హనుమ విహారి బయోగ్రఫీ – టెస్ట్ క్రికెట్, పేరులోనే ఉంది మనం ఆడే ఆటకు పరీక్ష పెట్టె కష్టమైన ఫార్మాట్ ఇది. ఒక ప్లేయర్ యొక్క ఏకాగ్రత, ఫిట్నెస్, ఓపిక మరియు టెక్నీక్ కు అసలైన పరీక్షగా మారే ఈ ఫార్మాట్ లో చాలా తక్కువ మంది ఆటగాళ్లే సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ జనరేషన్ లో 90% క్రికెటర్ గా మారాలనుకుంటున్న యువత కోట్ల వర్షం కురిపిస్తున్న టీ20 ఫార్మాట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్త టీ20 లీగ్ పుట్టుకొస్తుంది. వాటిలో బాగా రాణిస్తే డబ్బుతో పాటు మంచి పేరు కూడా వస్తుంది.
మరిముఖ్యంగా ఐపీఎల్ వంటి లీగ్స్ లో ఒక్క ఏడాది బాగా ఆడిన చాలు నేరుగా టీమిండియాలోకి వెళ్లిపోవచ్చు. దింతో ప్రెసెంట్ జనరేషన్ ప్లేయర్స్ అంత టీ20 క్రికెట్ పైనే వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్లందరికీ బిన్నంగా మన తెలుగు క్రికెటర్ ఒకరు తన జీవితాన్ని రెడ్ బాల్ క్రికెట్ కు అంకితం చేసాడు. టీమిండియాలోకి వెళ్లడం కోసం కష్టమైన దారినే ఎంచుకుని తను కన్న కలను నిజం చేసుకోవడమే కాకుండా టీమిండియాకు టెస్ట్ క్రికెట్ లో ఒక వాల్ గా మారాడు. అతనే మన గోదావరి బిడ్డ హనుమ విహారి. 12 ఏళ్లకే తన తండ్రిని పోగుట్టుకుని ఫ్యూచర్ లో టీమిండియా వరకు తీసుకెళ్తుందో లేదో తెలియని ఒకే ఫార్మాట్ పై శ్రద్ధ పెట్టి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న తెలుగు ప్లేయర్ హనుమ విహారి యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
హనుమ విహారి బయోగ్రఫీ (బయోడేటా)
హనుమ విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. అలాగే అతన్ని అందరూ ముద్దుగా కన్నా అని పిలుస్తారు. ఇక విహారి 1993వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు సత్యనారాయణ విహారి. ఈయన గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గన్నుల్లో ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి పేరు విజయలక్ష్మి. వీళ్లది ఒక మధ్య తరగతి కుటుంబం. ఇక విహారి ఈ దంపతులకు జన్మించిన రెండవ సంతానం. అలాగే అతనికి ఒక అక్క వైష్ణవి కూడా ఉంది.
హనుమ విహారి బయోగ్రఫీ (బాల్యం)
ఇక విహారి పుట్టింది కాకినాడలోనే అయినా అతని తండ్రి ఉద్యోగరీత్యా గోదావరిఖనిలోనే పెరిగాడు. సరిగ్గా ఈ టైంలోనే తనకి ఐదేళ్ల వయస్సు వచ్చేసరికి క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. చిన్న వయసులో కూడా పెద్దవాళ్ళతో కలిసి క్రికెట్ ఆడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. దింతో వాళ్ళ కాలనిలో ఉండే ఇరుగుపొరుగువాళ్లంతా విహారి తల్లి దగ్గరకు వచ్చి మీ అబ్బాయి ఎప్పటికైనా ఇండియా తరుపున క్రికెట్ ఆడతాడని చెప్తూ ఉండేవారు. అలాగే విహారి కూడా అమ్మ నేను క్రికెటర్ ను అవుతా అంటూ తన తల్లిని ఎంతగానో అలరించేవాడు. దింతో కొడుకు పట్టుదల చూసిన విజయలక్ష్మి గారు విహారిను ఎలాగైనా గొప్ప క్రికెటర్ ను చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. కానీ గోదావరిఖనిలోనే ఉంటే అది అసాధ్యమని ఆవిడకు అర్ధమయ్యింది.
కొడుకు భవిష్యత్ గురించి ఎంతగానో ఆలోచించిన విజయలక్ష్మి గారు ఆమె భర్తకు కొడుకు ప్యాషన్ గురించి వివరించి తన ఇద్దరి పిల్లలతో సికింద్రాబాద్ వచ్చేసారు. అలాగే అక్కడ ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకుని పిల్లలని పోషించడం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఇక సింగరేణిలో పనిచేస్తున్న విహారి తండ్రి తన జీతాన్ని పిల్లల స్కూల్ ఫీజుల కోసం పంపిస్తూ ఉండేవారు. వాటిలోనే కొంతడబ్బుతో విహారికు 8 ఏళ్ల వయసు వచ్చేసరికి జింఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ కోచింగ్ తీసుకునేందుకు జాయిన్ చేసారు.
Also Read – N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)
హనుమ విహారి బయోగ్రఫీ (జూనియర్ క్రికెట్ కెరియర్)
ఇక అప్పటినుండి జాన్ మనోజ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఆటలో మెళుకువలు నేర్చుకోవడం మొదలుపెట్టిన విహారి చాలా తక్కువ టైంలోనే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ల మారిపోయాడు. హైదరాబాద్ లో తను చదువుకున్న సెయింట్ ఆండ్రూస్ స్కూల్ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అలాగే VVS లక్ష్మణ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్ గా మారాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అయితే అంత బాగానే సెట్ అయ్యింది అనే టైంకు విహారి కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది.
అతనికి 12 ఏళ్ల వయసులో స్టేట్ లెవెల్ అండర్ 13 క్రికెట్ ఆడుతున్నప్పుడు విహారి తండ్రి మరణించారు. దింతో అతని కుటుంబం ఒక్కసారిగా బ్లాంక్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. ఇంటికి పెద్ద దిక్కైన భర్త మరణించడంతో విజయలక్ష్మి గారు కుమిలిపోయారు. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. కానీ ఆమె మాత్రం కొడుకు కలను చెదిరిపోనివ్వలేదు. ఎంత కష్టమైన సరే విహారి ట్రైనింగ్ ను కొనసాగించాలని బలంగా నిశ్చయించుకున్నారు.
భర్త చనిపోయిన తరువాత ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులను జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఒకవైపు ఇంటిని ముందుకు నడిపిస్తునే మరోవైపు కొడుకు ట్రైనింగ్ కు అవసరమయ్యే వాటన్నింటిని సమకూరుస్తూ వచ్చారు. ఒకానొక టైములో అయితే ఇల్లు గడిచేందుకు ఎంత కష్టంగా ఉన్నాసరే విహారికు మంచి క్వాలిటీ ఉన్న ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి టాప్ లెవెల్ కోచింగ్ సెంటర్ లో అతన్ని జాయిన్ చేసారు. క్రికెటర్ అవుతా అంటే చీపురికట్ట తిరగేసే ఈ రోజుల్లో ఒక తల్లి కొడుకు టేలంట్ ను ఇంతలా నమ్మి అతని కోసం ఇన్ని త్యాగాలు చేసిందంటే నిజంగా హ్యాట్సాఫ్ టూ విజయలక్ష్మి గారు.
ఇక తల్లి సహకారంతో తన క్రికెట్ జర్నీను కొనసాగించిన విహారి అండర్ 14 కేటగిరిలో లో తన టీం తరుపున ఒక డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే అతనికి 17 ఏళ్ల వయసు వచ్చేసరికి హైదరాబాద్ రంజీ టీంలో కూడా చోటు సంపాదించాడు. ఇక విహారి 2010వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జార్ఖండ్ పై తన రంజీ డెబ్యూ చేసాడు. అలాగే అదే ఏడాది హైదరాబాద్ టీం తరపునే తన డొమెస్టిక్ టీ20 డెబ్యూ కూడా చేసాడు. అయితే మొదట్లో విహారి ఎక్కువ సక్సెస్ చూడలేదు. కానీ 2011వ సంవత్సరంలో బాగా రాణించిన విహారి టీమిండియా తరుపున అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు.
హనుమ విహారి బయోగ్రఫీ (అండర్ 19 కెరియర్)
బట్ 2012వ సంవత్సరంలో జరిగిన ఆ అండర్ 19 వరల్డ్ కప్ అతనికి అంతగా కలిసిరాలేదు. ఆ ఏడాది ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలోని మన టీమిండియా ఛాంపియన్స్ గా నిలిచినా గానీ, విహారి మాత్రం ఆ టోర్నమెంట్ లో కేవలం 71 పరుగులే సాధించాడు. కానీ తన గేమ్ ను అయితే ఆపలేదు. ఆ మరుసటి ఏడాది మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అయినా విహారి డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టాడు. దింతో అప్పుడప్పుడే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విహారి ను తమ స్క్వాడ్ లోకి తీసుకుంది.
Also Read – Ambati Rayudu Biography In Telugu (అంబటి రాయుడు బయోగ్రఫీ)
హనుమ విహారి బయోగ్రఫీ (డొమెస్టిక్ & IPL కెరియర్)
ఇక విహారి 2013వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన పూణే వారియర్స్ పై తన ఐపీఎల్ డెబ్యూ చేసాడు. అయితే ఆ మ్యాచులో పెద్దగా రాణించలేకపోయిన ఆర్సీబీ తో జరిగిన రెండో మ్యాచులో మాత్రం క్రిస్ గేల్ ను అవుట్ చేయడంతో పాటు బ్యాటింగ్ లో 44 పరుగులు సాధించి మెన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కానీ ఆ తరువాత స్లో బ్యాటింగ్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండేది.దింతో విహారికు ఐపీఎల్ తో పాటు లిమిటెడ్ ఓవెర్స్ క్రికెట్ లో ఆడేందుకు పెద్దగా అవకాశాలు దొరికేవి కావు. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రమే అతను ఎక్కువగా కనిపించేవాడు.
ఇక తన బలం టెస్ట్ క్రికెట్ అని పూర్తిగా అర్థంచేసుకున్న విహారి ఐపీఎల్ నుండి టీమిండియాలోకి వెళ్లడం కష్టమని తెలుసుకున్నాడు. దింతో పూర్తిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ పై ఫోకస్ పెట్టిన అతను ఈ తరం క్రికెటర్లందరికి భిన్నంగా ఒక సాలిడ్ డిఫెన్సివ్ టెక్నీక్ ను అలవర్చుకున్నాడు. అలాగే రంజీ ట్రోఫీలో గంటల తరబడి క్రీజ్ లో పాతుకుపోయి నిలకడగా బ్యాటింగ్ చేసేవాడు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఎంత బాగా రాణించిన గానీ అతనికి మన టీమిండియా నుండి పిలుపువచ్చేది కాదు. దింతో విహారి 2016వ సంవత్సరం నుండి ఆంధ్ర టీం తరుపున ఆడాలని ఫిక్స్ అయ్యి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ టీంను హైదరాబాద్ నుండి ఆంధ్రాకు మార్చుకున్నాడు.
ఇక ఆంధ్రా టీంలోకి వచ్చిన తరువాత తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన విహారి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసాడు. మరీముఖ్యంగా 2017వ సంవత్సరంలో ఒడిశా టీం పై ట్రిపుల్ సెంచరీ సాధించి టీమిండియా సెలెక్టర్స్ నా వైపు చూడండంటూ ఒక సందేశం పంపించాడు. అలాగే ఆ సీజన్లో మొత్తం 6 మ్యాచ్‌లాడి 94 సగటుతో 752 పరుగులు సాధించాడు. దింతో అతన్ని డైరెక్ట్ గా ఇండియా టీంలోకి సెలెక్ట్ చెయ్యకపోయినా ఇండియా A టీం తరుపున ఆడేందుకు సెలెక్ట్ చేసారు. ఇక అక్కడ రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో మరింత రాటుదేలిన విహారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 59 పరుగుల సగటుతో బ్యాటింగ్ చేస్తూ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రెడ్ బాల్ క్రికెటర్స్ గా పేరు సంపాదించాడు. అలాగే తన గురువైన రాహుల్ ద్రావిడ్ దగ్గర మరిన్ని డిఫెన్సివ్ టెక్నీక్స్ నేర్చుకుని వికెట్ల ముందు ఒక గోడల నిలబడి బ్యాటింగ్ చేసేవాడు.
హనుమ విహారి బయోగ్రఫీ (అంతర్జాతీయ కెరియర్)
ఇక విహారి బ్యాటింగ్ చూసి దాదాపు 19 ఏళ్ల తరువాత ఒక ఆంధ్రా కుర్రాడని టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ చేసారు. దింతో విహారి 2018వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఇంగ్లాండ్ పై తన టెస్ట్ డెబ్యూ చేసి టీమిండియా తరుపున ఆడాలనే తన తల్లి కోరికను నెరవేర్చాడు. మరీముఖ్యంగా ఐపీఎల్ ను నమ్ముకుంటేనే టీమిండియాలోకి రాగలం అని బలంగా ఫిక్స్ అయినా ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ కు అది తప్పని నిరూపించాడు.
ఇక ఇంగ్లాండ్ పై తన డెబ్యూ మ్యాచులోనే హాఫ్ సెంచరీ సాధించిన విహారి ఘనంగా తన టెస్ట్ కెరియర్ ను ఆరంభించాడు. కానీ అతనాడిన రెండో టెస్ట్ సిరీస్ లోనే విహారీకు ఒక అగ్ని పరీక్ష ఎదురయ్యింది. ఆస్ట్రేలియా లాంటి కష్టమైన కండిషన్స్ లో అతని రెగ్యులర్ స్థానం కానీ ఓపెనింగ్ పోజిషన్ లో బ్యాటింగ్ చెయ్యవలసింది. అయితే ఇలాంటి కష్టమైన సిట్యువేషన్ లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతను ఎక్కువ పరుగులు సాధించకపోయినా బాల్ ఓల్డ్ అయ్యే వరకు క్రీజ్ లో నిలబడి ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చే ఆటగాళ్లకు మంచి ప్లాట్ఫారం సెట్ చేసాడు.
ఇక ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్ లో విహారి తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీను సాధించాడు. అయితే విహారి ఎంత బాగా రాణించిన గాని ప్లేయింగ్ 11 లో అతని ప్లేస్ కు గ్యారంటీ ఉండేది కాదు. మరీముఖ్యంగా ఇండియాలో టెస్ట్ మ్యాచులంటే చాలు అతన్ని పక్కన కూర్చోబెట్టేసేవారు. టఫ్ కండీషన్స్ ఉండే SENA కంట్రీస్ లోనే అతనికి టీంలో ప్లేస్ దక్కేది. అయినప్పటికీ విహారి మాత్రం సాలిడ్ బ్యాటింగ్ టెక్నీక్ తో మిగతా బాట్స్మన్ తడబడ్డ చోట అతను మాత్రం క్రీజ్ లో పాతుకుపోయేవాడు.
ముఖ్యంగా 2021వ సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన ఒక ముఖ్యమైన టెస్ట్ మ్యాచులో గాయాన్ని సైతం లెక్కచెయ్యకుండా బ్యాటింగ్ చేసి ఇండియాను ఓటమి అంచుల నుండి తప్పించాడు. నిజానికి అతను ఈ ఇన్నింగ్స్‌లో 23 పరుగులే సాధించిన అతను పోరాడిన తీరు ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసింది. సో ప్రెసెంట్ అయితే హనుమ విహారి తన ఫోకస్ మొత్తం టెస్ట్ క్రికెట్ పైనే పెట్టి ఒక ప్యూర్ టెస్ట్ క్రికెటర్ గా మన టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. సో ఇలాంటి ప్లేయర్ కు మన టీం మేనేజ్మెంట్ ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ అతన్ని బాగా ఎంకరేజ్ చేస్తే మన టీమిండియాకు మరో వాల్ దొరికినట్టే. చూడాలి మరి విహారి ప్రెసెంట్ తనకి నెంబర్ 3 లో వచ్చిన అవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగపరుచుకుంటాడో.
Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)
హనుమ విహారి బయోగ్రఫీ (వ్యక్తిగత జీవితం)
ఇక విహారి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2019వ సంవత్సరం మే 19వ తేదీన తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ అయినా ప్రీతిరాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే విహారీకు మొక్కలను పెంచడం అన్న ట్రావెలింగ్ చెయ్యడం అన్న చాలా ఇష్టం. ఇక ఎప్పుడు చాలా కామ్ ఉండే విహారి టీం యొక్క కంబినేషన్ కోసం ఎన్నో సార్లు జట్టులో తన స్థానాన్ని త్యాగం చేసాడని మన టీమిండియా ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్ R శ్రీధర్ చెప్పారు. విహారి ఫేవరిట్ బాట్స్మన్ VVS లక్ష్మణ్ మరియు సచిన్ టెండూల్కర్. అలాగే ఫేవరేట్ బౌలర్ షేన్ వార్న్. సో ఇది గాయిస్ మన గోదావరి బిడ్డ హనుమ విహారి బయోగ్రఫీ.
Hanuma Vihari Instagram ID – @viharigh
Hanuma Vihari Twitter ID – @Hanumavihari