Border Gavaskar Trophy History In Telugu (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర)

Border Gavaskar Trophy History – క్రికెట్ లో అతి పెద్ద టెస్ట్ సిరీస్ అంటే అందరికి యాషెస్ సిరీస్ గుర్తొస్తుంది. కానీ ఈ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సమరాన్ని తలదన్నే క్రికెట్ సమరం ఒకటి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యింది. అదే ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. అపుడెప్పుడో మన తెలుగోడు వీవీఎస్ లక్ష్మణ్ కొట్టిన 281 దగ్గర నుండి మొదలుపెడితే మొన్నటి గబా టెస్ట్ వరకు ఈ ట్రోఫీలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే అసలు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా మొదలయ్యింది. ఇప్పటివరకు ఈ ట్రోఫీలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్సమెన్ ఎవరు? అలాగే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ ఎవరు? ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Border Gavaskar Trophy History (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర)

1947వ సంవత్సరంలో మన టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మొట్టమొదటిసారి ఒక టెస్ట్ సిరీస్ జరిగింది. ఇక అప్పటి నుండి 1996వ సంవత్సరం వరకు ఈ రెండు దేశాల మధ్య రెగ్యులర్ గా ఒక టెస్ట్ జరిగేది. అయితే ఈ టైం పీరియడ్ లో ఈ సిరీస్ కు ఎలాంటి పేరు లేదు. ప్రెసెంట్ ఎలా అయితే ఇండియా టూర్ న్యూజీలాండ్, శ్రీలంక టూర్ ఇండియా అని పిలుస్తున్నామో అప్పట్లో కూడా ఈ సిరీస్ ను అలానే పిలిచేవారు.

Border Gavaskar Trophy History
Border Gavaskar Trophy History – India First Test Series Win vs Australia

అండ్ ఈ టైం పీరియడ్ లో అంటే 1996వ సంవత్సరం వరకు ఆస్ట్రేలియా టీం మన టీమిండియాను చాలా డామినేట్ చేసింది. మొత్తం 12 సిరీస్లు జరిగితే ఆస్ట్రేలియా టీం ఏకంగా 7 సిరీస్ ల్లో విజయం సాధించింది. కానీ మన టీమిండియా చూస్కుంటే ఒక్క సారి మాత్రమే ఈ సిరీస్ గెలిచారు. అది కూడా 1979వ సంవత్సరంలో ఇండియా వేదికగా ఆడినప్పుడు. సో ఆ సిరీస్ లో అయితే సునీల్ గవాస్కర్ మరియు గుండప్ప విశ్వనాధ్ యొక్క బ్యాటింగ్ హీరోయిక్స్ కు తోడు కపిల్ దేవ్ మరియు దిలీప్ దోషి బ్రిలియంట్ బౌలింగ్ కారణంగా మనవాళ్ళు ఫస్ట్ టైం ఆస్ట్రేలియా పై ఒక టెస్ట్ సిరీస్ గెలిచారు. ఇక ఈ టైం పీరియడ్ లో మిగిలిన 4 సిరీస్ లు డ్రాగా ముగిసాయి. సో ఫస్ట్ హాఫ్ అంత ఆస్ట్రేలియాదే డామినేషన్.

Also Read – About Ashes Series In Telugu (యాషెస్ సిరీస్ చరిత్ర)

Before BGT IND vs AUS Test Series Stats

Total Series – 12

Australia Won – 7

India Won – 1

Ends In Drawn – 4

Border Gavaskar Trophy History (1996-2021)

కానీ 2nd హాఫ్ చూస్కుంటే అంటే 1996వ సంవత్సరం నుండి మొదలుపెడితే ఈ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఏడాది బీసీసీఐ మరియు క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ఎలా అయితే యాషెస్ అని పేరు ఉందొ అలానే ఈ సిరీస్ కు కూడా ఒక పేరు పెట్టి ట్రోఫీను క్రియేట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

దింతో ఆ టైంలో రెండు టీమ్స్ యొక్క లెజెండ్స్ అయినా అలాన్ బోర్డర్ మరియు సునీల్ గవాస్కర్ పేర్లు కలిపి ఈ సిరీస్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. అండ్ వీళ్ళ నేమ్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నారంటే బోర్డర్ మరియు గవాస్కర్ తమ దేశం తరుపున 10000 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాళ్లు. దింతో వీళ్ళ గౌరవార్దం ఈ సిరీస్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు.

Also Read – 286 Runs Off 1 Ball Is Real or Fake Story (1 బంతికి 286 పరుగులు నిజంగానే కొట్టారా)

Border Gavaskar Trophy History
Border Gavaskar Trophy History – Allan Border & Sunil Gavaskar

ఇక 1996వ సంవత్సరం నుండి 2021 వరకు చూస్కుంటే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తం 15 సార్లు జరిగింది. అండ్ ఇందులో మన టీమిండియా 9 సార్లు ఈ సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా కేవలం ఐదు సార్లు మాత్రమే ఆ ట్రోఫీ గెలిచారు. మిగిలిన ఆ ఒక్కసారి ఈ సిరీస్ డ్రాగా ముగిసింది. సో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయినా తరువాత మనవాళ్ళు చాలా వరకు డామినేట్ చేసారు. మరి ముఖ్యంగా లాస్ట్ 3 టైమ్స్ ఈ ట్రోఫీ జరిగినప్పుడు మనవాళ్లదే విజయం. అండ్ ఇందులో చివరి రెండు సార్లు మనవాళ్ళు ఆస్ట్రేలియా వెళ్లి ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిచారు. దింతో ప్రెసెంట్ 2023 లో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాకు ఒక రివెంజ్ సిరీస్ లాంటింది.

Border Gavaskar Trophy History Stats

Total Series – 15

Australia Won – 5

India Won – 9

Ends In Drawn – 1

ఇక ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు యాషెస్ సిరీస్ అంత హిస్టరీ లేకపోయినా క్రేజ్ వైస్ చూస్కుంటే మాత్రం ఈ రెండు సిరీస్లు దాదాపు ఒక టైపులో ఉంటాయి. కొన్ని సార్లైతే ఈ BGT లో ఉండే డ్రామా మరియు థ్రిల్ ను మీరు మారే సిరీస్ లోను చూడలేరు. 2001 లో లక్ష్మణ్ ద్రావిడ్ హిస్టారిక్ పార్టర్న్షిప్, 2008 సిడ్నీ టెస్టులో స్టీవ్ బక్నర్ చెత్త అంపైరింగ్ అలాగే అదే సిరీస్ లో సైమండ్స్ మరియు భజ్జి మంకీ గేట్ వివాదం, రీసెంట్ గా చూస్కుంటే గబా హీరోయిక్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి.

Border Gavaskar Trophy History Stats (Individual)

ఇక BGT లో ఇప్పటివరకు టాప్ స్కోరర్ సచిన్ టెండూల్కర్ 34 మ్యాచుల్లో 3262 పరుగులు చేసాడు.

Top Scorer – Sachin Tendulkar

Runs – 3262

Average – 56.24

100s – 9

Border Gavaskar Trophy History
Border Gavaskar Trophy History – Sachin Tendulkar

టాప్ వికెట్ టేకర్ అనిల్ కుంబ్లే. 20 మ్యాచుల్లో ఏకంగా 111 వికెట్లు పడగొట్టాడు.

Top Wicket Taker – Anil Kumble

Wickets – 111

Average – 30.32

5W Hauls – 10

Also Read – Watch 10 Rare Funny Moments In Cricket

2 thoughts on “Border Gavaskar Trophy History In Telugu (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర)”

Comments are closed.