నాడు.
1. MS Dhoni The IQ Machine
క్రికెట్ లో ధోనికు ఉన్నంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇంకే ప్లేయర్ కు ఉండదు. రన్ అవుట్ చేసిన, స్టంప్ చేసిన, DRS తీసుకున్న ధోని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్ ఫ్యాక్ట్ అందరూ చెస్ గేమ్ బోర్డు పై ఆడితే ధోని మాత్రం క్రికెట్ గ్రౌండ్ లో ఆడతాడు. సో ధోని హై IQ మూమెంట్స్ చెప్పాలంటే కుప్పలుతెప్పలుగా ఉన్నాయి.
బట్ ఎనీవే ధోని బ్లైండ్ సైడెడ్ గా చేసే రనౌట్స్ కు మాత్రం ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫీల్డర్ త్రో వేసే టైంకు వికెట్ల ముందు దూరంగా నుంచుని బాట్స్మన్ కు ఎరా వేస్తాడు. దింతో బ్యాట్సమన్ దూరంగా ఉన్నాడు కదా రనౌట్ ఏం చేస్తాడులే అని మాములుగా క్రీజ్ లోకి వెళ్దాం అనుకుంటారు. బట్ ఈ లోపే ధోని బాల్ ను కలెక్ట్ చేసి అసలు వెనక్కి తిరిగి చూడకుండానే వికెట్లను గిరాటేస్తాడు. ఇంకేముంది బాట్స్మన్ షాక్స్ ధోని రాక్స్.