Highest Score At Each Batting Position In Test Cricket – హలో క్రికెట్ లవర్స్ ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ పొజిషన్ బేస్ చేసుకుని అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. అప్పుడు మీకు టెస్ట్ క్రికెట్ లో ప్రతి బ్యాటింగ్ పొజిషన్ కు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన 11 మంది ఆటగాళ్లు గురించి తెలుసుకోవచ్చు.
Highest Score At Each Batting Position In Test Cricket
- Highest Score At Each Batting Position In Test Cricket
- At Number 1 – Leonard Hutton (364*)
- At Number 2 – Matthew Hayden (380)
- At Number 3 – Brian Lara (400*)
- At Number 4 – Mahela Jayawardene (374)
- At Number 5 – Michael Clarke (329*)
- At Number 6 – Ben Stokes (258)
- At Number 7 – Donald Bradman (270)
- At Number 8 – Wasim Akram (257*)
- At Number 9 – Ian Smith (173)
- At Number 10 – Walter Read (117)
- At Number 11 – Ashton Agar (98)
At Number 1 – Leonard Hutton (364*)
ఇంగ్లాండ్ కు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు 1938వ సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో స్ట్రైకర్ ఎండ్ లో అంటే ఒకటవ స్థానంలో బరిలోకి దిగి ఒక సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో దాదాపు 13 గంటల పాటు క్రీజ్ లో పాతుకుపోయిన లెన్ హాటన్ ఏకంగా 364 పరుగులను సాధించి నాటౌట్ గా నిలిచాడు. అండ్ అతను ఆడిన ఈ లాంగ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 35 ఫోర్లు ఉన్నాయి.
At Number 2 – Matthew Hayden (380)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్సమెన్ 2003వ సంవత్సరంలో జింబాబ్వేతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో అదరగొట్టి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో 437 బంతులాడిన హేడెన్ 38 ఫోర్లు మరియు 11 సిక్సర్ల సహాయంతో ఏకంగా 380 పరుగులను సాధించాడు. నిజంగా హేడెన్ ఇన్నింగ్స్ అయితే వన్డే స్టయిల్లో ఉందని చెప్పుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి ఒక బ్యాట్సమెన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
At Number 3 – Brian Lara (400*)
వెస్టిండీస్ కు చెందిన ఈ దిగ్గజ ఆటగాడు 2004వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో 3వ స్థానంలో బరిలోకి దిగి చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే ఒక ట్రేడ్మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో మొత్తం 582 బంతులాడిన లారా 43 ఫోర్లు మరియు 4 సిక్సర్ల సహాయంతో ఏకంగా 400 పరుగులను సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటింగ్ పొజిషన్ కైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.
At Number 4 – Mahela Jayawardene (374)
శ్రీలంకకు చెందిన ఈ లెజెండరీ బ్యాట్సమెన్ 2006 వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో 4వ స్థానంలో బరిలోకి దిగి కుమార సంగాక్కర తో కలసి ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో మొత్తం 572 బంతులాడిన జయవర్ధనే 43 ఫోర్లు మరియు 1 సిక్సర్ సహాయంతో 374 పరుగులను సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో 4వ స్థానంలో బరిలోకి దిగి ఒక ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
Also Read – 286 Runs Off 1 Ball Is Real or Fake Story (1 బంతికి 286 పరుగులు నిజంగానే కొట్టారా)
At Number 5 – Michael Clarke (329*)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ దిగ్గజ ఆటగాడు 2012వ సంవత్సరంలో మన టీమిండియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో 5వ స్థానములో బ్యాటింగ్ కు దిగి ఒక వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో మొత్తం 468 బంతులాడిన క్లార్క్ 39 ఫోర్లు మరియు 1 సిక్సర్ సహాయంతో ఏకంగా 329 పరుగులను సాధించి నాటౌట్ గా నిలిచాడు.
At Number 6 – Ben Stokes (258)
ఇంగ్లాండ్ కు చెందిన ఈ బ్యాటింగ్ ఆల్ రౌండర్ 2016వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్ల్లో తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు 6వ స్థానములో బ్యాటింగ్ కు దిగిన స్టోక్స్ మన వీరేంద్ర సెహ్వాగ్ స్టయిల్లో ఒక విద్వాంస్కర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో కేవలం 198 బంతులాడిన స్టోక్స్ 30 ఫోర్లు మరియు 11 సిక్సర్ల సహాయంతో ఏకంగా 258 పరుగులను సాధించాడు.
At Number 7 – Donald Bradman (270)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు 1937వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తో పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్ల్లో మొత్తం 375 బంతులాడిన బ్రాడ్మన్ 22 ఫోర్లు సహాయంతో ఏకంగా 270 పరుగులను సాధించి ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.
Also Read – Highest Score At Each Batting Position In ODI Cricket Telugu
At Number 8 – Wasim Akram (257*)
పాకిస్తాన్ కు చెందిన ఈ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ 1996వ సంవత్సరంలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో తన సహచర ఆటగాళ్లంతా బ్యాటింగ్ చెయ్యలేక చేతులెత్తేస్తే తను మాత్రం ఒంటరి పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో 8వ స్థానములో బ్యాటింగ్ కు వచ్చిన అక్రమ్ 363 బంతుల్లో 257 పరుగులను సాధించి బ్యాట్సమెన్ ఏ కాదు బౌలర్ కూడా డబుల్ సెంచరీ చెయ్యగలడని నిరూపించాడు. అక్రమ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 22 ఫోర్లతో పాటు 12 సిక్సర్లు ఉన్నాయి.
At Number 9 – Ian Smith (173)
న్యూజీలాండ్ కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్సమెన్ 1990 వ సంవత్సరంలో ఇండియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో తన టీం 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు 9వ స్థానములో బ్యాటింగ్ కు దిగి ఒక సెన్సషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో కేవలం 136 బంతులాడిన స్మిత్ 23 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో ఏకంగా 173 పరుగులను సాధించి తన కెరియర్లో ఎప్పటికి మరిచిపోలేని ఘనత సాధించాడు.
At Number 10 – Walter Read (117)
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఆటగాడు 1884 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఒక వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో మొత్తం 155 బంతులాడిన వాల్టర్ 20 ఫోర్లు సహాయంతో 117 పరుగులను సాధించాడు. వాల్టర్ ఈ రికార్డును సాధించి 136 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఎవరు దీన్ని బద్దలగొట్టలేకపోయారు.
At Number 11 – Ashton Agar (98)
ఆస్ట్రేలియా కు చెందిన ఈ స్పిన్ బౌలర్ 2013వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో తన టీం 117 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్ల్లో ఉన్నప్పుడు చిట్టచివరి స్థానములో బ్యాటింగ్ కు దిగి ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ల్లో కేవలం 101 బంతులాడిన అగర్ 12 ఫోర్లు మరియు 2 సిక్సర్ల సహాయంతో 98 పరుగులను సాధించి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసాడు.
Also Read – Why Only A Few Players Get Sir Title In Cricket – 29 Famous Cricketers Who Got Sir Title