Coldplay Biography In Telugu – Top 3 Songs Of Coldplay

Coldplay Biography – Introduction

కోల్డ్ ప్లే, బ్రిటన్ కు చెందిన ఈ రాక్ బ్యాండ్, వెస్టర్న్ మ్యూజిక్ కల్చర్ లో ఒక రివొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కోల్డ్ ప్లే మిగతావారిలా కాకుండా చాలా డిఫెరెంట్ గా తమ ఆల్బమ్స్ ను క్రియేట్ చేస్తారు. మరిముఖ్యంగా ఈ బ్యాండ్ లీడ్ సింగర్ అయినా క్రిస్ మార్టిన్ వాయిస్ చాలా యూనిక్ గా ఉంటుంది. అలాగే తమ సాంగ్స్ లో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చెయ్యకుండా చాలా సోల్ ఫుల్ గా లిరిక్స్ రాస్తారు.

Coldplay Biography
Coldplay – Spotify

అంతేకాకుండా తమ వీడియో సాంగ్స్ లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా హార్ట్ టచింగ్ గా కొరియోగ్రఫీ చేస్తారు. అలాగే తమకు ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో 10 శాతాన్ని ఛారిటీకి ఇస్తున్న రేర్ బ్యాండ్ కోల్డ్ ప్లే. సో తమ ప్యూర్ అండ్ డిఫెరెంట్ మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోల్డ్ ప్లే యొక్క ఇన్స్పైరింగ్ బయోగ్రఫీను ఈ వీడియోలో తెలుసుకుందాం.

Coldplay Biography – How Coldplay Started

కోల్డ్ ప్లే 1996వ సంవత్సరంలో ఒక లండన్ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ బ్యాండ్ లో నలుగురు మ్యుజిషియన్స్ ఉన్నారు. లీడ్ సింగర్ మరియు పియోనిస్ట్ గా క్రిస్ మార్టిన్, లీడ్ గిటారిస్ట్ గా జానీ బక్లాండ్, బేసిస్ట్ గా గాయ్ బెరిమన్ మరియు డ్రమిస్ట్ గా విల్ ఛాంపియన్ ఉన్నారు. అయితే నిజానికి కోల్డ్ ప్లే ను స్టార్ట్ చేసింది క్రిస్ మార్టిన్ మరియు జానీ బక్లాండ్. వీళ్లిద్దరు 1996వ సంవత్సరం స్టెప్టెంబర్ నెలలో లండన్ యూనివర్సిటీ కాలేజ్ లో జరిగిన ఓరియెంటేషన్ వీక్ లో మీట్ అయ్యారు. అండ్ ఆ తరువాత ఫ్రెండ్స్ గా పెక్టోరల్జ్ అనే పేరుతో ఒక రాక్ బ్యాండ్ ను స్టార్ట్ చేసారు.

ఇక ఆ తరువాత వీళ్లిద్దరు కలిసి ప్రతి రోజు సాంగ్స్ రాస్తూ నైట్ టైంలో వాటిని ప్రాక్టీస్ చేసేవారు. సరిగ్గా ఈ టైంలోనే అదే కాలేజ్ లో చదువుకుంటున్న గాయ్ బెరిమన్ వీళ్ళతో జాయిన్ అయ్యాడు. అండ్ అల్సొ తమ బ్యాండ్ పేరును బిగ్ ఫ్యాట్ నొయిసెస్ గా మార్చుకున్నారు. ఇక ఆ తరువాత 1998వ సంవత్సరంలో విల్ ఛాంపియన్ ఈ ముగ్గురితో చేరి ఒక కంప్లీట్ బ్యాండ్ ను ఫామ్ చేసారు. అంతేకాకుండా తన బ్యాండ్ పేరు ను స్టార్ ఫిష్ ఇన్ ఏ ప్యానిక్ గా మార్చుకుని కొన్ని లోకల్ క్లబ్స్ లో లైవ్ పెరఫార్మన్సెస్ కూడా ఇచ్చారు. అయితే స్టార్టింగ్ లో వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. దింతో కొన్ని రోజుల తరువాత ఈ నలుగురు తమ బ్యాండ్ పేరును కోల్డ్ ప్లే గా మార్చుకున్నారు.

Coldplay Biography
Coldplay Biography – Band Members

Coldplay Biography – Initial Struggle

ఇక అప్పటినుండి ఇండిపెండెంట్ గా మ్యూజిక్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన కోల్డ్ ప్లే సేఫ్టీ అనే ఎక్స్టెండెడ్ ప్లే ను రిలీజ్ చేసారు. అయితే ఈ మినీ ఆల్బమ్ ను ఎవరు సరిగ్గా కొనుక్కోకపోవడంతో ప్రొడ్యూస్ చేసిన 500 కాపీస్ ను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు పంచిపెట్టారు. ఇక ఆ తరువాత మరో మినీ ఆల్బమ్ ను రిలీజ్ చేసిన అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ కోల్డ్ ప్లే ఇచ్చే లైవ్ పెరఫార్మన్సెస్ మాత్రం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునేవి. దింతో 1999వ సంవత్సరంలో పేర్లోఫొన్ అనే సంస్థ కోల్డ్ ప్లే కలిసి 5 ఆల్బమ్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే వాళ్లు ఇనీషియల్ గా ది బ్లూ రూమ్ అనే ఒక మినీ ఆల్బమ్ ను కూడా రిలీజ్ చేసారు.

Coldplay Biography – Popular & Successful Albums

1. Parachutes (2000)

అయితే కోల్డ్ ప్లే కు బ్రేక్ ఇచ్చింది మాత్రం 2000వ సంవత్సరంలో వాళ్ళు రిలీజ్ చేసిన ఫుల్ లెంగ్త్ ఆల్బమ్ పేరాషూట్స్. ఈ ఆల్బమ్ అయితే కోల్డ్ ప్లే కు చాలా మంచి సక్సెస్ ఇచ్చింది. 2001వ సంవత్సరంలో బ్రిటిష్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవడంతో పాటు ఇంటర్నేషనల్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కు నామినెట్ అయ్యింది. మరిముఖ్యంగా ఈ ఆల్బమ్ రిలీజ్ అయినా కొత్తలో శివర్ అనే సాంగ్ మొదటిసారి కోల్డ్ ప్లే నుండి UK టాప్ 40 సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

Coldplay Biography
Coldplay Biography – Parachutes

అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే ఇదే ఆల్బమ్ లో యెల్లో అనే మరో సాంగ్ ఏకంగా UK టాప్ 5 సింగిల్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ గా నిలిచింది. దింతో కోల్డ్ ప్లే ఈ కమెర్షియల్ సక్సెస్ ను ఇంకా ఎక్సపండ్ చెయ్యడం కోసం యూరప్ లోనే కాకుండా అమెరికా ఖండంలో కూడా లైవ్ పెరఫార్మన్సెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక ఇదే క్రమంలో 2002వ సంవత్సరంలో ఈ పేరాషూట్స్ ఆల్బమ్  బెస్ట్ ఆల్ట్రనేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది.

Coldplay Biography – Parachutes Album

2. A Rush of Blood to the Head (2003)

ఇక ఈ సక్సెస్ తరువాత 2003వ సంవత్సరంలో A Rush of Blood to the Head అనే మరో ఫుల్ లెంగ్త్ ఆల్బమ్ ను కోల్డ్ ప్లే రిలీజ్ చేసింది. అండ్ ఈ ఆల్బమ్ వాళ్ళ మొదటి ఆల్బమ్ కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. అది ఎంతలా అంటే 21వ శతాబ్దంలో బ్రిటన్స్ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా నిలిచింది. అంతేకాకుండా US బిల్ బోర్డ్ ఛార్ట్స్ లో టాప్ 5 లో స్థానం సంపాదించింది. అలాగే ఈ ఆల్బమ్ లో బాగా పాపులర్ అయినా ది సైంటిస్ట్ మరియు క్లోక్స్ అనే సింగిల్స్ కారణంగా కోల్డ్ ప్లే కు మరో గ్రామీ అవార్డు వచ్చింది. ఇక ఇదే టైములో కోల్డ్ ప్లే ది ప్రిటెండర్స్ కు చెందిన 2000 మైల్స్ అనే సాంగ్ ను కవర్ చేయగా అది 2003వ సంవత్సరంలో UKs టాప్ డౌన్లోడెడ్ సింగల్ గా నిలిచింది. అలాగే కోల్డ్ ప్లే కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం మొదలయ్యింది.

Coldplay Biography – A Rush of Blood to the Head Album

3. X & Y (2005)

ఇక ఆ తరువాత కోల్డ్ ప్లే 2005వ సంవత్సరంలో X & Y అనే ఒక సరికొత్త ఆల్బమ్ తో మరోసారి మ్యూజిక్ ప్రపంచాన్ని ఉర్రుతలూగించింది. ఈ ఆల్బమ్ కు కొన్ని మిక్సడ్ రివ్యూస్ వచ్చిన నేషనల్ లెవెల్లో 9 అవార్డులు గెలుచుకుంది. అలాగే బెస్ట్ రాక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మరిముఖ్యంగా ఈ ఆల్బమ్ లో ఉన్న ఫిక్స్ యూ అనే సాంగ్ ఇప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా కొనసాగుతుంది. ఇక US లో నెంబర్ 1 ఆల్బమ్ గా నిలిచిన ఈ X & Y లో ఎలెక్టర్నిక్ మ్యూజిక్ తో సాంగ్స్ క్రియేట్ చేసిన కోల్డ్ ప్లే తమ ఆడియన్స్ కు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. అలాగే వరల్డ్ వైడ్ గా చాలా క్రేజ్ ను సంపాదించి ఆ టైములో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాండ్స్ గా పేరు సంపాదించింది.

Coldplay Biography – X & Y Album

4. Viva La Vida (2008)

ఇక ఆ తరువాత 2008వ సంవత్సరంలో మరో ఎక్స్పరిమెంట్ చేసిన కోల్డ్ ప్లే ఈ సారి వివా లా విడా అనే ఒక డిఫరెంట్ ఆల్బమ్ ను రిలీజ్ చేసింది. అండ్ ఈ ఆల్బమ్ UK తో పాటు US లో కూడా నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఓవరాల్ గా మొత్తం 14 అవార్డులను గెలుచుకున్న ఈ ఆల్బమ్ 2009వ సంవత్సరంలో బెస్ట్ రాక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఆల్బమ్ లో ది బెస్ట్ సాంగ్ గా నిలిచిన వివా లా విడా అటు US తో పాటు ఇటు UK లో కూడా నెంబర్ 1 సింగల్ గా నిలిచి కోల్డ్ ప్లే ఇంతముందు ఎప్పుడు చూడని ఒక అతి పెద్ద సక్సెస్ ను ఇచ్చింది. దింతో కోల్డ్ ప్లే 2000వ దశాబ్దంలో బెస్ట్ రాక్ బ్యాండ్ గా నిలిచి అప్పట్లో ఒక మ్యూజిక్ సునామినే క్రియేట్ చేసింది.

Coldplay Biography – Viva La Vida Album

5. Mylo Xyloto (2011)

ఇక ఆ తరవాత 2011వ సంవత్సరంలో రిలీజ్ చేసిన మైలో జైలటో ఆల్బమ్ మరో అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఆల్బమ్ ఫాస్టెస్ట్ సెల్లింగ్ డిజిటల్ ఆల్బమ్ గా గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. అలాగే 7 నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడంతో పాటు మరో 14 నేషనల్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. ముఖ్యంగా ఆ ఆల్బమ్ లో వచ్చిన పారడైస్ సాంగ్ మనసుకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇక 2013వ సంవత్సరంలో రిలీజ్ చేసిన ఘోస్ట్ స్టోరీస్ ఆల్బమ్ ఇంతకముందులా పెద్ద సక్సెస్ కాకపోయినా ఆ ఆల్బమ్ లో వచ్చిన A Sky Full of Stars అనే సాంగ్ ఇప్పటికి చాలా పాపులర్ సింగిల్.

Coldplay Biography – Mylo Xyloto Album

6. A Head Full of Dreams (2017)

ఏదిఏమైనా కోల్డ్ ప్లే మాత్రం తమ ఎక్సపెరిమెంట్స్ ఆపలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఆడియన్స్ ను రీచ్ అవ్వడం కోసం రీజినల్ స్టైల్లో కొత్త సాంగ్స్ క్రియేట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే 2017వ సంవత్సరంలో రిలీజ్ అయినా A Head Full of Dreams అనే ఆల్బమ్ ఒక రివొల్యూషన్ అయ్యింది. మరిముఖ్యంగా ఈ ఆల్బమ్ లో వచ్చిన Hymn for the Weekend అనే సాంగ్ మన ఇండియన్ ఆరిజిన్ తో రూపొందించారు. దింతో ఈ సాంగ్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ సాంగ్ తరువాత కోల్డ్ ప్లే తమ దగ్గర ఉన్న ప్రతి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పై హిందీ లో కోల్డ్ ప్లే అని ప్రింట్ చేయించుకుంది. అయితే ఈ ఆల్బమ్ తరువాత 2019 లో వచ్చిన Everyday Life ఆల్బమ్ దీనంత సక్సెస్ సాధించలేకపోయింది.

Coldplay Biography – A Head Full of Dreams Album

ఇక ప్రెసెంట్ 2021వ సంవత్సరంలో రిలీజ్ చేసిన మ్యూజిక్ ఆఫ్ ది Spheres ఆల్బమ్ ఎప్పటిలానే తమ ఆడియన్స్ ను ఉర్రుతలూగిస్తూ సక్సెస్ఫుల్ గా సెల్ అవుతుంది.

Also Read – 5 Habits Of Mentally Strong People (ఈ ఐదు అలవాట్లు ఉంటే మీకు బలమైన మానసిక శక్తి ఉందని అర్ధం)

Coldplay Biography – Collaboration With Other Top Singers & Bands

ప్యూర్ మ్యూజిక్ తో ఎప్పుడు కూడా రకరకాల ఎక్సపెరిమెంట్స్ చేసిన కోల్డ్ ప్లే తమ ఆడియన్స్ ఏ రోజు డిసప్పోయింట్ చెయ్యలేదు. ఆ బ్యాండ్ దగ్గరున్న బెస్ట్ థింగ్ వాళ్ళు ఎప్పుడు మ్యూజిక్ ను ఒక కాంపిటేషన్ లా తీసుకోలేదు. తమ కెరియర్ లో ఎంతోమంది టాప్ సింగర్స్ తో కోలబ్రెట్ అయ్యారు. చైన్ స్మోకర్స్ తో కలిసి సంథింగ్ జస్ట్ లైక్ థిస్, రిహాన్నా తో కలిసి ప్రిన్సెస్ ఆఫ్ చైనా, బిగ్ సీన్ తో కలిసి మిరకిల్స్ ఇలా చెప్పుకుంటే పోతే తోటి మ్యుజిషియన్స్ తో కలిసి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసారు. రీసెంట్ గా అయితే BTS తో కలిసి రూపొందించిన మై యూనివర్స్ అనే సాంగ్ ప్రెసెంట్ ట్రెండింగ్ సాంగ్స్ లో ఒకటి. అలాగే పాపులర్ ఫిమేల్ సింగర్ సెలీనా గోమెజ్ తో కోలబ్రెట్ అయ్యి తీసిన Let Somebody Go అనే సాంగ్ కూడా ప్రెసెంట్ చాలా ఫేమస్ అయ్యింది.

Coldplay Biography – Live With AR Rahman In India

ఇక లైవ్ లో చాలా సార్లు టాప్ సింగర్స్ తో కలిసి పెర్ఫర్మ్ చేసిన కోల్డ్ ప్లే ఒకసారి మన ఇండియా మ్యూజిక్ లెజెండ్ AR రెహ్మాన్ తో కూడా కలిసి లైవ్ లో పెర్ఫర్మ్ చేసారు. మరిముఖ్యంగా ఈ బ్యాండ్ లీడ్ క్రిస్ మార్టిన్ చూపించే పాజిటివ్ ఆటిట్యూడ్ చాలా మందికి ఇష్టం. ఈవెన్ తమ ఫ్యాన్స్ తో కూడా ఎప్పుడు క్లోజ్ ఉంటూ సోషల్ మీడియాలో అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మూడో బ్యాండ్ గా కొనసాగుతుంది. అలాగే ప్రతి మ్యుజిషియన్ ఒకసారి గెలిస్తే చాలు అనుకునే గ్రామీ అవార్డు ను కోల్డ్ ప్లే ఏకంగా 7 సార్లు గెలుచుకుంది. అండ్ ఈ అవార్డు కోసం 31 సార్లు నామినేట్ అయ్యారు.

Coldplay Biography – Top 3 Songs On YouTube

యూ ట్యూబ్ లో వీళ్ళ టాప్ సాంగ్స్ చూసుకుంటే చైన్ స్మోకర్స్ తో కలిసి తీసిన సంథింగ్ జస్ట్ లైక్ థిస్ సాంగ్ 2.1 బిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది.

ఇక ఆ తరువాత 1.7 బిలియన్ వ్యూస్ తో Hymn for the Weekend సాంగ్ రెండో ప్లేస్ లో ఉండగా,

1.6 బిలియన్ వ్యూస్ తో పారడైస్ సాంగ్ మూడో స్థానంలో నిలిచింది.

ఎనీవే లవ్ సాంగ్స్ మరియు మాస్ సాంగ్స్ బాగా విని బోర్ కొట్టిన వాళ్ళు ఈ కోల్డ్ ప్లే సాంగ్స్ వింటే ఖచ్చితంగా ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కంటే ఎక్కువ ఆల్బమ్ సేల్స్ తో బెస్ట్ బ్యాండ్ ఆఫ్ 21st సెంచరీగా పేరు సంపాదించిన కోల్డ్ ప్లే ఇన్స్పైరింగ్ బయోగ్రఫీ అయితే ఇది.