Imagine Dragons Biography In Telugu – Top 3 Best Songs Of Imagine Dragons

మనం వినే కొన్ని సాంగ్స్ మనసుకి హాయిగా అనిపిస్తాయి. మరికొన్ని సాంగ్స్ మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంకొన్ని సాంగ్స్ మన హార్ట్ ను హీల్ చేసేలా అనిపిస్తాయి. కానీ కొన్ని సాంగ్స్ ఉంటాయి. అవి విన్నప్పుడు మన ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. నేను ఏదైనా సాధించేయగలను అనే ఉత్తేజాన్ని మనలో నింపుతాయి. సరిగ్గా ఇలాంటి పవర్ఫుల్ మ్యూజిక్ ను కంపోజ్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాండ్స్ ఇమాజిన్ డ్రాగన్స్. పవర్ఫుల్ మ్యూజిక్, అంతకుమించిన ఫైరీ లిరిక్స్, దానికిమించిన పెర్ఫార్మన్స్. సో ఇలా తమదైన పాప్ రాక్ మ్యూజిక్ తో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన అరుదైన బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ యొక్క ఇన్స్పైరింగ్ బయోగ్రఫీను ఈ వీడియోలో తెలుసుకుందాం.

Imagine Dragons Biography
Imagine Dragons Biography

Imagine Dragons Biography – How Imagine Dragons Started

ఇమాజిన్ డ్రాగన్స్ బ్యాండ్ 2008వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది. అండ్ అమెరికాకు చెందిన ఈ బ్యాండ్ లో ప్రెసెంట్ నలుగురు మ్యూజిషియన్స్ ఉన్నారు. లీడ్ సింగర్ & పియోనిస్ట్ గా Dan Reynolds, లీడ్ గిటారిస్ట్ గా Wayne Sermon, బేసిస్ట్ గా Ben McKee మరియు డ్రమ్మర్ గా Daniel Platzman ఈ బ్యాండ్ లో మెంబర్స్ గా ఉన్నారు.

అయితే నిజానికి ఈ బ్యాండ్ ను స్టార్ట్ చేసింది మాత్రం Andrew Tolman మరియు Dan Reynolds. వీళిద్దరూ 2008వ సంవత్సరంలో అమెరికాలోని Brigham Young University లో చదువుకుంటున్నప్పుడు ఒకర్నొకరు కలుసుకున్నారు. అండ్ అల్సొ వీళ్ల సంగీత ఆలోచనలు కూడా కలవడంతో డ్రమ్మర్ గా మంచి టేలెంట్ ఉన్న టోల్మాన్ డాన్ తో కలసి ఒక రాక్ బ్యాండ్ ను స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అలాగే వీళ్లిద్దరు అనుకున్నట్టే చాలా తక్కువ టైంలోనే తమ బ్యాండ్ ను స్టార్ట్ చేసి కావలిసిన టీం మెంబెర్స్ ను గెథెర్ చేసుకున్నారు. సో ఇనీషియల్ గా అయితే ఈ బ్యాండ్ లో వీళ్ళిద్దరితో పాటు గిటారిస్ట్ గా Andrew Beck, బేసిస్ట్ గా Dave Lemke మరియు పియానిస్ట్ గా Aurora Florence ఈ బ్యాండ్ సభ్యులు.

Music Imagine Dragons the whole band 045512
Imagine Dragons Biography – The Begining

Also Read – Coldplay Biography In Telugu – Top 3 Songs Of Coldplay

Imagine Dragons Biography – Initial Success

ఇక ఈ ఐదుగురు కలిసి తమ బ్యాండ్ ను Anagram అని పిలుచుకునేవారు. అలాగే అదే ఏడాది Speak to Me అనే ఒక ఎక్స్టెండెడ్ ప్లేను రిలీజ్ చేసారు. అయితే ఈ రిలీజ్ తరువాత Beck మరియు Florence బ్యాండ్ నుండి బయటికి వెళ్లిపోయారు. దింతో Tolman తన స్కూల్ ఫ్రెండ్ అయినా Wayne Sermon ను గిటార్ ప్లే చేసేందుకు తమ బ్యాండ్ లో జాయిన్ చేసుకున్నాడు. అలాగే Tolman తన వైఫ్ అయినా Brittany Tolman ను కూడా ఒక బ్యాక్ అప్ సింగర్ గా తమ బ్యాండ్ లోకి తీసుకున్నారు. దింతో మళ్లీ ఇమాజిన్ డ్రాగన్స్ ఒక ఫుల్ బ్యాండ్ గా మారి లైవ్ షోస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే మళ్లీ కొన్ని రోజులకే బేసిస్ట్ Lemke ఈ గ్రూప్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అయితే Sermon వచ్చిన Berklee College of Music నుండే మరో స్టూడెంట్ Ben McKee ను బేసిస్ట్ గా తమ బ్యాండ్ లో జాయిన్ చేసుకున్నారు.

ఇక ఆ తరువాత వీళ్లంతా కలిసి డాన్ ఇంట్లోనే ఉంటూ మినీ మ్యూజిక్ ఆల్బమ్స్ ను క్రియేట్ చెయ్యడం స్టార్ట్ చేసారు. అండ్ ఇదే క్రమంలో 2009వ సంవత్సరం సెప్టెంబర్ 1 తేదీన ఇమాజిన్ డ్రాగన్స్ పేరుతో ఒక Ep ను రిలీజ్ చేసారు. ఇక ఎక్స్టెండెడ్ ప్లే మంచి హిట్ అవ్వడం వల్ల ఈ Ep పేరునే తమ బ్యాండ్ పేరుగా మార్చేసుకున్నారు. అలాగే ఆ తరువాత 2010 లో Hell and Silence మరియు 2011 లో It’s Time అనే Ep ను రిలీజ్ మంచి గుర్తింపు సాధించారు. దింతో అదే ఏడాది Interscope Records అనే సంస్థ ఇమాజిన్ డ్రాగన్స్ తో కలిసి కొన్ని ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంది.

1200x1200bf 60
Imagine Dragons Biography – It’s Time Extended Play

Imagine Dragons Biography – Separation Of Band Members

అయితే ఇదే టైంలో తమ బ్యాండ్ లో Tolman కపుల్ ఇమాజిన్ డ్రాగన్స్ ను వదిలేసి సెపెరేట్ గా మ్యూజిక్ చెయ్యడం స్టార్ట్ చేసారు. దింతో బ్యాండ్ కు మళ్లీ కొత్తవాళ్లు అవసరం కాగా Ben McKee తనకు తెలిసిన డ్రమ్మర్ Daniel Platzman మరియు కీబోర్డ్ ప్లేయర్ Theresa Flaminio ను బ్యాండ్ లో జాయిన్ చేయించాడు. సో ఇనీషియల్ గా ఇమాజిన్ డ్రాగన్స్ చాలా స్ట్రగుల్ అయ్యింది. మంచి హిట్ సాంగ్స్ పడుతున్నప్పటికీ బ్యాండ్ మెంబెర్స్ లో సరైన కోర్డినేషన్ లేక ఆడియన్స్ దగ్గర నుండి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈవెన్ కీబోర్డ్ ప్లేయర్ Flaminio కూడా బ్యాండ్ లో జాయిన్ అయినా ఒక్క సంవత్సరానికె రిసైన్ చేసింది. దింతో చివరికి ఇమాజిన్ డ్రాగన్స్ లో నలుగురు మాత్రమే మిగిలారు.

ప్రెసెంట్ ఆ బ్యాండ్ లో ఉన్న Dan, Wayne, Ben మరియు Daniel ఫైనల్ గా ఒక ఫుల్ లెంగ్త్ ఆల్బం చేద్దాం అని చెప్పి Alex da Kid అనే ప్రొడ్యూసర్ తో జతకట్టారు. ఇక అప్పటి నుండి మొదలైన ఇమాజిన్ డ్రాగన్స్ అసలైన ప్రస్థానం మ్యూజిక్ ఇండస్ట్రీను ఒక ఊపు ఊపేసింది.

Imagine Dragons Biography – Popular & Successful Albums

1. Night Visions (2012)

2012వ సంవత్సరంలో వాళ్ళ డెబ్యూ ఆల్బం నైట్ విసన్ వాళ్ళు ఊహించిన దాని కంటే పెద్ద హిట్ అయ్యింది. అది ఎంతలా రిలీజ్ చేసిన మొదటి వారంలోనే 83000 కన్నా ఎక్కువ కాపీలు అమ్ముడయ్యి గత ఏడేళ్లలో రిలీజ్ అయినా బెస్ట్ డెబ్యూ రాక్ ఆల్బం గా రికార్డ్ క్రియేట్ చేసింది. బిల్ బోర్డు ఛార్ట్స్ లో వారాల తరబడి ఈ ఆల్బం పాటలే మారుమ్రోగిపోయాయి. మరిముఖ్యంగా ఈ ఆల్బం లో మొదటి పాటైనా రేడియోయాక్టీవ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బిల్ బోర్డు హాట్ 100 సాంగ్స్ లిస్టులో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ రాక్ సాంగ్ గా గ్రామీ అవార్డు ను కూడా సొంతం చేసుకుంది.

అలాగే ఇదే ఆల్బం లో డిమాన్స్ మరియు ఇట్స్ టైం అనే సాంగ్స్ కూడా సేమ్ రేడియోయాక్టీవ్ లానే చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో ఆల్బమ్ అయితే ఇమాజిన్ డ్రాగన్స్ కు చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం కోసం ఏ దేశానికి వెళ్లిన సరే ఇమాజిన్ డ్రాగన్స్ పాటల కోసం అభిమానులు క్యూ కట్టేవారు. అయితే ఈ ఆల్బమ్ తరువాత 2014వ సంవత్సరంలో వచ్చిన Smoke + Mirrors అనే ఆల్బమ్ వాళ్ళ ఫస్ట్ ఆల్బం అంత హిట్ కాలేకపోయింది. బట్ స్టిల్ తమ రెండో ఆల్బంతోనే ట్రాన్స్ఫార్మర్స్ లాంటి పాపులర్ మూవీ ఫ్రాంచైజ్ కు బాటిల్ క్రై అనే సింగిల్ ను అందించారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ లో కూడా వర్క్ చేసి తమ ఎక్సపోసుర్ ను పెంచుకున్నారు.

2. Evolve (2017)

ఇక 2017వ సంవత్సరంలో ఇమాజిన్ డ్రాగన్స్ రిలీజ్ చేసిన Evolve ఆల్బమ్ ఒక పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మరిముఖ్యంగా ఈ ఆల్బం లో నుండి వచ్చిన బిలీవర్ అనే సాంగ్ ఇప్పటికి చాలా ట్రెండింగ్ లో ఉంది. నిజంగా ఈ సాంగ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది విన్నప్పుడు ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ఫైరీ ఫీలింగ్ వస్తుంది. ఇక ఇదే ఆల్బమ్ నుండి వచ్చిన థండర్ మరియు వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అనే సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈవెన్ ఈ ఆల్బమ్ బెస్ట్ పాప్ వోకల్ ఆల్బం కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యింది.

ఇక ఈ ఆల్బమ్ తరువాత 2018వ సంవత్సరంలో Origins అనే మరో ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. అండ్ ఇది కూడా  విజయం సాధించింది. ముఖ్యంగా ఈ ఆల్బమ్ లో వచ్చిన Bad Liar అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక ప్రెసెంట్ 2021వ సంవత్సరంలో రిలీజ్ చేసిన మెర్క్యూరీ ఆల్బమ్ చాలా సక్సెస్ఫుల్ గా సేల్ అవ్వడంతో పాటు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగిస్తుంది. అలాగే Netflix లో Arcane అనే సిరీస్ కోసం వీళ్లు కంపోజ్ చేసిన ఎనిమీ సాంగ్ ప్రెసెంట్ ట్రేండింగ్ సాంగ్స్ లో ఒకటి.

Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)

ఇక ఇమాజిన్ డ్రాగన్స్ తమ పాటలతో అందరినీ ఇన్స్పైర్ చెయ్యడమే కాకుండా Tyler Robinson అనే పేరుతో 2013లో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా క్యాన్సర్ బాధితులకు సహాయం చేస్తున్నారు. అలాగే చాలా సార్లు కొన్ని చారిటీస్ కి ఫండ్ రైజ్ చేయడం కోసం ఫ్రీగా లైవ్ షోస్ ఇచ్చి తమది ఎంత గొప్ప మనసో చాటుకున్నారు.

TRF concert 17
Imagine Dragons Biography – Tyler Robinson Foundation

Imagine Dragons Biography – Top 3 Songs On YouTube

ఇక యూట్యూబ్ లో ఇమాజిన్ డ్రాగన్స్ యొక్క టాప్ 3 సాంగ్స్ చూసుకుంటే టాప్ ప్లేస్ లో 2.3 బిలియన్ వ్యూస్ తో బిలీవర్ సాంగ్ ఉంది.

ఇక ఆ తరువాత 1.9 బిలియన్ వ్యూస్ తో థండర్ సాంగ్ రెండో ప్లేస్ లో ఉంది.

1.4 బిలియన్ వ్యూస్ తో రేడియోయాక్టీవ్ సాంగ్ మూడో ప్లేసులో ఉంది.

ఇక ఇమాజిన్ డ్రాగన్స్ తమ కెరియర్ లో ఒక గ్రామీ అవార్డు గెలుచుకోగా 4 సార్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. అలాగే ఇప్పటివరకు 46 మిలియన్ ఆల్బం సేల్స్ సాధించిన ఇమాజిన్ డ్రాగన్స్ ప్రెసెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాప్ రాక్ బ్యాండ్స్ గా కొనసాగుతుంది. సో ఇది గాయిస్ ది మోస్ట్ పవర్ఫుల్ బ్యాండ్ అయినా ఇమాజిన్ డ్రాగన్స్ బయోగ్రఫీ.

Imagine Dragons Biography – Social Links

Instagram – @imaginedragons

Twitter – @Imaginedragons

Facebook Page – Imagine Dragons

Spotify – Imagine Dragons