How To Become A Cricketer (క్రికెటర్ ఎలా అవ్వాలి) In Telugu

Basic Things You Need To Become A Cricketer (క్రికెటర్ ఎలా అవ్వాలి)

1. Know the Game

క్రికెటర్ అవ్వాలంటే మీరు ముందు ఆ ఆట గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రికెట్ లో వాడే టర్మ్స్ గురించి బాగా తెలుసుకోవాలి. బట్ ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. మీరు డైలీ గేమ్ ప్రాక్టీస్ చేస్తూనే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అండ్ అలాగే మీరు టీవిలో మ్యాచ్ చూస్తున్నప్పుడు కామెంటరీ గనుక సరిగ్గా వింటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈవెన్ ఈ మధ్య కాలంలో తెలుగు కామెంటరీ సరిగ్గా విన్న సరే చాలా వరకు నాలెడ్జ్ పెంచుకోవచ్చు. సో క్రికెట్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మీరు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండాలి. కలలో కూడా క్రికెట్ గురించి నాకు మొత్తం తెలుసు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదని మాత్రం ఫీల్ అవ్వొద్దు.

How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)

2. Passion Towards The Game

చాలా మంది తమకు క్రికెట్ పై ఇష్టాన్ని పాషేన్ అనుకుంటారు. బట్ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు క్రికెట్ ఇష్టం అయితే దాన్ని డైలీ చూస్తారు అండ్ ఆడతారు. అంటే మీ దినచర్యలో క్రికెట్ కూడా ఒక భాగంలా ఉంటుంది. బట్ పాషేన్ అంటే అలా ఉండదు క్రికెట్ ఒక్కటే మీ దినచర్యగా ఉంటుంది. ప్రతి నిమిషం కూడా గేమ్ గురించి ఆలోచిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రికెట్ మీద పాషేన్ ఉన్న వాళ్ళు దాన్ని వల్ల కలిగే లాభం గురించి ఆడరు. బ్రతకడానికి ఆక్సిజన్ ఎలాగో సేమ్ క్రికెట్ ను కూడా అలానే ఫీల్ అవుతారు.

సో డబ్బులు సంపాదించడం కోసం లేదా పేరు వస్తుందని చెప్పి అలాగే ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పి క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకోవద్దు. నాకు తెలిసి చాలా మంది క్రికెటర్ అయితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది మనకి ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పి క్రికెటర్ అవ్వాలనుకుంటారు. బట్ నిజం ఏంటంటే అలా అనుకునే వాళ్ళు ఎప్పటికి క్రికెటర్ కాలేరు. సో ఎదో నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని అని చెప్పి మీరు ఆట మీద అభిరుచి పెంచుకోవడం కన్నా మీ మనసుకి నచ్చినప్పుడు మాత్రమే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకోండి. సింపుల్ గా చెప్పాలంటే మీరు క్రికెట్ ఆడటం వల్ల గొప్పవాళ్ళు కావాలని గానీ గొప్పవాళ్ళు అవుతాం అని చెప్పి క్రికెట్ ను ఎంచుకోకూడదు.

Also Read – 10 Rare Funny Moments In Cricket (క్రికెట్ లో 10 అరుదైన సంఘటనలు)

3. Starting Age

క్రికెట్ ఆడటం ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి. ఈ డౌట్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. సో జనరల్ గా అయితే 8 సంవత్సరాల వయసు నుండే క్రికెట్ ఆడటం మొదలుపెడితే మీకు ప్లేయర్ అవకాశాలు చాలా ఎక్కువుగా ఉంటాయి. 6 సంవత్సరాలకే మొదలపెడితే ఇంకా మంచిది. బట్ ఇలా చెయ్యడానికి అందరికి పాసిబుల్ కాదు. ఎవరైతే తమ పిల్లలని చిన్న వయసు నుండే క్రికెటర్ ను చెయ్యాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇంత ఎర్లీగా స్టార్ట్ చెయ్యడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎక్సమ్పుల్ మీరే క్రికెటర్ కావాలనుకున్నారు బట్ కాలేకపోయారు బట్ మీ కొడుకుని క్రికెటర్ చేద్దాం అని బలంగా ఫిక్స్ అయ్యారు. థెన్ మీరేంచేస్తారు ఆటోమేటిక్ గా చిన్న వయసు నుండే మీ అబ్బాయి లేదా అమ్మాయికి క్రికెట్ మీద ఆసక్తి పెరిగేలా చేస్తారు.

How To Become A Professional Cricketer 1
How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)

ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటిది పాసిబుల్ కాకపోతే మినిమం 12 సంత్సరాల వయసు నుండి అయినా సరే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ ఏజ్ లో మీకు పెద్దగా రెస్పాన్సబిలిటీస్ ఉండవు అలాగే డిస్ట్రక్షన్ కూడా ఉండవు. అదే ఏజ్ పెరిగాక క్రికెట్ ఆడటం మొదలుపెడితే డిస్ట్రక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలేజ్ డేస్ నుండి క్రికెట్ ఆడటం మొదలుపెట్టి క్రికెటర్ అవుతాని 99% ఫెయిల్ అవుతారు. సో వీలైనంత తొందరగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టి 15 ఏళ్ళు వచ్చేసరికి ప్రొఫెషనల్ క్రికెట్ నేర్చుకోవాలి.

4. Fitness

క్రికెట్ ఆడాలంటే ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉండాలి. అలా ఉండాలంటే మీరు చిన్న వయసు నుండే ఒక అథ్లెట్ లా తయారవ్వాలి. అంటే ప్రతి రోజు రన్నింగ్ మరియు ఎక్సర్సైజ్స్ చెయ్యాలి. మంచి ఆహారం తినాలి. స్టామినా పెంచుకోవాలి. మెయిన్లి మీ లైఫ్ స్టయిల్ ఒక క్రమపద్ధతిలో ఉండాలి. సో జిమ్ కు వెళ్లి కండలు పెంచలేకపోయిన ఒక అథ్లెట్ లా ఉండగలిగితే మీకు క్రికెటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గాయిస్ క్రికెటర్ అవ్వాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నింటిని ఫాలో అవ్వాలి. ఇక ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం.

Process To Become A Cricketer

1. Join In A Cricket Academy

టూ బీ ఫ్రాంక్ గల్లీ క్రికెట్ ఆడుతూ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియాలో మాములు కాంపిటీషన్ లేదు. ఒక చిన్న టెక్నికల్ లోపం ఉన్న సరే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. సో మీరు టెక్నికల్ గా మంచి ప్లేయర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారాలి. అండ్ అలా మారాలంటే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి.

అయితే ఏ ఏజ్ లో క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితే బెస్ట్. ఐడీఎల్ గా అయితే 12 నుండి 15 సంత్సరాల వయసు ఉన్నప్పుడు క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. అంటే మీరు హై స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితే మంచిది. ఇంకా లేట్ గా కూడా జాయిన్ అవ్వొచ్చు బట్ మీరు ఎక్కువ జూనియర్ క్రికెట్ ఆడలేరు. అండ్ అలా ఆడకపోతే మీరు మీ స్టేట్ టీంలోకి సెలెక్ట్ అవ్వడం చాలా కష్టమయిపోతుంది.

How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)
How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)

2. Choose A Good Academy & Coach

మీరు ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యే బాగా రీసెర్చ్ చెయ్యాలి. ఏ అకాడమీలో జాయిన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుందో మీకు మీరుగానే తెలుసుకుని అలాంటి అకాడమీలో జాయిన్ అవ్వాలి. మరి ముఖ్యంగా మన AP మరియు తెలంగాణ నుండి ఇండియాకు సెలెక్ట్ అయినా తెలుగు క్రికెటర్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు వాళ్ళ కోచ్ ఎవరు వాళ్ళు క్రికెటర్ అవ్వడం కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారు ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలి. అయితే సిటీల్లో ఉండేవాళ్ళకు ఇది కొంతవరకు ఈజీ గానే ఉన్న పల్లెటూరు నుండి క్రికెటర్ అవ్వాలనుకునేవాళ్లకి ఇది చాలా కష్టమైన విషయం.

సో అలాంటి టైములో హాస్టల్ ఫెసిలిటీ ఉన్న క్రికెట్ లో అకాడమీలో జాయిన్ అవ్వడం లేదా ఒక మంచి క్రికెట్ అకాడమీకు దగ్గరగా ఉన్న స్కూల్లోనో జాయిన్ అవ్వడం చేస్తే ప్రతి రోజు అకాడమీకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ చివరిగా ఒక క్రికెట్ అకాడమీలో మంత్లీ ఫీజు వచ్చేసి మినిమం 3 వేల నుండి మాక్సిమమ్ 20 వేల మధ్యలో ఉంటుంది అకాడమీ యొక్క ఫెసిలిటీస్ బట్టి. 3 వేల కన్నా తక్కువ ఫీజు తీసుకునే అకాడమీలు కూడా ఉంటాయి బట్ అంత క్వాలిటీ ట్రైనింగ్ ఉండదు. అలాగే నెలకి 20 వేలు కంటే ఎక్కువ ఫీజు తీసుకునే అకాడమీలు కూడా ఉంటాయి మంచి హై రేంజ్ ఫెసిలిటీస్ తో. సో మీ బడ్జెట్ కు తగట్టు ఒక మంచి అకాడమీను చూస్ చేసుకోండి.

Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)

3. Play Local Tournaments & Club Cricket

క్రికెట్ అకాడమీలో జాయిన్ అయినా తరువాత మీరు మెల్లగా స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెడతారు. అయితే మీరు నేర్చుకున్న స్కిల్స్ బాగా రాటుదేలాలంటే ఎక్కువ టోర్నమెంట్స్ ఆడాలి. మీ స్కూల్ లేదా కాలేజ్ టీం తరుపున పెద్ద టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చెయ్యడం లేదా మీరు జాయిన్ అయినా అకాడమీకు ఒక క్లబ్ టీం ఉంటుంది. సో ఆ టీం తరుపునైనా సరే మీరు ఫ్రీక్వెన్ట్ గా టోర్నమెంట్స్ ఆడుతూ ఉండాలి.

అండ్ అల్సొ మీరు గేమ్ ఆడినప్పుడు లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ప్లేయింగ్ స్టైల్ ను మోనిటర్ చెయ్యడం కోసం ఎక్కువగా వీడియోలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే బౌలింగ్ యాక్షన్ లో ఉన్న తప్పులను గానీ లేదా మీ బ్యాటింగ్ టెక్నీక్ లో ఉన్న తప్పులు గానీ తెలుస్తాయి. ఇంఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ప్లేయర్స్ యొక్క వీడియోస్ చూసే వాళ్ళ వీక్నెస్ ను అపొనెంట్ టీమ్స్ కనిపెడుతూ ఉంటాయి. సో మీ కోచ్ చెప్పే దానితో పాటు మీరు కూడా సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ సెల్ఫ్ మోనిటరింగ్ తో మీ స్కిల్స్ ను మీరే ఇంకా టాప్ లెవెల్ కు తీసుకెళ్లాలి. అలాగే సెలక్షన్ విషయంలో కూడా మీ కోచ్ ఏం చెయ్యలేరు. ఓన్లీ గేమ్ నేర్పడం వరకే ఆయన పని.

Dempo Cricket Club Wins 03
How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)

4. District Level Cricket

మీరు మీ స్కూల్ లేదా కాలేజ్ అండ్ లోకల్ టోర్నమెంట్స్ లో బాగా పెర్ఫర్మ్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మిమ్మల్ని సెలక్షన్ ట్రైల్స్ కు పిలుస్తుంది. అండ్ ఆ ట్రైల్స్ లో కూడా మీరు బాగా పెర్ఫర్మ్ చేస్తే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ టీంలోకి సెలెక్ట్ చేస్తారు. ఒక్కోసారి అయితే మీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కు సంబంధించిన సెలక్షన్ కమిటీ మీ పెర్ఫార్మన్స్ టాప్ నాచ్ లో ఉన్నప్పుడు నేరుగా టీంలోకి తీసుకుంటారు. అండ్ థెన్ మీరు జిల్లా స్థాయిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడటం మొదలుపెడతారు. సో మీరు గనుక మీ డిస్ట్రిక్ లెవెల్ టీంలోకి వెళ్లి ఇలా టోర్నమెంట్స్ ఆడటం మొదలపెడితే మీకు క్రికెటర్ అయ్యే అవకాశలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. మరిముఖ్యంగా ఐపీఎల్ టీమ్స్ ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ లోనే స్కౌటింగ్ నిర్వహించి మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ను తమ ఫ్రాంచైజ్ తరుపున గ్రూమ్ చేస్తారు.

అలాగే మీ సొంత రాష్ట్రం నిర్వహించే టీ20 లీగ్స్ లో అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఇలా మీ ఓన్ స్టేట్ లీగ్ లో ఆడేందుకు ఆయా ఫ్రాంచైజీలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఈవెన్ MS ధోని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ఏ ఒక ఆటగాడి జీవితంలో ముఖ్యమైన పార్ట్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో డిస్ట్రిక్ట్ లో లెవెల్లో ఎంత బాగా పెర్ఫర్మ్ చేస్తే అంత తొందరగా పై స్థాయికి వెళ్తారు. అయితే ఈ జిల్లా స్థాయి క్రికెట్ లో అండర్ 13, అండర్ 15 మరియు అండర్ 19 వాళ్ళకే ఎక్కువ ప్రిఫెరెన్స్ ఇస్తారు. 19 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెట్ లోకి సెలెక్ట్ అవ్వడం చాలా కష్టమైన పని.

5. State Level Cricket

మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన వాళ్ళని స్టేట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ నేరుగా స్టేట్ టీంలోకి సెలెక్ట్ చేస్తుంది. అలాగే ఒక్కోసారి ఓపెన్ గా సెలక్షన్ ట్రైల్స్ కూడా పెడతారు. సో ఆ ట్రైల్స్ లో గనుక మీరు పాస్ అయ్యారంటే మీ స్టేట్ అసోసియేషన్ లో ఒక మెంబెర్ అయిపోతారు. ఇక ఆ తరువాత మీరు రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్ 19 మరియు అండర్ 23 టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే కొన్ని డివిజనల్ టోర్నమెంట్స్ లో కూడా మిమ్మల్ని ఆడిస్తారు. అండ్ స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసాక మీకు మంచి డీసెంట్ ఇన్కమ్ కూడా వస్తుంది.

ఒకవేళ మీరు 17 లేదా 18 ఏళ్ల లోపే స్టేట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయితే మీక అండర్ 19 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్టేట్  బేసిక్ లెవల్లో మీరు బాగా పెర్ఫర్మ్ చేస్తే మీ స్టేట్ టీం తరుపున ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ A క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ చేస్తారు. అంటే రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ ఇలా చాలా ఫేమస్ టోర్నమెంట్స్ లో మీరు పార్టిసిపేట్ చెయ్యవచ్చు. అండ్ మీరు గనుక మీ స్టేట్ టీం తరుపున ఇలా నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడటం మొదలుపెడితే మీ పేరు ప్రొఫెషనల్ క్రికెటర్స్ లిస్ట్ లోకి చేరిపోతుంది. అలాగే మీకంటూ వికీపీడియాలో ఒక పేజీ క్రియేట్ అవుతుంది.

Cricket tournament nss5
How To Become A Cricketer In Telugu (క్రికెటర్ ఎలా అవ్వాలి)

సో స్టేట్ ప్లేయర్ అయ్యే వరకు మీరు చాలా కష్టపడాలి. బట్ వన్స్ స్టేట్ ప్లేయర్ అయ్యాక మీ క్రికెట్ కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదు. ఈవెన్ మీరు డైరెక్ట్ గా ఐపీఎల్ ఆక్షన్ కోసం బీసీసీఐ కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఆక్షన్ లో ఏదైనా ఫ్రాంచైజ్ మిమ్మల్ని కొంటే మీకు ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుండి పై స్థాయికి వెళ్లలేకపోతే ఎలానూ స్టేట్ ప్లేయర్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి మీ సొంతంగానే ఒక క్రికెట్ అకాడమీను స్టార్ట్ చెయ్యవచ్చు.

6. International Cricket

మీ డ్రీం యొక్క చివరి స్టెప్ ఇది. అయితే ఇండియా తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటం అంత సులువేమి కాదు. ఈవెన్ మీరు డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన గానీ నేరుగా టీమిండియాలోకి తీసుకోరు. ముందుగా ఇండియా A టీం తరుపున ఆడేందుకు సెలెక్ట్ చేస్తారు. అండ్ అక్కడ కూడా మీరు బాగా పెర్ఫర్మ్ చేయడంతో పాటు లక్ కూడా కలిసొస్తే అప్పుడు మీకు టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

సో డొమెస్టిక్ క్రికెట్ నుండి టీమిండియాలోకి రావడం చాలా కష్టం. బట్ మీకు స్పెషల్ టాలెంట్ ఉంటే ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి రావొచ్చు. అంటే బుమ్రా లా స్పెషల్ బౌలింగ్ యాక్షన్, ఉమ్రాన్ మాలిక్ లా హై స్పీడ్ బౌలింగ్ ఇలా మీకంటూ ఎవరికీ లేని ఒక స్పెషల్ టేలెంట్ ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి రావొచ్చు. సో గాయిస్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఎంత పూర్ బాక్క్గ్రౌండ్ అయినా సరే క్రికెటర్ అవ్వొచ్చు. ఇంఫాక్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ లో 50 పెర్సెంట్ పూర్ బాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లే. అందుకే ప్రతి క్రికెటర్ స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది.

Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)