Middle Order Batsmen Who Became Great Openers – క్రికెట్ లో కొంతమంది బాట్స్మన్ తమ కెరియర్ ను మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా మొదలుపెడతారు. అయితే మిడిలార్డర్ లో వాళ్ళకి మంచి సక్సెస్ రానప్పుడు ఒక్కోసారి తమ టీం కెప్టెన్ ఓపెనర్స్ గా ప్రమోట్ చేసి వాళ్ళ కెరియర్ ను పూర్తిగా మార్చేస్తారు. సో క్రికెట్ లో ఇలా మిడిలార్డర్ బ్యాట్సమెన్ నుండి ఓపెనర్స్ గా మారిన టాప్ 5 ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5 Middle Order Batsmen Who Became Great Openers
5. Sachin Tendulkar (India)
తన వన్డే కెరియర్ ను ఒక మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా స్టార్ట్ చేసిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాను ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో డక్ అవుట్ అయ్యాడు. అంతే కాకుండా తన వన్డే కెరియర్ లో మొదటి 78 మ్యాచుల్లో కనీసం ఒక్క సెంచరీను కూడా సాదించలేకపోయాడు. అలాగే తన బ్యాటింగ్ ఏవరేజ్ తో పాటు స్ట్రైక్ రేట్ కూడా మిడిలార్డర్ లో ఆడినంత కాలం చాలా దారుణంగా ఉండేది.
Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)
అయితే 1994 సంవత్సరంలో న్యూజీలాండ్ తో జరిగిన ఒక వన్డే మ్యాచులో అప్పటి ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్దు గాయపడటం వల్ల సచిన్ కు ఓపెనర్ గా ఆడే అవకాశం వచ్చింది. ఇక ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సచిన్ ఆ మ్యాచులో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు సాధించి ఓపెనర్ గా తన పరుగులు వేట మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూడని సచిన్ వన్డే ఫార్మాట్ బ్యాటింగ్ రికార్డ్స్‌లో దాదాపు 50 శాతం కన్నా ఎక్కువ రికార్డులను తన పేరు మీదే లికించుకున్నాడు.
4. Tillakaratne Dilshan (Sri Lanka)
1999వ సంవత్సరంలో శ్రీలంక నేషనల్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు దాదాపు ఒక దశబ్దకాలం పాటు తన టీంలో ఒక మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా ఆడాడు. అయితే తను మిడిలార్డర్ లో ఆడినంత కాలం పరుగులు సాధించడానికి చాలా ఇబ్బందిపడేవాడు. ముఖ్యంగా నిలకడగా రాణించడంలో ఘోరంగా విఫలమయ్యి టీంకు భారంగా మారిన రోజులు కూడా ఉన్నాయి. అయితే 2009 వ సంవత్సరంలో న్యూజీలాండ్ తో జరిగిన ఒక టెస్ట్ సిరీస్ లో శ్రీలంక టీం దిల్షాన్‌ను ఓపెనర్ గా పంపించి ఒక ప్రయోగం చేసింది.
ఇక ఆ ప్రయోగం శ్రీలంక టీం కు ఆ తరువాత ఒక వరంలా మారింది. ఇక దిల్షాన్ ఆ సిరీస్ లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్ లో 92 పరుగులు సాధించగా రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా సెంచరీ సాధించాడు. ఇక అప్పటి నుండి మూడు ఫార్మాట్లలో శ్రీలంక టీంకు ఓపెనర్ గా మారిన దిల్షాన్ తనదైన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారించి ఆ టీం తరుపున ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా చరిత్రలో నిలిచిపోయాడు.
Also Read – 5 Most Unlucky Cricketers Of India (క్రికెట్ లో దురదృష్టవంతులు)
3. Sanath Jayasuriya (Sri Lanka)
శ్రీలంకకు చెందిన ఈ లెజెండరీ విధ్వంసకర ఆటగాడు తన కెరీర్ ను ఒక స్పిన్ బౌలర్ గా ప్రారంభించి ఆ తరువాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ గా పేరు సంపాదించాడు. ఇక 1989వ సంవత్సరంలో తన కెరియర్ మొదలుపెట్టిన తరువాత మొదట్లో అటు వన్డేల్లోనూ మరియు ఇటు టెస్టుల్లోనూ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన జయసూర్య అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ 1994వ సంవత్సరంలో పాకిస్థాన్ తో జరిగిన ఒక వన్డే మ్యాచులో ఓపెనర్ గా బరిలోకి దిగి 77 పరుగులు సాధించాడు.
ఇక అక్కడ నుండి వెనుతిరిగి చూడని జయసూర్య ఓపెనర్ గా తనదైన స్టయిల్లో డెస్ట్రుక్టీవ్ బ్యాటింగ్ చేస్తూ ఎన్నో గొప్ప రికార్డులను క్రియేట్ చేసాడు. ముఖ్యంగా అప్పట్లో దిగ్గజ బౌలర్లను సైతం చాలా సునాయాసంగా ఎదుర్కుంటూ శ్రీలంక టీం ఒక బలమైన జట్టుగా మారడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికి ఎవరైనా ఆల్ టైం బెస్ట్ ప్లేయింగ్ లేవన్ను సెలెక్ట్ చెయ్యాలనుంటే అందులో ఖచ్చితంగా ఓపెనర్ గా జయసూర్య ను సెలెక్ట్ చేసుకుంటారు.
2. Virender Sehwag (India)
విధ్వంసకర బ్యాటింగ్ ను ఏదైనా ఒక పేరుతో రిప్రెసంట్ చెయ్యాల్సివస్తే అది ఖచ్చితంగా మన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్సమెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరే అవుతుంది. ఎందుకంటే ఫార్మట్ తో సంబంధం లేకుండా దొరికిన బాల్ ను దొరికినట్టు బౌండరీ దాటించాలనే బలమైన సంకల్పంతో బ్యాటింగ్ చేసే సెహ్వాగ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాట్సమెన్ గా పేరు సంపాదించాడు. అయితే సెహ్వాగ్ తన కెరియర్ ను ఒక మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా స్టార్ట్ చేసాడు. మొదట్లో ఎక్కువగా డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేస్తూ ఒక ఫినిషర్ గా టీంకు సేవలు అందించేవాడు. అయితే సెహ్వాగ్ కు మిడిలార్డర్ లో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతన్ని ఓపెనర్ గా ప్రోమోట్ చేసాడు.
ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపించడం అప్పట్లో ఒక పెద్ద సాహసమే అన్నారు. ఎందుకంటే సెహ్వాగ్ ఫుట్ వర్క్ అంత గొప్పగా ఏమి ఉండదు. దీనితో అందరూ టెస్ట్ క్రికెట్ లో అతన్ని ఓపెనర్ గా ప్రయోగించడం పెద్దగా సక్సస్ కాదనుకున్నారు. కానీ సెహ్వాగ్ మాత్రం తాను ఓపెనర్ గా ఆడిన మొట్టమొదటి ఇన్నింగ్స్ నుండే తనదైన డెస్ట్రుక్టీవ్ బ్యాటింగ్ తో పరుగులు సాధిస్తూ టెస్ట్ క్రికెట్ ను సైతం లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లా ఆడి పరుగుల వరద పారించాడు. ఇప్పటికి క్రికెట్ లో ఆల్ టైం మోస్ట్ డెస్ట్రుక్టీవ్ బ్యాట్సమెన్ ఎవరంటే చాలా మంది సెహ్వాగ్ పేరే చెప్తారు.
1. Rohit Sharma (India)
2007వ సంవత్సరంలో తన కెరియర్ ను ఒక మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా ప్రారంభించిన మన హిట్‌మాన్ రోహిత్ శర్మ ఆ తరువాత ఓపెనర్ గా మారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసాడో మనందరికీ తెలిసిందే. ఇక మొదట్లో మిడిలార్డర్ లో ఎన్ని అవకాశాలు వచ్చిన నిలకడగా రాణించలేకపోయిన రోహిత్ దాదాపు ఆరేళ్ళ పాటు టీంలోకి వస్తు పోతు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. అయితే 2013వ సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ ను ఓపెనర్ గా ట్రై చేసిన ఒక ప్రయోగం అతని కెరియర్ ను పెద్ద మలుపు తిప్పింది.
ఎంత పెద్ద మలుపంటే రోహిత్ ఓపెనర్ గా మారడం వల్ల మనం వన్డే క్రికెట్ లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలను చూసాం. అంతేకాకుండా వన్డే క్రికెట్ హిస్టరీ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా రోహిత్ క్రియేట్ చేసిన రికార్డు మనం ఎప్పటికి మర్చిపోలేం. ఇక రోహిత్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసినప్పుడు అతని సగటు కేవలం 30 పరుగులు. కానీ అతను ఓపెనర్ గా మారిన తరువాత అతని సగటు 58 పరుగులు. సో ఈ ఒక్క గణాంకం చాలు రోహిత్ ఎంత గొప్ప ఓపెనర్ బ్యాట్సమెనో చెప్పడానికి. ఇక రీసెంట్ గా టెస్ట్ క్రికెట్ లో కూడా ఓపెనర్ గా అదరగొట్టిన రోహిత్ ఇదే ఫామ్ తో గనుక తన బ్యాటింగ్ ను కొనసాగిస్తే తన కెరియర్ ముగిసేసరికి ఆల్ టైం బెస్ట్ ఓపెనర్స్ లో ఒకడిగా నిలిచిపోతాడు.
Also Read – Watch 10 Rare Funny Moments In Cricket
Honorable Mentions
వీరితో పాటు ఈ లిస్టులో మరికొంత మంది ఆటగాళ్లను హానరబుల్ గా మెన్షన్ చేసుకోవాలి. వాళ్ళే ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్సమెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, వెస్టిండీస్ కు చెందిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, మన టీమిండియాకు చెందిన లెజెండరీ ఆటగాళ్లు రవి శాస్త్రి మరియు సౌరవ్ గంగూలీ. ఈ నలుగురు బ్యాట్సమెన్ కూడా మొదట్లో తమ కెరియర్ ను ఒక మిడిలార్డర్ బ్యాట్సమెన్ గా స్టార్ట్ చేసి ఆ తరువాత ఓపెనర్ గా సక్సెస్ అయ్యారు.
- Adam Gilchrist
- Chris Gayle
- Ravi Shastri
- Sourav Ganguly