క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ అనే పదాన్ని చాలా సార్లు వింటుంటాం. ముఖ్యంగా లేట్ గా మ్యాచ్ ముగిసినప్పుడు ఆ మరుసటి రోజు మనం న్యూస్ లో వింటుంటాం ఫలానా టీం కెప్టెన్ పై స్లో ఓవర్ రేట్ పడింది అతని మ్యాచ్ ఫీజు నుండి కొంత జరిమానా విధించారని. ఒక్కోసారైతే దీని కారణంగా ఫలానా టీం కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించారని కూడా న్యూస్ లో చూస్తుంటాం. కానీ అసలు ఈ స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి? ఎందుకు దీన్ని మ్యాచ్ రిఫరీ సీరియస్ గా తీసుకుంటాడు. దీని వల్ల జరిగే అనర్దాలేంటి?
క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి
స్లో ఓవర్ రేట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఓవర్ రేట్ అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే ఓవర్ రేట్ అంటే ఏంటో తెలిస్తేనే మనకు స్లో ఓవర్ రేట్ పై అవగాహన వస్తుంది.
ఓవర్ రేట్ వివరణ
జనరల్ గా మనకున్న క్రికెట్ నాలెడ్జ్ ప్రకారం లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ను ఓవర్స్ లెక్కలో ఆడతారు. అంటే వన్డే మ్యాచ్ కు 50 ఓవర్లు. అలాగే టీ20 మ్యాచ్ కు 20 ఓవర్లు. ఇక టెస్ట్ క్రికెట్ ను టైం పీరియడ్ బేస్ మీద ఆడతారు. అంటే ఒక టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఉంటుంది.
అయితే ఈ మూడు ఫార్మట్స్ లో కూడా ఓవర్ రేట్ అనే ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్ ఎందుకంటే ఒక మ్యాచ్ యొక్క డ్యూరేషన్ అనేది పెరగకుండా ఉండటం కోసం. ఒకవేళ ఈ రూల్ లేకపోతే బౌలింగ్ టీం బాల్ బాల్ కు గ్రౌండ్ మధ్యలో చక్కగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పర్చుకుని బాట్స్మన్ ను ఎలా అవుట్ చెయ్యాలో స్కెచ్ గీస్తారు. అప్పుడు 3 గంటల్లో అవ్వాల్సిన టీ20 మ్యాచ్ కాస్త ఒక రోజు మొత్తం చూడాల్సి వస్తుంది. ఇక ఫీల్డింగ్ టీం ఇలాంటి టైం వేస్ట్ పనులు చెయ్యకూడదనే ఈ ఓవర్ రేట్ అనే రూల్ ను తీసుకొచ్చారు. కాగా ఫీల్డింగ్ టీం ఒక గంట టైములో ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేసింది అని తెలిపే ఫ్యాక్టర్ ను ఓవర్ రేట్ అంటారు. అంటే ఓవర్ రేట్ ఈక్వల్ టూ నెంబర్ ఆఫ్ ఓవర్స్ బౌల్డ్ పర్ వన్ అవర్.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
టీ20 క్రికెట్ ఓవర్ రేట్
ఈ రూల్ ప్రకారం ఒక ఓవర్ ను కంప్లీట్ చెయ్యడానికి స్టాండర్డ్ టైం 4 నిముషాలు. టీ20 క్రికెట్ లో మొత్తం 40 ఓవర్లు ఆడతారు కాబట్టి 40*4 + 20 మినిట్స్ ఇన్నింగ్స్ బ్రేక్ అన్ని కలిపితే 180 మినిట్స్. అంటే ఒక టీ20 మ్యాచ్ ను 3 గంటల్లో ముగించాలి. దీనిబట్టి టీ20 ఫార్మాట్ కు ఐసీసీ సెట్ చేసిన మినిమమ్ ఓవర్ రేట్ 14.11. అంటే ఫీల్డింగ్ టీం ఒక గంటకు కనీసం 14.1 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి.
ఒన్డే క్రికెట్ ఓవర్ రేట్
ఒన్డే క్రికెట్ విషయానికొస్తే రెండు టీంలు కలిపి మొత్తం 100 ఓవర్లు ఆడతారు. కాగా ఒక ఒన్డే మ్యాచ్ డ్యూరేషన్ 100*4 + 45 మినిట్స్ ఇన్నింగ్స్ బ్రేక్ మొత్తం కలిపి 445 మినిట్స్. అంటే ఒక ఒన్డే మ్యాచ్ ను ఏడున్నర గంటల్లో ముగించాలి. దీనిబట్టి ఒన్డే ఫార్మాట్ కు ఐసీసీ సెట్ చేసిన మినిమమ్ ఓవర్ రేట్ 14.28. అంటే ఫీల్డింగ్ టీం ఒక గంటకు మినిమం 14.2 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి.
టెస్ట్ క్రికెట్ ఓవర్ రేట్
టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే ఒక రోజుకు 90 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి. సో వన్ డే టెస్ట్ మ్యాచ్ డ్యూరేషన్ ఇస్ 90*4 + 40 మినిట్స్ లంచ్ బ్రేక్ + 20 మినిట్స్ టీ బ్రేక్ థాట్ ఈక్వల్ టూ 420 మినిట్స్. అంటే టెస్ట్ క్రికెట్ లో ఒక రోజు ఆటను 7 గంటల్లో ముగించాలి. సో దీని బట్టి టెస్ట్ ఫార్మాట్ కు ఐసీసీ సెట్ చేసిన మినిమమ్ ఓవర్ రేట్ 15.0. అంటే ఫీల్డింగ్ టీం ఒక గంటకు కనీసం 15 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి.
స్లో ఓవర్ రేట్ వివరణ
మీకు మూడు ఫార్మాట్లకు మినిమమ్ ఓవర్ రేట్ ఎంతో తెలిసింది. ఇక ఇప్పుడు ఒక ఫీల్డింగ్ టీం మనం పై చెప్పుకున్న మినిమమ్ ఓవర్ రేట్ కన్నా తక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే దాన్నే స్లో ఓవర్ రేట్ అంటారు. ఉదాహరణకు ఒక టీ20 మ్యాచ్ లో ఫీల్డింగ్ టీం గంటకు 12 ఓవర్లే బౌలింగ్ చేసిందనుకోండి ఆ టీం పై స్లో ఓవర్ రేట్ పడుతుంది.
అయితే ఈ స్లో ఓవర్ రేట్ ను లెక్కించినప్పుడు చాలా కారకాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది ఈ స్లో ఓవర్ రేట్ ను మ్యాచ్ జరుగుతునపుడు లెక్కించరు. అంటే మ్యాచ్ రిఫరీ చేతికి ఒక వాచ్ పెట్టుకుని మ్యాచ్ చూస్తూ గంటకి ఇన్ని ఓవర్లు అయ్యాయి అని లెక్కకట్టి ఫైనల్ చెయ్యరు. మ్యాచ్ మొత్తం అయిపోయాక ఈ స్లో ఓవర్ రేట్ ను లెక్కిస్తారు. దీనికి కారణం మనం పైన ఆల్రెడీ చెప్పుకున్నం కొన్ని ఫ్యాక్టర్స్ ను కన్సిడర్ చేస్తారని.
స్లో ఓవర్ రేట్ ఎలా లెక్కిస్తారు
స్లో ఓవర్ రేట్ లెక్కించినప్పుడు వికెట్ పడిన తరువాత మరో బాట్స్మన్ రావడానికి పట్టే టైం, డ్రింక్స్ బ్రేక్ టైం, DRS రివ్యూ తీసుకున్నప్పుడు వేస్ట్ అయ్యే టైం, అలాగే ఎవరైనా ప్లేయర్ గాయపడినప్పుడు వేస్ట్ అయ్యే టైం, రనౌట్స్ చెక్ చేసినప్పుడు వేస్ట్ అయ్యే టైం, ఇంకా బాట్స్మన్ కు టెక్నీకల్ గా వచ్చే సమస్యలు అంటే సైట్ స్క్రీన్ సమస్య వచ్చినప్పుడు వేస్ట్ అయ్యే టైం, అలాగే మరికొన్ని కారణాల వల్ల వేస్ట్ అయినా టైంను లెక్కలోకి తీసుకోరు. ఎందుకంటే ఇవ్వన్నీ ఫీల్డింగ్ టీం చేతిలో ఉండవు. కాబట్టి మ్యాచ్ అయిపోయాక ఇలాంటి కారకాలన్నింటిని కన్సిడర్ చేసి మ్యాచ్ రిఫరీ ఫైనల్ ఓవర్ రేట్ ను లెక్కిస్తారు.
అయితే ఇవన్నీ తీసేస్తే అసలు స్లో ఓవర్ రేట్ ఎందుకు వస్తుందని మీకొక డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఒక బాట్స్మన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్స్ ను కంట్రోల్ చెయ్యడం కోసం కెప్టెన్ మరియు బౌలర్ చాలా టైం తీసుకుని ఫీల్డింగ్ సెట్ చెయ్యడంతో పాటు అతన్ని ఎలా అవుట్ చెయ్యాలో ప్లాన్ చేస్తారు.
అలాగే ఒక టీంలో అందరూ పేస్ బౌలర్లే ఉంటే ఓవర్స్ కంప్లీట్ చెయ్యడానికి కుంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే స్పిన్నర్ తో పోలిస్తే ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేసేందుకు కుంచెం ఎక్కువ టైం తీసుకుంటాడు. అంటే ఒక స్పిన్నర్ రెండు మూడు నిమిషాల్లో ఓవర్ ను కంప్లీట్ చెయ్యగలిగితే పేస్ బౌలర్ కు మాత్రం ఐదారు నిముషాలు పడుతుంది. కాగా ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కుంచెం టైం లాస్ అయ్యి ఫీల్డింగ్ టీం పై స్లో ఓవర్ రేట్ అనేది పడుతుంది.
స్లో ఓవర్ రేట్ వల్ల పడే శిక్ష
ఈ స్లో ఓవర్ రేట్ కు పూర్తి బాధ్యత ఆ టీం కెప్టెన్ వహించాలి. ఎందుకంటే బౌలింగ్ చేంజెస్ తో పాటు ఫీల్డ్ ప్లేసెమెంట్స్ మరియు బాట్స్మన్ ను కట్టడి చేసే స్ట్రేటజీస్ అన్ని కెప్టెన్ చేతిలోనే ఉంటాయి. కాబట్టి స్లో ఓవర్ రేట్ పడితే ముందుగా ఆ టీం కెప్టెన్ ను శిక్షిస్తారు.
ఇక ఈ శిక్ష అనేది చాలా రకాలుగా ఉంటుంది. స్లో ఓవర్ రేట్ అనేది తక్కువగా ఉంటె కెప్టెన్ తో పాటు టీం మెంబెర్స్ మ్యాచ్ ఫీజులో పర్శంటేజ్ వైస్ కొంత కోత విధిస్తారు. అయితే ఈ ఫైన్ అనేది కెప్టెన్ కు ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక రెండు మూడు ఓవర్లు స్లో ఓవర్ రేట్ పడితే పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇలా ఫైన్ తో సరిపెడతారు. అలా కాకుండా స్లో ఓవర్ రేట్ మరి ఎక్కువగా ఉంటే అంటే ఒక ఐదారు ఓవర్లు ఉన్న లేదా స్లో ఓవర్ రేట్ ను తరుచుగా రిపీట్ చేసిన ఆ టీం కెప్టెన్ పై ఫైన్ తో పాటు ఒకటి రెండు మ్యాచులు నిషేధం కూడా విధిస్తారు.
ఫ్రెండ్స్ స్లో ఓవర్ రేట్ అనేది చాలా మంది కెప్టెన్ల పై ఒత్తిడి పెంచుతుంది. ఒక్కోసారి ఈ ప్రెషర్ వల్ల ఆన్ ఫీల్డ్ లో చాలా మంది కెప్టెన్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఫెయిల్ అవుతారు. కానీ ఎవరైతే షార్ప్ గా ఆలోచించి ఫాస్ట్ గా సరైన నిర్ణయాలు తీసుకుంటారో వల్లే ఒత్తిడిని అధిగమించి గొప్ప విజయాలు సాధిస్తారు. దీనికి బెస్ట్ ఎక్సమ్పుల్ రికీ పాంటింగ్ మరియు ఎమ్మెస్ ధోని.
Also Read – What Is Dew Factor In Cricket (క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి?)