యాషెస్ సిరీస్ చరిత్ర – ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే మన రెండు దేశాల అభిమానులు ఎలా ఉగిపోతారో, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ అంటే ఆ రెండు దేశాల అభిమానులు కూడా అంతకన్నా ఎక్కువగానే ఊగిపోతారు. ఎందుకంటే మన దేశాల మధ్య వార్ 1947 నుండి స్టార్ట్ అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ వార్ మాత్రం 1882 లోనే స్టార్ట్ అయ్యింది. అప్పటినుండి ఎన్ని తరాలు మారిన గానీ ఈ రెండు దేశాల అభిమానులని ఒక వరల్డ్ కప్ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్న ఈ యాషెస్ సిరీస్ కు చాలా పెద్ద హిస్టరీ ఉంది.
2006వ సంవత్సరంలో అయితే వరల్డ్ వైడ్ గా నిర్వహించిన ఒక సర్వే లో 77 శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ మాకు వరల్డ్ కప్ చూడటం కన్నా యాషెస్ సిరీస్ చూడటం అంటేనే ఎక్కువ ఇష్టం అని వోట్ చేసారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు యాషెస్ ఒక టెస్ట్ సిరీస్ ఏ అయినా దానికి ఎంత క్రేజ్ ఉందనేది. దాదాపు 139 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యాషెస్ సిరీస్ కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎంతో గనమైన క్రికెట్ చరిత్ర కలిగిన ఈ రెండు దేశాలు ఎందుకు బూడిద కోసం పోరాడతాయి. ఎందుకు ఈ రెండు జట్ల మద్యే ఈ సిరీస్ జరుగుతుంది? అసలు ఆ బూడిద ఎవరిదీ? యాషెస్ సిరీస్ చరిత్ర ఏంటి?
యాషెస్ సిరీస్ చరిత్ర (బ్యాక్ స్టోరీ)
అది 1877వ సంవత్సరం. మెల్బోర్న్ వేదికగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇక అప్పటి నుండి ఈ రెండు జట్లు ప్రతి ఏడాది ఒక టెస్ట్ సిరీస్ ఆడటం స్టార్ట్ చేసాయి. అయితే ఒక ఏడాది ఇంగ్లాండ్ గడ్డ పై ఈ సిరీస్ ఆడితే మరో ఏడాది ఆస్ట్రేలియా గడ్డ పై ఈ టెస్ట్ సిరీస్ ఆడేవారు. మొదటి ఐదు సంవత్సరాలు పాటు ఈ సిరీస్ ఆడినప్పుడు ఏ దేశంలో ఆడితే ఆ దేశం ఈ సిరీస్ గెలిచేది. అంటే ఆస్ట్రేలియా గడ్డ పై ఈ సిరీస్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ గడ్డ పై జరిగినప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచేవారు. బట్ 1882వ సంవత్సరంలో సీన్ రివర్స్ అయ్యింది.
ఇంగ్లాండ్ తో ఒకేఒక్క టెస్ట్ మ్యాచ్ కలిగిన సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్ కు వచ్చింది. ఆ ఏడాది ఆగష్టు 28వ తేదీన ఓవల్ మైదానం వేదికగా స్టార్ట్ అయినా ఈ టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బాట్స్మన్ ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. దింతో ఆస్ట్రేలియా టీం వాళ్ళ మొదటి ఇన్నింగ్స్ కేవలం 63 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో 8 మంది ఆటగాళ్లు సింగల్ డిజిట్ కు అవుటయ్యారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ బౌలర్స్ ఏ రేంజ్ లో బౌలింగ్ చేసారో.
సో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇంగ్లాండ్ నే ఫేవరేట్, మా వాళ్లే మ్యాచ్ గెలుస్తారని ఇంగ్లీష్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. బట్ ఆస్ట్రేలియా బౌలింగ్ స్టార్ట్ చేసాక సీన్ మొత్తం మారిపోయింది. ఇంగ్లాండ్ బాట్స్మన్ కూడా ఆస్ట్రేలియా బాట్స్మెన్ లాగే పెవిలియన్ కు క్యూ కట్టారు. బట్ స్టిల్ ఆ టీం 101 పరుగులు సాధించి మొదటి ఇన్నింగ్స్ లో 38 పరుగుల విలువైన లీడ్ ను సాధించింది. అయితే 2nd ఇన్నింగ్స్ లో కుంచెం కోలుకున్న ఆస్ట్రేలియా టీం తమ మొదట ఇన్నింగ్స్ స్కోర్ ను డబుల్ చేసింది.
ఓపెనర్ మాసీ హాఫ్ సెంచరీ సహాయంతో రెండో ఇన్నింగ్స్ లో 122 పరుగులు చేసారు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ టార్గెట్ 85 రన్స్ మాత్రమే. ఇంత చిన్న టార్గెట్ చూసి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అంత తమ టీం మ్యాచ్ గెలిచేస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు 7 వికెట్లు పడగొట్టిన ఫ్రెడ్రిక్ రెండో ఇన్నింగ్స్ లో కూడా తన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. 28 ఓవర్లలో కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చి మరోసారి ఏడూ వికెట్లు పడగొట్టాడు. దింతో ఇంగ్లాండ్ టీం తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 77 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. 85 పరుగుల చిన్న టార్గెట్ ను సైతం అందుకోలేక 7 పరుగుల తేడాతో మొదటిసారి తమ సొంత గడ్డ పై పరాభవాన్ని ఎదురుకున్నారు.
యాషెస్ సిరీస్ చరిత్ర (ఇంగ్లాండ్ పరాజయం)
ఇంగ్లాండ్ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. సొంత గడ్డ పై మొదటి సారి సిరీస్ ఓడిపోయారు కాబట్టి ఇంగ్లాండ్ మీడియా కూడా తమ సొంత టీం ను విమర్శించడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కు చెందిన ది స్పోర్టింగ్ టైమ్స్ అనే ఒక పత్రిక ఇంగ్లాండ్ ఓటమిని హేళన చేస్తూ సర్కాస్టిక్ గా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఇంగ్లీష్ క్రికెట్ విచ్ డైడ్ ఎట్ ది ఓవల్ ఆన్ 29th ఆగస్ట్ 1882 అంటే ఇంగ్లాండ్ క్రికెట్ చనిపోయింది అనే టైటిల్ తో ఈ ఆర్టికల్ ను ప్రచురించారు.
Also Read – Different Types Of Cricket Balls (క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి)
అంతేకాకుండా ఈ టైటిల్ క్రింద మేము ఈ ఘటనకు చాలా చింతిస్తున్నాం ఇంగ్లీష్ క్రికెట్ కు మా నివాళి అంటూ ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అయితే అసలైన ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందంటే ఈ ట్యాగ్ లైన్ కింద RIP అని పెట్టి ఒక నోట్ రాసారు. ఇంగ్లీష్ క్రికెట్ శరీరం యొక్క అంత్యక్రియలు పూర్తయ్యాయి అలాగే ఆ బూడిదను అంటే యాషెస్ ను ఆస్ట్రేలియా తమతో పట్టుకెళ్లింది అని తమ ఆర్టికల్లో రాసుకొచ్చారు. దింతో ఈ ఆర్టికల్ చాలా పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న బ్రిటిష్ దేశం తమకు సొంత గడ్డ పై ఎదురైనా అవమానానికి అస్సలు తట్టుకోలేకపోయింది.
యాషెస్ సిరీస్ చరిత్ర (ఇంగ్లాండ్ ప్రతీకారం & యాషెస్ ఆరంభం)
ఇక ఈ టైంలోనే ఇంగ్లాండ్ టీంకు కొత్త కెప్టెన్ గా ఐవో బ్లిగ్ ను ఎంపిక చేసారు. ఈ ఆర్టికల్ ను కుంచెం సీరియస్ గా తీసుకున్న బ్లిగ్ ఇంగ్లాండ్ మీడియా ముందు ఒక ప్రతిజ్ఞ చేసాడు. నెక్స్ట్ టైం ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడబోయే సిరీస్ లో మన ఇంగ్లాండ్ ను గెలిపించి ఆ యాషెస్ ను వెనక్కి తీసుకొస్తా అని శపథం చేసాడు. దింతో ఇంగ్లీష్ మీడియా ఈ సిరీస్ కు ది క్వెస్ట్ టూ రిగెయిన్ ది యాషెస్ అనే టైటిల్ పెట్టింది. ఇక ఈ టైటిల్ రెండు దేశాల ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది. మన యాషెస్ ను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని ఇంగ్లాండ్ టీం పై తమ ఫ్యాన్స్ ఎంతో ఒత్తిడి పెట్టారు. అలాగే అప్పటినుండి ఈ సిరీస్ ను ది యాషెస్ అని పిలవడం స్టార్ట్ చేసారు. బట్ స్టిల్ ఆ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు వరకు ఈ యాషెస్ అనేది ఒక మిత్ మాత్రమే. ఎవరికీ కనపడదు.
అదే ఏడాది డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియా తో మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ టీం ఆస్ట్రేలియా వెళ్ళింది. అయితే డిసెంబర్ 30వ తేదీన మెల్బోర్న్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. బట్ ఆ మరుసటి ఏడాది అంటే 1883వ సంవత్సరం జనవరి నెలలో జరిగిన మిగతా రెండు టెస్ట్ మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను ఓడించి ఈ సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
ఈ టైంలోనే మెల్బోర్న్ కు చెందిన కొందరు మహిళలు మనం స్టంప్స్ పై పెట్టె ఒక వుడెన్ బెయిల్ ను నిజంగానే కాల్చి దాని యొక్క బూడిదను ఒక అర్న్ లో పెట్టి బ్లిగ్ కు బహుమతిగా ఇచ్చారు. ఇక్కడ అర్న్ అంటే కలశం ఫ్రెండ్స్. ఎవరైనా చనిపోతే వాళ్ళ అస్థికలను ఒక చిన్న పాత్రలో పెడతాం కదా దాన్నే అర్న్ అంటారు. అప్పట్లో ఈ బూడిద ఆస్టేలియా క్రికెట్ ది అని, ఇంగ్లాండ్ యాషెస్ తిరిగి తీసుకొచ్చిదంటూ ఇంగ్లీష్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దింతో అప్పటినుండి ఈ రెండు జట్లు ఈ యాషెస్ ను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఎలాగైనా సరే ఈ సిరీస్ ను గెలిచి ఆ యాషెస్ ను తమ దేశంలోనే ఉంచాలన్న పట్టుదలతో ఆడటం స్టార్ట్ చేసారు.
యాషెస్ సిరీస్ చరిత్ర (యాషెస్ ట్రోఫీ)
ఈ ఘటన జరిగిన ఒక ఏడాది కాలంలో అప్పుడు బ్లిగ్ కు ఈ యాషెస్ ఇచ్చిన ఉమెన్ గ్రూప్ నుండి ఫ్లోరెన్స్ మొర్ఫీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దింతో ఆ రోజు బ్లిగ్ చేతిలో పెట్టిన యాషెస్ ను ఒక పర్సనల్ గిఫ్ట్ గానే కన్సిడర్ చేసి ఆ అర్న్ అతనికే ప్రెసెంట్ చేసారు. సో ఈ సిరీస్ కు యాషెస్ అనే పేరైతే వచ్చింది గాని ఫిజికల్ గా రిప్రెసెంట్ చేసేందుకు ఎలాంటి ట్రోఫీ లేదు. బట్ 1883 లో ఆ సిరీస్ విజయం తర్వాత ఈ సిరీస్ కు చాలా పాపులారిటీ వచ్చింది. ఎప్పుడు ఈ రెండు దేశాల మధ్య సిరీస్ జరిగిన దాన్ని ప్రెసెంట్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలా ఫీల్ అవుతున్నామో ఆ లెవెల్లో ఫీల్ అయ్యి అమాంతం ఈ సిరీస్ క్రేజ్ ను పెంచేశారు.
Also Read – Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)
దీనివల్ల అప్పట్లో బ్లిగ్ దగ్గర ఉన్న అర్న్ కు రెప్లికా గా అంటే డూప్లికేట్ గా కొన్ని ట్రోఫీలు తయారుచేయడానికి ట్రై చేసారు. బట్ 1925వ సంవత్సరం వరకు అఫీసియల్ గా ఏవి సెట్ కాలేదు. అయితే 1927వ సంవత్సరంలో బ్లిగ్ మరణించిన తరువాత అతని వైఫ్ ఫ్లోరెన్స్ ఒక డూప్లికేట్ అర్న్ ను లార్డ్స్ క్రికెట్ క్లబ్ అయినా MCC కు అందించింది. అలాగే ఒరిజినల్ బూడిద ఉన్న కలశాన్ని కూడా అక్కడే MCC మ్యూజియంలో పెట్టారు. బ్లిగ్ వైఫ్ ఎప్పుడైతే ఆ డూప్లికేట్ అర్న్ ను MCC కు ఇచ్చిందో ఇక అప్పటినుండి అదే ఈ యాషెస్ సిరీస్ కు అఫీసియల్ ట్రోఫీగా మారింది. అయితే 1998-99 సిరీస్ లో ఈ ట్రోఫీ మరి చిన్నదిగా ఉందని చెప్పి దానికి రెప్లికాగా ఒక క్రిస్టల్ ట్రోఫీ ను తీసుకొచ్చారు. అప్పటి నుండి ఈ సిరీస్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ గాజు ట్రోఫీతో పాటు ఆ అర్న్ ను కూడా ప్రెసెంట్ చేస్తున్నారు.
యాషెస్ సిరీస్ చరిత్ర (ఆస్ట్రేలియా డామినేషన్)
ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధంల భావించే ఈ యాషెస్ సిరీస్ చరిత్ర ను ఆస్ట్రేలియా బాగా డామినేట్ చేసింది. ఒకానొక టైములో అయితే 1989 నుండి 2003 వరకు జరిగిన ఎనిమిది యాషెస్ సిరీస్లలో వరుసగా ఆస్ట్రేలియానే గెలుస్తూ వచ్చింది. దీనివల్లే 2005వ సంవత్సరంలో ఇంగ్లాండ్ యాషెస్ గెలిచినప్పుడు అదొక చరిత్ర గా మారింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ గెలవడంతో ఈ సిరీస్ లో బాగా ఆడిన కెవిన్ పీటర్సన్ మరియు ఆండ్రూ ఫ్లింటాఫ్ కు చాలా మంచి పేరు వచ్చింది. మరీముఖ్యంగా ఇంగ్లాండ్ ఆ ఏడాది సిరీస్ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఫ్లింటాఫ్ ఆల్ రౌండ్ షో.
యాషెస్ సిరీస్ చరిత్ర (గణాంకాలు)
ఈ యాషెస్ సిరీస్ చరిత్ర యొక్క స్టాట్స్ ఒకసారి చూస్కుంటే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ఈ సిరీస్ మొత్తం 72 సార్లు జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 34 సార్లు ఈ యాషెస్ ను గెలిస్తే ఇంగ్లీష్ టీం 32 సార్లు ఈ సిరీస్ ను సొంతం చేసుకుంది. మిగతా ఆరు సార్లు ఈ సిరీస్ డ్రా అయ్యింది. అంటే రెండు టీంలు కూడా ఆ ఆరు సిరీస్లలో ఈక్వల్ గా మ్యాచ్స్ గెలిచారు.
ఈ యాషెస్ సిరీస్ చరిత్ర లో టాప్ స్కోరర్ డాన్ బ్రాడ్మన్. 37 మ్యాచుల్లో 5028 పరుగులు సాధించాడు.
టాప్ వికెట్ టేకర్ షేన్ వార్న్. 36 మ్యాచుల్లో ఏకంగా 195 వికెట్లు పడగొట్టాడు.
సో గాయిస్ ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరిగే ఈ యాషెస్ సిరీస్ చరిత్ర దాదాపు 45 రోజుల పాటు రెండు ఈ దేశాల అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది.
Ashes Series Complete Stats – Click Here