క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు ఎలా వస్తుంది – క్రికెట్ లో సర్ అనే పదం మీరు వినే ఉంటారు. ఈ గేమ్ లో బాగా రాణించిన కొంతమంది లెజెండరీ క్రికెటర్స్ పేరు ముందు సర్ అనే టైటిల్ ను తగిలించి పిలుస్తూ ఉండటం మనం ఎక్కువగా చూస్తుంటాం. సర్ డాన్ బ్రాడ్మన్, సర్ వివ్ రిచర్డ్స్, సర్ గార్ఫీల్డ్ సోబెర్స్ ఇలా కొంత లెజెండరీ క్రికెటర్స్ యొక్క నేమ్స్ ముందు సర్ అనే టైటిల్ మనం గమనించవచ్చు.
అయితే ఈ సర్ అనే టైటిల్ లెజెండరీ క్రికెటర్స్ అందరకీ ఉంటుందా అంటే ఉండదు. సచిన్ టెండూల్కర్, మురళీధరణ్, వసీం అక్రమ్, జాక్ కలిస్ మరియు ఎమ్మెస్ ధోని లాంటి ఆటగాళ్లు తమ దేశానికీ ఎన్నో సేవలు అందించి ఆల్ టైం బెస్ట్ క్రికెటర్స్ గా పేరు సంపాదించారు. కానీ వీళ్లెవరికి సర్ అనే టైటిల్ ఇవ్వలేదు.
వీళ్ళ కన్న కుంచెం తక్కువ పాపులారిటీ ఉన్న క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు ఇచ్చారు. కానీ ఈ లెజెండ్స్ కు మాత్రం ఇవ్వలేదు. సో అసలు సర్ టైటిల్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ఎందుకు ఈ టైటిల్ ను సెలెక్టెడ్ గా కొంత మంది ఆటగాళ్లకు మాత్రమే ఇచ్చారు? ఈ టైటిల్ దక్కాలంటే ఒక ప్లేయర్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? సో వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు ఎలా వస్తుంది?
క్రికెట్ పుట్టినిల్లు గా చెప్పుకునే ఇంగ్లాండ్ లోనే ఈ సర్ టైటిల్ కు పునాది పడింది. బ్రిటిష్ రాజ్యంలో ఉండే రాణి గారు ఆవిడ రాజ్యంలో ఉండే కొంతమంది వ్యక్తులకు ఈ టైటిల్ ను ఇచ్చేవారు. సో ఎవరైతే తమ రాజ్యంలో ఉంటూ తమ దేశానికీ గాని లేదా రాజ్యానికి గానీ అపారమైన సేవ చేసినందుకు బహుమతిగా క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ వ్యక్తికి బంటుతనాన్ని ప్రసాదించేవారు. దీన్నే ఇంగ్లీష్ లో నైట్ హుడ్ అనిపిలుస్తారు.
సో బ్రిటిష్ క్వీన్ తమ దేశం కోసం పాటు పడిన కొందరు వ్యక్తులకు ఈ నైట్ హుడ్ ను ప్రసాదించి వాళ్ళ పేరు ముందు ఈ సర్ అనే టైటిల్ ను యాడ్ చేసి పిలిచేవారు. అంటే ఈ సర్ అనే బిరుదు కొంతమంది ఉన్నతమైన వ్యక్తులకు మాత్రమే ఇచ్చే బిరుదు. సో ఇంగ్లాండ్ రాణి అయితే ఈ హానర్ ను ఆర్ట్స్, స్పోర్ట్స్, పబ్లిక్ సర్వీస్ ఇలా చాలా రంగాల్లో తమ దేశానికీ చేసిన సేవకు గాను సర్ అనే ఈ టైటిల్ ను బిరుదుగా ఇస్తారు.
ఇక ఈ క్రమంలోనే 1926వ సంవత్సరం నుండి బ్రిటిష్ అండర్ లో ఉంటూ క్రికెట్ ఆడే కొన్ని కంట్రీస్ లో క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదును ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో బ్రిటిష్ ఆధీనంలో చాలా దేశాలే ఉండేవి. ఇప్పుడు మనం కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పుకునే అన్ని దేశాలు కూడా ఒకప్పుడు బ్రిటిష్ అండర్ లో ఉన్నవే. సో ఇది ఒక ఇంగ్లాండ్ ఆచారమే అయినప్పటికీ ఆ టైంలో వాళ్ళ ఆధీనంలో ఉన్న కంట్రీస్ యొక్క క్రికెట్ ప్లేయర్స్ కు కూడా ఈ సర్ అనే టైటిల్ ను ఇచ్చేవారు.
ఇక ఈ టైటిల్ ఇవ్వడానికి ఏదైనా క్రైటీరియా ఉందా అంటే, అలాంటిది ఏమి లేదు. అప్పట్లో ఇంగ్లాండ్ దేశం ఈ గేమ్ బాగా ఆడే కొంతమంది ఆటగాళ్లను పిక్ చేసి ఆఫీసియల్ గా వాళ్ళని నైటెడ్ చేస్తూ సర్ అనే ఈ బిరుదుని ఇచ్చేవారు. సో 1926వ సంవత్సరం నుండి మొత్తం 29 మంది ఆటగాళ్లకు ఈ విధంగా సర్ ను టైటిల్ ను ఇచ్చారు. ఇక వీరిలో 14 మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉండగా 13 మంది వెస్టిండీస్ ఆటగాళ్లు ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు ఆస్ట్రేలియా క్రికెటర్ కాగా మరొకరు న్యూజీలాండ్ ఆటగాడు.
అయితే నైట్ హుడ్ ప్రసాదించినప్పుడు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు కాకుండా కొంత మంది పేర్లకు తగ్గట్టు లార్డ్ అనే బిరుదును కూడా ఇస్తారు. సో ఈ నైటెడ్ అయినా లిస్టలో 27 ప్లేయర్స్ కు సర్ అనే బిరుదుని ఇస్తే ఇద్దరికి మాత్రం ది లార్డ్ అనే బిరుదుని ఇచ్చారు. ఒకవేళ మీరు ఈ 29 మంది ఎవరో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేర్లని ఆఖరున ఉంచుతా ఒకసారి చెక్ చెయ్యండి.
Also Read – Syed Mushtaq Ali Trophy History In Telugu (సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర)
క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు అందరికి ఎందుకు ఇవ్వరు
ఇక ఇప్పుడు మనకున్న అతి పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకని ఈ సర్ టైటిల్ లెజెండరీ క్రికెటర్స్ అందరికి ఇవ్వలేదు. దీనికి రీసన్ మనం పైనే చెప్పుకున్నాం. అప్పట్లో కొన్ని దేశాలు బ్రిటిష్ అండర్ లోన్ ఉండేవి. సో అధికారం వాళ్లదే కాబట్టి ఈ ఆచారాన్ని అప్పట్లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మరియు వెస్టిండీస్ దేశాలు కూడా పాటించాయి.
కానీ కాలం గడిచే కొద్దీ అన్ని దేశాలకు ఫ్రీడమ్ రావడంతో ఆయా దేశాల సొంత నిర్ణయం మేరకు ఈ పద్దతని కొన్ని దేశాలు వారు ఆపేసారు. సో ప్రెసెంట్ అయితే క్రికెట్ వరకు ఓన్లీ ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ కంట్రీస్ మాత్రమే తమ లెజెండరీ ప్లేయర్స్ కు ఈ సర్ అనే బిరుదుని ఇస్తుంది. ఇక మన ఇండియా విషయానికొస్తే 1947 ముందు మనదగ్గర చెప్పుకోదగ్గ క్రికెటర్స్ ఎవరు లేరు. సో అప్పట్లో ఇంగ్లాండ్ మనవాళ్లెవరికి ఈ సర్ అనే టైటిల్ ఇవ్వలేదు.
ఇక మన ఇండియాకు ఫ్రీడమ్ వచ్చిన తరువాత మన రాజ్యాగంలోని రూల్స్ ప్రకారం ఈ సర్ అనే బిరుదుని క్రికెటర్స్ కి ఇవ్వడానికి అనుమతి లేదు. అయితే దీనికి బదులు మనవాళ్ళు పద్మ శ్రీ, పద్మ విభూషణ్, భారత్ రత్న వంటి టైటిల్స్ ను తీసుకొచ్చి దేశం కోసం పాటు పాడిన వాళ్ళకి ఈ అవార్డ్స్ నే బిరుదుగా ఇస్తున్నారు. అంటే సచిన్ ఇండియాలో పుట్టాడు కాబట్టి పద్మ శ్రీ సచిన్ టెండూల్కర్ అయ్యాడు. అదే ఇంగ్లాండ్ లో పుట్టి ఉంటే సర్ సచిన్ టెండూల్కర్ అయ్యి ఉండేవాడు. అయితే ఏ దేశంలో అయినా సరే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ఇవ్వరు. గొప్పగా ఆడి రిటైర్ అయినా కొన్నేళ్ల తర్వాత ఈ బిరుదుని ఇస్తారు.
క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు ఒక ఇండియన్ ఉంది కదా?
ఇక ఇప్పుడు మీ అందరి బుర్రల్లో ఒక డౌట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. మన ఇండియన్స్ కు పరిమిషిన్ లేదు కదా మరి మన జడేజా సర్ రవీంద్ర జడేజా ఎలా అయ్యాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ ఎలా లార్డ్ శార్దూల్ అయ్యాడు. సో ముందు జడేజా గురించి మాట్లాడుకుంటే 2009వ సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ లో జడేజా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దింతో అప్పట్లో కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ జడేజా కు సర్ అనే టైటిల్ ను సర్కాస్టిక్ గా తగిలించి నెగటివ్ మేనేర్ లో ట్రోల్ చేసారు.
అయితే జడేజా ఆ ఫెయిల్యూర్ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టి తిరిగి నేషనల్ టీంలోకి వచ్చాడు. అంతేకాకుండా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఆస్ట్రేలియా తో జరిగిన 4 టెస్టుల హోమ్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. దింతో నెగటివ్ సర్ టైటిల్ కాస్త కుంచెం పాజిటివ్ గా మారింది.
కానీ ఈ సర్ రవీంద్ర జడేజా అనే టైటిల్ కు పాపులారిటీ వచ్చింది మాత్రం ధోని వల్లనే. ఐపీఎల్ 6 లో ఆర్సీబీ తో జరిగిన ఒక లీగ్ మ్యాచులో చెన్నై టీం చివరి బంతికి 2 పరుగులు చెయ్యాలి. అయితే స్ట్రైక్ లో ఉన్న జడేజా థర్డ్ మెన్ లో ఉన్న ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ బాల్ నో బాల్ కావడం చెన్నై ఇంకా ఒక్క బంతి మిగిలిఉండగానే మ్యాచ్ గెలిచింది. దింతో ధోని ట్విట్టర్ లో సర్ జడేజాకు 1 బంతికి రెండు పరుగులు చెయ్యమని చెప్తే అతడు ఆ ఒక్క బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిపించేస్తాడు అని ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసాడు.
అలాగే ధోని ఎప్పుడు జడేజా గురించి ట్వీట్ చేసిన అతనికి పేరు ముందు సర్ అనే టైటిల్ ను యూస్ చేసేవాడు. దింతో సర్ జడేజా అనేది బాగా పాపులర్ అయ్యి ఫ్యాన్స్ అంత అతన్ని సర్ రవీంద్ర జడేజా అని పిలవడం స్టార్ట్ చేసారు. సో ఇదైతే ఆఫీసియల్ నేమ్ కాదు. కావాలంటే మీరు Cricbuzz లో మనం పైన చెప్పుకున్న 29 మంది పేర్లను సెర్చ్ చేసి చూడండి వాళ్ళ పేరుకు ముందు సర్ అని గానీ లార్డ్ అని గానీ ఉంటుంది. బట్ అదే యాప్ లో జడేజా ప్రొఫైల్ చూస్తే సర్ అనే టైటిల్ ఉండదు.
ఇక శార్దూల్ విషయంలో కూడా తన హీరోయిక్స్ చూసి ఫ్యాన్స్ అతనికి లార్డ్ శార్దూల్ అనే టైటిల్ పెట్టారు. ఆఫీసియల్ గా అయితే అతనికి ఆ నేమ్ రాలేదు. ఎనీవే ఈ సర్ అనే టైటిల్ గురించి ఇప్పుడు మీకు పూర్తిగా అర్ధమయ్యింది అనుకుంటున్నా.
Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)
క్రికెట్ ఆడే ఆటగాళ్లకు సర్ అనే బిరుదు దక్కించుకున్నవారు
1. Sir Francis Eden Lacey – 1926 (England)
2. Sir Frederick Charles – 1929 (England)
3. Sir Plum Warner – 1937 (England)
4. Sir Donald George Bradman – 1949 (Australia)
5. Sir Jack Hobbs – 1953 (England)
6. Sir Shrimp Leveson Gower – 1953 (England)
7. Sir Leonard Len Hutton – 1956 (England)
8. Sir Frank Mortimer Maglinne Worrell – 1964 (West Indies)
9. Sir John Frederick Neville Cardus – 1967 (England)
10. Sir Garry Sobers – 1975 (West Indies)
11. Sir Gubby Allen – 1986 (England)
12. Sir Richard John Hadlee – 1990 (New Zealand)
13. The Lord Cowdrey of Tonbridge – 1992 (England)
14. Sir Clyde Leopold Walcott – 1993 (West Indies)
15. Sir Everton de Courcy Weekes – 1995 (West Indies)
16. Sir Alec Victor Bedser – 1996 (England)
17. Sir Conrad Cleophas Hunte – 1998 (West Indies)
18. Sir Isaac Vivian Alexander Richards – 1999 (West Indies)
19. The Lord Botham of Ravensworth – 2007 (England)
20. Sir Wesley Winfield Hall – 2012 (West Indies)
21. Sir Curtly Elconn Lynwall Ambrose – 2014 (West Indies)
22. Sir Andy Roberts- 2014 (West Indies)
23. Sir Richie Richardson – 2014 (West Indies)
24. Sir Charles Christopher Griffith – 2017 (West Indies)
25. Sir Alastair Nathan Cook – 2019 (England)
26. Sir Geoffrey Boycott – 2019 (England)
27. Sir Andrew John Strauss – 2019 (England)
28. Sir Clive Hubert Lloyd – 2020 (West Indies)
29. Sir Cuthbert Gordon Greenidge – 2020 (West Indies)