Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – క్రికెట్ లో త్రో బౌలింగ్ అనేది నిషేధం. బౌలర్స్ తమ బౌలింగ్ హ్యాండ్ ను 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచి బౌలింగ్ చేస్తే దాన్ని క్రికెట్ లో త్రో బౌలింగ్ అంటారు. మరి అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన బౌలర్స్ ఎవరైనా ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఈ ఆర్టికల్లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది ఫేమస్ బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు

10. Sachithra Senanayake (Sri Lanka)

శ్రీలంకకు చెందిన ఈ స్పిన్ బౌలర్ 2014వ సంవత్సరంలో క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయాడు. ఆ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక ఒన్డే మ్యాచ్ లో తన బౌలింగ్ హ్యాండ్ ను 15 డిగ్రీస్ కంటే ఎక్కువుగా వంచి బౌలింగ్ చేసాడు. దింతో అంపైర్లు అతని బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీ కు పిర్యాదు చేసారు. ఇక అతని బౌలింగ్ యాక్షన్ ను టెస్ట్ చేసిన ఐసీసీ సచిత్ర క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని నిర్దారించింది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ నుండి అతన్ని బ్యాన్ చేసింది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు సహాయంతో తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకున్న సచిత్ర అదే ఏడాది డిసెంబర్ నెలలో మరోసారి తన బౌలింగ్ యాక్షన్ ను టెస్ట్ చేయించుకున్నాడు. ఇక ఆ టెస్ట్ లో అతని బౌలింగ్ యాక్షన్ రూల్స్ కు లోబడి ఉందని ఐసీసీ నిర్దారించింది. దింతో అతని పై ఉన్న బ్యాన్ ను ఎత్తేసారు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Sachithra Senanayake

9. Shabbir Ahmed (Pakistan)

పాకిస్తాన్ కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ 2005వ సంవత్సరంలో త్రో బౌలింగ్ చేసి 12 నెలల పాటు క్రికెట్ నుండి బ్యాన్ అయ్యాడు. అయితే జనరల్ గా క్రికెట్ లో త్రో బౌలింగ్ అంటే ఎక్కువగా స్పిన్నర్లే ఈ కేటగిరీలోకి వస్తారు. కానీ ఆ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో రూల్స్ కు విరుద్ధంగా బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ అంపైర్లకు దొరికిపోయాడు. దింతో అతని బౌలింగ్ యాక్షన్ పై ఎనాలిసిస్ చేసిన ఐసీసీ అతనికి 12 నెలల బ్యాన్ విధించింది.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Shabbir Ahmed

కాగా క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ యొక్క బౌలింగ్ యాక్షన్ కారణంగా ఇలా 12 నెలల పాటు బ్యాన్ చెయ్యడం ఇదే మొట్టమొదటిసారి. దింతో అప్పట్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక బ్యాన్ తరువాత తిరిగి క్రికెట్ లోకి రీఎంట్రీ ఇద్దాం అనుకున్న షబ్బీర్ కు నేషనల్ టీంలో చోటు దక్కలేదు. అలాగే మరోసారి తాను ఇల్లీగల్ బౌలింగ్ చేస్తే అది సరిచేసుకునే వరకు అతన్ని క్రికెట్ ఆడనివ్వమని ఐసీసీ పీసీబీను హెచ్చరించింది. దింతో షబ్బీర్ డొమెస్టిక్ క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యి 2013వ సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.

8. Johan Botha (South Africa)

సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ 2006వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పై తన టెస్ట్ డెబ్యూ చేసినప్పుడే క్రికెట్ లో త్రో బౌలింగ్ సమస్యను ఎదుర్కున్నాడు. దింతో ఐసీసీ అతని పై బ్యాన్ విధించింది. అయితే అదే ఏడాది తన బౌలింగ్ యాక్షన్ ను సరి చేసుకున్న బోథా తిరిగి బౌలింగ్ వేయడం స్టార్ట్ చేసాడు. కానీ 2009వ సంవత్సరంలో మరోసారి త్రో బౌలింగ్ చేసిన బోథా అంపైర్లకు దొరికిపోయాడు. ముఖ్యంగా దూస్రా వేరియేషన్ ట్రై చేస్తున్నప్పుడు అతను క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని ఐసీసీ నిర్దారించింది. దింతో దూస్రా వేరియేషన్ ను మరోసారి ట్రై చేయకూడదంటూ అతను వేసే ఆ వేరియేషన్ పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక బోథా 2013వ సంవత్సరంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మరోసారి అంపైర్లు అతని బౌలింగ్ యాక్షన్ పై రిపోర్ట్ చేసారు. అయితే తన బౌలింగ్ యాక్షన్ ను తొందరగానే సరిచేసుకున్న బోథా తిరిగి నార్మల్ గా క్రికెట్ ఆడటం కంటిన్యూ చేసాడు

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Johan Botha

Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)

7. Sohag Gazi (Bangladesh)

బంగ్లాదేశ్ కు చెందిన ఈ స్పిన్ బౌలర్ 2014వ సంవత్సరంలో ఐసీసీ రూల్స్ కు విరుద్ధంగా క్రికెట్ లో త్రో బౌలింగ్ వేసి దొరికిపోయాడు. ఆ ఏడాది వెస్టిండీస్ తో జరిగిన ఒక ఒన్డే మ్యాచులో సోహాగ్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని అంపైర్లు ఐసీసీకు పిర్యాదు చేసారు. దింతో వెస్టిండీస్ తో జరిగిన ఒన్డే సిరీస్ ముగిసిన తరువాత అతన్ని టీం నుండి తప్పించారు. ఇక అతని బౌలింగ్ యాక్షన్ చెక్ చేసిన ఐసీసీ అఫీసియల్ గా సోహాగ్ వేసే ప్రతి బాల్ కూడా రూల్స్ కి విరుద్ధంగా ఉన్నట్టు నిర్దారించారు. దింతో ఐసీసీ అతన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి బ్యాన్ చేసింది. ఇక ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ బోర్డు కు తెలియచేసిన ఐసీసీ సోహాగ్ బౌలింగ్ యాక్షన్ సరిచేసుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి వీల్లేదని చెప్పింది. అయితే బీసీబీ పర్మిషన్ తో డొమెస్టిక్ క్రికెట్ లో ఆడిన అతను 2015వ సంవత్సరంలో తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకుని ఐసీసీ నిర్వహించిన టెస్టులో పాస్ అయ్యాడు. అయితే బ్యాడ్ లక్ కొద్దీ అతనికి బంగ్లాదేశ్ తరుపున ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Sohag Gazi

6. Shane Shillingford (West Indies)

వెస్టిండీస్ కు చెందిన ఈ స్పిన్ బౌలర్ క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తూ రెండు సార్లు బ్యాన్ అయ్యాడు. ముందుగా 2010వ సంవత్సరంలో గయానా తో జరిగిన ఒక డొమెస్టిక్ టెస్ట్ మ్యాచ్ లో అతని బౌలింగ్ యాక్షన్ రూల్స్ కు విరుద్ధంగా ఉందని రిపోర్ట్ చేసారు. దింతో ఆ ఏడాది డిసెంబర్ లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతని బౌలింగ్ యాక్షన్ ను చెక్ చేసి బ్యాన్ చేసారు. అయితే 2011వ సంవత్సరంలో తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకున్న షేన్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ 2013వ సంవత్సరంలో వెస్టిండీస్ మరియు న్యూజీలాండ్ జట్ల మధ్య ఒక టెస్ట్ జరుగుతున్నప్పుడు అతని బౌలింగ్ యాక్షన్ పై మరోసారి పిర్యాదు చేసారు. ఇక అతని బౌలింగ్ యాక్షన్ ను టెస్ట్ చేసిన ఐసీసీ షిల్లింగ్ ఫోర్డ్ రూల్స్ కు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని నిర్దారించింది. దింతో మరోసారి అతని పై విధించారు. ఇక ఆ తరువాత షిల్లింగ్ ఫోర్డ్ తన బౌలింగ్ స్టైల్ ను మార్చుకున్న వెస్టిండీస్ తరుపున ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Shane Shillingford

5. Mohammad Hafeez (Pakistan)

పాకిస్తాన్ కు చెందిన ఈ స్టార్ ఆల్ రౌండర్ ను క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసాడని 12 నెలలు పాటు బ్యాన్ చేసారు. 2014వ సంవత్సరంలో న్యూజీలాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో హఫీజ్ త్రో బౌలింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ వచ్చింది. దింతో తన బౌలింగ్ యాక్షన్ ను రీమోడల్ చేసుకున్న హఫీజ్ ఐసీసీ ను సంతృప్తిపరిచి తిరిగి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే ఆ మరుసటి ఏడాదే శ్రీలంకతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు వచ్చింది. దింతో ఐసీసీ  12 నెలలు పాటు బౌలింగ్ చేయకూడదని హఫీజ్ పై బ్యాన్ విధించింది.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Mohammad Hafeez

ఇక ఆ టైంలో ఒక ప్యూర్ బాట్స్మన్ గా పాకిస్థాన్ తరుపున ఆడిన హఫీజ్ తన బౌలింగ్ యాక్షన్ ను మరోసారి సరిచేసుకుని 2017 నుండి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే అదే ఏడాది చివర్లో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు వచ్చింది. అంతేకాకుండా ఐసీసీ నిర్వహించిన టెస్ట్ లో కూడా అతడు ఫెయిల్ అయ్యాడు. దింతో మరోసారి అతని బౌలింగ్ పై బ్యాన్ విధించారు. అయితే 2018లో తన బౌలింగ్ యాక్షన్ ను మరోసారి చేసుకున్న హఫీజ్ ఆ తరువాత పాకిస్థాన్ తరుపున ఒక ఆల్ రౌండర్ గా కొనసాగాడు.

Also Read – About “Sir” Title In Cricket (క్రికెట్ ఆడే ఆటగాళ్లకు “సర్” అనే బిరుదు ఎలా వస్తుంది?)

4. Muttiah Muralitharan (Sri Lanka)

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 1000 కన్నా వికెట్లు పడగొట్టి రికార్డు క్రియేట్ చేసిన ఈ నెంబర్ వన్ బౌలర్ 1995వ సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మురళి క్రికెట్ లో త్రో బౌలింగ్ వేస్తున్నాడని అప్పటి అంపైర్ డారెల్ హెయిర్ వరుసపెట్టి నో బాల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు. ఏకంగా ఏడూ సార్లు మురళి బౌలింగ్ లో నో బాల్ సిగ్నల్ ఇచ్చి రచ్చ రచ్చ చేసాడు. ఒకానొక టైములో అయితే శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగ తన టీం తో కలిసి ఫీల్డ్ నుండి వాక్ అవుట్ చేసాడు. అయితే కొద్దిసేపటికి ఈ గొడవ సద్దుమనగడంతో మ్యాచ్ కంటిన్యూ అయ్యింది.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Muttiah Muralitharan

కానీ ఈ మ్యాచ్ తరువాత ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన హెయిర్ మురళి ఎప్పుడు బౌలింగ్ చేసిన నో బాల్ ఇస్తా అని చెప్పాడు. దింతో ఐసీసీ మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ పై బయో కెమికల్ ఎనాలిసిస్ చేసింది. ఇక ఆ అనాలసిస్ లో మురళిధరన్ బౌలింగ్ చేసే హ్యాండ్ బెండ్ అయ్యి ఉండటం వల్ల అతను త్రో బౌలింగ్ చేస్తున్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుందే తప్ప అతని బౌలింగ్ యాక్షన్ రూల్స్ కు లోబడే ఉందని ఐసీసీ నిర్దారించింది. దింతో హెయిర్ పిర్యాదు వల్ల కొన్ని మ్యాచుల పాటు నిషేధం ఎదుర్కున్న మురళి 1996వ సంవత్సరం నుండి తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్ లో బౌలింగ్ చెయ్యడం స్టార్ట్ చేసాడు.

3. Sunil Narine (West Indies)

ఒకానొక టైములో తన మిస్టరీ స్పిన్ బౌలింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఈ వెస్టిండీస్ ఆటగాడు చాలా సార్లు క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయాడు. ముందుగా 2014వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ లో నరైన్ బౌలింగ్ యాక్షన్ పై రెండు సార్లు పిర్యాదు వచ్చింది. అలాగే 2015 ఐపీఎల్ తో పాటు అదే ఏడాది శ్రీలంక తో జరిగిన ఒక ఒన్డే మ్యాచులో నరైన్ రూల్స్ కు విరుద్ధంగా క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ చేసారు. దింతో కొన్ని మ్యాచుల పాటు బ్యాన్ ఎదురుకున్న నరైన్ తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకుని తిరిగి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే 2018లో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు వచ్చింది. అలాగే ఐపీఎల్ 2020లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఒక లీగ్ మ్యాచులో కూడా అతని బౌలింగ్ యాక్షన్ పై అంపైర్లు పిర్యాదు చేసారు. అయితే నరైన్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్ పై ఎన్నిసార్లు పిర్యాదు వచ్చిన ఎప్పటికప్పుడు దాన్ని ఈజీగా క్లియర్ చేస్తూ తిరిగి బౌలింగ్ చేస్తున్నాడు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Sunil Narine

2. Harbhajan Singh (India)

ఈ లిస్టులో మన టీమిండియాకు చెందిన బౌలర్ పేరు ఉండటం కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే 2005వ సంవత్సరంలో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో మన భజ్జి వేసిన ఒక దూస్రా వేరియేషన్ అతనికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ మ్యాచులో అంపైర్స్ గా ఉన్న అలీమ్ డార్ మరియు మార్క్ బెన్సన్ భజ్జి వేసిన దూస్రా బాల్ రూల్స్ కు విరుద్ధంగా ఉందని రిపోర్ట్ చేసారు. అంతేకాకుండా అన్ ఆఫీసియల్ గా భజ్జి 22 డిగ్రీస్ వరకు తన బౌలింగ్ హ్యాండ్ ను బెండ్ చేసి బౌలింగ్ చేస్తున్నాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దింతో భజ్జి వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహాయంతో తన బౌలింగ్ యాక్షన్ పై వర్క్ అవుట్ చేసి దూస్రా వేసినప్పుడు తన ఎల్బో ఎక్కువ బెండ్ కాకుండా సరిచేసుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ నిర్వహించిన టెస్ట్ లో పాస్ అయ్యి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన బౌలింగ్ ను కంటిన్యూ చేసాడు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Harbhajan Singh

1. Saeed Ajmal (Pakistan)

2014వ సంవత్సరంలో త్రో బౌలింగ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఈ పాకిస్థాన్ బౌలర్ ఇప్పటికి తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకోలేకపోయాడు. ఇక ఆ ఏడాది శ్రీలంక తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచులో అజ్మల్ క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని పిర్యాదు వచ్చింది. దింతో అతని బౌలింగ్ యాక్షన్ పై ఎనాలిసిస్ చేసిన ఐసీసీ అజ్మల్ క్రికెట్ లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని నిర్దారించింది. అంతేకాకుండా అతని పై బ్యాన్ కూడా విధించింది. అయితే కొంత కాలం తరువాత తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకున్న అతను పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దింతో పాత పద్దతిలోనే బౌలింగ్ చేసి మరోసారి నిషేధం ఎదుర్కున్నాడు. ఇక ఆ తరువాత తన బౌలింగ్ యాక్షన్ ను సరిచేసుకోలేకపోయిన అజ్మల్ క్రికెట్ కు దూరమయ్యాడు. దింతో అజ్మల్ 2017వ సంవత్సరంలో క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2020 లో తన బౌలింగ్ యాక్షన్ పై స్పందించిన అజ్మల్ ఐసీసీపై కోర్ట్ లో కేసు వేస్తే నేనే గెలుస్తా అంటూ జోస్యం చెప్పాడు.

క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు
క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు – Saeed Ajmal (Getty Images)

Also Read – N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)