Umran Malik Biography In Telugu (ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ)

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – అది 2021వ సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ. అబూ దాబి వేదికగా SRH మరియు RCB జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో అప్పుడప్పుడే సన్ రైజర్స్ టీంలోకి వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు 9 ఓవర్ లో బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. మొదటి బాల్ గంటకి 147 కిలోమీటర్ల స్పీడ్ తో వేసాడు. రెండో బాల్ 150 కిలోమీటర్ల వేగం. మూడో బాల్ అయితే 152 kmph టచ్ చేసింది. దెబ్బకు అందరూ వావ్ అన్నారు. అయితే ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమే.

ఎందుకంటే ఆ ఓవర్లో నాలుగో బంతిని ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆ కుర్రాడు ఐపీఎల్ హిస్టరీలోనే ఆ ఘనత సాధించిన మొట్టమొదటి ఇండియన్ బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు. అంతేకాకుండా ఆ ఓవర్లో మిగతా బాల్స్ ను కూడా 150+ స్పీడ్ తో వేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగమైన ఓవర్ వేసిన ఆటగాడిగా ఒక అరుదైన ఘనత సాధించాడు. స్పిన్ బౌలర్స్ కు పుట్టినిల్లు అయినా మన ఇండియాలో ఒక పేస్ బౌలర్ నిలకడగా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ

కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి యుద్ధ భూమి నుండి వచ్చిన ఒక 21 ఏళ్ల కుర్రాడు మంచినీరు తాగినంత ఈజీగా ఆ పనిచేసాడు. అతనే ది పేస్ కింగ్ ఉమ్రాన్ మాలిక్. ఒక నెట్ బౌలర్ గా SRH టీంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రెసెంట్ ఐపీఎల్ ను షేక్ చేస్తున్న ఈ పేస్ సంచనలం భవిష్యత్తులో టీమిండియాకు ఒక డైమండ్ ప్లేయర్ గా మారతాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రోడ్ పై పండ్లు అమ్మే ఒక చిరు వ్యాపారి కొడుకు ఈ స్టేజ్ కు ఎలా వచ్చాడు. తన జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడు. అతని ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఏంటి? ఈ ఆర్టికల్లో ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ (బాల్యం)

ఉమ్రాన్ మాలిక్ 1999వ సంవత్సరం నవంబర్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని గుజ్జర్ నగర్ అనే ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు అబ్దుల్ రషీద్. ఈయన రోడ్ ప్రక్కన ఒక తోపుడు బండి పై ఫ్రూట్స్ అమ్మేవారు. తల్లి పేరు అబ్దుల్ ఖళీలా. ఈమె ఇంటివద్దే ఉంటూ కుటుంబాన్ని చూసుకునేది. ఉమ్రాన్ ఈ దంపతులకు జన్మించిన మూడవ సంతానం. అతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. కాగా ఉమ్రాన్ వాళ్ళ ఫ్యామిలీ కటిక పేదరికంలో ఉండేది. రెక్కాడితే తప్ప పూట గడవని పరిస్థితి.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – ఉమ్రాన్ మాలిక్ ఫ్యామిలీ

ఉమ్రాన్ తండ్రి ప్రతి రోజు ఫ్రూట్స్ అమ్మి తన కుటుంబానికి కావాల్సిన నిత్యవసర సరుకులు సమకూర్చేవారు. ఉమ్రాన్ ఉండేది జమ్మూ కాశ్మీర్ లో కాబట్టి అక్కడ రూల్స్ కుంచెం కట్టుదిట్టంగా ఉంటాయి. మిగతా స్టేట్స్ నుండి వచ్చినట్టు ఈ రాష్ట్రం నుండి ఎక్కువగా క్రికెటర్స్ బయటికి రారు. బట్ మాలిక్ మాత్రం చిన్న వయసు నుండే ఆట పై ఇష్టం పెంచుకున్నాడు. టెర్రర్ ఎటాక్ ఉన్న చోట చిన్న వయసు నుండే తన పదునైన పేస్ బౌలింగ్ తో బాట్స్మన్ కు టెర్రర్ చూపించేవాడు.

గల్లీ క్రికెట్ లో ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ చూసి చాలా మంది బాట్స్మన్ నువ్వో గొప్ప బౌలర్ అవుతావ్ అంటూ అతన్ని పొగిడేవారు. అలాగే తన ఇంట్లో తల్లి తండ్రలు కూడా ఉమ్రాన్ మాలిక్ ను ఎంతగానో సపోర్ట్ చేసారు. ముఖ్యంగా అతని తండ్రి చేసేది ఫ్రూట్స్ వ్యాపారమే అయినా నువ్వు మంచిగా క్రికెట్ ఆడుకో నాయనా అని ఉమ్రాన్ కు చాలా స్వేచ్ఛనిచ్చారు. అయితే దీని వెనుక కూడా ఒక రీసన్ ఉంది.

అదేంటంటే తన కొడుకు బాగా చదివిన చదవకపోయినా చెడు సావాసాల వైపు వెళ్లకూడదని చెప్పి ఉమ్రాన్ తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్లే మాలిక్ చిన్నతనంలో అతని తండ్రి ఎప్పుడు కూడా నువ్వు ఎంతసేపైనా క్రికెట్ ఆడుకో కానీ ఎలాంటి చెడు అలవాట్లు అలవరచుకోవద్దని మంచిగా కూర్చోబెట్టి చెప్పేవారు. ఇక తన ఫ్యామిలీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ రావడంతో ఉమ్రాన్ తన చదువును కూడా పక్కన పెట్టేసాడు. 10th క్లాస్ మధ్యలోనే డ్రాపౌట్ అయ్యి ఒక బౌలింగ్ మెషిన్ గా మారిపోయాడు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – తండ్రి అబ్దుల్ రషీద్

ఉమ్రాన్ తన చిన్న తనంలో ఎక్కువగా తావి అనే క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేవాడు. తన సీనియర్స్ తో కలిసి రోజు మొత్తం గేమ్ ను ఎంజాయ్ చేస్తూ తన స్కిల్స్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఒకానొక టైంలో అయితే నైట్ టోర్నమెంట్స్ లో కాస్కో బాల్ క్రికెట్ ఆడి రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. మరీముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల వరకు క్రికెట్ ఆడి ఇంటికి వస్తే తన పేరెంట్స్ అతన్ని చాలా తిట్టేవారు.

Also Read – Pravin Tambe Biography In Telugu (ప్రవీణ్ తాంబే బయోగ్రఫీ)

ఒక్కోసారైతే ఉమ్రాన్ తండ్రి నా కొడుకు నిజంగానే క్రికెట్ ఆడుతున్నాడా లేదా చెడు సావాసాల వైపు పోతున్నాడా అని మిగతా పిల్లల చేత స్పై చేయించేవారు. ఇక ఉమ్రాన్ టెన్నిస్ బాల్ బౌలింగ్ చూసి అతని సీనియర్స్ తో పాటు ఫ్రెండ్స్ అంతా నువ్వు స్టేడియంకు వెళ్లి అకాడమీలో జాయిన్ అవ్వు అని ఎంతో ఫోర్స్ చేసేవారు. బట్ అతను మాత్రం నాకన్నా గొప్ప ఆటగాళ్లు ఇంకా చాలా మంది ఉంటార్లే అని చెప్పి భయంతో గల్లీ క్రికెట్ లోనే తన బాల్యనంత గడిపేశాడు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ (డొమెస్టిక్ కెరియర్)

అయితే ఉమ్రాన్ ఎట్టకేలకు తనకి 17 ఏళ్ల వయసు వచ్చిన తరువాత కుంచెం ధైర్యం తెచ్చుకుని శ్రీనగర్ లోని జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ కోచ్ గా ఉన్న రణధీర్ సింగ్ మిన్హాస్ మాలిక్ లో ఉన్న టేలంట్ ను ఫస్ట్ ఇంప్రెషన్ లోనే గుర్తించారు. అంతే కాకుండా ఉమ్రాన్ బౌలింగ్ బాగా నచ్చడంతో అతని పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బట్ మాలిక్ మాత్రం రజన్ సర్ చెప్పేది సరిగ్గా వినేవాడు. గేమ్ పై ఇష్టం ఉన్న ఆటను మాత్రం సీరియస్ గా తీసుకునేవాడు కాదు. నా కంటే గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు నేను ఆ స్థాయికి వెళ్లగలన అనే సెల్ఫ్ డౌట్ తో తన టేలంట్ ను తానే తొక్కేసుకునేవాడు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – రణధీర్ సింగ్ మిన్హాస్ (రజన్ సర్)

కానీ రజన్ సర్ మాత్రం ఉమ్రాన్ టేలంట్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి అతన్ని బాగా తిట్టేవారు. ఒక్కోసారైతే కొట్టి మరి అతని చేత ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ చేయించేవారు. ఇక ఉమ్రాన్ కొన్ని రోజుల ప్రాక్టీస్ తరువాత జమ్మూ కాశ్మిర్ అండర్ 19 ట్రైల్స్ కు వెళ్ళాడు. అలాగే అక్కడ సెలెక్టర్స్ ను ఇంప్రెస్స్ చేసి స్క్వాడ్ లో చోటు కూడా సంపాదించాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ అతనికి ప్లేయింగ్ 11 లో ఆడే ఛాన్స్ రాలేదు. దింతో కుంచెం నిరాశకు గురైన మాలిక్ తన సెల్ఫ్ డౌట్ ను మరింత బలపరుచుకున్నాడు.

సరిగ్గా ఈ టైంలోనే రజన్ సర్ తో పాటు ఉమ్రాన్ తండ్రి అతన్ని ఎంతగానో మోటివేట్ చేసారు. నీలో చాలా టేలంట్ ఉంది నువ్వు గొప్ప బౌలర్ అవుతావని అతనికి ప్రేరణ ఇచ్చారు. దింతో ఉమ్రాన్ మరోసారి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ సారి బుమ్రాను ఆదర్శంగా తీసుకుని బుల్లెట్ వేగంతో యోర్కర్లు వెయ్యడం బాగా ప్రాక్టీస్ చేసాడు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ స్టేట్ టీం ట్రైల్స్ లో అందరిని ఇంప్రెస్స్ చేసి తన స్టేట్ టీం తరుపున డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు.

Also Read – N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)

అయితే మొదట్లో అతనికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఎంత టేలంట్ ఉన్న గానీ బెంచ్ పైనే కూర్చునేవాడు. ఒకసారి నెట్స్ లో అతని బౌలింగ్ చూసి అస్సాం టీం హెడ్ కోచ్ మరియు మాజీ టీమిండియా వికెట్ కీపర్ అజయ్ రాత్రా జమ్మూ కాశ్మీర్ టీం మేనేజ్మెంట్ పై విమర్శలు గుప్పించారు. ఇక కొన్నాళ్ల తరువాత మన టీమిండియా ఫార్మర్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జమ్మూ కాశ్మీర్ టీంకు మెంటార్ గా వెళ్ళినప్పుడు ఉమ్రాన్ టేలంట్ ను గుర్తించి అతనికి టీంలో స్థానాన్ని కల్పించారు. అంతేకాకుండా అతని బౌలింగ్ యాక్షన్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఉమ్రాన్ ను మరింత క్వాలిటీ బౌలర్ గా తీర్చిదిద్దారు. సరిగ్గా ఈ టైంలోనే ఆర్టికల్ 370 ఇష్యూ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు. దింతో ఉమ్రాన్ ప్రాక్టీస్ కు ఆటంకాలు కలగడంతో పాటు అతని రంజీ డెబ్యూ కూడా ఆలస్యమయ్యింది.

ఇక ఉమ్రాన్ 2021వ సంవత్సరం జనవరి 18వ తేదీన సయద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన టీ20 డెబ్యూ చేసాడు. అయితే రైల్వేస్ తో జరిగిన ఆ మ్యాచులో ఉమ్రాన్ తన మొదటి స్పెల్లో ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. సరిగ్గా ఈ సమయంలోనే అతని టీం మేట్ మరియు ఫ్రెండ్ అయినా అబ్దుల్ సమాద్ మాలిక్ ను తిట్టి సరిగ్గా బౌలింగ్ చేయమని అతన్ని మోటివేట్ చేసాడు. దింతో ఆ తరువాత తన రిథమ్ అందుకున్న మాలిక్ తన రెండో స్పెల్లో మూడు వికెట్లు పడగొట్టి తన టీంను గెలిపించాడు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – ఉమ్రాన్ మాలిక్ తల్లి

ఇక అదే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన బెంగాల్ పై తన లిస్ట్ A డెబ్యూ చేసిన మాలిక్ ఆ మ్యాచులో ఏకంగా 98 పరుగులు సమర్పించుకున్నాడు. దింతో అతన్ని నెక్స్ట్ మ్యాచులో ఆడించలేదు. బట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో అతని నిలకడైన పేస్ బౌలింగ్ చూసి SRH స్కౌటింగ్ టీం ఇంప్రెస్స్ అయ్యింది. అలాగే అప్పటికే SRH టీంలో మెంబర్ అయినా అబ్దుల్ సమాద్ ఉమ్రాన్ యొక్క టేలంట్ గురించి సన్ రైజర్స్ కోచ్ కు చెప్పాడు. దింతో సన్ రైజర్స్ మాలిక్ ను మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకోకపోయినా ఒక నెట్ బౌలర్ గా 2021 ఐపీఎల్ కోసం అతన్ని టీంలోకి తీసుకున్నారు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ (IPL కెరియర్)

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – IPL 2021

ఇక అప్పటినుండి నెట్స్ లో విపరీతమైన పేస్ వెయ్యడం స్టార్ట్ చేసిన ఉమ్రాన్ చాలా మంది SRH బాట్స్మన్ ను బీట్ చేసాడు. మరీముఖ్యంగా డేవిడ్ వార్నర్ లాంటి టాప్ బాట్స్మన్ ను సైతం ఉమ్రాన్ తన పేస్ తో ఇబ్బంది పెట్టాడు. దింతో లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేస్ లో నటరాజన్ గాయపడి రూల్డ్ అవుట్ అయినా తరువాత SRH టీం అతనికి రీప్లేస్మెంట్ గా ఉమ్రాన్ మాలిక్ ను మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకుంది. ఇక ఉమ్రాన్ 2021వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన KKR పై తన ఐపీఎల్ డెబ్యూ చేసాడు. అంతేకాకుండా తానాడిన మొదటి మ్యాచులోనే గంటకి 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో బాల్ వేసి రికార్డును క్రియేట్ చేసాడు. అలాగే ఆ తరువాత మ్యాచుల్లో కూడా మాలిక్ తన పేస్ పవర్ చూపించి చాలా పొదుపుగా బౌలింగ్ చేసాడు. కాగా మాలిక్ ఈ ఐపీఎల్ తరువాత అదే ఏడాది నవంబర్ నెలలో తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసాడు.

Also Read – Ayush Badoni Biography In Telugu (అయుష్ బదోని బయోగ్రఫీ)

ఇక IPL 2021 లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చూసిన తరువాత SRH టీం 2022 ఐపీఎల్ కోసం అతన్ని ఏకంగా 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. దింతో అతను ఒక కోటీశ్వరుడిగా మారిపోయి తన ఫ్యామిలీ కష్టాలన్నింటినీ తీర్చేసాడు. ఇక ఆ తరువాత డేల్ స్టెయిన్ కోచింగ్ బరిలోకి దిగిన ఉమ్రాన్ స్టార్టింగ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని కొన్ని విమర్శలు ఎదుర్కున్నాడు. కానీ ఆ తరువాత పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఒక మ్యాచులో లాస్ట్ ఓవర్ ను మేడిన్ చెయ్యడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టి అలా చేసిన మూడో బౌలర్ గా రికార్డును క్రియేట్ చేసాడు. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఒక మ్యాచులో తన సహచర బౌలర్లంతా ఫెయిల్ అయినా చోట అతను మాత్రం 5 వికెట్లు పడగొట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసాడు.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – IPL 2022

ఇప్పటివరకు అయితే ఐపీఎల్లో మనం చాలా టేలంట్ చూసాం. కానీ ఒక ఇండియన్ పేస్ బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చెయ్యడం మాత్రం చూడలేదు. సో స్టెయిన్ గన్ అండర్ లో ట్రైన్ అవుతున్న ఈ బుల్లి పేస్ గన్ అతి తొందరలోనే టీమిండియాలోకి వస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అతను గనుక రాబోయే రోజుల్లో కూడా ఇలానే నిలకడగా రాణిస్తే మన టీమిండియాకు ఫారెన్ కంట్రీస్ లో తిరుగుండదు. సో ఇది గాయిస్ SRH యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ.

ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ
ఉమ్రాన్ మాలిక్ బయోగ్రఫీ – డేల్ స్టెయిన్

Umran Malik Profile – Click Here

Umran Malik Instagram Id – @umran_malik_1