సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర – ఇండియాలో క్రికెటర్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఆ గేమ్ మన కంట్రీలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాకు ఆడే ప్రతి క్రికెటర్ కు కూడా మూవీ స్టార్స్ కు మించి ఫాలోయింగ్ ఉంటుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే తమ ఫేవరెట్ క్రికెటర్స్ ను దేవుళ్లుగా కొలుస్తారు. మరి ఇంత పాపులారిటీ ఉన్న గేమ్ లో మనం కూడా పార్ట్ అవ్వాలంటే ఒక్క ఇంటర్నేషనల్ క్రికెట్ చూస్తే సరిపోదు.
ముఖ్యంగా క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుందాం అనుకునేవాళ్లు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియా తరుపున ఆడాలన్న లేదా ఐపీఎల్లో ఆడాలన్న మీరు ఎక్కడో చోట డొమెస్టిక్ లెవల్లో మీ టేలంట్ ను చూపించాలి. కాబట్టి డొమెస్టిక్ లెవెల్లో బీసీసీఐ నిర్వహించే టోర్నమెంట్స్ నుండి స్టేట్ బోర్డ్స్ నిర్వహించే టోర్నమెంట్స్ అన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. ఇక దీనిలో భాగంగా ఈ రోజు మనం సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర గురించి తెలుసుకుందాం.
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫిను SMAT (స్మాట్) అని కూడా పిలుస్తారు. అలాగే ఇది బీసీసీఐ నిర్వహించే ఒక టీ20 టోర్నమెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఉండే స్టేట్స్ కు ఇదొక టీ20 వరల్డ్ కప్ లాంటిది. ఇక ఈ స్మాట్ కు ఆ పేరు ఎలా వచ్చిదంటే 1934వ సంవత్సరం నుండి 1952వ సంవత్సరం వరకు మన టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్ ఆడిన సయిద్ ముస్తాక్ అలీ అనే క్రికెటర్ కు ట్రిబ్యూట్ గా ఈ టోర్నీకి సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అని పేరు పెట్టారు.
ఇక ఈ బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఇండియా తరుపున 11 టెస్ట్ మ్యాచ్లాడి 612 పరుగులతో పాటు 3 వికెట్లను పడగొట్టారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం 13 వేల కన్నా ఎక్కువ పరుగులు చెయ్యడంతో పాటు 150 కన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే డొమెస్టిక్ లెవెల్లో ఆడే టెస్ట్ క్రికెట్. ఒక మ్యాచ్ ఫోర్ డేస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ అయితే 5 డేస్ ఉంటుంది. ఇక సింపుల్ గా చెప్పాలంటే మూడు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఆడే ఏ మ్యాచ్ అయినా సరే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కిందకే వస్తుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కిందకే వస్తుంది. బట్ ఇంటర్నేషల్ స్టాట్స్ మరియు డొమెస్టిక్ స్టాట్స్ వేరుగా చూపించడం కోసం వీటిని సెపెరేట్ గా పిలుస్తారు.
ఇక మన టాపిక్ అయినా స్మాట్ లోకి వెళ్తే ఇదొక డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్. 2006వ సంవత్సరంలో టీ20 క్రికెట్ గ్రో అవుతున్నప్పుడు బీసీసీఐ మనకంటూ డొమెస్టిక్ లెవెల్లో ఒక టీ20 టోర్నమెంట్ ఉండాలని చెప్పి ఈ స్మాట్ ను స్టార్ట్ చేసారు. ఇక ఆ ఏడాది ఇంటర్ స్టేట్ టీ20 ఛాంపియన్షిప్ పేరుతో స్టార్ట్ అయినా ఈ టోర్నమెంట్ ను అప్పట్లో రంజీ ట్రోఫీ ఆడుతున్న 27 స్టేట్ టీమ్స్ ను 5 గ్రూప్లగా డివైడ్ చేసి నిర్వహించారు.
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర (సీజన్లవారీగా)
ఇక ఆ ఏడాది జరిగిన మొదటి సీజన్లో దినేష్ కార్తీక్ నాయకత్వంలోని తమిళనాడు టీం మొట్టమొదటి ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. అలాగే మన టీమిండియా హిట్మాన్ రోహిత్ శర్మ గుజరాత్ తో జరిగిన ఒక మ్యాచులో సెంచరీ కొట్టి స్మాట్ లోనే కాకుండా ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో మొట్టమొదటి సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. సో మొదటి సీజన్ అయితే ఈ టోర్నీ సక్సెఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.
కానీ 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐపీఎల్ అనే ఒక ఐడియా ఈ టోర్నీకి బ్రేక్ వేసింది. సో 2007వ సంవత్సరంతో పాటు 2008వ సంవత్సరంలో కూడా ఈ టోర్నీకు బ్రేక్ పడింది. అయితే 2009వ సంవత్సరంలో రీ లాంచ్ అయినా ఈ టోర్నీ ఈ సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనే పేరుతో తన జర్నీను స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుండి ప్రతి ఏడాది జరుగుతున్న ఈ ట్రోఫీ ఇప్పటివరకు మొత్తం 14 సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇక ఇప్పటివరకు జరిగిన 14 సీజన్స్లో తమిళనాడు మూడు సార్లు కప్ కొడితే బరోడా, కర్ణాటక మరియు గుజరాత్ టీంలు రెండేసి సార్లు ఈ ట్రోఫీ గెలుచుకుని మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా ఉన్నాయి. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రంజీ ట్రోఫీలో నెంబర్ 1 టీం అయినా ముంబై జట్టు ఒక్కసారి కూడా ఈ స్మాట్ ట్రోఫీ ఫైనల్స్ కు రీచ్ అవ్వలేకపోయింది.
Also Read – Ambati Rayudu Biography In Telugu (అంబటి రాయుడు బయోగ్రఫీ)
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరిగే పద్ధతి
ఇక రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగే ఈ నాకౌట్ సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో 12 సీజన్లు స్టేట్ బోర్డ్స్ తలపడగా, 2016వ సంవత్సరంలో మాత్రం మన ఇండియా లో ఉండే ఫైవ్ జోన్స్ తలపడ్డాయి. అంటే సౌత్ లో ఉండే స్టేట్ టీమ్స్ అన్ని సౌత్ జోన్ గా, నార్త్ లో ఉండే స్టేట్ టీమ్స్ నార్త్ జోన్ గా, అలాగే వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ మరియు సెంట్రల్ జోన్ అని చెప్పి 2016 లో కేవలం ఐదు టీంలు మాత్రమే ఈ టోర్నీ ఆడాయి.
కానీ అంతకముందు మాత్రం ఈ 5 జోన్స్ లో ఉండే స్టేట్ టీమ్స్ అన్ని 5 గ్రూపులగా విడిపోయి ఒకరితో ఒకరు మ్యాచెస్ ఆడేవారు. ఇక ఆ తరువాత ఈ గ్రూపుల్లో ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 లో నిలిచిన టీమ్స్ ను మళ్ళి సూపర్ లీగ్ పేరుతో రెండు గ్రూప్ల గా డివైడ్ చేసి ఈ 10 టీమ్స్ మధ్య కాంపిటీషన్ పెట్టేవారు. ఇక ఈ సూపర్ లీగ్ గ్రూప్స్ నుండి టాప్ 1 లో నిలిచినా రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడేవి.
ప్రెసెంట్ అయితే ఈ ఫార్మాట్ ను కుంచెం మార్చారు. మొత్తం 38 టీంలను ఈ టోర్నీకి ఎంపిక చేసి వాటిని 5 ఎలైట్ గ్రూప్స్ మరియు ఒక ప్లేట్ గ్రూప్ గా డివైడ్ చేసి ఈ టోర్నీను నిర్వహిస్తున్నారు. సో 5 ఎలైట్ గ్రూప్స్ లో ఒక్క గ్రూప్ కు 6 టీంలు చొప్పున ఉంటాయి. అంటే 5 * 6 టోటల్ 30 టీమ్స్ ఈ ఎలైట్ గ్రూప్స్ లో ఉంటాయి. అలాగే మిగతా 8 టీంలు ప్లేట్ గ్రూప్ లో ఉంటాయి.
ఇక టోర్నీ స్టార్ట్ అయ్యాక ఒక్కో టీం 5 మ్యాచులు ఆడుతుంది. వాళ్ళ గ్రూపులో ఎన్ని టీమ్స్ ఉన్న గానీ. ఇక ఒక మ్యాచ్ గెలిస్తే ఆ టీంకు 4 పాయింట్లు చొప్పున అవార్డు చేస్తారు. సో లీగ్ లో స్టేజిలో మొత్తం అన్ని టీంలు కూడా ఐదేసి మ్యాచ్లు ఆడిన తర్వాత నాకౌట్ స్టేజి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఈ నాకౌట్ స్టేజిలో ముందు ఆరు టీంలు 3 ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఆడతాయి. అలాగే 5 టీంలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్లి మిగతా మూడు టీమ్స్ కోసం ఎదురుచూస్తాయి.
సో ప్రీ క్వార్టర్స్ లో గెలిచినా మూడు టీంలు ఈ ఐదు టీమ్స్ తో కలిసి 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్స్ ఆడతారు. ఇక నాలుగు మ్యాచుల్లో గెలిచిన టీమ్స్ సెమీ ఫైనల్స్ కు వెళ్లగా సెమీస్ లో గెలిచిన టీమ్స్ ఫైనల్లో తలపడతాయి. సో ప్రీ క్వార్టర్స్ ఏ 6 టీమ్స్ ఆడాలి, అలాగే మెయిన్ క్వార్టర్స్ కు ఏ 5 టీమ్స్ నేరుగా క్వాలిఫై అవుతాయి అనేది ఆయా టీంల గ్రూప్స్ లో వాళ్ళ ఫైనల్ పోసిషన్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని ఈ నాకౌట్ మ్యాచ్స్ ఫిక్స్ చేస్తారు. సో గాయిస్ ఈ ఫార్మాట్ అయితే బీసీసీఐ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే ఈ టోర్నమెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్మాట్లో జరుగుతుంది.
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర గణాంకాలు
ఇక ఇప్పటివరకు సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర స్టాట్స్ చూస్కుంటే బరోడా కు చెందిన కూడా దేవధర్ ఇప్పటివరకు ఈ స్మాట్ లో 2215 పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అలాగే గుజరాత్ కు చెందిన లెగ్ స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా ఇప్పటివరకు ఈ టోర్నీలో మొత్తం 85 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ స్మాట్ లో ఒక టీం సాధించినహైయెస్ట్ టీం టోటల్ 250 రన్స్.
2019వ సంవత్సరంలో కర్ణాటక టీం సర్వీసెస్ టీం పై ఈ స్కోర్ సాధించింది. ఇక లోయస్ట్ టీం టోటల్ 30 రన్స్. 2009వ సంవత్సరంలో త్రిపుర టీం జార్ఖండ్ టీం పై కేవలం 30 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఈ స్మాట్ లో ఒక బాట్స్మన్ యొక్క హైయెస్ట్ ఇండివిడ్యుయల్ స్కోర్ 147 రన్స్. ముంబై కు చెందిన శ్రేయాస్ అయ్యర్ 2019వ సంవత్సరంలో సిక్కిం పై ఈ స్కోర్ సాధించాడు.
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాలంటే ఏం చేయాలి
ఇది రాష్ట్రాల మధ్య జరిగే టోర్నమెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీ స్టేట్ క్రికెట్ బోర్డు టీంలో ఒక మెంబెర్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగలరు. జిల్లాస్థాయి నుండి అయితే మీరు ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చెయ్యలేరు. ఇక టోర్నీలో బాగా ఆడిన ఆటగాళ్ళని ఐపీఎల్ వేలంలో మంచి ధరకు కొనుగోలు చేసే అవకాశాలుంటాయి. అలాగే ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్స్ ను టీమిండియాలోకి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు మీ స్టేట్ క్రికెట్ టీంలో ఎలా చోటు సంపాదించి ఈ సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో బాగా ఆడితే ఇండియా టీంలోకి వెళ్లేందుకు దారి దొరికినట్టే.
Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)