కబడ్డీలో 5 తెలివైన రైడింగ్ టెక్నిక్స్ – కబడ్డీలో చాలా మందికి ఇష్టమైన అంశం రైడింగ్. అంటే కూతకు వెళ్లడం. ఒక ఆటగాడు కూతకు వెళ్లి పాయింట్లు తీసుకొస్తే మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులకు కూడా వేరే లెవల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే క్రికెట్ లో బ్యాటింగ్ ఎలానో కబడ్డీలో రైడింగ్ అలా. అయితే ఊరికే రైడింగ్ వెళ్లి పాయింట్స్ తెచ్చేద్దాం అంటే కుదరని పని. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో ఉన్న ఢిఫెండర్లు చాలా సులువుగా రైడర్ ను ఒడిసిపడతారు.
కాబట్టి కూతకు వెళ్లే రైడర్ కు కొన్ని టెక్నిక్స్ అవసరం. ఢిఫెండర్లును బోల్తా కొట్టించి మిడ్ లైన్ మీదకి రావాలి. అయితే రైడింగ్ లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. కానీ వాటి నుండి నేను ఇప్పుడు చెప్పబోయే ఐదు టెక్నిక్స్ చాలా ప్రత్యేకమైనవి. వీటిలో మీరు ఏ రెండు టెక్నిక్స్ ను అయినా సరే బాగా నేర్చుకుంటే మీరు రైడింగ్ లో తోపైపోతారు. ఇక లేట్ చెయ్యకుండా కబడ్డీలో 5 తెలివైన రైడింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం.
5. Toe Touch (టో టచ్)
ఒక రైడర్ డిఫెండర్ ను టచ్ చేయడం కోసం తన కాలును ఉపయోగిస్తే దాన్ని టో టచ్ అంటారు. నార్మల్ గా రైడింగ్ చేస్తున్నప్పుడు ఢిఫెండర్స్ ను ఆశ్చర్యపరిచేందుకు ఎక్కువగా వాడే మూవ్ ఇది. అలాగే 6 లేదా అంతకంటే ఎక్కువ మంది ఢిఫెండర్లు మ్యాట్ మీద ఉన్నప్పుడు బోనస్ పాయింట్ సాధించడం కోసం ఈ టో టచ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇక ఈ మూవ్ అమలు చెయ్యాలంటే రైడర్ యొక్క లెగ్స్ లో చాలా బలం ఉండాలి. అలాగే బాలన్స్ అనేది కూడా సరిగ్గా మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే మాత్రమే ఈ మూవ్ ద్వారా పాయింట్ సాధించవచ్చు. ఇక ఈ టో టచ్ ను అమలుపరచడంలో బోనస్ కా బాద్షా ఫార్మర్ యూ ముంబా కెప్టెన్ అనూప్ కుమార్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు.
4. Running Hand Touch (రన్నింగ్ హ్యాండ్ టచ్)
ఒక రైడర్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక కార్నర్ నుండి మరో కార్నర్ కు రన్ చేస్తూ డిఫెండర్ ను హ్యాండ్ తో టచ్ చేస్తే దాన్ని రన్నింగ్ హ్యాండ్ టచ్ అంటారు. ఈ మూవ్ అయితే దాదాపు ప్రతి రైడర్ వాడతాడు. ఎందుకంటే రైడింగ్ చేసేవాళ్లకి ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్ అనేది ఒక బేసిక్ మూవ్ లాంటిది.
Also Read – 10 Rare Funny Moments In Cricket (క్రికెట్ లో 10 అరుదైన సంఘటనలు)
ఎవరికైతే ఎక్కువ స్పీడ్ తో పాటు తమ ఫుట్ వర్క్ పై సరైన కంట్రోల్ ఉంటుందో వాళ్ళు ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్ ను బాగా అమలు చేయగలరు. ఉదాహరణకు ప్రో కబడ్డీ పోస్టర్ బాయ్ రాహుల్ చౌదరిను చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా రెండు కార్నర్స్ కు మూవ్ అయ్యే రాహుల్ ఈ రన్నింగ్ హ్యాండ్ టచ్ లో మాస్టరీ చేసాడు. తన కెరియర్ లో దాదాపు 70 శాతం వరకు పాయింట్లను ఈ ఒక్క మూవ్ తోనే సాధించాడు.
3. Scorpion Kick (స్కార్పియన్ కిక్)
ఒక డిఫెండర్ టో టచ్ ఎక్సపెక్ట్ చేస్తున్నప్పుడు రైడర్ వెనక్కి తిరిగి తన కాలును స్కార్పియన్ స్టింగ్ ట్రాజెక్టరీలో మూవ్ చేస్తూ డిఫెండర్ ను టచ్ చేస్తే దాన్ని స్కార్పియన్ కిక్ అంటారు. ఈ మూవ్ అమలు చేయడం చాలా కష్టం. చాలా తక్కువ మంది రైడర్లు మాత్రమే స్కార్పియన్ కిక్ ను వాడతారు.
ఎందుకంటే ఈ కిక్ ను వాడే రైడర్ కు లైట్నింగ్ స్పీడ్ తో పాటు తన బాడీ ను సింగిల్ లెగ్ పై బాలన్స్ చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. కుంచెం బాలన్స్ కోల్పోయిన ఢిఫెండర్లు ఈజీగా టాకిల్ చేస్తారు. ఇక స్కార్పియన్ కిక్ కు బెస్ట్ ఎక్సమ్పుల్ జస్వీర్ సింగ్ మరియు జాన్ కున్ లీ. ఈ ఇద్దరు రైడర్స్ అయితే ఢిఫెండర్స్ ను సర్ప్రైజ్ చేయడం కోసం ఈ మూవ్ ను ఉపయోగిస్తారు.
2. Frog Jump (ఫ్రాగ్ జంప్)
ఇప్పటివరకు చెప్పుకున్న మూవ్స్ అన్ని ఒక రైడర్ డిఫెండర్ పై ఎటాక్ చేసి పాయింట్స్ సాధించడం కోసం యూస్ చేస్తారు. కానీ ఈ ఫ్రాగ్ జంప్ మాత్రం ఢిఫెండర్లు రైడర్ పై ఎటాక్ చేసినప్పుడు, వాళ్ళ నుండి తప్పించుకుని పాయింట్స్ సాధించడం కోసం ఎక్కువగా యూస్ చేస్తారు.
Also Read – 42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)
ఇక ఫ్రాగ్ జంప్ అంటే దాని పేరులోనే ఉంది. ఒక రైడర్ ఢిఫెండర్స్ పై నుండి ఫ్రాగ్ ల జంప్ చేసి తప్పించుకుంటే దాన్ని ఫ్రాగ్ జంప్ అంటారు. ఈ మూవ్ వల్ల రైడర్ కు మల్టిపుల్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చైన్ ఢిఫెండర్స్ పై నుండి జంప్ చేసి తప్పించుకుంటే ఈజీగా రెండు పాయింట్స్ వస్తాయి. ప్రో కబడ్డీ హై ఫ్లయిర్ పవన్ కుమార్ శెరావత్ ఈ ఫ్రాగ్ జంప్ అమలు చేయడంలో మాస్టరీ చేసాడు. ఒకసారైతే ఏకంగా 5 అడుగుల ఎత్తు వరకు జంప్ చేసి కబడ్డీ ప్రపంచాన్ని షాక్ చేసాడు.
1. Dubki (దుబ్కి)
మనం పైన చెప్పుకున్న ఫ్రాగ్ జంప్ మూవ్ కు అపోజిట్ ఇది. ఢిఫెండర్స్ ఎవరైనా బ్లాక్ లేదా చైన్ టాకిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ కింద నుండి గుంజీలు తీసినట్టు బెండ్ అయి తప్పించుకుంటే దాన్ని దుబ్కి అంటారు. ఈ మూవ్ అమలు చేయడం చాలా కష్టం. రైడర్ యొక్క లెగ్స్ లో చాలా బలం ఉండాలి. అలాగే శరీరంలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అప్పుడే మాత్రమే దుబ్కిను సరిగ్గా అమలు చేయగలరు.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
ఇక ఫ్రాగ్ జంప్ లనే ఈ మూవ్ తో కూడా మల్టిపుల్ రైడ్ పాయింట్స్ సాధించవచ్చు. ముఖ్యంగా చైన్ టాకిల్ నుండి తప్పించుకోవడం కోసం ఇదొక బ్రహ్మాస్తరం అని చెప్పవచ్చు. ఇక ఈ దుబ్కి మూవ్ కు కింగ్ ఎవరో మన అందరికి బాగా తెలుసు. ప్రెసంట్ ప్రో కబడ్డీలో నెంబర్ 1 రైడర్ గా దూసుకుపోతున్న పర్దీప్ నర్వాల్ తన కెరియర్లో సగం కంటే ఎక్కువ పాయింట్లను ఈ ఒక్క మూవ్ తోనే సాధించాడు.