విరాట్ కోహ్లీ. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అతనిలో ఉండే అగ్రేషన్ చూస్తే ఎవరికైనా సరే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరి అలాంటి విరాట్ కోహ్లీ తన పై ఎవరైనా కౌంటర్ వేస్తే దానికి అతను తీర్చుకునే ప్రతీకారం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరిముఖ్యంగా ఎదుటివాళ్ళు తనని ఎలా కెలికారో అదే విధంగా ఎదుటవాళ్ళని డిస్ట్రాయ్ చేస్తూ సరైన సమాధానం చెప్తాడు. ఆ రివెంజ్ లో ఉండే స్వేగ్ అయితే మాములుగా ఉండదు. కాగా విరాట్ కోహ్లీ తన కెరియర్లో చాలా ప్లేయర్స్ పై రివెంజ్ తీర్చుకున్నాడు. వాటి నుండి విరాట్ కోహ్లీ టాప్ 5 రివెంజ్ మూమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ టాప్ 5 రివెంజ్ మూమెంట్స్
5. Virat Kohli Gives Silent Send-off to Ben Stokes
అది 2016వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ. మొహాలీ వేదికగా మన టీమిండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీం 283 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిప్లై లో మనవాళ్ళు 73 పరుగులకే రెండు వికెట్లు కోల్పయి కుంచెం తడబడుతున్నారు. సరిగ్గా ఈ టైంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి ఒక అదిరిపోయే హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే అంత బాగానే ఉందనుకునేసరికి 62 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఔటైపోయాడు. థర్డ్ మెన్ వైపు గ్లైడ్ చేద్దాం అనుకున్న బాల్ బ్యాట్ ఎడ్జ్ కు తగిలి కీపర్ చేతిలో పడింది. అయితే వికెట్ పడిన ఆనందంలో స్టోక్స్ కుంచెం అతిగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. తన చేత్తో నోటిని మూసుకుని బాట్స్మన్ ను హేళన చేసే విధంగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నాడు. కానీ న్యూటన్ థర్డ్ అప్లై చెయ్యడానికి కోహ్లీ మరీ ఎక్కువ టైం తీసుకోలేదు.
Also Read – Top 5 MS Dhoni Wicket Keeping Moments (5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు)
ఆ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసిన స్టోక్స్ అశ్విన్ బౌలింగ్ లో LBW గా అవుటయ్యాడు. బట్ అంపైర్ అది అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ తీసుకున్న విరాట్ బెన్ స్టోక్స్ కు ఒక అదిరిపోయే సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తన హ్యాండ్ ఫింగర్స్ ను నోటిపై వేసుకుని చూపిస్తూ స్టోక్స్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. కాగా ఇప్పటికి ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య కొన్ని హీట్ మూమెంట్స్ చూస్తూ ఉంటాం. ఏదిఏమైనా వరల్డ్ నెంబర్ 1 ఆల్ రౌండర్ అయినా సరే విరాట్ కోహ్లీను కెలికే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బెటర్ అని ఈ రివెంజ్ ప్రూవ్ చేసింది.
4. Virat Kohli Gives Aussies A Taste Of Their Own Medicine
మన విరాట్ ను మాములుగా కెలికేతేనే చాలా ప్రమాదం. అలాంటిది 2017వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీను ఎగతాళి చేసారు. మనోడు ఊరుకుంటాడా ఆ సంఘటన జరిగిన రెండు రోజులకే ఆస్ట్రేలియా ఆటగాళ్ల పై రివెంజ్ తీర్చుకున్నాడు.
ఆ ఏడాది రాంచీ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే వాళ్ళ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దూకుడుగా ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ ఒక బౌండరీను ఆపే క్రమంలో డైవ్ కొట్టాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ విరాట్ కోహ్లీ తన షోల్డర్ పై ల్యాండ్ అవ్వడంతో అతనికి ఇంజురీ అయ్యింది. ఇక్కడ వరకు బాగానే ఉంది.
కానీ ఆ తరువాత ఆస్ట్రేలియా వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు విరాట్ గాయాన్ని ఎగతాళి చేస్తూ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అతన్ని రెచ్చగొట్టారు. ముఖ్యంగా గ్లెన్ మాక్స్వెల్ మరియు స్టీవ్ స్మిత్ విరాట్ గాయాన్ని మోక్ చేస్తూ షోల్డర్ పట్టుకున్నారు. పాపం వీళ్ళకి న్యూటన్ థర్డ్ లా గురించి సరిగ్గా తెలియదనుకుంటా అనవసరంగా విరాట్ కోహ్లీతో పెట్టుకున్నారు.
ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన మోకింగ్ ను మైండ్ లో పెట్టుకున్న విరాట్ కోహ్లీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఒక దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. జడేజా బౌలింగ్ లో ఆస్ట్రేలియా మొదటి వికెట్ పడగానే రివెంజ్ మోడ్ లోకి మారిన విరాట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ను ఒక బాస్ ల ట్రోల్ చేసాడు. తన షోల్డర్ ను పట్టుకుని అగ్రేషన్ తో ఊగిపోయిన కోహ్లీ ఆస్ట్రేలియా వాళ్ళు నీతో ఎందుకు పెట్టుకున్నాం రా బాబు అనే రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. నిజంగా ఇదొక క్లాసిక్ రివెంజ్ అని చెప్పాలి. అయినా ఇంజూర్ అయ్యి బాధపడుతున్నప్లేయర్ ను మోక్ చేసారంటే ఆస్ట్రేలియా వాళ్ళకి కోహ్లీ నే సరైన మొగుడు.
3. Virat Kohli Bat Drop Revenge on Joe Root
2018వ సంవత్సరంలో మన టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళింది. ఈ టూర్ లో భాగంగా జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఇండియా మొదటి ఒన్డే మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ ను ఒక హై నోట్ లో స్టార్ట్ చేసింది. బట్ రెండో వన్డేలో సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ స్టార్ బాట్స్మన్ జో రూట్ తన టీంను ఒంటిచేత్తో గెలిపించాడు. అలాగే డిసైడర్ గా మారిన మూడో వన్డేలో కూడా తన బ్యాటింగ్ జోరు కొనసాగించిన రూట్ చివర్లో బౌండరీ కొట్టి తన టీంను గెలిపించడమే కాకుండా వరుసగా రెండో సెంచరీ కొట్టాడు.
అయితే సిరీస్ గెలిచిన ఆనందంలో కుంచెం వెరైటీ గా సెలెబ్రేట్ చేసుకున్న రూట్ తన చేతిలో ఉన్న బ్యాట్ ను పై నుండి డ్రాప్ చేసాడు. కాగా ఇది చూసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఆండ్రూ ఫ్లింటాఫ్ షర్ట్ తీసి సెలెబ్రేట్ చేసుకున్న పిక్ ను ట్విట్టర్ లో పెట్టాడు. బహుశ ఇక్కడ బ్రాడ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత దాదా తీర్చుకున్న రివెంజ్ మర్చిపోయి ఉంటాడు. అయితే దాదా ఈ రివెంజ్ తీర్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు గాని కోహ్లీ మాత్రం ఆ ఒన్డే తరువాత జరిగిన టెస్ట్ మ్యాచులోనే రూట్ కు తన ఓన్ టేస్ట్ చూపించాడు. ఎడ్జిబస్టన్ వేదికగా జరిగిన ఆ టెస్ట్ మ్యాచులో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది.
Also Read – Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)
మంచి ఫామ్ లో ఉన్న రూట్ ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 80 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకు దగ్గరవుతున్న టైంలో లేని పరుగు కోసం ప్రయత్నించిన రూట్ విరాట్ కోహ్లీ వేసిన బుల్లెట్ లాంటి త్రో కు డైరెక్ట్ హిట్ గా రనౌట్ అయ్యాడు. దింతో విరాట్ తనదైన స్టయిల్లో రూట్ కు సెండ్ ఆఫ్ ఇచ్చి రివెంజ్ తీర్చుకున్నాడు. ముందు నోటి పై వేలువేసుకుని సైలెన్స్ ప్లీజ్ అన్న విరాట్ ఆ తరువాత మాత్రం ఒక ఇమాజినరీ బ్యాట్ ను తన చేతి నుండి డ్రాప్ చేస్తున్నట్టు రూట్ కు మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు. చివరికి వరల్డ్ లో వన్ అఫ్ ది బెస్ట్ బాట్స్మన్ అయినా సరే విరాట్ దగ్గర కుప్పిగంతులు వేసే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాలి.
2. Virat Kohli Mass Revenge On Mitchel Johnson
ఆస్ట్రేలియా వాళ్ళ స్లెడ్జింగ్ గురించి చెప్పాలంటే ఒక బుక్ రాయవచ్చు. అలాంటి స్లెడ్జింగ్ హీరోస్ కు మన విరాట్ కోహ్లీ చాలా సార్లు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్లైస్ మనం 2014 లో చూసాం. ఆ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో మన టీమిండియా మొదటి రెండు టెస్ట్ మ్యాచుల్లో ఓడిపోయింది. అలాగే మూడో టెస్టులో కూడా తమ ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా టీం మొదటి ఇన్నింగ్స్ లో 530 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో మనవాళ్ళు 108 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయారు. సరిగ్గా ఈ టైంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కు, జాన్సన్ ఒక బౌన్సర్ తో వెల్కమ్ చెప్పాడు. దింతో అక్కడ నుండి మొదలైన హీట్ వీళ్లిద్దరి మధ్య ఒక వార్ ల తయారయ్యింది. ఇక ఆ తరువాత రహానేతో జతకట్టిన విరాట్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కుంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తరువాత విరాట్ 84 పరుగుల వద్ద ఉన్నపుడు కుంచెం డౌన్ ది ట్రక్ వచ్చి జాన్సన్ వేసిన బాల్ ను డిఫెండ్ చేసాడు. కానీ ఫాలో త్రూలో దాన్ని అందుకున్న జాన్సన్ వికెట్ పడట్లేదు అనే నిరాశలో తాను పట్టుకున్న బాల్ ను కోహ్లీ పైకి విసిరేసాడు.
అయితే ఆ బాల్ కాస్తా విరాట్ బాడీకు బలంగా తగిలి అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. దింతో కుంచెం కోపం తెచ్చుకున్న విరాట్ జాన్సన్ కు న్యూటన్ థర్డ్ లా ఎలా ఉంటుందో లైవ్ లో రుచి చూపించాడు. ఆ నెక్స్ట్ బాల్ కె బౌండరీ కొట్టి జాన్సన్ కు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. ఇది కాస్త వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్దానికి దారితీసింది. దింతో విరాట్ ఆ తరువాత జాన్సన్ ఎప్పుడు బౌలింగ్ కు వచ్చిన అతని బౌలింగ్ లో బౌండరీలు కొడుతూ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో 150 రన్స్ చేసిన తరువాత జాన్సన్ బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ పై నుండి 4 కొట్టిన విరాట్ అతనికి గాల్లోనే ముద్దులు పెడుతూ తన బలం ఏంటో చూపించాడు. కాగా ఈ ఇన్నింగ్స్ లో 169 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో ఆస్ట్రేలియా టీం విజయం సాధించకుండా అడ్డుపడ్డాడు.
1. The Note Book Revenge
ఇది క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రివెంజ్స్. నిజానికి ఇప్పటివరకు చెప్పుకున్న ఏ రివెంజ్ లో కూడా చూపించినంత స్వేగ్ & ఆటిట్యూడ్ విరాట్ కోహ్లీ ఈ రివెంజ్ లో చూపించాడు. ఇక ఈ ఎపిక్ రివెంజ్ స్టోరీలోకి వెళ్తే 2017వ సంవత్సరంలో మన టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళింది. ఆ టూర్ లో ఆడిన ఒక టీ20 మ్యాచులో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కెసిరిక్ విలియమ్స్ విరాట్ కోహ్లీను అవుట్ చేసాడు. అయితే వికెట్ తీసాక తన మార్క్ నోట్ బుక్ సెలెబ్రేషన్స్ తో విరాట్ కోహ్లీ పేరు ను ఇమాజినరీ నోట్ బుక్ లో రాసుకుని టిక్ చేసున్నాడు.
అయితే అప్పుడు సైలెంట్ గా పెవిలియన్ కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ రెండేళ్ల తర్వాత మాత్రం ఒక అదిరిపోయే రివెంజ్ తీర్చుకున్నాడు. 2019 సంవత్సరంలో వెస్టిండీస్ ఇండియా టూర్ కు వచ్చింది. హైదరాబాద్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్. కోహ్లీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడే విలియమ్స్ ఒక ఝలక్ ఇచ్చాడు. లాస్ట్ టైం నీకు నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చా, కానీ ఈ సారీ కథ వేరేలా ఉంటుంది అని తనదైన స్టయిల్లో బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేసాడు.
అలాగే తను చెప్పినట్టే విలియమ్స్ బౌలింగ్ ను ఒక ఆటాడుకున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే విలియమ్స్ బౌలింగ్ లో ఒక అద్భుతమైన ఫ్లిక్ షార్ట్ కొట్టిన విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ పై నుండి ఒక కళ్లుచెదిరే సిక్సర్ సాధించాడు. అయితే ఈ సిక్స్ కొట్టాక అసలు రివెంజ్ అంటే ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీ విలియమ్స్ కు రుచి చూపించాడు. తన బ్యాట్ ను పక్కనపెట్టి మరి అచ్చం విలియమ్స్ లాగానే నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. నిజంగా మీరు ఇది గనుక లైవ్ లో చూసుంటే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాగా విరాట్ కోహ్లీ రీవెంజ్ చూసి షాక్ తిన్న విలియమ్స్ ఆ తరువాత ఇండియాతో జరిగిన ఏ మ్యాచులో కూడా వికెట్ తీసిన గానీ నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకోలేదు. సో నెవెర్ మెస్ విత్ కింగ్ విరాట్ కోహ్లీ.
Also Read – Watch 10 Rare Funny Moments In Cricket