అయుష్ బదోని బయోగ్రఫీ – అయుష్ బదోని. ప్రెసెంట్ ఐపీఎల్లో మారుమ్రోగిపోతున్న పేరు ఇది. ఆడిందే తక్కువ మ్యాచుల్లోనే అయినా ఈ ఆటగాడు టీమిండియా భవిష్యత్ ప్లేయర్ అని లక్నో టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడంటే అర్ధం చేసుకోవచ్చు, బదోని దగ్గర ఎంత టేలంట్ ఉందో. మరి ముఖ్యంగా అతని బ్యాటింగ్ స్టైల్ చూసిన చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ బధోనీకు ఆల్రెడీ 360 డిగ్రీస్ బాట్స్మన్ అనే బిరుదును కూడా ఇచ్చేసారు. అయితే అసలు ఎవరు ఈ అయుష్ బదోని. అతని సక్సెస్ స్టోరీ ఏంటి. ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
అయుష్ బదోని బయోగ్రఫీ (బాల్యం)
బదోని పూర్తి పేరు అయుష్ బదోని. అతను 1999వ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన మన ఇండియా రాజధాని అయినా ఢిల్లీ నగరంలో జన్మించాడు. కాగా బదోని వాళ్ళ కుటుంబం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పనిచేస్తుంటే తల్లేమో టీచర్ గా పనిచేసేవారు. ఇక చిన్న వయసు నుండే క్రికెట్ పై ఇష్టం పెంచుకున్న బదోని ఢిల్లీ వీధుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇరుగుపొరుగు వాళ్ళని అలరించేవాడు. అయితే అతని బ్రదర్ ప్రత్యూష్ బదోని మాత్రం ఎక్కువగా ఫుట్బాల్ ఆడేవాడు.
ఇక ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో చదువుకున్న బదోని క్రికెట్ ఎంత బాగా ఆడిన గానీ అతని పేరెంట్స్ మాత్రం తన ఆటని సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఇవన్నీ నీకెందుకు బుద్ధిగా చదువుకో అంటూ కొడుకుని మందలించేవారు. అయితే బదోని ఎలాగోలాగ తన పేరెంట్స్ ను ఒప్పించి ప్రొఫెషనల్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం ఒక చిన్న అకాడమీలో జాయిన్ అయ్యాడు.
Also Read – Syed Mushtaq Ali Trophy History In Telugu (సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర)
అయుష్ బదోని బయోగ్రఫీ (జూనియర్ క్రికెట్ కెరియర్)
ఇక ఆ అకాడమీలో కోచ్ గా పనిచేసిన బాలరాజ్ కుమార్ బదోని కెరియర్ కు ఒక బలమైన పునాది వేశారు. అతనిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి మీ అబ్బాయిలో అసాధారణ ప్రతిభ ఉంది, క్రికెట్ ను తన కెరియర్ గా ఎంచుకోనివ్వండి అంటూ, బదోని పేరెంట్స్ ను కన్విన్స్ చేసారు. అంతేకాకుండా అతని బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం బదోని ఇంటి దగ్గరే ఒక సిమెంట్ పిచ్ ను కూడా తయారుచేయించారు. దింతో అయుష్ ప్రతి రోజు బాలరాజ్ కుమార్ గారి దగ్గర బ్యాటింగ్ టెక్నీక్స్ నేర్చుకుని వాటిని తన ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసేవాడు.
ఇక కొడుకు పట్టుదల మరియు కోచ్ నమ్మకం చూసి బదోని తండ్రి కూడా అతనికి సపోర్ట్ చెయ్యడం స్టార్ట్ చేసాడు. దింతో బదోని కొద్దీ రోజులకే ఇండియా అండర్ 14 టీంకు సెలెక్ట్ అయ్యి మన టీమిండియా తరుపున మూడు సెంచరీలు సాధించాడు. అలాగే జూనియర్ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. బట్ బదోని ఎంత బాగా ఆడిన గానీ అతన్ని ఇండియా అండర్ 16 టీంలోకి తీసుకోలేదు. దింతో ఆ టైంలో అతను చాలా కుమిలిపోయాడు.
సరిగ్గా ఆ సమయంలోనే అతని కోచ్ బాలరాజ్ కుమార్ బదోనికి ధైర్యం చెప్పి నువ్వు సెంచరీలు కాదు డబుల్ సెంచరీలు కొట్టు, అప్పుడు నిన్ను సచినట్టు టీంలోకి తీసుకుంటారని అతన్ని మోటివేట్ చేసాడు. ఇక ఆ తర్వాత బదోని ట్రైనింగ్ బాగానే నడుస్తుందనుకున్న టైంలో బాలరాజ్ గారు పంజాబ్ కు షిఫ్ట్ అయిపోయారు. దింతో అతని ట్రైనింగ్ కు బ్రేక్ పడింది. అయితే అతని టాలెంట్ పై విశ్వాసం పెంచుకున్న అతని తండ్రి అయుష్ కు సపోర్ట్ గా నిలిచాడు. కొడుకు ట్రైనింగ్ కు హెల్ప్ చెయ్యడంతో పాటు ఈ సారి ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి అతన్ని సొన్నెట్ క్రికెట్ క్లబ్ లో జాయిన్ చేశారు.
Also Read – N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)
అయుష్ బదోని బయోగ్రఫీ (అండర్ 19 కెరియర్)
ఇక ఆ క్లబ్ కోచ్ గా ఉన్న తారక్ సిన్హా గారు ఎంత మంది క్రికెటర్స్ ను మన టీమిండియాకు అందించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సో అలాంటి గొప్ప కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన బదోని కొద్దీ రోజులకే ఇండియా అండర్ 19 టీంలో సెలెక్ట్ అయ్యాడు. ఇక అప్పటినుండి మొదలైన అతని పరుగుల ప్రవాహం జూనియర్ క్రికెట్ విభాగంలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. 2018వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక యూత్ టెస్ట్ లో 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతను ఏకంగా 185 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే తన స్పిన్ బౌలింగ్ తో కూడా రాణించిన అతను రెండు ఇన్నింగ్స్లు కలుపుకుని 6 వికెట్లు పడగొట్టాడు.
అయితే ఆ మ్యాచులో అర్జున్ టెండూల్కర్ డెబ్యూ కారణంగా ఫోకస్ మొత్తం అతని మీద ఉంది. ఇక ఆ టూర్ మొత్తం అయుష్ ను నెంబర్ 7 లోనే బ్యాటింగ్ కు పంపడం వల్ల నాలుగు ఇన్నింగ్స్ ల్లో 222 పరుగులు సాధించాడు. అలాగే అండర్ 19 ఆసియా కప్ లో కూడా అతన్ని డౌన్ ది ఆర్డర్ లోనే బ్యాటింగ్ కు పంపేవారు. బట్ స్టిల్ బదోని అయితే తన బ్యాట్ తో మెరుపులు మెరిపించడం మానలేదు. ఆ టోర్నమెంట్ లో శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచులో 28 బంతుల్లోనే 52 పరుగులు సాధించి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. అలాగే మన టీమిండియా ఆ ఆసియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కూడా బదోని టేలంట్ ను గుర్తించి అతన్ని మెచ్చుకున్నారు.
అయితే ఢిల్లీ బోర్డు మాత్రం బదోని ఆటతీరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు పనికిరాదంటూ అతను రంజీ ట్రోఫీలో ఆడేందుకు పెట్టుకున్న అప్లికేషన్ ను రిజెక్ట్ చేసింది. అలాగే ఇండియా ఫార్మర్ ప్లేయర్ అతుల్ వాసన్ ఈ ప్లేయర్ లో టాలెంట్ ఉంది ఇతన్ని సెలెక్ట్ చెయ్యాలంటూ ఢిల్లీ సెలెక్టర్లకు విన్నపం పెట్టుకున్న DDCA అయుష్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. దింతో బదోని దాదాపు 3 ఏళ్ల పాటు చిన్న చిన్న టోర్నమెంట్స్ లో ఆడుతూ ఐపీఎల్ ఆక్షన్ లో తన పేరును నమోదు చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్ 3 ఇయర్స్ లో ఆక్షన్ లో అతని పేరైతే వినిపించేది గానీ ఏ ఫ్రాంచైజ్ కూడా అతన్ని కొనేది కాదు.
2021లో జరిగిన సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను ముంబై పై తన టీ20 డెబ్యూ చేసిన కూడా అతన్ని నెంబర్ 7 లోనే బ్యాటింగ్ కు పంపేవారు. దింతో అతనికి పెర్ఫామ్ చేసే ఛాన్స్ రాక ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంఛైజీలు అతన్ని పట్టించుకునేవి కాదు. సరిగ్గా ఈ టైంలోనే లక్నో కోచింగ్ స్టాఫ్ లో మెంబెర్ గా ఉన్న విజయ్ దహియా బదోని టాలెంట్ ను గుర్తించి అతని గురించి టీం మేనేజ్మెంట్ కు తెలియచేసాడు. దింతో ఈ ఏడాది మెగా ఆక్షన్ లో లక్నో టీం 20 లక్షల రూపాయిల బేస్ ప్రైస్ తో బదోనిను కొనుగోలు చేసింది.
అయుష్ బదోని బయోగ్రఫీ (IPL కెరియర్)
అయితే లక్నో టీం అయుష్ ను కొనడంలో గంభీర్ దే కీలక పాత్ర. ఎందుకంటే విజయ్ దహియా పంపించిన వీడియోస్ లో బదోని టాలెంట్ చూసి ఇంప్రెస్స్ అయినా గంభీర్ అతన్ని లక్నో టీంలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నాడు. ఇక గంభీర్ నమ్మకాన్ని ఎక్కడ వొమ్ము చెయ్యని బదోని ఈ సీజన్ స్టార్ట్ కాకముందు లక్నో ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో కూడా అర్ద సెంచరీలు సాధించాడు. దింతో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతన్ని ఆడించిన గంబీర్ ఒక సెన్సషనల్ బాట్స్మన్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసాడు.
ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనమంతా కళ్లారా చూసాం. ఆడేది మొదటి సీజన్ ఏ అయినా తీవ్ర ఒత్తిడి సమయాల్లో కూడా చాలా కూల్ గా బ్యాటింగ్ చేసిన అతను ప్రెసెంట్ ఒక సూపర్ స్టార్ లా మారిపోయాడు. సో బదోని అయితే ఈ సీజన్ మొత్తం ఇలానే రాణించి అతి త్వరలో మన టీమిండియాకు సెలెక్ట్ కావాలని కోరుకుందాం.
Also Read – Watch 10 Rare Funny Moments In Cricket