Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu

Fast And Medium Fast Bowling In Cricket – క్రికెట్ లో ఒక బౌలర్ బౌలింగ్ కు వచ్చినప్పుడు అతని పేరు కింద ఫాస్ట్ బౌలర్ అని లేదా మీడియం ఫాస్ట్ బౌలర్ అని ఇలా రకరకాల ట్యాగ్స్ ఉంటాయి. అయితే అసలు ఇవి ఏంటి? క్రికెట్ లో బౌలింగ్ వేసే వాళ్ళందరూ ఒకే స్పీడ్ తో వెయ్యరు. కొంతమంది ఫాస్ట్ గా వేస్తారు కొంతమంది స్లో గా వేస్తారు. అండ్ ఈ స్పీడ్ ను బేస్ చేసుకునే పేస్ లేదా సీమ్ బౌలర్స్ ను నాలుగు రకాలుగా విభజించారు.

1. Fast Bowlers (140+ kmph)

2. Fast Medium Bowlers (130-145 kmph)

3. Medium Fast Bowles (125-135 kmph)

4. Medium Bowlers (120 kmph)

ఇక ఇప్పుడు మనం వీటి గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
Difference Between Fast And Medium Fast Bowling

Difference Between Fast And Medium Fast Bowling In Cricket

1. Fast Bowlers (140+ kmph)

 క్రికెట్ లో బాట్స్మన్ ను ఎక్కువగా భయపెట్టే బౌలర్ ఎవరంటే ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిలకడగా 140 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో బాల్స్ వేసే వీళ్ళు బాట్స్మన్ ను బ్యాక్ ఫుట్ పై ఆడిస్తారు.

జనరల్ గా ఏ బౌలర్ అయితే తన స్టాక్ డెలివరీ ను అంటే నార్మల్ బాల్ ను గంటకి 140 కిలోమీటర్ల వేగంతో వేస్తారో వాళ్ళని ఫాస్ట్ బౌలర్స్ అంటారు. ఉదాహరణకు జొఫ్రా ఆర్చర్, కాగిసో రబడా, ఫ్యాట్ కమ్మిన్స్ మరియు బుమ్రా లాంటి బౌలర్స్ ను తీసుకుంటే వీళ్ళు నార్మల్ గానే వీళ్ల బౌలింగ్ స్పీడ్ 140+ ఉంటుంది. అంటే బాల్ ను స్వింగ్ చేసిన లేదా బౌన్సర్ వేసిన ఈ స్పీడ్ తోనే వేస్తారు. అంటే వీళ్ళ స్టాండర్డ్ స్పీడ్ 140 నుండి 150 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
Difference Between Fast And Medium Fast Bowling – Jasprit Bumrah (Fast Bowler)

ఇక ఈ ఫాస్ట్ బౌలర్స్ కు మెయిన్ వెపన్ వాళ్ళ బౌన్సర్. అలాగే వీళ్ళు బాల్ యొక్క సీమ్ ను యూస్ చేసుకుని స్వింగ్ అనేది రాబడతారు. అంటే బాల్ పిచ్ అయినా తరువాత దాని దిశ మారడం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు స్లో బాల్ ట్రై చేస్తారో అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా 140+ స్పీడ్ తో బౌలింగ్ చేసే బౌలర్ సడన్ గా 110 స్పీడ్ తో బాల్ వేస్తే బాట్స్మన్ ఖచ్చితంగా మోసపోతాడు. కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ దగ్గర ఉండే ఇంకొక మంచి వెపన్ స్లోవర్ బాల్.

ఇక ఈ ఫాస్ట్ బౌలర్స్ ను ఎక్కువగా సీమ్ బౌలర్స్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే స్పీడ్ గా బౌలింగ్ వేద్దామనుకున్నప్పుడు బాల్ పై ఉండే కంట్రోల్ అనేది మిస్ అవ్వొచ్చు. అందుకే వీళ్ళు సీమ్ పొజిషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి బౌలింగ్ చేస్తారు.

Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)

2. Fast Medium Bowlers (130-145 kmph)

ఫాస్ట్ బౌలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ మీడియం బౌలర్స్ వేగం కుంచెం తక్కువగా ఉంటుంది. జనరల్ గా ఏ బౌలర్ అయితే ఎక్కువగా 130 to 140 మధ్యలో ఉండే స్పీడ్ తో బౌలింగ్ చేస్తారో వాళ్ళని ఫాస్ట్ మీడియం బౌలర్స్ అంటారు. అంటే వీళ్ళ స్టాక్ డెలివిరి అనేది గంటకి 135 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంటుంది.

ఉదాహరణకు మన మొహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, స్టువర్ట్ బ్రాడ్ మరియు జేమ్స్ అండర్సన్ లాంటి బౌలర్స్ ఎక్కువగా ఈ స్పీడ్ లో బౌలింగ్ చేస్తారు. అయితే వీళ్ళు 140+ స్పీడ్ తో బౌలింగ్ చెయ్యలేరా అంటే ఖచ్చితంగా చేస్తారు. అయితే అది రెగ్యులర్ గా కాదు. ఎప్పుడైనా బాట్స్మన్ ను ఎక్స్ట్రా పేస్ తో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే కుంచెం ఎక్కువ శ్రమించి 140+ స్పీడ్ తో బౌలింగ్ చేస్తారు. కానీ ఏవరేజ్ గా వీళ్ల బౌలింగ్ స్పీడ్ మాత్రం 130 నుండి 140 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది.

Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
Difference Between Fast And Medium Fast Bowling – James Anderson (Fast Medium)

ఇక వీళ్ళ మెయిన్ వెపన్ స్వింగ్ బౌలింగ్. పిచ్ తో పెద్దగా సంబంధం లేకుండా బాల్ కొత్తగా ఉన్నప్పుడు కండిషన్స్ యూస్ చేసుకుని స్వింగ్ రాబడతారు. అలాగే బాల్ ఓల్డ్ అయిపోయాక రివర్స్ స్వింగ్ అనేది కూడా ఎక్కువగా రాబడతారు. దింతో ఎప్పుడైతే పిచ్ కుంచెం గ్రీన్ గా ఉండి ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు వీళ్ళను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం.

3. Medium Fast Bowles (125-135 kmph)

ఈ కేటగిరీలోకి ఎక్కువగా స్వింగ్ బౌలర్స్ తో పాటు జెన్యూన్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ వస్తారు. నార్మల్ గా ఎవరైతే ఏవరేజ్ గా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేస్తారో వాళ్ళని మీడియం ఫాస్ట్ బౌలర్స్ అంటారు. అండ్ వీళ్ల బౌలింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా 125 to 135 మధ్యలో ఉంటుంది.

ఉదాహరణకు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ లాంటి స్వింగ్ బౌలర్స్ తో పాటు బెన్ స్టోక్స్ మరియు తిసారా పెరీరా లాంటి ఆల్ రౌండర్స్ ఈ స్పీడ్ తో బౌలింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా బాట్స్మన్ ను సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటే 140+ స్పీడ్ తో బౌన్సర్స్ మరియు యోర్కర్స్ వెయ్యగలరు. కానీ వీళ్ళ రెగ్యులర్ స్టాక్ డెలివరీ అనేది ఏవరేజ్ గా గంటకి 130 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంటుంది.

Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
Difference Between Fast And Medium Fast Bowling – Bhuvneshwar Kumar (Medium Fast)

ఇక వీళ్ళ మెయిన్ వెపన్ కూడా బాల్ ను స్వింగ్ చెయ్యడం. అయితే వీళ్ళు ఎక్కువగా తమ బౌలింగ్ లో వేరియేషన్ కూడా చూపిస్తారు. అంటే కట్టర్స్ మరియు స్లో బాల్స్ ఎక్కువగా ట్రై చేస్తారు. ఇక చాలా బ్రాడ్కాస్టర్స్ అయితే ఈ మీడియం ఫాస్ట్ బౌలర్స్ ను కూడా ఫాస్ట్ మీడియం బౌలర్స్ కేటగిరీలోనే చూపిస్తారు. ఎందుకంటే ఈ రెండు రకాల బౌలర్స్ కు మరి ఎక్కువ తేడా ఏమి ఉండదు. కాబట్టి ఫాస్ట్ మీడియం అన్న మీడియం ఫాస్ట్ అన్న దాదాపు ఒకే టైప్ ఆఫ్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు.

Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)

4. Medium Bowlers (120 kmph)

పేస్ బౌలర్స్ లో ఇది లాస్ట్ టైప్. నార్మల్ గా వీళ్ళ బౌలింగ్ స్పీడ్ అనేది గంటకి 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంటుంది. అంటే వీళ్ళ ఏవరేజ్ స్పీడ్ 120kmph. ఇక ఈ కేటగిరీలోకి ఎక్కువగా పేస్ బౌలింగ్ వేసే బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ వస్తారు. ఉదాహరణకు విజయ్ శంకర్, దసున్ శనక మరియు డారెల్ మిట్చెల్ లాంటి ఆటగాళ్లు ఈ కేటగిరీలోకి వస్తారు.

Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
Difference Between Fast And Medium Fast Bowling – Daryl Mitchell (Medium)

ఇక వీళ్ళ మెయిన్ వెపన్ కట్టర్స్. ఎక్కువగా లెగ్ కట్టర్ మరియు ఆఫ్ కట్టర్ యూస్ చేసి బాట్స్మన్ ను ఇబ్బంది పెడుతూఉంటారు. ఎప్పుడో గాని సీమ్ అప్ బాల్ వెయ్యరు. దింతో ఫ్లాట్ పిచ్ మీద ఈ టైప్ బౌలర్స్ ను ఆడటం చాలా ఈజీ గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పిచ్ స్లోగా ఉంటుందో వీళ్ళ బౌలింగ్ కుంచెం డేంజర్స్ గా ఉంటుంది. ఇక ఈ మీడియం బౌలర్స్ అయితే 140kmph తో బౌలింగ్ వెయ్యడం అనేది చాలా అరుదు. మహా అయితే 135kmph ను టచ్ చేస్తారు.

సో పేస్ బౌలింగ్ లో ఒక బౌలర్ యొక్క ఏవరేజ్ స్పీడ్ బట్టి ఈ నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసారు. ఇక వీటి తరువాత ఉండే స్లో మీడియం మరియు మీడియం స్లో అనేవి స్పిన్ బౌలింగ్ కేటగిరీలోకి వెళ్లిపోతాయి. కాబట్టి ఎవరైతే ఏవరేజ్ గా 100kmph కన్నా తక్కువ స్పీడ్ తో బౌలింగ్ చేస్తారో వాళ్ళని ఆఫ్ బ్రేక్ లేదా లెగ్ బ్రేక్ బౌలర్స్ అంటారు.