క్రికెట్ పిచ్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ ఆడినప్పుడు కామెంటేటర్స్ “పిచ్ స్లో గా ఉంది ఫాస్ట్ గా ఉంది బౌన్స్ ఎక్కువుగా ఉంది గ్రాస్ ఎక్కువుగా ఉంది టాప్ లేయర్ డస్టిగా ఉంది” ఇలా చాలా రకాలుగా పిచ్ అనలైజ్ చేస్తారు. అయితే వీటికి మీనింగ్ ఏంటి? అసలు క్రికెట్ పిచ్ ను ఎలా తయారుచేస్తారు. అలాగే క్రికెట్ పిచ్ లో ఎన్ని రకాలున్నాయి. క్రికెట్ పిచ్ ను చూసి దాని బిహేవియర్ ను ఎలా చెప్తారు. వీటన్నింటి గురించి క్లియర్ గా ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
క్రికెట్ పిచ్ అంటే ఏంటి?
క్రికెట్ గ్రౌండ్ మధ్యలో లేత గోధుమ రంగులో ఉండే 22 గజాలు (20.12 మీటర్లు) పొడవు మరియు 10 అడుగులు (3.05 మీటర్లు) వెడల్పు ఉన్న ప్రాంతాన్ని క్రికెట్ పిచ్ అంటారు. క్రికెట్‌లో జరగాల్సిన పనులన్నీ ఈ 22 గజాల ప్రాంతంలోనే జరుగుతాయి. అయితే, కొన్ని మైదానాల్లో, కృత్రిమ పిచ్‌ను ఉపయోగిస్తారు. వీటిని నాన్ టర్ఫ్ పిచ్‌లు అంటారు. అవి కనీసం 58 అడుగుల పొడవు మరియు కనీసం 6 అడుగుల వెడల్పు ఉండాలి. వీటిని మైదానంలో కాకుండా బయట తయారు చేసి మ్యాచ్ కు ముందు గ్రౌండ్ లో అమర్చుతారు.
క్రికెట్ పిచ్ ను ఎలా తయారు చేస్తారు?
జనరల్ గా క్రికెట్ పిచ్ ను నాలుగు రకాల కంపోనెంట్స్ తో తయారు చేస్తారు.
- Clay Content (మట్టి పదార్థం)
- Sand Content (ఇసుక పదార్థం)
- Fine Sand Content (మెత్తటి ఇసుక పదార్థం)
- Silt Content (మెత్తని ఒండ్రు మట్టి పదార్థం)
ఒక క్రికెట్ పిచ్ తయారు చేయడం కోసం క్లే కంటెంట్ అంటే మట్టిని 50 శాతం కన్నా తక్కువగా ఉపయోగిస్తారు. అలాగే సాండ్ కంటెంట్ అంటే ఇసుకను 5 శాతం కన్నా తక్కువగా వాడతారు. ఇక ఫైన్ సాండ్ అంటే బాగా మెత్తటి ఇసుక ను 20 శాతం కన్నా తక్కువ ఉపయోగిస్తారు. చివరిగా సిల్ట్ కంటెంట్ అంటే మనకు రివర్ సైడ్ దొరికే మెత్తని ఒండ్రు మట్టిని 20 శాతం కన్నా తక్కువగా యూస్ చేసి క్రికెట్ పిచ్ ను తయారుచేస్తారు. కాగా ఈ నాలుగు కంటెంట్స్ ను మిక్స్ చెయ్యడం కోసం PH వేల్యూ 6.30 నుండి 7.30 మధ్యలో ఉన్న లిక్విడ్ ను యూస్ చేస్తారు. సాధారణంగా అయితే అది నార్మల్ వాటర్.
మనకు క్రికెట్ లో మేజర్ గా రెండు రకాల పిట్చెస్ ను తయారు చేస్తారు.
- Black Soil (బ్లాక్ సాయిల్)
- Red Soil (రెడ్ సాయిల్)
Also Read – Different Types Of Cricket Balls (క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి)
బ్లాక్ సాయిల్ క్రికెట్ పిచ్
బ్లాక్ సాయిల్ పిచ్ అంటే అందులో క్లే కంటెంట్ ఎక్కువుగా ఉండి సాండ్ కంటెంట్ తక్కువుగా ఉంటుంది. దాని వల్ల పిచ్ కు ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే బ్లాక్ సాయిల్ వాటర్ ను బాగా అబ్సర్వ్ చేసుకుంటుంది. దీని వల్ల పిచ్ త్వరగా ఎండిపోదు. పిచ్ యొక్క టాప్ లేయర్ చాలా హార్డ్ గా ఉంటుంది. అలాగే పిచ్ కలర్ కూడా బ్లాక్ అండ్ బ్రౌన్ గా ఉంటుంది.
రెడ్ సాయిల్ క్రికెట్ పిచ్
రెడ్ సాయిల్ పిచ్ విషయానికొస్తే ఇందులో క్లే కంటెంట్ తక్కువుగా ఉండి, సాండ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల పిచ్ కు ఎలాస్టిసిటీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే సాండ్ కంటెంట్ వాటర్ ను తక్కువగా అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి పిచ్ ఫాస్ట్ గా డ్రై అవుతుంది. దీని వల్ల పిచ్ టాప్ లేయర్ అంతా డస్టిగా ఉంటుంది. అంటే ఎక్కువ వదులుగా ఉండి త్వరగా చీలిపోతుంది. దింతో మ్యాచ్ ఆడే కొద్దీ పిచ్ పై క్రాక్స్ అంటే పగుళ్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ రెడ్ సాయిల్ పిచ్ మోస్ట్లీ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇప్పటివరకు క్రికెట్ పిచ్ యొక్క సాయిల్ గురించి తెసులుసుకున్నాం. ఇక ఇప్పుడు క్రికెట్ పిచ్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం.
వివిధ రకాల క్రికెట్ పిచ్ లు
1. Flat Pitch (ఫ్లాట్ క్రికెట్ పిచ్)
పేరులోనే ఉంది ఫ్లాట్ పిచ్. అంటే పిచ్ లో ఎలాంటి జీవం ఉండదు. ఫ్లాట్ పిట్చెస్ ను ఎలా తయారు చేస్తారంటే పిచ్ మీద ఉండే మొత్తం గ్రాస్ ను రోల్ డౌన్ చేస్తారు. దీనర్థం పిచ్ మీద ఉండే చిన్న గడ్డిని చాలా అంటే చాలా షార్ట్ గా ట్రిమ్ చేస్తారు. అలాగే వాటరింగ్ కూడా చాలా తక్కువుగా చేస్తారు. దీని వల్ల పిచ్ సర్ఫేస్ పై తేమ అనేది ఉండదు. దింతో పిచ్ మీద ఉండే ఆ కుంచెం గ్రాస్ కూడా ఎండిపోతుంది.
ఇక ఇలా పిచ్ పై ఉండే ఆ షార్ట్ గ్రాస్ లో జీవం పోవడం వల్ల లైట్ గా క్రాక్స్ అనేవి కూడా వస్తాయి. దింతో పిచ్ మొత్తం డెడ్ అవుతుంది. సో పేస్ బౌలర్ కైనా సరే స్పిన్ బౌలర్ కైనా సరే, పిచ్ నుండి ఎలాంటి హెల్ప్ దొరకదు. బాల్ పిచ్ అయ్యాక ఈజీగా బ్యాట్ పైకి వస్తుంది. దింతో ఫ్లాట్ పిచ్ పై రన్స్ స్కోర్ చెయ్యడం చాలా ఈజీ. బౌలర్ లైన్ అండ్ లెంగ్త్ ను సరిగ్గా అంచనా వేసి బ్యాటింగ్ చేస్తే సెంచరీల మీద సెంచరీలు కొట్టొచ్చు.
ఇలాంటి ఫ్లాట్ పిట్చెస్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే మన సబ్ కాంటినెంట్ లో చూడొచ్చు. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ లో ఎక్కువగా ఈ ఫ్లాట్ పిట్చెస్ అనేవి కనపడతాయి. అలాగే వెస్టిండీస్ మరియు జింబాబ్వే తో పాటు గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఈ ఫ్లాట్ పిట్చెస్ ను చూడొచ్చు. కానీ ఇవే ఫ్లాట్ పిట్చెస్ ను టెస్ట్ క్రికెట్ కోసం వాడితే డే 4 మరియు డే 5 వచ్చే సరికి అవి స్పిన్ పిట్చెస్ గా మారిపోతాయి.
ఎందుకంటే మొదటి మూడు రోజులు పిచ్ అనేది సన్ లైట్ కు ఎక్సపోజ్ అవుతుంది. దీని వల్ల స్టార్టింగ్ లో ఉన్న చిన్న క్రాక్స్ అన్ని పెద్దవిగా మారతాయి. అలాగే మూడు రోజుల పాటు బౌలింగ్ చెయ్యడం వల్ల పిచ్ కు ఇరువైపులా బౌలర్ల ఫుట్ మార్క్స్ కూడా ఏర్పడతాయి. దీని వల్ల బాల్ ఆ ఫుట్ మార్క్స్ లేదా క్రాక్స్ పై పిచ్ అయినప్పుడు ఎక్కువగా టర్న్ అవుతుంది. అందువల్లే డే 4 మరియు డే 5 పిచ్ మీద బ్యాటింగ్ చెయ్యడం చాలా కష్టం. కాబట్టి ఈ ఫ్లాట్ పిట్చెస్ ను ఎక్కువగా ఒన్డే మరియు టీ20 క్రికెట్ కు యూస్ చేస్తారు. ఒకవేళ టెస్ట్ క్రికెట్ కు యూస్ చేసిన మ్యాచ్ సాగే కొద్దీ అది స్పిన్ ట్రక్ గా మారిపోతుంది.
Also Read – What Is Two Paced Wicket In Cricket (క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి)
ఇక పిచ్ ఫ్లాట్ గా ఉందొ లేదో కనిపెట్టడం కోసం పిచ్ పై మీ చేత్తో నాక్ చెయ్యండి. అది హార్డ్ గా ఉంటే ఫ్లాట్ పిచ్ అని సగం నిర్దారణ అయినట్టే. ఇక మిగతా సగం నిర్దారించడం కోసం పిచ్ సర్ఫేస్ పై మీ అరచేత్తో రబ్ చెయ్యండి. అలా చేసినప్పుడు మీ అరచేతికి తడి అవ్వకపోతే అది ఫ్లాట్ పిచ్ అని అర్ధం. అలాగే ఈ ఫ్లాట్ పిచ్ ఎక్కువగా బ్లాక్ లేదా డార్క్ గ్రే కలర్ లో ఉంటుంది.
2. Dusty Pitch (డస్టి క్రికెట్ పిచ్)
దీన్నే మనం స్లో పిచ్ అని కూడా అంటాం. డస్టి క్రికెట్ పిచ్ ను నార్మల్ గా రెడ్ సాయిల్ తో ప్రిపేర్ చేస్తారు. దీని పై గ్రాస్ ఉండదు తేమ ఉండదు. మొత్తం పొడిగా ఉంటుంది. కాగా పిచ్ ఇలా డ్రైగా ఉండటం వల్ల టాప్ లేయర్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది. దింతో మ్యాచ్ ముందు పిచ్ ను ఎక్కువగా రోల్ చెయ్యరు. ఇక ఈ డస్టి క్రికెట్ పిచ్ అనేది ఎక్కువగా స్లో బౌలర్స్ కు అనుకూలిస్తుంది. అంటే స్పిన్ బౌలర్లకు ఈ డస్టి పిచ్ అనేది ఒక స్వర్గం లాంటింది. టెస్ట్ క్రికెట్ లో మొదటి రోజు నుండే స్పిన్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకోవచ్చు.
ఇక డస్టి క్రికెట్ పిచ్ టాప్ లేయర్ అంతా సాఫ్ట్ గా ఉండటంతో అది ఈజీ గా బ్రేక్ అవుతుంది. దింతో బాల్ పిచ్ అయినా తరువాత ఆగి కుంచెం నెమ్మదిగా బ్యాట్ పైకి వస్తుంది. అలాగే బాల్ కూడా ఎక్కువగా టర్న్ అవుతుంది. ఇక ఇలాంటి డస్టి పిట్చెస్ ను ఎక్కువగా మన సబ్ కాంటినెంట్ లో చూస్తుంటాం. అయితే వీటిని ఎక్కువగా టెస్ట్ క్రికెట్ కు మాత్రమే యూస్ చేస్తారు.
ఒకవేళ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో ఇలాంటి పిచ్ ను వాడితే అది చాలా స్లో గా ఉండటం వల్ల 250 రన్స్ కూడా ఒక మంచి టార్గెట్ అవుతుంది. అయితే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో ఈ పిచ్ స్పిన్నర్లతో పాటు ఎవరైతే మీడియం పేస్ బౌలింగ్ వేస్తారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చేయవల్సిందల్లా కట్టర్స్ తో పాటు స్లోవెర్ బాల్స్ వెయ్యాలి. ఎందుకంటే బాల్ గ్రిప్ అయ్యి బ్యాట్ పైకి వస్తుంది. అంటే 130 కిలోమీటర్ల వేగంతో బాల్ వేస్తే అది 120 కిలోమీటర్ల వేగంతో వేసిన బాల్ లా బిహేవ్ చేస్తుంది. సింప్లి బాల్ పిచ్ అయ్యాక దానిలో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎవరైతే బాల్ ను రోటారీ మోషన్ తో రిలీజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇక పిచ్ డస్టిగా ఉందొ లేదో కనిపెట్టడం కోసం మీ కాలితో పిచ్ పై రబ్ చెయ్యండి. అలా చేసినప్పుడు పిచ్ టాప్ లేయర్ డిస్టర్బ్ అయితే అది స్లో పిచ్ అని అర్ధం. అలాగే మీరు రబ్ చేసిన చోట చేయి పెట్టి చూస్తే మీ చేతికి డస్ట్ కూడా అంటుకుంటుంది.
3. Green or Grassy Pitch (పచ్చిక క్రికెట్ పిచ్)
ఒక పిచ్ గ్రీన్ గా ఎప్పడుంటుందంటే దాని పై జీవమున్న గ్రాస్ ఉన్నప్పుడు. అంటే గ్రీన్ క్రికెట్ పిచ్ లో జీవం ఉంటుంది. అలాగే పిచ్ పై గ్రాస్ ఉందంటే వాటి రూట్స్ లో వాటర్ అనేది ఉంటుంది. దింతో గ్రీన్ పిచ్ పై తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రాస్ ఉండటం వల్ల టాప్ లేయర్ అంత చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రాస్ యొక్క వేర్లు పిచ్ టాప్ లేయర్ పై ఉండే సాయిల్ ను గట్టిగా పట్టి ఉంచుతాయి. దీని వల్ల పిచ్ ఈజీగా బ్రేక్ అవ్వదు. దింతో ఈ గ్రీన్ పిచ్ పై బాల్ ల్యాండ్ అయినా తరువాత దానికి మూవ్మెంట్ తో పాటు ఎక్స్ట్రా బౌన్స్ కూడా దొరుకుతుంది.
అంటే ఈ గ్రీన్ పిట్చెస్ అనేవి ఎక్కువగా పేస్ బౌలింగ్ కు బాగా అనుకూలిస్తాయి. ఎవరైతే బాల్ సీమ్ ను కరెక్ట్ గా 90 డిగ్రీస్ యాంగిల్ తో పెట్టి రిలీజ్ చేస్తారో వాళ్ళకి పిచ్ నుండి బీభత్సమైన హెల్ప్ దొరుకుంది. ఇక ఇలాంటి పిట్చెస్ ను ఎక్కువగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజీలాండ్ కంట్రీస్ లో చూడొచ్చు.
ఈ పేస్ పిట్చెస్ ను కంటితో చూసి కనిపెట్టొచ్చు. అలాగే పిచ్ పై రబ్ చేస్తే చేయి మొత్తం తడిగా అవుతుంది. ఇక ఈ పేస్ పిట్చెస్ ను ఎక్కువగా మనం టెస్ట్ క్రికెట్ లో చూస్తుంటాం. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఎండ కాస్తే పిచ్ లో ఉండే జీవం పోయి అది కుంచెం ఫ్లాట్ గా మారిపోవచ్చు. అలాంటప్పుడు బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు ఈ గ్రీన్ పిచ్ పై బ్యాటింగ్ చెయ్యడం చాలా కష్టంగా ఉంటుంది. కాగా మనం పైన చెప్పుకున్న నాలుగు కంట్రీస్ కూడా ఈక్వెటర్ కు కుంచెం దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సన్ ఎక్సపోసర్ కుంచెం తక్కువగా ఉంటుంది. దింతో వాళ్లు గ్రీన్ పిట్చెస్ ను తయారు చేసుకుంటారు.