Retired Hurt – జనరల్ గా మనం గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా డాట్ బాల్స్ ఆడుతున్న బాట్స్మన్ ను డిక్లేర్ అని చెప్పి అవుట్ కాకుండానే పక్కన కూర్చోపెడతాం. అది కూడా ఓవర్ అయిపోయాకనో లేదా ఒక ఓవర్ లో మూడు బాల్స్ పూర్తయ్యాక ఇలా చేస్తాం. ఇక ఆ బాట్స్మన్ మళ్ళి ఎప్పుడు బ్యాటింగ్ కి రావాలంటే అందరూ అవుట్ అయ్యాక లాస్ట్ వికెట్ గా తిరిగి క్రీజ్ లోకి రావాలి. చాలా ఇంట్రెస్టింగ్ రూల్స్ కదా. మరి ఇలాంటి రూల్స్ ప్రొఫెషనల్ క్రికెట్ లో ఉంటాయా అంటే, అవును ఉంటాయి.
ఒక బాట్స్మన్ ఇలా తన ఇన్నింగ్స్ కు ఎప్పుడైనా బ్రేక్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇలా చెయ్యడాన్ని రిటైర్డ్ అంటారు. అయితే ఒక బాట్స్మన్ తన ఇన్నింగ్స్ ను ఇలా మధ్యలోనే ముగించి వెళ్ళినప్పుడు మనకు ఎక్కువుగా వినిపించే పదం రిటైర్డ్ హర్ట్. అయితే ఒక్కోసారి బాట్స్మన్ గాయపడకుండా కూడా రిటైర్డ్ అవుతాడు. అయితే అసలు ముందు ఈ రిటైర్డ్ హర్ట్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
What Is Retired Hurt (రిటైర్డ్ హర్ట్)
రిటైర్డ్ హర్ట్, పేరులోనే ఉంది ఒక బాట్స్మన్ హర్ట్ అంటే గాయం అవ్వడం వల్ల అతను రిటైర్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తాడు.
జనరల్ గా ఎవరైనా బాట్స్మన్ బ్యాటింగ్ చేస్తున్నపుడు గాయపడి నా ఇన్నింగ్స్ ను ఇంక కంటిన్యూ చెయ్యలేను అనుకున్నప్పుడు అతను రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్ళిపోతాడు. ఇక ఆ తరువాత తన గాయం కుంచెం తగ్గిందని అనిపించినప్పుడు తిరిగి బ్యాటింగ్ చెయ్యడానికి వస్తాడు. సో నార్మల్ గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అయితే MCC క్రికెట్ లాస్ ప్రకారం బాట్స్మన్ రిటైర్ అవ్వడం అనేది రెండు రకాలుగా ఉంటుంది.
1. Retired Not Out
2. Retired Out
ఒక బాట్స్మన్ తన ఇన్నింగ్స్ ను అవుట్ అవ్వకుండా మధ్యలోనే ముగిస్తే అది ఈ రెండు కేటాగిరిల్లోకి వస్తుంది. ఇక ఇప్పుడు మనం ఈ రెండిటి గురించి లోతుగా తెలుసుకుందాం.
1. Retired Not Out
ఒక బాట్స్మన్ తనకు గాయం అవ్వడం వల్ల రిటైర్ అయితే దాన్ని రిటైర్డ్ నాటౌట్ అంటారు. అయితే ప్రెసెంట్ దీన్ని బ్రాడ్కాస్టర్స్ అంత రిటైర్డ్ హర్ట్ గా చూపిస్తున్నారు. ఇక రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్లిన బాట్స్మన్ తిరిగి ఎప్పుడైనా బ్యాటింగ్ కి రావచ్చు. కానీ అతను డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళాక కనీసం ఒక వికెట్ అయినా పడాలి. లేదా ఇంకో బాట్స్మన్ ఎవరైనా రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ అవుట్ అయితేనే అతను తిరిగి బ్యాటింగ్ కు రాగలడు.
ఇక ఈ కేస్ లో గాయపడి వెళ్ళిపోయినా బాట్స్మన్ తిరిగి బ్యాటింగ్ వచ్చేందుకు ఎవరి పర్మిషన్ తీసుకోనవసరం లేదు. జస్ట్ రూల్ ఫాలో అయితే సరిపోతుంది. ఒకవేళ గాయం అయినా బాట్స్మన్ తిరిగి బ్యాటింగ్ కు రాకపోతే అతన్ని రిటైర్డ్ నాటౌట్ గా పరిగణించి స్కోరుబోర్డు లో రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్ అని మెన్షన్ చేస్తారు. బట్ టీం టోటల్లో మాత్రం మొత్తం అందరూ ప్లేయర్స్ అవుటయ్యినట్టే ఆలౌట్ అని మెన్షన్ చేస్తారు.
Also Read – How To Become A Cricketer (క్రికెటర్ ఎలా అవ్వాలి) In Telugu
2. Retired Out
ఒక బాట్స్మన్ తనంతట తాను ఎలాంటి ఇంజురీ ప్రాబ్లెమ్ లేకుండా పెవిలియన్ కు వెళ్ళిపోతే దాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు. మనం గల్లీ క్రికెట్ లో యూస్ చేసే రూల్ ఇదే. ఎవరైనా డాట్స్ బాల్స్ ఎక్కువగా ఆడుతుంటే అతన్ని బలవంతంగా రిటైర్డ్ అవుట్ చేయించి నెక్స్ట్ బాట్స్మన్ ను బరిలోకి దింపుతాం. కానీ ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇది చాలా అరుదు. అయితే వార్మప్ మ్యాచ్స్ లో ఈ రిటైర్డ్ అవుట్ ను ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నప్పడు ఒక బాట్స్మన్ అర్ద సెంచరీ లేదా సెంచరీ కొట్టాక మిగతా బాట్స్మన్ కు ఛాన్స్ ఇవ్వడం కోసం తమని తాము రిటైర్డ్ అవుట్ గా డిక్లేర్ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతారు.
ఇక ఇలా రిటైర్డ్ అవుట్ అయి వెళ్లిన బాట్స్మన్ కూడా తనకి కావలసినప్పుడు తిరిగి మళ్ళీ బ్యాటింగ్ కు రావచ్చు. కానీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ప్రత్యర్థి కెప్టెన్ ఒప్పుకోకపోతే తిరిగి బ్యాటింగ్ చెయ్యడానికి ఉండదు. దింతో రిటైర్డ్ అవుట్ అయినపుడు లాస్ట్ రావడం, రెండు వికెట్లు పడ్డాక రావడం లేదా ఐదు వికెట్లు పడ్డాక రావడం లాంటి కాన్సెప్టులు ఏమి ఉండవు. ఆపొనెంట్ కెప్టెన్ ఒప్పుకుంటూనే అతనికి మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. లేకపోతే అతను అవుట్ అయినట్టే. కాబట్టి రిటైర్డ్ అవుట్ అంటే మాక్సిమం అవుట్ లాంటిదే. ఇక రిటైర్డ్ అవుట్ గా వెనుతిరిగిన బాట్స్మన్ మళ్ళీ బ్యాటింగ్ కు రాకపోతే స్కోర్ బోర్డు లో అతని పేరు పక్కన రిటైర్డ్ అవుట్ అని డిక్లర్ చేస్తారు.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
ఈ రెండు కేసుల్లో కూడా ఒక బాట్స్మన్ రిటైర్ అవ్వడం కోసం అంపైర్ నుండి అనుమతి తీసుకోనునవసరం లేదు. అయితే ఎందుకు రిటైర్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కారణాన్ని మాత్రం ఖచ్చితంగా అంపైర్ కు చెప్పాలి. ఎందుకంటే బ్యాట్సమన్ మధ్యల్లో వెళ్ళింది రిటైర్డ్ హర్ట్ గానా లేదా రిటైర్డ్ అవుట్ గానా అనేది వాళ్ళు స్కోర్ బోర్డులో నోట్ చేసుకోవాలి. మీకైతే ఈ ఆర్టికల్ చదివిన తరువాత ఈ రిటైర్డ్ హర్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనే ఆశిస్తున్నా.