What Is Bowling Ends In Cricket Telugu (బౌలింగ్ ఎండ్స్ అంటే ఏంటి?)

Bowling Ends In Cricket – క్రికెట్ లో చాలామంది ఓవర్ పూర్తయిన తరువాత బ్యాట్సమెన్ క్రాస్ అవుతారు అని అనుకుంటారు. అంటే అంపైర్ మరియు వికెట్ కీపర్ తమ స్థానాల్లో అలానే ఉండి ఓవర్ పూర్తయిన తరువాత బ్యాట్సమెన్ మాత్రమే తమ స్థానాన్ని మార్చుకుంటారు అని అర్ధం. అయితే ఇది కేవలం గల్లీ క్రికెట్ వరకు మాత్రమే పరిమితం.

కానీ ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇలా జరగదు. మ్యాచ్ మొత్తంలో బ్యాట్సమెన్ పరుగు తీసినప్పుడే తప్ప మరే ఇతర సందర్భంలోను క్రాస్ అవ్వరు. ఎందుకంటే ప్రతి క్రికెట్ స్టేడియంకు రెండు బౌలింగ్ ఎండ్స్ ఉంటాయి. ఒక బౌలర్ ఒక ఓవర్ ను ఒక ఎండ్ నుండి వేస్తే మరో బౌలర్ తన ఓవర్ ను వేరే ఎండ్ ను వేస్తాడు. మీకు ఇంకా బాగా అర్ధం కావడం కోసం నేను ఒక ఎక్సమ్పుల్ తీసుకుని ఈ బౌలింగ్ ఎండ్స్ గురించి క్లియర్ గా ఎక్సప్లైన్ చేస్తాను.

What Is Bowling Ends In Cricket Telugu (బౌలింగ్ ఎండ్స్ అంటే ఏంటి)
Two Common Bowling Ends In A Cricket Stadium

What Is Bowling Ends In Cricket

ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక క్రికెట్ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇందులో మధ్య భాగంలో ఉండే పిచ్ కి ఆ చివర మరియు ఈ చివర స్టంప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పిచ్ కు ఒక వైపు ఉండే స్టంప్స్ ను తీసుకుంటే దానికి వెనుక భాగంలో బౌండరీ అవతల సైట్ స్క్రీన్ మరియు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దీనినే బౌలింగ్ ఎండ్ అంటారు. అలాగే సేమ్ దీనికి వ్యతిరేక దిశలో అంటే మరోవైపు ఉండే స్టంప్స్ వెనకాల కూడా ఒక సైట్ స్క్రీన్ మరియు ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దీనిని కూడా బౌలింగ్ ఎండ్ అంటారు. సో ఈ విధంగా ప్రతి స్టేడియంకు రెండు బౌలింగ్ ఎండ్స్ ఉంటాయి.

Also Read – What Is Batting Guard In Cricket Telugu (క్రికెట్ లో బ్యాటింగ్ గార్డ్ అంటే ఏంటి?)

Names Of Bowling Ends In Cricket

సాధారణంగా ఈ రెండిటిలో ఒక దానిని పెవిలియన్ ఎండ్ అని మరో దానిని మీడియా ఎండ్ అని అంటారు. పెవిలియన్ ఎండ్ అంటే మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లకు సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్స్ మరియు టీం మేనేజిమెంట్ కు సంబందించిన రూమ్స్ ఉంటాయి. ఇక మీడియా ఎండ్ అంటే కామెంటేటర్లు మరియు ప్రెస్ కు సంబంధించిన అధికారులు ఉంటారు.

అయితే కొన్ని స్టేడియాల్లో ఉండే ఎండ్స్ కు వాళ్ళ దేశం తరుపున బాగా ఆడిన లెజెండరీ ప్లేయర్స్ యొక్క పేర్లను పెడతారు. ఎక్సమ్పుల్ సచిన్ టెండూల్కర్ ఎండ్, బ్రియాన్ లారా ఎండ్, రికీ పాంటింగ్ ఎండ్ ఇలా దిగ్గజ క్రికెటర్ల పేర్లను పెడుతుంటారు. ఉదాహరణకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం తీసుకుంటే అక్కడ బౌలింగ్ ఎండ్స్ కు అదానీ ఎండ్ అని మరియు రిలయన్స్ ఎండ్ అని పేరు పెట్టారు. సో ఈ విధంగా ప్రతి అంతర్జాతీయ స్టేడియంలో రెండు బౌలింగ్ ఎండ్స్ ఉంటాయి. కానీ పేర్లే ప్రతి స్టేడియంకు వేరువేరుగా ఉంటాయి.

What Is Bowling Ends In Cricket Telugu (బౌలింగ్ ఎండ్స్ అంటే ఏంటి)
Narendra Modi Stadium Bowling Ends

Usage Of Bowling Ends In Cricket

ఉదారణకు ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. ఈ మ్యాచ్ల్లో మొదటి ఓవర్ ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ ఎండ్ నుండి వేసాడు. సో ఇప్పుడు రెండో ఓవర్ ను ఏ బౌలర్ అయితే వేస్తాడో అతను వేరే ఎండ్ నుండి అంటే మీడియా ఎండ్ నుండి బౌలింగ్ చెయ్యాలి. సో దీన్ని బట్టి చూస్తే ఓవర్ ముగిసిన తరువాత బ్యాట్సమెన్ తమ స్థానాన్ని మార్చుకోరు. అందుకే పిచ్ కు రెండు వైపులా సైట్ స్క్రీన్స్ ఉంటాయి. అలాగే ఓవర్ ముగిసిన తరువాత వికెట్ కీపర్ మరియు అంపైర్ బౌలింగ్ ఎండ్ కు అనుగుణంగా తమ స్థానాన్ని మార్చుకుంటారు. సో ఈ విధంగా మ్యాచ్ మొత్తం ప్రతి ఓవర్ కు బౌలింగ్ ఎండ్ మార్చుతూ బౌలింగ్ చేస్తారు.

Also Read – How To Become A Cricketer (క్రికెటర్ ఎలా అవ్వాలి) In Telugu

Reasons For Using Bowling Ends In Cricket

ఇక ఇలా రెండు బౌలింగ్ ఎండ్స్ అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

1. కొన్ని గ్రౌండ్స్ లో ఒకవైపు బౌండరీ డిస్టెన్స్ తక్కువుగా మరోవైపు ఎక్కువుగా ఉంటుంది. దింతో ఒక సైడ్ బ్యాట్సమెన్ కు మాత్రమే అడ్వాంటేజ్ పొందుతాడు. అంటే లెఫ్ట్ సైడ్ బౌండరీ చిన్నదిగా ఉంటే రైట్ హ్యాండ్ బ్యాట్సమెన్ కు తన పవర్ జోన్ అయినా లెగ్ సైడ్ ఈజీగా సిక్సలు కొడతాడు. కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్సమెన్ మాత్రం తన లెగ్ సైడ్ సిక్సులు కొట్టాలంటే ఎక్కువ బలం ఉపయోగించాలి. అలాగే బౌండరీ లైన్ దూరంగా ఉంటుంది కాబట్టి అవుట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో బౌండరీ లెంగ్త్ అనేది రెండు చేతివాటం బ్యాట్సమెన్ కు ఒకేలాంటి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఈ బౌలింగ్ ఎండ్స్ ను ఉపయోగిస్తారు.

2. ఇంకో కారణం ఏంటంటే పిచ్ కు ఒకేవైపు నుండి బౌలింగ్ చేస్తే పిచ్ పాడైపోతుంది. అలాగే బౌలర్స్ రన్ చేసే ఏరియా కూడా డేమేజ్ అయ్యి రన్నప్ కు ఇబ్బందిగా మారుతుంది.

3. ఇక వీటితో పాటు గ్రౌండ్ లో కూర్చుని చూసే అభిమానులకు మంచి వీక్షణ అనుభూతి కలగడం కోసం ఈ బౌలింగ్ ఎండ్స్ చాలా ఉపయోగపడుతాయి.

 సో ఫ్రెండ్స్ స్టేడియంలో లైవ్ క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్లకు ఈ బౌలింగ్ ఎండ్స్ గురించి ఒక అవగాహన ఉంటుంది. ఇక తెలియనివాళ్ళు ఏం చేస్తారంటే టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీకే క్లియర్ గా అర్ధమవుతుంది.

Also Read – All Types Of Cricket Shots Explained – 20 Best Cricket Shots