Different Types Of Cricket Balls (క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి)

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ – క్రికెట్ చూసే వాళ్ళందరూ గమనించే ఉంటారు. టెస్ట్ ఫార్మాట్లో రెడ్ మరియు పింక్ బాల్ వాడటం అలాగే వన్డే మరియు టీ20 ఫార్మాట్లో వైట్ బాల్ వాడటం. అయితే ఎందుకు ఇలా మూడు రకాల బాల్స్ వాడతారు? క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ మధ్య తేడా ఏంటి?

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ చరిత్ర

క్రికెట్ లో రెడ్ బాల్ చరిత్ర

క్రికెట్ లో స్టార్టింగ్ నుండి రెడ్ బాల్ ను మాత్రమే ఉపయోగించేవారు. అయితే 1971వ సంవత్సరంలో ఒన్డే క్రికెట్ మొదలుపెట్టాక ఈ రెడ్ బాల్ తో ఒన్డే మ్యాచ్స్ ఆడటం కష్టంగా మారింది. ఎందుకంటే నార్మల్ గా టెస్ట్ క్రికెట్ లో ఒక రోజులో 90 ఓవర్లు పాటు బౌలింగ్ చేయవచ్చు. సన్ లైట్ బాగా ఉంటే మాక్సిమం 98 ఓవర్లు పాటు బౌలింగ్ చేస్తారు. కానీ అప్పట్లో ఒన్డే క్రికెట్ అంటే ఇన్నింగ్స్ కు 60 ఓవర్లు చెప్పున ఉండేది. అంటే డే టైంలోనే మొత్తం 120 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి. కానీ ఒక్క రోజులో అన్ని ఓవర్లు కంప్లీట్ చెయ్యడం అంటే చాలా కష్టం.

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి
క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ – రెడ్ బాల్ క్రికెట్

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ లో రెడ్ బాల్ అనేది డే టైంలోనే బాగా కనపడుతుంది. ఫ్లడ్ లైట్స్ లో రెడ్ బాల్ తో క్రికెట్ ఆడటం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్ అనేవి కుంచెం ఎల్లో కలర్ లైటింగ్ ను ఇస్తాయి. దింతో ఫ్లడ్ లైట్స్ వెలుగులో రెడ్ బాల్ ఎర్రగా కాకుండా కుంచెం బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. సో మనందరికీ తెలిసిందే పిచ్ అనేది ఆల్రెడీ కుంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది. దింతో బాట్స్మన్ బాల్ ను సరిగ్గా చూడలేడు. ఈవెన్ ఫీల్డర్స్ తో పాటు ఆడియన్స్ కు కూడా రెడ్ బాల్ తో నైట్ టైం మ్యాచ్స్ ఆడితే మంచి అనుభవం కలగదు.

Also Read – What Is Two Paced Wicket In Cricket (క్రికెట్ లో టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి)

క్రికెట్ లో వైట్ బాల్ చరిత్ర

ఇక స్టార్టింగ్ లో వన్డేలను కూడా లైట్ ఫెయిల్ అయినప్పుడు ఆపేసి ఆ మరుసటి రోజు కంటిన్యూ చేసేవారు. అలాగే ఫ్యాన్స్ కు కూడా డే టైంలో తప్పితే నైట్ టైంలో మ్యాచ్ చూడటానికి ఉండేది కాదు. దింతో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసం 1977 సంవత్సరంలో వైట్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేసారు. అలాగే ఒన్డే మ్యాచ్స్ ను డే అండ్ నైట్ ఫార్మాట్లో ఆడటం మొదలుపెట్టారు. డార్క్ స్కై లో వైట్ బాల్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అలాగే మ్యాచ్ చూసేవాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది.

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి
క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ – వైట్ బాల్ క్రికెట్

అయితే అప్పట్లో కలర్ జెర్సీస్ ఉండేవి కాదు దింతో వైట్ జెర్సీలు వేసుకుని వైట్ బాల్ తో క్రికెట్ ఆడటం మరో ప్రాబ్లమ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాబ్లెమ్ కు కూడా చెక్ పెట్టేందుకు అదే ఏడాది కలర్ జెర్సీలను కూడా ఇంట్రడ్యూస్ చేసారు. కానీ స్టార్టింగ్ లో వరల్డ్ కప్స్ ఆడినప్పుడు అన్ని డే మ్యాచ్స్ పెట్టడం వల్ల 1992 వరకు వైట్ జెర్సీస్ వేసుకుని రెడ్ బాల్ తోనే వరల్డ్ కప్ మ్యాచ్స్ ఆడారు. కానీ 1992వ సంవత్సరం నుండి వరల్డ్ కప్స్ లో కూడా డే అండ్ నైట్ మ్యాచ్స్ ఇంట్రడ్యూస్ చేసి కలర్ జెర్సీలతో వైట్ బాల్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. ఇక అప్పటినుండి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ను వైట్ బాల్ తో అలాగే టెస్ట్ క్రికెట్ ను రెడ్ బాల్ తో ఆడుతూ వస్తున్నారు.

Also Read – What Is Dew Factor In Cricket (క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి?)

క్రికెట్ లో పింక్ బాల్ చరిత్ర

అయితే రీసెంట్ గా 2015వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ ను డే అండ్ నైట్ ఫార్మాట్లో ఆడటం స్టార్ట్ చేసారు. కానీ మనం పైన చెప్పుకున్నట్టు ఫ్లడ్ లైట్స్ లో రెడ్ బాల్ తో ఆడటం చాలా డేంజర్. దింతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా పింక్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేసారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావొచ్చు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లను వైట్ బాల్ తో ఆడొచ్చు కదా అని. దీనికి ఆన్సర్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ వైట్ జెర్సీలతో ఆడతారు. సో డే అండ్ నైట్ టెస్టుల్లో వైట్ బాల్ తో క్రికెట్ ఆడితే అది ప్రాబ్లెమ్ అవ్వొచ్చు.

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి
క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ – పింక్ బాల్ క్రికెట్ (Credit – Getty Images)

అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ లో ఒక బాల్ ను మినిమం 80 ఓవర్లు పాటు యూస్ చేయాలి. బట్ వైట్ బాల్ 50 నుండి 60 ఓవర్లు పాటే యూస్ అవుతుంది. దింతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల కోసం పింక్ బాల్ ను యూస్ చేస్తున్నారు.

రెడ్ బాల్ మరియు పింక్ బాల్ కు మధ్య ఉన్న తేడా

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ లో రెడ్ బాల్ కు పింక్ బాల్ కు అయితే మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచుల్లో నైట్ టైం సన్ ఉండడు కాబట్టి పిచ్ మీద జీవం అలానే ఉంటుంది. దీని వల్ల నైట్ టైంలో పింక్ బాల్ కుంచెం ఎక్కువుగా స్వింగ్ అవుతుంది. సో కండిషన్స్ వల్ల ఈ రెండు బాల్స్ మధ్య కుంచెం డిఫరెన్స్ వస్తుంది గాని ప్రోపర్టీస్ మాత్రం ఆల్మోస్ట్ ఒకటే. సింపుల్ గా చెప్పాలంటే జస్ట్ కలర్ చేంజ్ చేసారు అంతే.

క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి
క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ – పింక్ vs రెడ్ బాల్

రెడ్ బాల్ మరియు వైట్ బాల్ కు మధ్య ఉన్న తేడా

1. రెడ్ బాల్ సీమ్ థ్రెడింగ్ అనేది కుంచెం దగ్గరగా ఉంటుంది. అంటే బాల్ మీద ఉండే కుట్లు కుంచెం దగ్గరగా ఉంటాయి. దీని వల్లే రెడ్ బాల్ 80 ఓవర్స్ వరకు స్ట్రాంగ్ ఉంటుంది. కానీ వైట్ బాల్ కు ఉండే థ్రెడింగ్ మాత్రం కుంచెం వైడ్ గా ఉంటుంది. దింతో వైట్ బాల్ అనేది 50 ఓవర్స్ ముగిసేసరికి షేప్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.

2. వైట్ బాల్ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అంటే బాల్ యొక్క టాప్ సర్ఫేస్ అంతా షైనీ గా ఉంటుంది. దీని వల్లే మ్యాచ్ స్టార్టింగ్ లో వైట్ బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. బట్ మ్యాచ్ వెళ్లే కొద్దీ త్వరగా ఓల్డ్ అయిపోవడం వల్ల షైన్ తొందరగాపోయి స్వింగ్ తగ్గిపోతుంది. కానీ రెడ్ బాల్ ఫినిషింగ్ మాత్రం కుంచెం హార్డ్ గా ఉంటుంది. అలాగే షైన్ పార్ట్ మరియు రఫ్ పార్ట్ లాంగ్ టైం వరకు ఉంటాయి. దింతో స్టార్టింగ్ లో 30 ఓవర్స్ వరకు బాల్ బాగా స్వింగ్ అవుతుంది.

3. రెడ్ బాల్ తో కంపేర్ చేస్తే వైట్ బాల్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బౌలర్ వైట్ బాల్ ను సరిగ్గా కంట్రోల్ చెయ్యలేడు. బాగా స్కిల్ ఉన్న బౌలర్స్ మాత్రమే అనుకున్న లైన్ అండ్ లెంగ్త్ ను నిలకడగా వెయ్యగలరు. బట్ రెడ్ బాల్ కుంచెం వెయిట్ తక్కువగా ఉండటం వల్ల అది చాలా వరకు బౌలర్ మాట వింటుంది.

సో గాయిస్ ఫిజికల్ ప్రోపర్టీస్ లో రెడ్ బాల్ కు మరియు వైట్ బాల్ కు ఉండే మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవి. అయితే వైట్ బాల్ క్రికెట్ లో బాట్స్మన్ రిస్క్ తీసుకుని కుంచెం అటాకింగ్ గేమ్ ఆడతాడు కాబట్టి రన్స్ ఎక్కువగా వస్తాయి. వైట్ బాల్ క్రికెట్ లో ఓవర్స్ లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి బాట్స్మన్ రన్స్ కోసం ఆడతాడు. అదే రెడ్ బాల్ క్రికెట్ లో స్కోరుబోర్డు ప్రెషర్ ఉండదు. దింతో బాట్స్మన్ తన వికెట్ కాపాడుకోవడం కోసం స్లో గా బ్యాటింగ్ చేస్తాడు. అందుకే రన్స్ తక్కువగా వస్తాయి. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ ను SG, కుకుబుర మరియు డ్యూక్ కంపెనీలు తాయారు చేస్తాయి.

Also Read – About “Sir” Title In Cricket (క్రికెట్ ఆడే ఆటగాళ్లకు “సర్” అనే బిరుదు ఎలా వస్తుంది?)