Pravin Tambe Biography In Telugu (ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ)

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – అది 2014వ సంవత్సరం. చేంజ్ కాన్ఫరెన్స్ లో భాగంగా అప్పటి రాజస్థాన్ రాయల్స్ కోచ్ అయినా రాహుల్ ద్రావిడ్ ను తనని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక క్రికెటర్ గురించి చెప్పమన్నారు. ఇక తన స్పీచ్ స్టార్ట్ చేసిన ద్రావిడ్ “నాకు ప్యాషనేట్ అనిపించిన క్రికెటర్ లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన క్రికెటర్ గురించి మాట్లాడమంటే చాలా మంది నేను టెండూల్కర్, లక్ష్మణ్, గంగూలీ లేదా కుంబ్లే లాంటి ప్లేయర్స్ గురించి చెబుతా అనుకుంటారు. వాళ్లంతా గొప్ప ఆటగాళ్లే, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వాళ్ళతో కలసి నేను చాలా కాలం క్రికెట్ ఆడాను. అలాగే వాళ్లలో అమేజింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ నేను చెప్పాలనుకుంటుంది వాళ్ళ గురించి కాదు. క్రికెట్ నుండి రిటైర్ అయ్యే ఏజ్ లో IPL డెబ్యూ చేసి నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ప్రవీణ్ తాంబే అనే ఆటగాడి కథ” అని ద్రావిడ్ తన స్పీచ్ ను కంటిన్యూ చేసాడు.

నిజంగా ఈ స్పీచ్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక సరిగ్గా 8 ఏళ్ల తరువాత అప్పుడు ద్రావిడ్ ఏ ఆటగాడి గురించి చెప్పాడో ఇప్పుడు అదే ప్లేయర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు “ఎవరు ప్రవీణ్ తాంబే”. ఏప్రిల్ 1వ తేదీన హాట్స్టార్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఇండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ప్రవీణ్ తాంబే లైఫ్ స్టోరీపై ఎందుకు సినిమా తీశారు. కుర్రాళ్లకు ప్లాట్ఫామ్ అయినా ఐపీఎల్లో 41 ఏళ్లకు డెబ్యూ చేసి ద్రావిడ్ సార్ కు ఒక ఇన్స్పిరేషన్ ఎలా అయ్యాడు. అసలు ఎవరు ఈ ప్రవీణ్ తాంబే. అతని ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఏంటి? ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం.

Also Read – Watch 10 Rare Funny Moments In Cricket

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ

ప్రవీణ్ తాంబే పూర్తి పేరు ప్రవీణ్ విజయ్ తాంబే. అలాగే అతన్ని అందరూ ముద్దుగా PT అని పిలుస్తారు. ఇక తాంబే 1971వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించాడు. తండ్రి పేరు విజయ్. తల్లి పేరు జ్యోతి. అలాగే తనకి ఒక అన్నయ్య ప్రశాంత్ కూడా ఉన్నాడు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ
ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – తల్లి తండ్రలు

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (బాల్యం)

ప్రవీణ్ చిన్న వయసు నుండే క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి గంటల తరబడి గల్లీ క్రికెట్ ఆడుతుండేవాడు. ప్రవీణ్ వాళ్ళది ఒక మధ్య తరగతి కుటుంబం. తండ్రి కూలీపని చేస్తూ తన పిల్లలిద్దరని పెంచసాగాడు. ప్రవీణ్ తండ్రి విజయ్ గారికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. నిజానికి తండ్రి క్రికెట్ ఆడటం చూసే ప్రవీణ్ కూడా ఆ ఆట పై ఇష్టం పెంచుకున్నాడు. కానీ అతని తల్లికి అది నచ్చేది కాదు. ఇక చిన్నవయసులో అన్నయ్యతో కలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రవీణ్ స్కూల్ లెవెల్ నుండే మంచి క్రికెటర్ గా పేరు సంపాదించాడు. కానీ చదువులో మాత్రం అంతగా రాణించేవాడు కాదు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (ది గల్లీ క్రికెటర్)

ఇక ఆ తరువాత కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్న ఈ అన్నదమ్ములు తమ కుటుంబాన్ని పోషించే స్థాయికి వచ్చారు. అయితే ప్రవీణ్ అన్నయ్య ఒక ఇంజనీర్ గా జాబ్ సంపాదిస్తే అతను మాత్రం క్రికెట్ ను ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. 15 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ను ఒక ఆటలా చూసిన ప్రవీణ్ ఆ తరువాత మాత్రం ఎలాగైనా నేషనల్ టీం తరుపున ఆడాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. బట్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉండేది. దింతో ప్రవీణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకునేందుకు ఎలాంటి అకాడమీలో జాయిన్ అవ్వలేదు. అలా అని ఆట పై ఉన్న ఇష్టాన్ని తన కలని చంపేసుకుందాం అంటే అది కూడా కుదరలేదు.

Also Read – About “Sir” Title In Cricket (క్రికెట్ ఆడే ఆటగాళ్లకు “సర్” అనే బిరుదు ఎలా వస్తుంది?)

అటు కంప్లీట్ గా క్రికెట్ లోకి వెళ్లలేక ఇటు కంప్లీట్ గా జాబు చెయ్యలేక ప్రవీణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. జాబ్ అంటూ చేస్తే, పనితో పాటు క్రికెట్ కూడా ఆడించే కంపెనీలోనే జాయిన్ అవుతా అని బలంగా ఫిక్స్ అయ్యాడు. కానీ అతనికి అలాంటి జాబ్ అంత సులువుగా దొరకలేదు. ఇంట్లో అన్నయ్య ఇంజనీర్ గా వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటే ప్రవీణ్ మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి డైలీ క్రికెట్ ఆడేవాడు. మొదట్లో ప్రవీణ్ ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. మంచి రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ వెయ్యడంతో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేసేవాడు. ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినా అచ్చం ఒక ప్రొఫెషినల్ క్రికెటర్ ల ఆడేవాడు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (ఓరియంట్ షిప్పింగ్ క్రికెటర్)

ఇక ప్రవీణ్ 1994వ సంవత్సరంలో తను అనుకున్నట్టే క్రికెట్ ఆడించే ఒక కంపెనీలో జాబ్ సంపాదించాడు. ఆ కంపెనీ పేరు ఓరియంట్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్. ఇక ఈ కంపెనీలో ఒక అకౌంటెంట్ గా జాయిన్ అయినా ప్రవీణ్ తన క్రికెట్ జర్నీను స్టార్ట్ చేసాడు. తన కంపెనీ టీం తరుపున కంగా క్రికెట్ లీగ్ తో పాటు లోకల్ గా జరిగే ఎన్నో క్లబ్ క్రికెట్ లీగ్స్ లో తన ప్రెసెన్స్ చూపించి ఒక మంచి క్రికెటర్ గా పేరు సంపాదించాడు. అయితే అవన్నీ టెన్నిస్ బాల్ లీగ్స్. వాటిలో ఎంత బాగా ఆడిన గానీ అతనికి ఇంకా పెద్ద టోర్నమెంట్స్ లో ఆడేందుకు ఛాన్స్ వచ్చేది కాదు.

ఇక ఇదంతా ఇలా ఉండగా కొడుకు క్రికెట్ పిచ్చి తగ్గించేందుకు అతని తల్లి ప్రవీణ్ కు వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లి చేసింది. బట్ అతని క్రికెట్ పిచ్చి ఎక్కువైందే గానీ ఏ మాత్రం తగ్గలేదు. ఎలా అయినా సరే తన స్టేట్ తరుపున రంజీ ట్రోఫీలో ఆడాలని బలంగా నిశ్చయించుకున్నాడు. అయితే దానికి టెన్నిస్ బాల్ క్రికెట్ సరిపోదు. దింతో ప్రవీణ్ తనకి జాబ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులను క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం యూస్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అలాగే అనుకున్నట్టే ముంబైలోని శివాజీ పార్క్ జింఖానా క్రికెట్ అకాడమీలో జాయిన్ అయినా ప్రవీణ్ పగలంతా ఆఫీస్ లో పని చేసి నైట్ టైంలో ట్రైనింగ్ తీసుకుంటూ ప్రతి రోజు నెట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఒక్కోసారైతే రాత్రుళ్ళు ఇంటికి వెళ్లకుండా గ్రౌండ్ లో పిచ్ పైనే పడుకునేవాడు. దింతో ప్రవీణ్ గేమ్ మెల్లగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది.

అయితే సరిగ్గా ఈ సమయంలోనే అప్పటి ఓరియంట్ కంపెనీ క్రికెట్ టీంకు కెప్టెన్ గా ఉన్న అజయ్ కడం ప్రవీణ్ లో ఉన్న స్పెషల్ టేలంట్ ను గుర్తించాడు. నువ్వు పేస్ బౌలింగ్ బాగానే వేస్తున్నావ్, కానీ నువ్వు వేసే బాల్ నేచురల్ గానే స్పిన్ అవుతుంది. సో నువ్వు పేస్ బౌలింగ్ కాకుండా లెగ్ స్పిన్ బౌలింగ్ ట్రై చేస్తే ఇంకా మంచి పొజిషన్ కు వెళ్తావని సలహా ఇచ్చాడు. దింతో తన కెప్టెన్ మాటలు విన్న ప్రవీణ్ కష్టమైన సరే లెగ్ స్పిన్ బౌలింగ్ నేర్చుకున్నాడు. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు అతని బౌలింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు.

Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (రంజీ ప్రాబబుల్స్)

1983 వరల్డ్ కప్ హీరోస్ లో ఒకరైన సందీప్ పాటిల్ కూడా ప్రవీణ్ తాంబే బౌలింగ్ ను ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాకుండా 1998వ సంవత్సరంలో అతన్ని ఒక నెట్ బౌలర్ గా కూడా పిక్ చేసారు. అప్పట్లో ఇండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు, షేన్ వార్న్ లెగ్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడేందుకు కుంచెం స్పెషల్ ట్రైనింగ్ కావాల్సి వచ్చింది. దింతో అతని ప్రాక్టీస్ కోసం లోకల్ గా ఉన్న కొంతమంది లెగ్ స్పిన్ బౌలర్స్ ను నెట్ బౌలర్స్ గా పిక్ చేసి సచిన్ కు బౌలింగ్ చేయించారు. అందులో ప్రవీణ్ తాంబే కూడా ఒకడు. సో ఒక్కసారిగా ప్రవీణ్ తాంబే రేంజ్ మారిపోయింది. ముంబై టీం యొక్క రంజీ ప్రాబబుల్స్ లో కూడా చోటు సంపాదించాడు. కానీ అతనికి ఫైనల్ స్క్వాడ్ లో ఛాన్స్ రాలేదు. అలాగే ఆ తరువాత కూడా బ్యాడ్ కొద్దీ మరోసారి రంజీ ప్రాబబుల్స్ లో చోటు దొరికిన ఫైనల్ స్క్వాడ్ లో మాత్రం అతనికి అవకాశం ఇచ్చేవారు కాదు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ
ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – డొమెస్టిక్ క్రికెట్

ఇక దానికి తోడు ఆ టైంలో ప్రవీణ్ కు కొన్ని గాయాలు అవ్వడం వల్ల అతను కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. బట్ క్రికెట్ మీద ఉన్న ఇష్టం మాత్రం తగ్గలేదు. మూడుపదుల వయసు దాటిన తన డ్రీం కోసం మళ్ళి పోరాడటం స్టార్ట్ చేసాడు. అయితే ఈ సారి అతని ఏజ్ ను వంకగా చూపిస్తూ ప్రవీణ్ ను రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలున్న ఏజ్ లో నీకెందుకు క్రికెట్ అంటూ అవకాశం కోసం వెళ్లిన ప్రతి చోట అవమానాలు ఎదుర్కున్నాడు. ఇక చివరికి చేసేదేమిలేక డెక్కన్ ఛార్జర్స్ మరియు పూణే వారియర్స్ ఫ్రాంచైస్స్ లో కొన్నాళ్ళు పాటు లియజాన్ ఆఫీసర్ గా పనిచేసాడు. కానీ క్రికెట్ ను మాత్రం వదిలెయ్యలేదు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (IPL కెరియర్)

రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తుంటే అది చూసేందుకు వెళ్ళేవాడు. అలాగే ఛాన్స్ దొరికినపుడు బౌలింగ్ చేసేవాడు. సరిగ్గా ఈ టైంలోనే షేన్ వార్న్ రిప్లేసెమెంట్ కోసం ఒక లెగ్ స్పిన్నర్ ను వెతుకుతున్న RR ఫ్రాంచైజ్ ప్రవీణ్ పట్టుదలకు ఫిదా అయిపోయింది. మరీముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ అయితే ఆ ఫ్రాంచైజ్ CEO వద్దన్న సరే ప్రవీణ్ ను రాజస్థాన్ స్క్వాడ్ లోకి తీసుకున్నాడు. బట్ మొదట్లో అతనికి ఛాన్సెస్ రాలేదు. టీంతో దాదాపు ఒక సంవత్సరం పాటు టీంతో ట్రావెల్ చేసాడు. సరిగ్గా ఈ టైంలోనే ప్రవీణ్ కు ఆట పట్ల ఉన్న ఇష్టాన్ని మరియు అతని సంకల్పాన్ని చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డ అని రాహుల్ ద్రావిడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ
ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – రాహుల్ ద్రావిడ్

ఇక 2013వ సంవత్సరంలో 41 ఏళ్ల వయసులో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై తన ఐపీఎల్ డెబ్యూ చేసిన ప్రవీణ్ తాంబే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేకాకుండా రిటైర్ అయ్యే ఏజ్ లో టీ20 డెబ్యూ చేసిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డును క్రియేట్ చేసాడు. నిజానికి చాలా మంది క్రికెటర్స్ 39 ఏళ్ల వయసులోనే రిటైర్ అయిపోతారు. అలాంటింది ప్రవీణ్ తాంబే ఎలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం లేకుండా ఐపీఎల్లో డెబ్యూ చేసి ఆట మీద తనకి ఎంత ఇష్టం ఉందో క్రికెట్ ప్రపంచానికి తెలియచేసాడు. ఇక అదే ఏడాది ఛాంపియన్స్ లీగ్ లో తన బౌలింగ్ విశ్వరూపం చూపించిన అతను 5 మ్యాచులోనే 12 వికెట్లు పడగొట్టి గోల్డెన్ వికెట్ అవార్డును అందుకున్నాడు. అలాగే అదే ఏడాది ముంబై టీం తరుపున 42 ఏళ్ల వయసులో ఒరిస్సా పై తన రంజీ డెబ్యూ చేసి రంజీ ట్రోఫీలో ఆడాలి అనే తన కలను నెరవేర్చుకున్నారు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ IPL హ్యాట్రిక్
ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – IPL హ్యాట్రిక్

ఇక 2014వ సంవత్సరంలో KKR పై హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టిన ప్రవీణ్ ఎంతో మంది దిగ్గజ బౌలర్స్ కు సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఆ సీజన్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ టీం తరుపున బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఇక 2015వ సంవత్సరం వరకు రాజస్థాన్ తరుపున ఆడిన తాంబే ను 2016వ సంవత్సరంలో గుజరాత్ లయన్స్ టీం పిక్ చేసింది. అలాగే 2017వ సంవత్సరంలో SRH స్క్వాడ్ లోకి వెళ్లిన ప్రవీణ్ అదే ఏడాది ముంబై తరుపున తన లిస్ట్ A డెబ్యూ కూడా చేసాడు. బట్ అతనికి రెగ్యులర్ గా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇచ్చేవారు కాదు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ (T10 కెరియర్)

దింతో ఇండియా బయట జరిగే లీగ్స్ ఆడాలని డిసైడ్ అయినా ప్రవీణ్ తన డొమెస్టిక్ కెరియర్ కు గుడ్ బయ్ చెప్పి టీ10 లీగ్ ఆడటం స్టార్ట్ చేసాడు. అంతేకాకుండా 2018వ సంవత్సరంలో కేరళ నైట్స్ పై హ్యాట్రిక్ తో పాటు 5 వికెట్ హల్ సాధించి టీ10 లీగ్ హిస్టరీలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్ గా నిలిచాడు. మరిముఖ్యంగా ఆ మ్యాచులో క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, పోలార్డ్, ఫేబియన్ ఆలెన్, ఉపుల్ తరంగ లాంటి డెంజరస్ బాట్స్మన్ ను అవుట్ చేసి ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని మరోసారి ప్రూవ్ చేసాడు.

ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ
ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ – T10 లీగ్

ఇక 47 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తాంబేను 2020 ఐపీఎల్లో ఆడటం కోసం KKR టీం 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. బట్ బీసీసీఐ దగ్గర నుండి సరైన పర్మిషన్ లేకుండా టీ10 లీగ్ లో ఆడాడని చెప్పి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రవీణ్ ను సస్పెండ్ చేసింది. అయినా తాంబే బౌలింగ్ ఆగలేదు. అదే ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో 3 మ్యాచ్లాడిన అతను 3 వికెట్లు పడగొట్టి ఆ లీగ్ లో ఆడిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డును క్రియేట్ చేసాడు.

సో ఫ్రెండ్స్ రిటైర్ అయ్యే ఏజ్ లో కూడా పట్టుదలగా తన డ్రీం కోసం పోరాడిన ప్రవీణ్ తాంబే ఇండియా తరుపున ఆడకపోయినా దాదాపు అన్ని రకాల లీగ్స్ లో తన బౌలింగ్ పవర్ చూపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. నెవెర్ గివ్ అప్ అనే వాక్యానికి పర్యాయపదంగా మారిన ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ సినిమాగా తీశారంటే ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఆ మూవీను ఫ్యాన్ మిస్ అవ్వకుండా చూడాలి.

Pravin Tambe Instagram Id – @tambepravin

Also Read – N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)