Line And Length In Cricket – మనం క్రికెట్ చూస్తున్నప్పుడు లైన్ అండ్ లెంగ్త్ అనే పదాన్ని ఎక్కువుగా వింటుంటాం. ముఖ్యంగా కామెంటేటర్లు దాదాపు ప్రతి బాల్ కి కూడా ఈ లైన్ అండ్ లెంగ్త్ అనే పదాన్ని యూస్ చేస్తారు. అయితే అసలు ఈ లైన్ అండ్ లెంగ్త్ అంటే ఏమిటి?
What Is Line And Length In Cricket
ఒక బౌలర్ బాల్ రిలీజ్ చేసాక బాల్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అని తెలిపేదాన్ని లైన్ అండ్ లెంగ్త్ అంటారు. అయితే ఇక్కడ లైన్ అనేది పిచ్ కు పెరలెల్ గా ఉంటె లెంగ్త్ అనేది మాత్రం పిచ్ కు లంబం (Perpendicular) గా ఉంటుంది. ముందుగా లైన్ గురించి తెలుసుకుందాం.
What Is Line In Cricket
పిచ్ కు రెండు వైపులా ఉండే వికెట్ల మధ్య ఒక లైన్ గీస్తే దాన్ని స్టంప్స్ లైన్ అంటారు. అండ్ అంపైర్ ఎప్పుడు కూడా ఈ స్టంప్స్ లైన్ లోనే నిలుచుంటాడు. ఎందుకంటే LBW అవుట్ విషయంలో ఈ స్టంప్స్ లైన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ స్టంప్స్ లైన్ ను కూడా మూడు డిఫరెంట్ లైన్స్ గా చెప్తారు.
Different Types Of Lines In Cricket
1. Leg Stump Line
2. Middle Stump Line
3. Off Stump Line
మీరు ఈ నంబరింగ్ ను గుర్తుపెట్టుకోండి. 1 అంటే లెగ్ స్టంప్ 2 అంటే మిడిల్ స్టంప్ 3 అంటే ఆఫ్ స్టంప్. ఇక ఒక బౌలర్ రిలీజ్ చేసిన బాల్ లెగ్ స్టంప్ కు స్ట్రెయిట్ గా ఉన్న ఏరియా నుండి ట్రావెల్ అయితే దాన్ని లెగ్ స్టంప్ లైన్ అంటారు. అలాగే మిడిల్ స్టంప్ కు స్ట్రెయిట్ గా ఉన్న ఏరియాలో బాల్ ట్రావెల్ చేస్తే అయితే దాన్ని మిడిల్ స్టంప్ లైన్ అంటారు. ఇక ఆఫ్ స్టంప్ కు స్ట్రయిట్ గా ఉన్న ఏరియా నుండి బాల్ పాస్ అయితే దాన్ని ఆఫ్ స్టంప్ లైన్ అంటారు.
జనరల్ గా ఒక బ్యాట్స్మన్ ను బౌల్డ్ లేదా LBW అవుట్ చెయ్యాలంటే బాల్ ను ఎక్కువగా ఈ స్టంప్స్ లైన్ లో పిచ్ చెయ్యాలి. అయితే బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతున్నప్పుడు బౌలర్ స్కిల్ బట్టి ఈ స్టంప్స్ లైన్ లో బాల్ ను పిచ్ చేయకపోయినా స్టిల్ బాట్స్మన్ ను బౌల్డ్ లేదా LBW అవుట్ చెయ్యవచ్చు.
ఇక మనకు టెస్ట్ క్రికెట్ లో ఈ స్టంప్స్ లైన్ తో పాటు ఎక్కువగా వినిపించే లైన్స్ 4th స్టంప్ లైన్, 5th స్టంప్ లైన్ అండ్ 6th స్టంప్ లైన్. సో మనం పైన ఆల్రెడీ ఆఫ్ స్టంప్ అంటే థర్డ్ స్టంప్ అని చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఆ థర్డ్ స్టంప్ పక్కన ఒక స్టంప్ ఉన్నట్టు ఉహించుకుని ఆ ఏరియా నుండి బాల్ వెళ్లేలా బౌల్ చేస్తే దాన్నే 4th స్టంప్ లైన్ అంటారు. అలాగే 4th ఇమాజినరీ స్టంప్ పక్కన ఇంకో స్టంప్ ను ఊహించుకుని ఆ ఏరియా నుండి బాల్ వెళ్లేలా బౌలింగ్ చేస్తే దాన్ని 5th స్టంప్ లైన్ అంటారు. ఇక ఆ తరువాత ఉండే ఇమాజినరీ స్టంప్ ను 6th స్టంప్ అంటారు.
Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)
మీరు సరిగ్గా గ్రహిస్తే మనకి బాట్స్మన్ లైన్ చార్ట్ చూపించినప్పుడు ఈ 4th, 5th అండ్ 6th స్టంప్ ఏరియాను గ్రీన్ కలర్ లో చూపిస్తారు. అండ్ ఛానల్ అని పిలిచే ఈ లైన్ లో ఎక్కువగా బౌలింగ్ చేస్తే బాట్స్మన్ బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఈ లైన్ లో వచ్చే బాల్ పొరపాటున ఇన్ స్వింగ్ అయితే ఆఫ్ స్టంప్ ను హిట్ చేస్తుంది.
బాట్స్మన్ తన వికెట్ ను కాపాడుకోవడం కోసం ఈ లైన్ లో వచ్చే బాల్ ను డిఫెండ్ చేద్దాం అని బ్యాట్ అడ్డుపెడతాడు. కానీ అలాంటి టైములో బాల్ అవుట్ స్వింగ్ అయితే బాట్స్మన్ బ్యాట్ యొక్క అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలోనో లేదా స్లిప్ ఫీల్డర్స్ చేతిలోనో పడుతుంది. దింతో బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఈ 4th ,5th అండ్ 6th స్టంప్ క్యారిడార్ లో నుండి బాల్ ట్రావెల్ అయ్యేలా బౌలింగ్ చేస్తే వరల్డ్ నెంబర్ 1 బాట్స్మన్ అయినా సరే ఇబ్బంది పడతాడు.
ఇక మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 లైన్స్ నుండి కాకుండా ఇంక ఏ లైన్ నుండి బాల్ వేసిన బాట్స్మన్ కు రన్స్ స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th స్టంప్ నుండి స్టార్ట్ చేసి ఆ బయట ఏరియా లో ఎక్కడ బౌలింగ్ చేసిన బాట్స్మన్ కు విడ్త్ దొరుకుతుంది. దింతో బాట్స్మన్ తన చేతులను ఫ్రీ చేసుకుని హారిజాంటల్ బ్యాట్ తో షాట్స్ ఆడతారు. సింపుల్ గా చెప్పాలంటే కట్ షాట్ మరియు స్క్వేర్ డ్రైవ్ ఎక్కువగా ఆడతారు. ఇక లెగ్ స్టంప్ బయట ఉండే ఏరియా నుండి బౌలింగ్ చేస్తే బాట్స్మన్ ఎక్కువగా ఫ్లిక్ లేదా లెగ్ గ్లాన్స్ షాట్ ఆడతారు. అండ్ ఇవి కూడా స్కోరింగ్ షార్ట్స్. ఒకవేళ ఈ షాట్స్ మిస్ అయినా ఆ బాల్ ను వైడ్ గా ప్రకటిస్తారు. దింతో లెగ్ స్టంప్ అవతలి ఉండే ఏరియాలో బౌలింగ్ చేస్తే దాన్ని బ్యాడ్ లైన్ అంటారు.
What Is Length In Cricket
ఇప్పుడు మనకు ఏ లైన్ లో బౌలింగ్ చేస్తే బాట్స్మన్ ను ఇబ్బంది పెట్టొచ్చో ఒక ఐడియా వచ్చింది. అయితే ఆ గుడ్ లైన్స్ వేసినప్పుడు పిచ్ మీద బాల్ ను ఎక్కడ ల్యాండ్ చెయ్యాలో అనేది కూడా తెలియాలి. ఎందుకంటే మనం ఎంత గుడ్ లైన్ లో బౌలింగ్ చేసిన బాల్ వికెట్ పై నుండి పోతే బాట్స్మన్ అవుట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి సరైన లైన్ లో బాల్ వెయ్యడంతో పాటు దాన్ని ఎక్కడ పిచ్ చెయ్యాలో మనకి తెలియాలి. ఇక ఇలా బాల్ ను ఎక్కడ పిచ్ చెయ్యాలో చెప్పే కాన్సెప్ట్ నే లెంగ్త్ అంటారు.
అయితే మనం పైన ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ లెంగ్త్ అనేది లైన్ మరియు పిచ్ కు లంబం (Perpendicular) గా ఉంటుంది. ఇక ఈ లైన్ అండ్ లెంగ్త్ కలిసే పాయింట్ బట్టే ఒక బౌలర్ గుడ్ లైన్ అండ్ లెంగ్త్ వేశాడా లేదా బ్యాడ్ లైన్ అండ్ లెంగ్త్ వేశాడా అనేది డిసైడ్ చేస్తారు. ఇక ఈ లెంగ్థ్స్ అనేవి 6 రకాలుగా ఉంటాయి.
Also Read – Top 10 High IQ Moments In Cricket (10 తెలివైన క్రికెటర్లు)
Different Types Of Lengths In Cricket
1. Full Toss
2. Yorker Length
3. Full Length
4. Good Length
5. Back of Length
6. Short of Length
1. Full Toss
బాల్ ను అసలు పిచ్ మీద ల్యాండ్ చెయ్యకపోతే దాన్ని ఫుల్ టాస్ అంటారు. ఈ టైప్ ఆఫ్ బాల్ ను ఆడటం చాలా సులువు. అలాగే ఈ బాల్ బాట్స్మన్ ను చేరుకునే ముందు ఎక్కడ ల్యాండ్ అవ్వదు కాబట్టి పిచ్ నుండి ఎలా సహకారం పొందలేదు.
2. Yorker Length
స్టంప్స్ దగ్గర నుండి 2 మీటర్స్ దూరం వరకు ఉన్న ఏరియాలో బాల్ ను పిచ్ చేస్తే దాన్ని యోర్కర్ లెంగ్త్ అంటారు. క్రికెట్ లో ఒక బాట్స్మన్ రన్స్ స్కోర్ చెయ్యటానికి ఎక్కువ ఇబ్బంది పడే లెంగ్త్ ఇదే. అయితే ఈ లెంగ్త్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. స్పెషల్ టేలంట్ ఉన్న బౌలర్స్ మాత్రమే యోర్కర్ ను నిలకడగా వెయ్యగలరు. ఒకవేళ ఈ యార్కర్ మిస్ అయ్యిందంటే ఫుల్ టాస్ గానో లేదా ఫుల్ లెంగ్త్ బాల్ గానో మారుతుంది. అండ్ ఈ రెండు రకాల బాల్స్ బాట్స్మన్ కు చాలా ఇష్టం.
3. Full Length
యోర్కర్ లెంగ్త్ తరువాత 4 మీటర్ల దూరం వరకు ఉండే ఏరియాను ఫుల్ లెంగ్త్ అంటారు. అంటే ఫుల్ లెంగ్త్ అనేది స్టంప్స్ దగ్గర నుండి 6 మీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈ లెంగ్త్ లో బాల్ ను పిచ్ చేస్తే రన్స్ స్కోర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో బాల్ ల్యాండ్ అయినప్పుడు దానికి స్వింగ్ అయ్యే ఛాన్స్ మరి ఎక్కువగా ఉండదు. బాట్స్మన్ ఒక అడుగు ముందుకేసి ఈజీ గా డ్రైవ్ చేస్తాడు. అందుకే ఫుల్ లెంగ్త్ ను బాట్స్మన్ యొక్క ఫేవరెట్ లెంగ్త్ అని చెప్తారు. అయితే ఇదే ఫుల్ లెంగ్త్ లో స్టంప్స్ నుండి 5 మీటర్ల దూరంలో బాల్ ను పిచ్ చేస్తే స్వింగ్ తో పాటు సీమ్ మోమెంట్ కూడా లభిస్తుంది. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో స్లాట్ అని పిలిచే ఈ లెంగ్త్ లో బాల్ పిచ్ అయితే బాట్స్మన్ భారీ షాట్లు ఆడటానికి ట్రై చేస్తారు.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
4. Good Length
ఫుల్ లెంగ్త్ తరువాత 1 మీటర్ దూరం వరకు ఉండే లెంగ్త్ ను గుడ్ లెంగ్త్ అంటారు. అంటే గుడ్ లెంగ్త్ అనేది స్టంప్స్ దగ్గర నుండి 7 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ ఏరియా ఎందుకు గుడ్ లెంగ్త్ అంటే ఈ లెంగ్త్ లో పిచ్ అయినా బాల్ ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలా లేదా బ్యాక్ ఫుట్ మీద ఆడాలా అనే డౌట్ ను బాట్స్మన్ మైండ్ లో క్రియేట్ చేస్తుంది. దీని వల్ల బాట్స్మన్ కుంచెం కంఫ్యూజ్ అయ్యి ఫ్రీ గా స్కోర్ చెయ్యలేడు. అందుకే ఈ లెంగ్త్ ను గ్రీన్ కలర్ తో రిప్రెసెంట్ చేస్తారు.
ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం పైన చెప్పుకున్న గ్రీన్ లైన్ మరియు ఇప్పుడు చెప్పుకున్న గ్రీన్ లెంగ్త్, ఈ రెండు కలిసే చోట బాల్ ను పిచ్ చేస్తే ఎలాంటి బాట్స్మన్ అయినా సరే ఆ బౌలర్ కు తల వంచాల్సిందే. సో ఒక బౌలర్ అప్పుడైతే ఈ రెండు గ్రీన్ జోన్లను మ్యాచ్ చేస్తూ నిలకడగా బౌలింగ్ చేస్తాడో అతన్ని తోప్ బౌలర్ అంటాం. బెస్ట్ ఎక్సమ్పుల్ డేల్ స్టెయిన్.
5. Back of Length
ఈ గుడ్ లెంగ్త్ వెనకాల 1 మీటర్ దూరం వరకు ఉండే ఏరియా ను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ అంటారు. మనకు లైన్ విషయంలో 6th స్టంప్ లైన్ ఎలానో లెంగ్త్ విషయంలో ఈ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ కూడా అలానే. అంటే బాల్ ను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ లో పిచ్ చేసి గ్రీన్ ఛానల్ లైన్ నుండి వెళ్లేలా బౌలింగ్ చేస్తే అది కూడా బాట్స్మన్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా బాల్ బాగా స్వింగ్ అవ్వాలంటే ఈ గుడ్ లెంగ్త్ మరియు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ ను ఎక్కువగా హిట్ చెయ్యాలి.
6. Short of Length
స్టంప్స్ దగ్గర నుండి 8 మీటర్ల తరువాత ఉండే మొత్తం ఏరియా ను షార్ట్ ఆఫ్ లెంగ్త్ అంటారు. బాట్స్మన్ ను బ్యాక్ ఫుట్ మీద ఆడించడం కోసం ఈ లెంగ్త్ ను ఎక్కువగా యూస్ చేస్తారు. అయితే ఈ లెంగ్త్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటింది. ఎందుకంటే ఈ లెంగ్త్ లో బాల్స్ వేసి బాట్స్మన్ ను ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా బౌన్సర్లతో బాట్స్మన్ ను భయపెట్టొచ్చు. కానీ ఇదే లెంగ్త్ ను రిబ్స్ హైట్ లో వచ్చేలా హిట్ చేస్తే పుల్ షాట్ ఆడటం బాగా వచ్చిన వాళ్ళు ఈజీగా రన్స్ స్కోర్ చేస్తారు. కాబట్టి ఈ షార్ట్ ఆఫ్ లెంగ్త్ వేసినప్పుడు చాలా ఖచ్చితత్వంతో వెయ్యాలి.
క్రికెట్ ప్రేమికులారా లైన్ అండ్ లెంగ్త్ అంటే ఇలా ఉంటాయి. బట్ ఈ రెండు కూడా కొన్ని కారకాలు మీద ఆధారపడి ఉంటాయి.
Factors That Influence Line And Length In Cricket
బౌలర్ యొక్క స్పీడ్ అండ్ హైట్ అలాగే పిచ్ లో ఉండే బౌన్స్, బాట్స్మన్ యొక్క హైట్, మరియు బాల్ కొత్తగా ఉందా పాతగా ఉందా అనే ఫ్యాక్టర్స్ ఈ లైన్ అండ్ లెంగ్త్ ను ఎఫక్ట్ చేస్తాయి. బౌలర్ తనకున్న స్కిల్స్ కు అనుగుణంగా కండిషన్స్ ను అర్ధం చేసుకుని బౌలింగ్ చెయ్యాలి. ఎందుకంటే బాల్ కొత్తగా ఉన్నప్పుడు అది ఎక్కువగా బౌన్స్ అవుతుంది. అలాగే బౌలర్ పొడవుగా ఉన్న లేదా పిచ్ లో బౌన్స్ ఉన్న గుడ్ లెంగ్త్ కు దగ్గరలో ఉండే ఫుల్ లెంగ్త్ లో బౌలింగ్ చెయ్యాలి. అప్పుడు బాల్ స్టంప్స్ కు తగిలే హైట్ లో ట్రావెల్ చేస్తుంది.
అలాగే స్లోగా బౌలింగ్ చెయ్యడం వల్ల బాల్ త్వరగా డిప్ అవుతుంది కాబట్టి మీడియం స్పీడ్ బౌలర్స్ ఫుల్ లెంగ్త్ లో బౌలింగ్ చెయ్యాలి. అలా చేస్తేనే అది కీపర్ కు క్యారీ అవుతుంది. దీని వల్లే స్పిన్నర్లకు ఈ లెంగ్థ్స్ అనేవి కుంచెం ముందుకు ఉంటాయి. అలాగే వికెట్ కీపర్ కూడా వికెట్ల దగ్గరికి వచ్చి కీపింగ్ చేస్తాడు. ఇక బాల్ ఓల్డ్ అయినా తరువాత మరియు బాట్స్మన్ ఎక్కువ హైట్ ఉన్నప్పుడు ఎక్కువగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ హిట్ చెయ్యాలి. ఎనీవే ఈ ఆర్టికల్ చదివిన తరువాత మీకు లైన్ అండ్ లెంగ్త్ పై ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ తో షేర్ చెయ్యండి. మర్చిపోవద్దు.