Top 5 MS Dhoni Wicket Keeping Moments (5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు)

5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు – మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ చూడని వాళ్ళకి కూడా ధోని ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. అదే క్రికెట్ చూసే వాళ్లకైతే ఒక ఆరాధ్య దైవం. అయితే ధోని తన బ్యాట్ తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిన లేదా తన పదునైన కెప్టెన్సీ తో ఎన్ని కప్ లు గెలిచిన అతనికి వికెట్ కీపింగ్ కు మాత్రం ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు
5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు

ఎందుకంటే అతను వికెట్ల వెనుకాల కీపింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది బాట్స్మన్ బౌలర్ వేసే మిస్టరీ బాల్స్ కంటే, అమ్మో ధోని నా వెనుక కీపింగ్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలని భయపడుతూ బ్యాటింగ్ చేసేవారు. మరి అలాంటి ధోని వికెట్ల వెనుక ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల అద్భుతాలు చేసి చూపించాడు. వాటి నుండి అయితే మనం మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుకాల క్రియేట్ చేసిన 5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు

5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు
5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు – IND vs BAN

Also Read – About Ashes Series In Telugu (యాషెస్ సిరీస్ చరిత్ర)

5. Dhoni Ross Taylor Run Out

ధోని రనౌట్స్ గురించి మాట్లాడుకోవాలనుంటే ముందుగా మనం ఈ రనౌట్ నుండే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2009వ సంవత్సరంలో న్యూజీలాండ్ తో జరిగిన 3వ ఒన్డే మ్యాచులో ధోని చేసిన ఈ రనౌట్ ఒక బాట్స్మన్ ను ఇలా కూడా అవుట్ చెయ్యొచ్చా అని అబ్బురపడేలా చేసింది.

ఈ మ్యాచులో మన టీమిండియా సెట్ చేసిన 393 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో న్యూజీలాండ్ టీం చాలా వేగంగా బ్యాటింగ్ చేస్తుంది. సరిగ్గా ఈ టైంలోనే హర్భజన్ సింగ్ బౌలింగ్ లో రాస్ టేలర్ ఫైన్ లెగ్ వైపు షాట్ ఆడాడు. కానీ ఆ బాల్ ప్యాడ్స్ కు తగలడంతో మన వాళ్ళు గట్టిగా LBW అప్పీల్ చేసారు. ధోని అయితే మాములుగా అరవలేదు. దింతో కుంచెం కంఫ్యూజ్ అయినా రాస్ టేలర్ సింగల్ కోసం వెళ్ళాడు.

అయితే అప్పటివరకు అప్పీల్ చేసిన ధోని టేలర్ క్రీజ్ వదలగానే ఒక మైండ్ బ్లోయింగ్ రనౌట్ చేసాడు. యువరాజ్ వేసిన బుల్లెట్ లాంటి త్రోను వికెట్ల వైపు డిఫ్లేక్ట్ చేస్తూ టేలర్ ను రన్ అవుట్ చేసాడు. ఒకవేళ ధోని గనుక నార్మల్ గా బాల్ గెథెర్ చేసి ఈ రనౌట్ చేసి ఉంటె టేలర్ క్రీజ్ లోకి వచ్చేసేవాడు. కానీ ధోని ఆ ఫ్రేక్షన్ ఆఫ్ టైంను ఎలిమినేట్ చెయ్యడం కోసం జస్ట్ బాల్ డైరెక్షన్ ను మార్చి టేలర్ ను రనౌట్ చేసాడు.

4. 0.08 Seconds Stumping

నార్మల్ గా మన కళ్ళు బ్లింక్ చేసే రిఫ్లెక్షన్ టైం 0.1 సెకండ్స్. అంటే అది చాలా తక్కువ టైం. అలాంటిది ధోని ఒకసారి 0.08 సెకండ్స్ టైములో ఒక బాట్స్మన్ ను స్టంప్ అవుట్ చేసాడు. 2018వ సంవత్సరంలో వెస్టిండీస్ తో జరిగిన ఒక ఒన్డే మ్యాచులో జడేజా వేసిన బాల్ ను డిఫెండ్ చేయబోయి కీమో పాల్ క్రీజ్ బయటికి వచ్చాడు. బట్ ఆ బాల్ బ్యాట్ ను మిస్ అయ్యి ధోని చేతిలోకి వెళ్ళింది.

ఇక ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కలెక్ట్ చేసిన ధోని రెప్పపాటు టైములో కాదుకాదు అంతకన్నా తక్కువ టైంలోనే వికెట్లను గిరాటేసాడు. దింతో కీమో పాల్ అంపైర్ డెసిషన్ ఇచ్చే వరకు టైం వేస్ట్ చెయ్యడం ఎందుకన్నట్టు ధోని స్టంప్ చెయ్యగానే పెవిలియన్ కు నడవడం మొదలుపెట్టాడు. కాబట్టి ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున కూడా క్రీజ్ వదిలి బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చారంటే 3rd అంపైర్ డెసిషన్ వచ్చేవరకు వెయిట్ చెయ్యనవసరం లేదు. చంకలో బ్యాట్ పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోవడమే.

3. Dhoni Catch + Stumping

ధోని బ్రెయిన్ ఎంతో షార్ప్ అనేది చెప్పడానికి ఇదొక్క ఇన్సిడెంట్ చాలు. ఎందుకంటే 2009వ సంవత్సరంలో న్యూజీలాండ్ తో జరిగిన మొదటి ఒన్డే మ్యాచులో వికెట్ల వెనుక ధోని చూపించిన చురుకైన తెలివితేటలకు జాకబ్ ఓరమ్ మతి పోయింది. ఈ మ్యాచులో 3 బంతుల్లో 14 పరుగులు చెయ్యలిసిన టైములో యువరాజ్ సింగ్ వేసిన ఒక ఫుల్ లెంగ్త్ బాల్ ను జాకబ్ ఓరమ్ స్వీప్ చేసాడు. బట్ అది మిస్ టైం అయ్యి బాల్ గాల్లోకి లేచింది. కానీ అది బ్యాట్ కు తగిలిందో ప్యాడ్ కు తగిలిందో క్లారిటీ లేదు. అలాగే బాల్ కూడా బాట్స్మన్ తలపై నుండే గాల్లోకి లేచింది.

Also Read – What Is Match Fixing And Spot Fixing In Cricket (క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటి)

దింతో వికెట్ల ముందుకు వచ్చి దాన్ని క్యాచ్ అందుకున్న ధోని వెంటనే బెయిల్స్ ను కూడా గిరాటేసాడు. ఎందుకంటే ఒకవేళ అది క్యాచ్ కాకపోతే బాట్స్మన్ స్టంప్ అవుట్ అయినా అవుతాడని చెప్పి ధోని ఆ మూమెంట్ లో తెలివిగా ఆ పని చేసాడు. దింతో అది క్యాచ్ అవుట్ అయినా కాకపోయినా జాకబ్ ఓరమ్ పెవిలియన్ కు వెళ్లక తప్పదు. కాగా రిప్లై లో బాల్ క్లియర్ గా బ్యాట్ కు తగిలిందని తేలడంతో జాకబ్ ఓరమ్ ను క్యాచ్ అవుట్ గా ప్రకటించారు. ఎనీవే ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు బాట్స్మన్ కు ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టు ఓరమ్ బోథ్ క్యాచ్ అవుట్ అండ్ స్టంప్ అవుట్ అయ్యాడు.

2. Dhoni The Stumping Machine

మనం ఆల్రెడీ 4th పాయింట్ లో చెప్పుకున్నాం ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు క్రీజ్ వదిలి బయటకు వస్తే చంకలో బ్యాట్ పెట్టుకుని పెవిలియన్ కు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అని. అయితే బంగ్లాదేశ్ బాట్స్మన్ షబ్బీర్ రెహమాన్ క్రీజ్ బయటికి రాకపోయినా గానీ ధోని స్టంపింగ్ బాధితుల్లో ఒకడిగా నిలిచిపోయాడు. అదేంటి భయ్యా క్రీజ్ బయటకి రాకపోయినా స్టంప్ ఎలా అవుతాడు అని మీకొక డౌట్ రావచ్చు. అసలు ఏం జరిగింది.

బంగ్లాదేశ్ తో జరిగిన ఒక టీ20 మ్యాచులో సురేష్ రైనా లెగ్ సైడ్ వైపు బాల్ వేసాడు. సరే లూస్ బాల్ కదా బ్యాట్ అలా టచ్ చేస్తే ఫోర్ పోతుందని షబ్బీర్ రెహమాన్ ఆ వైడ్ బాల్ ను వేటాడి మరి లెగ్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేసాడు. అయితే మనోడికి ధోని గురించి తెలుసు కాబట్టి క్రీజ లోపలకన్నా నిలబడ్డాడు. బట్ ఆ షాట్ ఆడే క్రమంలో కుంచెం బాలన్స్ కోల్పోయి తన కాలును ఫ్రేక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక రెండు మిల్లీమీటర్లు పైకి లేపాడు. అది చాలు కదా మన స్టంపింగ్ మెషిన్ కి.

5 ధోని బెస్ట్ వికెట్ కీపింగ్ సంఘటనలు – Shabbir Rahman’s Stumping

వైడ్ గా వచ్చిన బాల్ ను కూడా క్లీన్ గా కలెక్ట్ చేసి షబ్బీర్ తన బాలన్స్ కోల్పోయిన ఆ ఫ్రేక్షన్ ఆఫ్ సెకండ్ లోనే అతన్ని స్టంప్ అవుట్ చేసాడు. ఇక రిప్లై లో తన అవుట్ ను కళ్లారా చూసిన షబ్బీర్ చేసేదేమి లేక తెల్ల మొహం పెట్టి పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. సో ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు క్రీజ్ బయటకి రాకుండా ఉండటమే కాదు. క్రీజ లో ఉన్న బాడీ పార్ట్స్ ను కూడా ఫెవికాల్ వేసి అతికించినట్టు గట్టిగా గ్రౌండ్ మీద పెట్టి ఉంచాలి. లేకపోతే ధోని అనే స్టంపింగ్ మెషిన్ కు మీరు బలవ్వడం ఖాయం.

1. Dhoni Run Out Ross Taylor 2.0

2009వ సంవత్సరంలో ధోని చేసిన రనౌట్ నుండి సరైన గుణపాఠం నేర్చుకొని రాస్ టేలర్ 2016వ సంవత్సరంలో మరోసారి ధోని చేతిలో బలైపోయాడు. ఆ ఏడాది జార్ఖండ్ వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన 4వ ఒన్డే మ్యాచ్ లో రాస్ టేలర్ మరోసారి ఫైన్ లెగ్ వైపు బలంగా బాల్ ను కొట్టి సెకండ్ రన్ తీసే ప్రయత్నం చేసాడు. ధోని కూడా వికెట్లకు కూడా కుంచెం దూరంగా ఉన్నాడు. అలాగే ఆ బాల్ అందుకున్న కులకర్ణి కూడా కుంచెం నెమ్మదిగా త్రో చేసాడు. దింతో సెకండ్ రన్ ఈజీగా వచ్చేస్తుందనుకున్న రాస్ టేలర్ ధోని ను లైట్ తీసుకుని డైవ్ కూడా చెయ్యలేదు.

Also Read – Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)

సరిగ్గా ఈ సమయంలోనే నెమ్మదిగా వచ్చిన బాల్ ను అందుకున్న ధోని వెనక్కి తిరిగి చూడకుండానే బలంగా దాన్ని వికెట్ల వైపు త్రో చేసి టేలర్ కు షాక్ ఇచ్చాడు. అసలు ఎవరు ఎక్సపెక్ట్ చెయ్యని విధంగా టేలర్ ను అవుట్ చేసిన ధోని క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ రనౌట్ చేసాడు. సో ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు సైలెంట్ గా సింగల్ తీసుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉంటే బెటర్. అలా కాదని అందరిలాంటి కీపర్ కదా అని రిస్క్ తీసుకుంటే చివరికి రస్కె మిగులుతుంది.

Also Read – Watch 10 Rare Funny Moments In Cricket