Highest Score At Each Batting Position – హలో క్రికెట్ లవర్స్ ఇప్పటి వరకు వన్డే క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ పొజిషన్ బేస్ చేసుకుని అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. అప్పుడు మీకు వన్డే క్రికెట్ లో ప్రతి బ్యాటింగ్ పొజిషన్ కు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన 11 మంది ఆటగాళ్లు గురించి తెలుసుకోవచ్చు.
Highest Score At Each Batting Position In ODI Cricket
- Highest Score At Each Batting Position In ODI Cricket
- At Number 1 – Martin Guptill (237*)
- At Number 2 – Rohit Sharma (264)
- At Number 3 – Charles Coventry (194*)
- At Number 4 – Sir Viv Richards (189*)
- At Number 5 – AB de Villiers (162*)
- At Number 6 – Kapil Dev (175)
- At Number 7 – Luke Ronchi (170*)
- At Number 8 – Mehidy Hasan Miraz (100*)
- At Number 9 – Andre Russell (92*)
- At Number 10 – Ravi Rampaul (86*)
- At Number 11 – Mohammad Amir (58)
At Number 1 – Martin Guptill (237*)
న్యూజీలాండ్ కు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్సమెన్ 2015 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో వెస్టిండీస్ తో జరిగిన ఒక మ్యాచ్ లో ఓపెనర్ గా ఒకటో స్థానములో అంటే స్ట్రైకర్ ఎండ్ లో బరిలోకి దిగి 163 బంతుల్లో 237 పరుగులు సాధించాడు. అండ్ ఈ మ్యాచులో అజేయంగా నిలిచిన అతను తన ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు మరియు 11 సిక్సర్లు బాదాడు. ఇక ఈ మ్యాచులో గప్టిల్ కొట్టిన 237 రన్స్ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్.
At Number 2 – Rohit Sharma (264)
మన టీమిండియా హిట్‌మాన్ రోహిత్ శర్మ 2014వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో ఓపెనర్ గా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో అంటే రెండో స్థానములో బరిలోకి దిగి కేవలం 173 బంతుల్లో 264 పరుగులు కొట్టాడు. ఇదైతే ఇప్పటికి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచులో శ్రీలంక బౌలర్స్ కు చుక్కలు చూపించిన అతను తన ఇన్నింగ్స్ లో ఏకంగా 33 ఫోర్లు మరియు 9 సిక్సర్లు సాధించాడు.
Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)
At Number 3 – Charles Coventry (194*)
జింబాబ్వే కు చెందిన ఈ ఆటగాడు 2009వ సంవత్సరంలో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 156 బంతుల్లో 194 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. అండ్ తానాడిన ఈ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు మరియు7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చార్లెస్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మ్యాచులో జింబాబ్వే టీం ఓడిపోయింది. దింతో అతను ఒక మ్యాచ్ ఓడినప్పుడు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాట్సమెన్ గా తనకి అవసరం లేని రికార్డును క్రియేట్ చేసాడు.
At Number 4 – Sir Viv Richards (189*)
వెస్టిండీస్ కు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు 1984వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్ పవర్ చూపించి 170 బంతుల్లో 189 పరుగులు కొట్టాడు. అండ్ ఈ మ్యాచులో అజేయంగా నిలిచిన అతను తన ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు మరియు 5 సిక్సర్లు బాదాడు. అప్పట్లో ఈ ఇన్నింగ్స్ ఒక సంచలనమే సృష్టించింది. ఎందుకంటే ఆ టైంలో ఎక్కుగా బౌలింగ్ కు సహకరించే వికెట్స్ తో పాటు రూల్స్ కూడా బౌలర్స్ ను అనుకూలంగా ఉండేవి. దింతో అందరూ స్లో గా బ్యాటింగ్ చేసేవారు. బట్ రిచర్డ్స్ మాత్రం అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసాడు.
At Number 5 – AB de Villiers (162*)
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ డేంజరస్ ఆటగాడు 2015 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్‌ల్లో తన మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కేవలం 66 బంతుల్లో 162 పరుగులు కొట్టి ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసాడు. అండ్ ఈ మ్యాచులో అజేయంగా నిలిచిన అతను తన ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు మరియు 8 సిక్సర్లు బాదాడు. ఇక ఈ మ్యాచులో 64 బంతుల్లో 150 పరుగులు సాధించిన డివిలియర్స్ వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ 150 కొట్టిన బ్యాట్సమెన్ గా నిలిచాడు.
Also Read – Top 10 High IQ Moments In Cricket (10 తెలివైన క్రికెటర్లు)
At Number 6 – Kapil Dev (175)
వన్డే క్రికెట్ లో మన టీమిండియా తరుపున ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ లో ఇది ఒకటి. నిజానికి బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కపిల్ దేవ్ 1983 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వే తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్‌ల్లో మన టీం కష్టాల్లో ఉన్నప్పుడు 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కేవలం 138 బంతుల్లో 175 పరుగులు కొట్టాడు. అండ్ ఈ మ్యాచులో అజేయంగా నిలిచిన కపిల్ దేవ్ తన ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు మరియు 6 సిక్సర్లు బాదాడు. ఒకవేళ ఆ రోజు కపిల్ ఈ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉండుంటే మన ఇండియా క్రికెట్ పరిస్థితి ఇలా ఉండేది కాదు.
At Number 7 – Luke Ronchi (170*)
న్యూజీలాండ్ కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్సమెన్ 2015వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో ఎవరు ఊహించని ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 7 స్థానములో బ్యాటింగ్ కు వచ్చి కేవలం 99 బంతుల్లోనే 170 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇక అతను ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు మరియు 9 సిక్సర్లు ఉన్నాయి.
At Number 8 – Mehidy Hasan Miraz (100*)
బంగ్లాదేశ్ కు చెందిన ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ 2022వ సంవత్సరంలో ఇండియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న తన జట్టుని తన అద్బుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ యొక్క గమనాన్ని మార్చేశాడు. ఈ మ్యాచులో తన టీం 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయినప్పుడు 8వ స్థానములో బ్యాటింగ్ కు వచ్చిన మిరాజ్ 83 బంతుల్లో 100 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. నిజంగా ఈ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తానాడిన ఈ ఫైటింగ్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి.
At Number 9 – Andre Russell (92*)
వెస్టిండీస్ కు చెందిన ఈ డేంజరస్ ఆల్ రౌండర్ 2011వ సంవత్సరంలో ఇండియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో అసలు గెలిచే ఛాన్స్ లేని మ్యాచ్ లో సైతం వీరోచిత బ్యాటింగ్ చేసి మన టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. అది ఎంతలా అంటే ఈ మ్యాచ్‌ల్లో 9 స్థానములో బ్యాటింగ్ కు వచ్చిన రస్సెల్ కేవలం 64 బంతుల్లో 92 పరుగులు కొట్టాడు. అండ్ ఈ మ్యాచులో అజేయంగా నిలిచిన రస్సెల్ తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 5 సిక్సర్లు బాదాడు.
Also Read – Most ICC Trophy Wins By A Team
At Number 10 – Ravi Rampaul (86*)
వెస్టిండీస్ కు చెందిన ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ 2011వ సంవత్సరంలో ఇండియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో తన టీం 150 పరుగులకే ఆలౌట్ అయిపోతుందనే సందర్బంలో బ్యాటింగ్ కు వచ్చి ఒక సెన్సషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 10 స్థానములో బ్యాటింగ్ కు వచ్చిన అతను 6 ఫోర్లు మరియు 6 సిక్సర్ల సహాయంతో కేవలం 66 బంతుల్లోనే 86 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.
At Number 11 – Mohammad Amir (58)
పాకిస్థాన్ కు చెందిన ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ 2016వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌ల్లో తన బ్యాట్ ఝులిపించాడు. ఇక ఈ మ్యాచ్‌ల్లో చివరి స్థానములో బ్యాటింగ్ కు వచ్చిన అమిర్ కేవలం 28 బంతుల్లో 58 పరుగులు సాధించి తన కెరియర్ లో ఎప్పటికి మర్చిపోలేని ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తానాడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి.