Unlucky Cricketers Of India – ఇండియాలో పుట్టి క్రికెటర్ అవ్వడం అంటే చాలా కష్టమైన పని. ఎంత టాలెంట్ ఉన్న అవకాశాలు రావు. ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్ ఫీల్డ్ కు చాలా పోటీ ఉంది. అయితే కొంతమంది ఆటగాళ్లు తమ టాలెంట్ ను పై స్థాయిలో నిరూపించుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాక పైకి ఎదగలేరు. లెజెండ్స్ గా అవ్వాల్సిన వాళ్ళు దురదృష్టం కారణంగా సాధారణ ఆటగాళ్లలాగే మిగిలిపోతారు. అలాంటి 5 దురదృష్టవంతులైన క్రికెటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5 Most Unlucky Cricketers Of India
5. Wasim Jaffer
ఈ ఆటగాడి పేరు మీరు వినే ఉంటారు. ముంబై కు చెందిన ఈ అద్భుతమైన బాట్స్మన్ ను లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ అంటారు. ఎందుకంటే ఇతను ముంబై తరుపున 186 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడి ఏకంగా 14609 పరుగులు సాధించాడు. ఇప్పటికి డొమెస్టిక్ క్రికెట్ లో ఒక బ్యాట్సమన్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. అలాగే తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో 53.70 ఎవరేజ్ తో పరుగులు చేసిన ఈ ఆటగాడు 46 సెంచరీలు సాధించాడు.
ఇక జాఫర్ మన ఇండియా తరుపున 2000వ సంవత్సరంలో డెబ్యూ చేసాడు. అంతేకాకుండా 31 టెస్ట్ మ్యాచులాడి 34.11 ఏవరేజ్ తో 1944 పరుగులు సాధించాడు. సో అప్పట్లో ఇది ఒక డీసెంట్ రికార్డు అని చెప్పొచ్చు. అయితే జాఫర్ ఇండియాకు ఆడుతున్న టైములో మన టీం ఒక రఫ్ ప్యాచ్ లో ఉంది. దింతో జాఫర్ కు అవకాశాలు కరువయ్యాయి. తరుచుగా ప్లేయర్స్ ను రొటేట్ చెయ్యడంతో జాఫర్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. అదిరిపోయే బ్యాటింగ్ టెక్నీక్ తో పాటు నిలకడగా రన్స్ స్కోర్ చేసిన గానీ బ్యాడ్ లక్ కారణంగా అతని ఇంటర్నేషనల్ కెరియర్ ముగిసిపోయింది.
Also Read – Most ICC Trophy Wins By A Team
4. Irfan Pathan
ఈ పేస్ ఆల్ రౌండర్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పాకిస్తాన్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టి ఎవరికీ సాద్యంకాని రికార్డును క్రియేట్ చేసాడు. అంతేకాకుండా టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలో అదరగొట్టిన ఈ ప్లేయర్ 23 ఏళ్లకే జూనియర్ కపిల్ దేవ్ అని పేరు సంపాదించాడు. అయితే దురదృష్టం అతన్ని గ్రెగ్ ఛాపెల్ రూపంలో వెంటాడింది. ఎందుకంటే ఛాపెల్ కోచ్ మన టీమిండియా కోచ్ గా మారిన తరువాత ఇర్ఫాన్ పఠాన్ ను ఒక జెన్యూన్ ఆల్ రౌండర్ గా మారమని ఫోర్స్ చేసాడు. తన బౌలింగ్ కన్నా బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చెయ్యమని ఒత్తిడి చేసాడు. దింతో పఠాన్ రెండిటిని ఈక్వల్ గా మేనేజ్ చెయ్యలేక చాలా ఇబ్బంది పడ్డాడు. అంతేకాకుండా టీంలో తన స్థానాన్ని కూడా కోల్పోయాడు.
ప్రెసెంట్ అతని ఏజ్ 38 సంవత్సరాలు (2023 వరకు*). అయితే పఠాన్ తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ను 2012 లో ఆడాడు. అంటే 27 సంవత్సరాల వయసులోనే అతని కెరియర్ ఆగిపోయింది. కానీ అప్పటికే పఠాన్ 173 అంతర్జాతీయ మ్యాచులాడి చాలా పేరు సంపాదించాడు. సో అతన్ని టాలెంట్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్న గానీ బ్యాడ్ లక్ కొద్దీ చిన్న ఏజ్ లోనే టీంలో తన స్థానాన్ని కోల్పోయాడు. లేకపోతే ఈ పాటికి అతను మన టీమిండియాకు ఆడిన నెంబర్ 1 ఆల్ రౌండర్ గా పేరు సంపాదించి ఉండేవాడు.
3. Dinesh Karthik
ఈ పేరు చెప్పగానే అందరికీ నిద్రహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కళ్ళముందు కనపడుతుంది. అసలు మ్యాచులోనే లేమనుకున్న టైములో బ్యాటింగ్ కు వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళకి చుక్కలు చూపించాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అద్భుతంగా రాణించి మంచి పేరు సంపాదించాడు. కానీ ఇండియన్ క్రికెట్ టీంలో మాత్రం అతను పర్మినెంట్ కాలేకపోయాడు. దీనికి పరోక్ష కారణం ఎమ్మెస్ ధోని అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరు దాదాపు ఒకే టైములో ఇండియాకు డెబ్యూ చేసారు. అలాగే ఇద్దరు కూడా మంచి వికెట్ కీపర్స్ గా పేరు సంపాదించారు.
అయితే దినేష్ కార్తీక్ అప్పట్లో ఒక ఓపెనర్ గా డెబ్యూ చెయ్యడం అతని కొంప ముంచింది. ఎందుకంటే అప్పటికే గంగూలీ, సచిన్ మరియు సెహ్వాగ్ లాంటి టాపార్డర్ బాట్స్మన్ ఇండియాకు ఉన్నారు. దింతో అతనికి ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు. మరోవైపేమో ధోని మిడిలార్డర్ లో అదరగొట్టి దాదాపు 15 ఏళ్ల పాటు మన టీమిండియాకు వికెట్ కీపర్ బాట్స్మన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా సేవలందించాడు. దింతో దినేష్ కార్తీక్ తన కెరియర్ అంత ఒక సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ గానే మిగిలిపోయాడు. టాలెంట్ ఉన్న గానీ బ్యాడ్ లక్ కొద్ది చాలా తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు.
Also Read – Difference Between Fast And Medium Fast Bowling In Cricket Telugu
2. Karun Nair
2016వ సంవత్సరంలో కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దింతో ఇండియా క్రికెట్ చరిత్రలో సెహ్వాగ్ తరువాత ఈ ఘనత సాధించిన అరుదైన బాట్స్మన్ గా రికార్డును క్రియేట్ చేసాడు. అయితే బ్యాడ్ లక్ అతన్ని ఏ రేంజ్ లో వెంటాడిందంటే ఈ ట్రిపుల్ సెంచరీ సాధించాక నెక్స్ట్ మ్యాచులో అతనికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. జనరల్ గా ఒక హాఫ్ సెంచరీ కొడితేనే నెక్స్ట్ మ్యాచులో మనకు టీంలో ప్లేస్ పక్కా అని ఆటగాళ్లు కుంచెం ధైర్యంగా ఉంటారు. కానీ నాయర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ ఏ కొట్టిన గానీ అతనికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. బహుశా క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరిగుండదు.
ఇక టీంలో తన ప్లేస్ కు సరైన గ్యారంటీ లేకపోవడంతో నాయర్ మానసికంగా కృంగిపోయాడు. కొన్ని రోజులు తరువాత ఒక మూడు టెస్టుల్లో అతనికి ఛాన్స్ ఇచ్చారు. కానీ తాను సరిగ్గా ఆడలేకపోయాడు. దింతో అతని టెస్ట్ ఏవరేజ్ 62 ఉన్న గానీ అతనికి మరోసారి టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. ఇక ప్రెసెంట్ సిట్యుయేషన్ చూసుకున్న గానీ అతడు టీంలోకి రావడం చాలా కష్టం. సో టాలెంట్ ఉండి ఒక కూడా బ్యాడ్ లక్ కొద్దీ నాయర్ ఇండియా తరుపున ఆడే అవకాశాలు ఎక్కువ దక్కలేదు.
1. Ambati Rayudu
మన తెలుగు తేజం అంబటి రాయుడిది బ్యాడ్ లక్ అనే కంటే, కావాలనే అతన్ని కిందకి లాగేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అతని బ్యాటింగ్ కేపబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీం కు ఎన్నో థ్రిల్లింగ్ విక్టరీలు అందించాడు. అయితే వరల్డ్ కప్ ఆడాలనే తన కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఇక టీమిండియా లో ప్లేస్ లో కోసం ఎన్నో కష్టాలు భరించిన రాయుడు తరుచు స్టేట్ బోర్డ్స్ మారుతూ ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. అలాగే తనకి రానీ వికెట్ కీపింగ్ ను కూడా నేర్చుకుని ఎట్టకేలకు టీంలో ప్లేస్ సంపాదించాడు. అయితే అతనికి సరైన అవకాశలు రాక టీంలోకి వస్తూ పోతు ఉండేవాడు. కానీ 2019 వరల్డ్ కప్ ముందు అద్భుతంగా రాణించి తన కలకు చేరువయ్యాడు.
అయితే ఆఖరి నిమిషంలో అతన్ని టీం నుండి తప్పించారు. మాకు త్రి డైమెన్షనల్ ప్లేయర్ కావాలంటూ రాయుడుని పక్కన పెట్టారు. చివరికి ఆ వరల్డ్ కప్ లో ఆటగాళ్లు గాయపడి దూరమైన గానీ స్టాండ్ బై గా ఉన్న రాయుడుని మాత్రం టీంలోకి తీసుకోలేదు. దింతో అతను మనస్తాపంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. నిజంగా రాయుడు లాంటి టాలెంటెడ్ ఆటగాణ్ణి కోల్పోయిన మన టీం ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. అలాగే తన కల కూడా చెదిరిపోయింది. సో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకున్న రాయుడుకు సెలెక్టర్ లే విలన్స్ లా మారి అతని కెరియర్ ముగిసిపోయేలా చేసారు.
Also Read – What Is Line And Length In Cricket Telugu