286 Runs Off 1 Ball Is Real or Fake Story (1 బంతికి 286 పరుగులు నిజంగానే కొట్టారా)

286 Runs Off 1 Ball – క్రికెట్ లో ఒకసారి 1 బంతికి 286 పరుగులు కొట్టారంట. ఏంటి షాక్ అయ్యారా. ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు నేను కూడా మీలానే షాక్ అయ్యాను. ఏమైనప్పటికీ క్రికెట్ అంటే బాగా పిచ్చి ఉన్నవాళ్ళకి ఈ ఫ్యాక్ట్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా క్రికెట్ ఫాక్ట్స్ అని చెప్పి దీని మీద పోస్ట్లు పెడుతూ ఉంటారు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా చాలా ఫ్యాక్ట్ వీడియోస్ లో దీని గురించి వినే ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోయిన ఏం కాదు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి మీకే అర్ధం అవుతుంది అసలు ఇది నిజామా లేదా అబద్దమా అనేది. అసలు ముందు మనం ఒక బాల్ కు 286 పరుగులు ఎలా కొట్టారో తెలుసుకుందాం.

286 Runs Off 1 Ball – Back Story

1894వ సంవత్సరంలో ఇంగ్లాండ్ కు చెందిన The Pall Mall Gazette అనే న్యూస్ పేపర్ ఈ విషయం పై మొట్టమొదటి సారి ఒక ఆర్టికల్ ను ప్రచురించింది. అండ్ దాని సారాంశం ఏంటంటే టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్ అవుతున్న వెస్టర్న్ ఆస్ట్రేలియా సైంటిఫిక్ క్రికెట్ లో మాత్రం చాలా వెనుకపడి ఉంది. రీసెంట్ గా బంబరి (Bunbury) అనే ప్రాంతంలో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఒక టీం విక్టోరియా అయితే మరో టీం స్క్రాచ్ 11 ఫ్రమ్ ది నైబర్హూడ్. (Victoria vs Scratch XI From The Neighborhood)

ఇక ఈ మ్యాచులో విక్టోరియా టీం ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే ఆ టీం ఓపెనింగ్ బ్యాట్సమన్ కొట్టిన మొదటి బాల్ అక్కడి గ్రౌండ్ లో ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు మీదకి వెళ్లి అక్కడ కొమ్మల్లో ఇరుక్కుపోయింది. దింతో ఫీల్డింగ్ టీం బాల్ పోయింది కొత్త బాల్ ఇవ్వాలని అంపైర్ కు అప్పీల్ చేసారు. కానీ అంపైర్ మాత్రం బాల్ ఎక్కడ పడిందో నేను చూసా నాకు బాల్ కనపడుతుంది. కాబట్టి మీరు ఆ బాల్ ను కిందకి దింపే వరకు అది డెడ్ అవదని చెప్పాడు.

286 Runs Off 1 Ball
286 Runs Off 1 Ball – Back Story

Also Read – Most ICC Trophy Wins By A Team

దింతో బాట్స్మన్ వికెట్ల మధ్య రన్నింగ్ స్టార్ట్ చేసారు. ఫీల్డింగ్ టీం వాళ్లేమో బాల్ తీసేందుకు నానా తిప్పలు పడ్డారు. చెట్టెక్కుదాం అంటే బాగా పొడవుగా ఉంది. గొడ్డలితో నరుకుదాం అంటే సమయానికి గొడ్డలి దొరకలేదు. దింతో చేసేదేమి లేక బాట్స్మన్ వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే చాలా సేపు అలా చూస్తూ ఉండిపోయారు. అయితే చివరికి ఒక రైఫిల్ సహాయంతో బాల్ ను షూట్ చేసి కిందకి దింపారు. అది కూడా చాలా ట్రైల్స్ తరువాత.

అయితే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాల్ కింద పడినప్పుడు ఫీల్డింగ్ టీంలో ఏ ఫీల్డర్ కూడా దాన్ని క్యాచ్ పట్టలేకపోయాయరు. ఇక ఈ గ్యాప్ లో బ్యాటింగ్ టీం వాళ్ళు వికెట్ల మధ్య దాదాపు 6 కిలోమీటర్ల వరకు పరిగెత్తి మొత్తం 286 రన్స్ స్కోర్ చేసారు. అండ్ ఈ ఒక్క బాల్ తరువాత తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఈ మ్యాచులో విక్టోరియా టీం ఘనవిజయం సాధించింది. ఇదండీ ఒక్క బాల్ కు 286 పరుగులు ఎలా వచ్చాయనేదాని వెనుకాల ఉన్న బ్యాక్ స్టోరీ.

286 Runs Off 1 Ball – Real Story or Fake Story

అయితే ఇదంతా నిజమా అంటే ఇలా జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. Gazette తర్వాత ప్రపంచ నలుమూలల కొన్ని న్యూస్ పేపర్లు ఇదే న్యూస్ ను తమ ఆర్టికల్స్ లో రాసుకొచ్చాయి. బట్ వాళ్ళ సోర్స్ మాత్రం The Pall Mall Gazette అనే చెప్పారు. అంటే ఇంగ్లాండ్ న్యూస్ పేపర్ వేసిందే వాళ్ళు కాపీ కొట్టి వేశారు.

286 Runs Off 1 Ball - Real Story or Fake Story
286 Runs Off 1 Ball – Real Story or Fake Story

అయినా ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరిగితే అది ఇంగ్లాండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్ చెయ్యడం ఏంటి? ఒకవేళ అలాంటి వింతేమైన జరిగి ఉంటే ముందు మా ఆస్ట్రేలియా మీడియాకే కదా తెలుస్తుందని చెప్పి ఆస్ట్రేలియా మెయిల్ కూడా దీన్ని ఒక అద్భుతమైన కట్టు కథ అంటూ కొట్టిపారేసింది. ఏమైనప్పటికీ ఒక్క బాల్ కు 286 పరుగులు కొట్టారని చెప్పాడని ఎలాంటి ప్రూఫ్ లేదు. ఈవెన్ Gazette వాళ్ళకి కూడా ఆస్ట్రేలియా నుండి ఈ వార్తను ఫలానా వ్యక్తి అందించారని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ స్టోరీ అయితే కొంతవరకు లాజికల్ గానే ఉంది. అయితే ఎవిడెన్స్ లేనంత వరకు 286 Runs Off 1 Ball అనేది ఫిక్షనల్ స్టోరీ మాత్రమే.

Also Read – 5 Most Unlucky Cricketers Of India (క్రికెట్ లో దురదృష్టవంతులు)

Most Runs Off One Ball In International Cricket

ఇక ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఒక బాల్ కు అత్యధిక పరుగులు కొట్టిన రికార్డు అయితే 21 పరుగులు. 2006వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆల్ టైం బెస్ట్ వన్డే మ్యాచ్ లో ఇది జరిగింది. ఆ మ్యాచులో ఆస్ట్రేలియా సెట్ చేసిన 435 పరుగుల టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా టీం చేజ్ చేసి ఒక సరి కొత్త రికార్డును క్రియేట్ చేసారు. అయితే ఇదే మ్యాచులో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేసినప్పుడు 48వ ఓవర్ మొదటి బాల్ కు ఏకంగా 21 పరుగులు సాధించారు. ఎలా అనుకుంటున్నారా?

ఆ ఓవర్ లో బౌలింగ్ చేసిన రోజర్ టెలెమెకస్ మొదటి లీగల్ బాల్ వేసే ముందు 4 నో బాల్స్ వేసాడు. అండ్ వీటిలో మొదటి నో బాల్ కి 4 కొట్టిన పాంటింగ్ రెండో నో బాల్ కు సింగల్ తీసాడు. ఇక ఆ తర్వాత మూడో నో బాల్ ఎదురుకున్న సైమండ్స్ ఆ బాల్ కు ఫోర్ కొట్టాడు. అలాగే నాలుగో నో బాల్ కు సిక్స్ కొట్టాడు. దింతో ఆ ఓవర్లో ఒక్క బాల్ కూడా వెయ్యకుండానే 19 పరుగులు వచ్చాయి. అండ్ ఆ తరువాత ఎట్టకేలకు లీగల్ వేసిన మొదటి బాల్ కు సైమండ్స్ రెండు పరుగులు తీసాడు. దింతో 48 ఓవర్ మొదటి బాల్ అయ్యేసరికి ఆస్ట్రేలియా స్కోరుబోర్డులో 21 రన్స్ యాడ్ అయ్యాయి. బట్ ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఓడిపోవడం అండ్ సౌత్ ఆఫ్రికా రికార్డు చేస్ చెయ్యడం వల్ల ఈ రికార్డు పెద్దగా గుర్తింపు సాధించలేదు.

Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)