What Is Match Fixing And Spot Fixing In Cricket (క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటి)

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ – క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక భయంకరమైన భూతం. ఎంతో మంది ప్లేయర్స్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఉచ్చులో పడి తమ కెరియర్స్ ను నాశనం చేసుకున్నారు. కొంతమంది సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొంటే మరికొంత మంది ఆటగాళ్లు ఏకంగా లైఫ్ టైం బ్యాన్స్ ఎదురుకున్నారు. అయితే అసలు క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి? ఫిక్సింగ్ చెయ్యడం వల్ల ఎవరికి లాభం? క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ కు ఉన్న తేడా ఏంటి? అసలు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేస్తారు?

క్రికెట్ లో ఫిక్సింగ్ అంటే ఏంటి?

నార్మల్ గా ఎవరైనా ప్లేయర్ లేదా ఒక టీం మొత్తం కొంతమంది బుకీస్ దగ్గర నుండి డబ్బులు తీసుకుని వాళ్ళు చెప్పిన మ్యాచులో రిసల్ట్ ను ఆ బుకీస్ కు అనుకూలంగా వచ్చేలా చేస్తే దాన్ని ఫిక్సింగ్ అంటారు. అంటే ఒక మ్యాచులో ఏం జరగాలో ఆ మ్యాచ్ జగరగకముందే దాని ఫలితం ఇలా ఉండాలని ముందే ప్లాన్ చేసి డిసైడ్ చేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక మ్యాచ్ గెలవడం కోసం ముందుగా ప్లాన్ చేసుకుని ఆ మ్యాచ్ ను ఆడితే అది ఒక కాంపిటేషన్. అలా కాకుండా ఒక మ్యాచ్ లో కావాలని ఓడిపోవడం కోసం ముందుగా ప్లాన్ చేసుకుని ఆ మ్యాచ్ ఆడితే దాన్ని ఫిక్సింగ్ అంటాం.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటి
క్రికెట్ లో ఫిక్సింగ్ చేసి నిషేధం ఎదుర్కున్న కొంతమంది ఆటగాళ్లు

అయితే ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే దీన్ని ఎక్కువగా క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేవారు. కానీ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం చాలా తక్కువగా వినపడుతుంది. ప్రెసెంట్ ఏ ప్లేయర్ ఫిక్సింగ్ లో పట్టుబడ్డగానీ దాన్ని స్పాట్ ఫిక్సింగ్ అన్న మాటే ఎక్కువగా వినపడుతుంది. ఎవరు కూడా దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అనట్లేదు. అయితే ఎందుకు ప్రెసెంట్ ఎవరైనా ప్లేయర్స్ ఫిక్సింగ్ చేస్తే దాన్ని స్పాట్ ఫిక్సింగ్ అనే అంటున్నారు. అసలు క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ కు ఉన్న తేడా ఏంటి?

Also Read – Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వివరణ

ఈ పేరును బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు. ఒక కంప్లీట్ మ్యాచ్ యొక్క ఫలితాన్ని ప్రభావితం చెయ్యడం కోసం ఫిక్సింగ్ చేస్తే దాన్ని క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఓల్డెన్ డేస్ లో బెట్టింగ్ అనేది చాలా సింపుల్ గా జరిగేది. ఉదాహరణకు ఇండియా మరియు పాకిస్థాన్ జట్ల మధ్య ఒక ఒన్డే మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని ఒకరు లక్ష రూపాయిలు బెట్ కడితే మరొకరు పాకిస్థాన్ గెలుస్తుందని లక్ష రూపాయిలు బెట్ కట్టారు. అంటే మ్యాచ్ జరగకముందే ఏ టీం గెలుస్తుందనే దాని పై అంచనా వేసి బెట్టింగ్ కట్టారు.

ఇక ఆ మ్యాచ్ ఫలితం వచ్చిన తరువాత ఆ బెట్ కట్టిన వాళ్ళు డబ్బు సంపాదించడమే లేదా పోగుట్టుకోవడమో జరిగేది. అయితే ఈ బెట్టింగ్ అనేది ఎవరో ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగేది కాదు. వీళ్లకంటూ ఒక సిండికేట్ ఉంటుంది. ఈ సిండికేట్ దగ్గరికి బెట్ కట్టే వాళ్ళు వచ్చి రేపు ఇండియా మరియు పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఫలానా టీం గెలుస్తుందని బెట్ కడతారు.

అయితే ఈ బెట్టింగ్ సిండికేట్స్ వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఈవెన్ వీళ్ళు మాఫియా వాళ్ళతో కూడా లింక్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండియా మరియు పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో జనరల్ గా ఉండే ప్రిడిక్షన్ ప్రకారం బెట్టింగ్ ఆడ్స్, పర్సెంటేజెస్ మరియు రేషియోస్ అని చెప్పి ఈ మ్యాచ్ కోసం కొన్ని బెట్టింగ్ స్టాండర్డ్స్ ను ఈ సిండికేట్ వాళ్ళు సెట్ చేస్తారు. ఇక వాటి ప్రకారం బెట్టింగ్ అనేది జరుగుతుంది.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్
క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్

అయితే ఈ బెట్టింగ్ లో సిండికేట్ వాళ్ళు భారీగా ప్రాఫిట్ చేసుకోవడం కోసం క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే దాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అది ఎలా అంటే రేపు జగరబోయే మ్యాచులో ఎక్కువ మంది ఏ టీం గెలుస్తుందని భావిస్తారో ఆ టీంను ఈ సిండికేట్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. అంటే బలంగా ఉన్న ఆ టీంలోని ఒక ప్లేయర్ ను వీళ్లు సీక్రెట్ గా అప్ప్రోచ్ అయ్యి మేము చెప్పినట్టు మ్యాచ్ ఫలితాన్ని ఫిక్స్ చేస్తే నీకు ఇంత డబ్బు ఇస్తామని ఆశ చూపిస్తారు.

ఇలా ప్లేయర్స్ ను అప్ప్రోచ్ అయ్యి వాళ్లతో డీల్ చేసుకునే వాళ్లనే మనం బుకీస్ లేదా బుక్ మార్కర్స్ అంటాం. ఇక ఇప్పుడు ఆ బలమైన టీంలో ఉన్న ప్లేయర్ ఈ బుకీ దగ్గర డబ్బులు తీసుకుని రేపటి మ్యాచ్ యొక్క ఫలితం ఎలా ఉండబోతుందో సిండికేట్ వాళ్లకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు. అంటే ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారు, టీం గేమ్ ప్లాన్ ఏంటి, రేపటి మ్యాచ్ యొక్క కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇలా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి లీక్ చేస్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు బెట్టింగ్ ఆడ్స్ అనేవి సెట్ చేసుకుంటారు. ఒకవేళ బెట్టింగ్ సిండికేట్ వాళ్ళు మ్యాచ్ ఫలితాన్నే మార్చెయ్యాలనుకుంటే ఆ బలమైన టీం యొక్క కెప్టెన్ ను టార్గెట్ చేస్తారు. మ్యాచ్ ఓడిపోయేలా నిర్ణయాలు తీసుకుంటే డబ్బు ఇస్తాం అని ఆశ చూపిస్తారు.

Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)

ముఖ్యంగా ఓల్డెన్ డేస్ లో మ్యాచ్ ఫలితాన్ని శాసించేందుకు వాళ్ళు టార్గెట్ చేసిన కెప్టెన్ కు ఈ బుకీస్ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. దింతో ఆ టీం కెప్టెన్ ఆ డబ్బులు తీసుకుని తన టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ కు విషయం చెప్పేవాడు. డబ్బు మీద ఆశ ఉన్న ప్లేయర్స్ తమ కెప్టెన్ చెప్పినట్టు తక్కువ స్కోర్ కు ఔటైపోవడం లేదా బౌలింగ్ లో అయితే ధారాళంగా పరుగులు ఇవ్వడం వంటి పనులు చేసేవారు. దింతో మ్యాచ్ రిసల్ట్ మారిపోయి క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ప్లేయర్స్ తో పాటు బెట్టింగ్ సిండికేట్ వాళ్ళకి చాలా డబ్బు వచ్చేది.

ఉదాహరణకు మనం సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్యే మరియు ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్స్ నే చెప్పుకోవచ్చు. వీళ్ళు కెప్టెన్స్ గా ఉన్నప్పుడు క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిషేధం ఎదుర్కొన్నారు. అయితే వీళ్ళతో పాటు అదే టైంలో సౌత్ ఆఫ్రికా కు చెందిన కొంతమంది ప్లేయర్స్ తో పాటు ఇండియాకు చెందిన మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజా లాంటి ప్లేయర్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు నిషేధం ఎదురుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా టీం కెప్టెన్ తో కలిసి ఫిక్సింగ్ చేశారనే ఆరోపణలు ఎదురుకున్నారు కాబట్టి. సో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఎదో ఒక్క ప్లేయర్ తో అయ్యే పని కాదు. టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా సహకరిస్తేనే బుకీస్ చెప్పిన రిసల్ట్ ను తీసుకురావడం సాధ్యపడుతుంది.

క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ వివరణ

స్పాట్ ఫిక్సింగ్ అనేది మనం పైన చెప్పుకున్న క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లా కాదు. ఈ టైప్ ఆఫ్ ఫిక్సింగ్ చెయ్యడానికి ఒక్క ప్లేయర్ చాలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాగే కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దింతో ప్రెసెంట్ బెట్టింగ్ నిర్వహించే విధానంలో కూడా మార్పు వచ్చింది. ఓల్డెన్ డేస్ లా మ్యాచ్ రిసల్ట్ పై కాకుండా ఫలానా ఓవర్ లో ఫలానా బాల్ కు ఇలా జరుగుతుందని బెట్టింగ్ కడుతున్నారు. దింతో ఈ సిండికేట్ వాళ్ళు ఒక ప్లేయర్ ను టార్గెట్ చేసి నువ్వు ఫలానా మ్యాచ్ లో మేము చెప్పిన ఓవర్ లో ఇన్ని రన్స్ ఇవ్వాలి, అయితే ఆ ఓవర్ వేసేముందు నువ్వు మాకు ఏదొక సిగ్నల్ ఇవ్వాలి, అలా చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తామని మ్యాచ్ ముందే ఫిక్స్ చేస్తారు.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్
క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్

ఇక ఆ ఫిక్సింగ్ చెయ్యాలనుకున్న ప్లేయర్ బుకీస్ చెప్పిన పని చేసే ముందు వాళ్ళకి సిగ్నల్ ఇస్తాడు. దింతో ఆ టైంలో బెట్టింగ్ ఆడ్స్ అనేవి ఈ సిండికేట్ వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకుని గ్యాంబ్లింగ్ చేయడం ద్వారా ఎక్కవ లాభం పొందుతారు. సో ఎవరో ఒక ప్లేయర్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి బుకీస్ చెప్పినట్టు నో బాల్ వెయ్యడమో లేదా రన్స్ ఎక్కువ లీక్ చెయ్యడమో లేదా బాట్స్మన్ అయితే తొందరగా అవుట్ అయిపోవడమో చేస్తే దాన్ని స్పాట్ ఫిక్సింగ్ అంటారు. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్ వల్ల కూడా ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలు మారిపోతాయి. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ తో పోలిస్తే ఆ రిసల్ట్ ఛేంజింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ కు ఉన్న తేడా

ఓల్డెన్ డేస్ లో టీ20 ఫార్మట్ లేదు కాబట్టి ఎక్కువగా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చేసేవారు. ఎందుకంటే లాంగ్ ఫార్మాట్ ఆఫ్ గేమ్ లో ఎదో ఒక్క ప్లేయర్ తప్పు చెయ్యడం వల్ల మ్యాచ్ రిసల్ట్ మొత్తం చేంజ్ అవ్వకపోవచ్చు. బట్ ప్రెసెంట్ టీ20 ఫార్మాట్లో ఒక్క ప్లేయర్ తప్పు చెయ్యడం వల్ల మ్యాచ్ ఫలితం మారె అవకాశం ఉంది. దింతో బెట్టింగ్ సిండికేట్ వాళ్లు ఎక్కువగా స్పాట్ ఫిక్సింగ్ రూట్ ను ఎంచుకుని లాభం పొందుతున్నారు.

సో ఒక టీంలో గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ కలిసి తమ టీం ఆ మ్యాచ్ ఓడిపోయేలా చేస్తే దాన్ని క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఇందులో ఖచ్చితంగా మ్యాచ్ రిసల్ట్ అనేది ప్రభావితం అవుతుంది. బట్ స్పాట్ ఫిక్సింగ్ లో మాత్రం ఒక్క ప్లేయర్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి బుకీస్ చెప్పినట్టు ఫలానా మ్యాచ్ లో ఫలానా పని చేస్తాడు అంతే. మ్యాచ్ రిసల్ట్ తో అతనికి ఎలాంటి సంబంధం ఉండదు.

క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్
క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్

ఉదాహరణకు శ్రీశాంత్ సంఘటననే తీసుకుంటే ఆ సంఘటన జరిగిన టైములో ఎక్కువగా అతను కర్చీఫ్ పెట్టుకుని బౌలింగ్ చేసిన ఓవర్ ను హైలైట్ చేసారు. ఎందుకంటే స్పాట్ ఫిక్సింగ్ ప్లాన్ లో భాగంగా నువ్వు ఎక్కువ పరుగులు ఇవ్వాలనుకుంటున్న ఓవర్లో ఇలా కర్చీఫ్ పెట్టుకుని బౌలింగ్ చెయ్ అని ముందే ఫిక్స్ చేసి పెట్టుకుని ఉండొచ్చు అనే అనుమానంతో ఆ ఓవర్ ను బాగా హైలైట్ చేసారు. కానీ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే ఇలాంటి సిగ్నల్స్ ఏం ఉండవు. మ్యాచ్ రిసల్ట్ ను చేంజ్ అయ్యేలా మ్యాచ్ మొత్తం తప్పులు చేస్తూ తమ టీం ఓడిపోయేలా చెయ్యాలి. అదే మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ప్లేయర్స్ యొక్క ముఖ్య లక్ష్యం.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిషేధం ఎదుర్కున్న ఆటగాళ్ల జాబితా – Click Here

ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన స్పాట్ ఫిక్సింగ్ జరిగిన దాని వెనుక ఉన్న మెయిన్ రీసన్ బెట్టింగ్. సో ఈ బెట్టింగ్ అనేది ఎక్కువగా జరగడం వల్లే ప్లేయర్స్ కు డబ్బు ఆశ చూపించో లేదా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించో ఆటగాళ్ల చేత ఈ బుకీస్ అనే వాళ్ళు ఫిక్సింగ్ చేయిస్తున్నారు.

Also Read – Signs Of Fake Friend In Telugu (ఫేక్ ఫ్రెండ్ కి ఉండే 7 లక్షణాలు)