Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)

మనం డొమెస్టిక్ క్రికెట్ సిరీస్ లో భాగంగా ఆల్రెడీ సయద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ రోజు ది ఫేమస్ అండ్ లెజెండరీ టోర్నమెంట్ అయినా రంజీ ట్రోఫీ చరిత్ర గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్మాట్ టోర్నీ అనేది ఇండియాలో రాష్ట్రాల మధ్య జరిగే ఒక టీ20 వరల్డ్ కప్ లాంటిది అని. అలాగే విజయ్ హజారే ట్రోఫీ ఒన్డే వరల్డ్ కప్ లాంటిదని. అయితే ఈ రంజీ ట్రోఫీ చరిత్ర మాత్రం వైట్ బాల్ తో ఆడే టోర్నమెంట్ కాదు. కంప్లీట్ గా రెడ్ బాల్ క్రికెట్. అండ్ ప్లేయర్స్ వేసుకునే జెర్సీలు కూడా వైట్ కలర్ లోనే ఉంటాయి.

ఈ రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇండియాలో జరిగే ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే టెస్ట్ ఫార్మాట్ తో పోల్చుకుంటే ఈ రంజీ మ్యాచ్స్ లో కొంతవరకు డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ తేడా ఏంటి? రంజీ ట్రోఫీలో ఆడాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. నాకౌట్ మ్యాచ్స్ డ్రా అయితే విన్నర్స్ ను ఎలా డిసైడ్ చేస్తారు. రంజీ ట్రోఫీలో ప్లేయర్స్ శాలరీ ఎంత? అసలు ఈ రంజీ ట్రోఫీ చరిత్ర ఎలా మొదలైంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – ట్రోఫీ

History Of Ranji Trophy (రంజీ ట్రోఫీ చరిత్ర)

మన ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్ లో ఎంతో చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీని 1934వ సంవత్సరంలో స్టార్ట్ చేసారు. అప్పటి పాటియాలా మహారాజైనా భూపిందర్ ఈ రంజీ ట్రోఫీకు నాంది పలికారు. అలాగే మొదటి మ్యాచ్ 1934వ సంవత్సరం నవంబర్ 4 తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడారు. అండ్ ఈ మొట్టమొదటి రంజీ మ్యాచ్ చెన్నై మరియు మైసూర్ జట్ల జరిగింది. ఇక అప్పటినుండి ఈ రంజీ ట్రోఫీను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. కోవిడ్ కారణంగా 2020-21 సీజన్ ను పూర్తిగా రద్దు చేసారు.

ఆ ఒక ఏడాది తప్పిస్తే ఇప్పటివరకు ఈ రంజీ ట్రోఫీ చరిత్ర అనేది మొత్తం 87 సార్లు జరిగింది. ఇక ఈ టోర్నీకి రంజీ అనే పేరు ఎలా వచ్చిదంటే నవనగర్ ప్రిన్స్ అయినా రంజిత్ సింహ్జి ఇండియాలో పుట్టి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి ప్లేయర్. అయితే అతను ఆడింది ఇంగ్లాండ్ తరుపున. మొత్తం 15 టెస్ట్ మ్యాచుల్లో 989 పరుగులు సాధించాడు. ఇండియా తరుపున ఆడమని రిక్వస్ట్ చేసిన రాజును అనే అహంతో తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్స్ కూడా ఇంగ్లాండ్ లోనే ఆడాడు.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – రంజిత్ సింహ్జి

కానీ ఇండియా నుండి వెళ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు కాబట్టి అతని గుర్తుగా ఈ టోర్నమెంట్ కు రంజీ ట్రోఫీ అని పేరు పెట్టారు. ఇన్ ఫ్యాక్ట్ అతను అప్పట్లో బ్రిటిష్ అండర్ లో ఉన్న రాజు కాబట్టి తన పేరు పెట్టవలసి వచ్చింది. అదే ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఈ టోర్నీ స్టార్ట్ అయ్యి ఉండుంటే దీనికి మన ఇండియా తరుపున క్రికెట్ ఆడిన ఎవరో ఒక లెజెండరీ ఆటగాడి పేరు పెట్టేవారు.

Also Read – Vijay Hazare Trophy History In Telugu (విజయ్ హజారే ట్రోఫీ చరిత్ర)

Format Of Ranji Trophy (రంజీ ట్రోఫీ చరిత్ర ఫార్మాట్)

మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం ఈ రంజీ ట్రోఫీ చరిత్ర అనేది టెస్ట్ ఫార్మాట్లో జరుగుతుంది. అలాగే రెడ్ బాల్ తో ఆడతారు. బట్ టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే ఈ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్స్ అనేవి నాలుగు రోజులే ఉంటాయి. అంటే ఒక లీగ్ మ్యాచ్ ను కేవలం నాలుగు రోజులే ఆడతారు. బట్ టెస్ట్ ఫార్మాట్ కు ఎలాంటి రూల్స్ ఉంటయో సేమ్ అవే రూల్స్ ఉంటాయి. అయితే లీగ్ స్టేజ్ ముగిసిన తరువాత నాకౌట్ మ్యాచ్స్ ను మాత్రం ఐదు రోజులు నిర్వహిస్తారు. బట్ ఇవి నాకౌట్ మ్యాచ్స్ కాబట్టి డ్రా అనే ఫలితం ఉండదు.

ప్రతి నాకౌట్ మ్యాచులో కూడా ఒక విన్నర్ మరియు ఒక లూసర్ ఉంటారు. అదే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఆ మ్యాచ్ డ్రా అయినప్పుడు జాయింట్ విన్నర్స్ ను ప్రకటిస్తారు. అంటే ఫైనల్ ఆడిన రెండు టీంలు మ్యాచ్ గెలిచినట్టు. బట్ రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్స్ లో మాత్రం ఒక క్లియర్ విన్నర్ ఉంటాడు. ఈవెన్ మ్యాచులు డ్రా అయినా గానీ ఫలితాన్ని ఒక సెపెరేట్ రూల్ ద్వారా నిర్ణయిస్తారు. ఇక ఆ రూల్ ఏంటంటే ఈ నాకౌట్ మ్యాచ్స్ జరిగినప్పుడు ఈ టీం అయితే తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అపొనెంట్ టీం కన్నా ఎక్కువ రన్స్ కొడతారో వాళ్లే విజేతలు.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – ఫార్మాట్

ఉదాహరణకు 2019-2020 రంజీ సీజన్ యొక్క ఫైనల్ మ్యాచ్ నే చూడండి. ఆ మ్యాచులో సౌరాష్ట్ర టీం తమ మొదటి ఇన్నింగ్స్ లో 44 పరుగులు ఎక్కువ సాధించింది. దింతో ఆ మ్యాచ్ డ్రా అయినా సౌరాష్ట్ర టీంనే ఛాంపియన్స్ గా ప్రకటించారు. సో రెండు టీంల ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఎవరికైతే లీడ్ ఉంటుందో వాళ్లదే విజయం. అయితే ఈ రూల్ ను ఏదైనా నాకౌట్ మ్యాచ్ డ్రా అయినప్పుడు మాత్రమే యూస్ చేస్తారు. మిగతా ఏ సందర్భాల్లోనూ యూస్ చెయ్యరు.

Teams Of Ranji Trophy (రంజీ ట్రోఫీ చరిత్ర టీమ్స్)

ఈ రంజీ ట్రోఫీలో స్టేట్ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే క్రికెట్ అసోసియేషన్ గా ఏర్పడ్డ నగరాలతో పాటు ఫస్ట్ క్లాస్ అర్హత కలిగిన క్లబ్ టీమ్స్ కు కూడా ఈ రంజీ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ రంజీ ట్రోఫీ చరిత్ర స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా తక్కువ టీంలు ఉండేవి. అలాగే పార్టిషన్ కు ముందు ఈ టోర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియల్ డేస్ లో పాకిస్థాన్ తో పాటు బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఈ రంజీ ట్రోఫీలో ఆడారు. సో స్టార్టింగ్ లో అయితే టీమ్స్ అన్ని జోన్స్ గా విడిపోయే ఈ రంజీ ట్రోఫీ కోసం తలపడేవారు. మీకు ఈ జోన్స్ గురించి ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇంతకముందు పోస్ట్ చేసిన డొమెస్టిక్ క్రికెట్ ఆర్టికల్స్ చదవండి.

Also Read – Syed Mushtaq Ali Trophy History In Telugu (సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర)

ఇక ప్రెసెంట్ అయితే ఓవరాల్ గా 38 టీమ్స్ ఈ రంజీ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఈ 38 టీమ్స్ ను 8 ఎలైట్ గ్రూప్స్ మరియు ఒక ప్లేట్ గ్రూప్ గా డివైడ్ చేసారు. ఇందులో ప్రతి ఎలైట్ గ్రూప్ కు 4 టీంల చెప్పున ఉంటాయి. బట్ ప్లేట్ గ్రూప్ లో మాత్రం 6 టీంలు ఉంటాయి. ఇక టీమ్స్ ను ఈ గ్రూప్స్ లోకి ఎలా సెపెరేట్ చేస్తారంటే ముందు నుంచి రంజీ ట్రోఫీ ఆడుతున్న టీమ్స్ ను స్టార్టింగ్ లో పెట్టి, రీసెంట్ గా రంజీ ట్రోఫీపై అర్హత సాధించిన టీమ్స్ ను లాస్టులో పెడతారు. సో ప్లేట్ గ్రూప్ మరియు చివరి ఎలైట్ గ్రూప్స్ లో కుంచెం చిన్న టీమ్స్ ఉంటాయి. ఇక లీగ్ స్టేజ్ లో ప్రతి టీం కూడా మొత్తం మూడు మ్యాచ్లు ఆడుతుంది. ఆ తరువాత నాకౌట్ స్టేజ్.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – టీమ్స్

ఇక నాకౌట్ స్టేజ్ కోసం టీమ్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే ప్లేట్ గ్రూప్ లో టాప్ టీం మరియు 8వ ఎలైట్ గ్రూప్ లో టాప్ లో నిలిచిన టీం ఒక ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. మిగిలిన 7 ఎలైట్ గ్రూప్స్ లో టాపర్ గా నిలిచిన టీమ్స్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్తాయి. అండ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో గెలిచినా టీం 8వ టీంగా మెయిన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతాయి. ఇక ఆ తరువాత మనందరికీ తెలిసిన ప్రాసెస్ నే. 8 టీంల నుండి 4 టీంలు సెమీఫైన్సల్ కు, ఆ తరువాత సెమీస్ లో గెలిచిన టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.

అయితే ఫ్రెండ్స్ సిస్టం అనేది టైం టూ టైం మారిపోతూ ఉంటుంది. అంతేందుకు నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఈ ఏడాది మాత్రమే యూస్ చేసారు. అంతకముందు 3 ఎలైట్ గ్రూపులు మరియు ఒక ప్లేట్ గ్రూప్ మాత్రమే ఉండేది. సో పరిస్థితులకు తగట్టు ట్రోఫీ నిర్వహించడానికి ఎంత టైం ఉంది అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ టోర్నీ సిస్టంను మారుస్తూ ఉంటారు.

ఇక పాయింట్స్ విషయానికొస్తే ఒక మ్యాచ్ గెలిచినందుకు 6 పాయింట్లు అవార్డుగా ఇస్తారు. అదే ఓడిపోతే జీరో పాయింట్స్. ఒక మ్యాచులో గెలిచిన టీం ఇన్నింగ్స్ లేదా 10 వికెట్ల తేడాతో గెలిస్తే ఆ టీంకు ఒక బోనస్ పాయింట్ ఇస్తారు. డ్రా అయినా మ్యాచ్స్ లో మాత్రం 1st ఇన్నింగ్స్ లీడ్ ఉన్న టీంకు 3 పాయింట్లు ఇస్తే లీడ్ లేని టీంకు ఒక్క పాయింట్ మాత్రమే ఇస్తారు. బట్ ఇవి కూడా ఆ మ్యాచ్ సిట్యుయేషన్ ను బేస్ చేసుకుని మారుతూ ఉంటాయి. ఇక ఏదైనా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండు టీంలకు కూడా చెరో పాయింట్ ను అవార్డుగా ఇస్తారు.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – పాయింట్స్ (Source – Wikipedia)

Stats Of Ranji Trophy (రంజీ ట్రోఫీ చరిత్ర గణాంకాలు)

ఇప్పటివరకు 87 సార్లు జరిగిన ఈ రంజీ ట్రోఫీను ముంబై టీం ఏకంగా 41 సార్లు గెలుచుకుంది. మారె ఇతర టీం కనీసం పది సార్లు కూడా ఈ ట్రోఫీను గెలవలేకపోయారు. సో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ రంజీ ట్రోఫీలో ముంబై టీం డామినేషన్ ఏ రేంజ్ లో ఉందనేది. అలాగే ముంబై టీం 1958 సంవత్సరం నుండి 1972వ సంవత్సరం వరకు వరుసగా 15 సార్లు ఈ రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచి ఏ టీంకు సాధ్యంకానీ అరుదైన రికార్డును సాధించారు.

ఇక ముంబై తరువాత కర్ణాటక టీం 8 సార్లు ఈ రంజీ ట్రోఫీ గెలిస్తే ఢిల్లీ టీం 7 సార్లు విజేతగా నిలిచింది. బహుశా దీనివల్లే కావచ్చు ఒకప్పుడు మనం ఎక్కువగా ఈ త్రి రీజియన్స్ నుండే టీమిండియా ఆటగాళ్లు ఎమెర్జ్ అవ్వడం చూసాం. ఇక ప్రెసెంట్ మధ్య ప్రదేశ్ టీం ఈ ఏడాది రంజీ ట్రోఫీను గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళు ఫస్ట్ టైం రంజీ ట్రోఫీ గెలిచారు.

ఇక ఈ రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వసీం జాఫర్. ముంబై కు చెందిన ఈ ప్లేయర్ మొత్తం 155 మ్యాచ్లాడి 12038 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో మారె ఇతర బ్యాట్సమన్ 10000 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఒక్క జాఫర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

Ranji Trophy History In Telugu (రంజీ ట్రోఫీ చరిత్ర)
రంజీ ట్రోఫీ చరిత్ర – వసీం జాఫర్

ఇక ఈ రంజీ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్ రజిందర్ గోయెల్. పాటియాలా తరుపున డెబ్యూ చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ మొత్తం 640 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ టోర్నీ యొక్క టాప్ స్కోర్ మరియు లోవెస్ట్ స్కోర్ రెండు కూడా ఒకే టీం పేరు మీద ఉన్నాయి. 1993వ సంవత్సరంలో హైదరాబాద్ టీం ఆంధ్రా పై 935 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కానీ ఇదే టీం 2010వ సంవత్సరంలో రాజస్థాన్ పై కేవలం 21 పరుగులకే ఆలౌట్ అయ్యి ఎవరు ఊహించని ఒక చెత్త రికార్డును తమ పేరిట రాసుకుంది.

ఇక మిగిలిన బ్యాటింగ్ రికార్డ్స్ చూసుకుంటే చాలా వరకు వసీం జాఫర్ పేరు మీదే ఉన్నాయి. ఈ రంజీ ట్రోఫీలో ఎక్కువ సెంచరీలు చేసింది అతడే. మొత్తం 40 సెంచరీలు కొట్టాడు. అలాగే ఒకే సీజన్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది. 1999-2000 సీజన్లో 7 సెంచరీలు కొట్టాడు. హాఫ్ సెంచరీల రికార్డు కూడా వసీం జాఫర్ పేరు మీదే ఉంది. 155 మ్యాచుల్లో 89 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఇక ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు మన తెలుగు కక్రికెటర్ అయినా VVS లక్ష్మణ్. 1999-2000 సీజన్లో ఏకంగా 1415 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక హైయెస్ట్ ఇండివిడ్యుయల్ స్కోర్ చూస్కుంటే 1948వ సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన B.B నింబాల్కర్ కతియావర్ పై ఒకే ఇన్నింగ్స్ లో 443 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.

Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)

Qualification For Ranji Trophy (రంజీ ట్రోఫీ చరిత్ర ఆటగాళ్ల అర్హత)

ఈ ట్రోఫీ స్టేట్ టీమ్స్ మధ్య జరిగే టోర్నీ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చెయ్యాలకున్న ఆటగాళ్లు ఖచ్చితంగా తమ స్టేట్ బోర్డులో ఒక మెంబెర్ అయ్యి ఉండాలి. అప్పుడే మాత్రమే ఈ రంజీ ట్రోఫీలో అడగలరు. జిల్లాస్థాయి నుండి అయితే ఈ టోర్నీ ఆడేందుకు అర్హత లేదు. అయితే ప్రెసెంట్ రంజీ ట్రోఫీకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఐ మీన్ టీం ఇండియా సెలక్షన్ కోసం. ఒకప్పుడైతే ఈ రంజీ ట్రోఫీలో బాగా ఆడిన ప్లేయర్స్ ను టీం ఇండియా తరుపున ఆడేందుకు సెలెక్ట్ చేసేవారు.

కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత టీమిండియా సెలక్షన్ ప్రాసెస్ కొంతవరకు మారింది. ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్స్ నే టీమిండియాకు సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరో హనుమ విహారి మరియు చటేశ్వర్ పుజారా లాంటి రెడ్ బాల్ స్పెసలిస్ట్ ప్లేయర్స్ మాత్రమే రంజీ నుండి టీమిండియాలోకి సెలెక్ట్ అవుతున్నారు. బట్ ఎనీవే ఐపీఎల్లో ఆడాలన్న స్టేట్ టీంలో ప్లేయర్ గా ఉంటే మంచిది కాబట్టి ఈ రంజీ ట్రోఫీకు ఇంకా ఆదరణ ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ రంజీ ట్రోఫీ ఎటు పోతుందో అనేది.

Salary Of Ranji Players (రంజీ ట్రోఫీ చరిత్ర ఆటగాళ్ల జీతాలు)

ఈ రంజీ ట్రోఫీలో ఆటగాళ్ల శాలరీ అనేది డే బేసిస్ మీద ఉంటుంది. అంటే ఒక రోజు మ్యాచ్ ఆడినందుకు ఇంతని ఇస్తారు. అయితే ఈ శాలరీను మూడు కెటగిరీల్లో ఇస్తారు.

1. 20 లేదా అంతకన్నా తక్కువ మ్యాచులు ఆడిన ప్లేయర్ కు వన్ డే శాలరీ 40 వేల రూపాయిలు.

2. 21 నుండి 40 మ్యాచుల ఎక్సపీరియెన్స్ ఉన్న ప్లేయర్స్ కు వన్ డే శాలరీ 50 వేల రూపాయిలు.

3. 40 కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ప్లేయర్స్ కు వన్ డే శాలరీ 60 వేల రూపాయిలు.

అయితే ఈ శాలరీ అనేది ప్లేయింగ్ 11 లో ఉన్న ఆటగాళ్ళకి మాత్రమే ఇస్తారు. ప్లేయింగ్ 11 లో కాకుండా స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ కు వాళ్ళ కేటగిరిని బట్టి ఇందులో 50% డబ్బులను మాత్రమే సాలరీగా ఇస్తారు.

సో ఒక రంజీ మ్యాచ్ ఆడినందుకు ప్లేయర్ తీసుకునే శాలరీ అనేది లక్ష 60 వేల నుండి రెండు లక్షల 40 వేల మధ్యలో ఉంటుంది. అదే నాకౌట్ మ్యాచ్స్ లో అయితే ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఈ శాలరీ కొంతవరకు పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రంజీ ట్రోఫీ యొక్క చరిత్ర.