క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి – మనకు క్రికెట్ లో ఎక్కువగా వినపడే పదం ఇది. ముఖ్యంగా వింటర్ సీజన్లో డే అండ్ నైట్ మ్యాచ్స్ ఆడినప్పుడు ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బౌలింగ్ చేయడానికి, మ్యాచ్ ఆడే రెండూ టీంలు కూడా చాలా ఎక్కువగా భయపడతాయి. ఎందుకంటే ఈ డ్యూ అనేది ప్లేయర్స్ యొక్క నేచురల్ పెర్ఫార్మన్స్ ను దెబ్బ తీస్తుంది. ముఖ్యంగా బౌలర్స్ అయితే నువ్వు రావదొమ్మ అంటూ ఈ డ్యూకు దండం పెడతారు.
దీనికి కారణం డ్యూ ఉన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన టీం ఎంత పెద్ద స్కోర్ చేసిన గానీ డిఫెండ్ చేసుకోలేక ఓడిపోతారు. సో డ్యూ అనే 12th ప్లేయర్ కు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసి సత్తా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే డ్యూ ఇస్ ది మ్యాచ్ విన్నర్ ఫర్ చేసింగ్ టీం. అయితే అసలు క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఇది ఎందుకు బౌలింగ్ టీంను ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
నైట్ టైంలో వాతావరణంలో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉండే ఎయిర్ పార్టికల్స్ ఔట్ఫిల్డ్ ను టచ్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ గా మారతాయి. పగటి పూట మన ఎర్త్ సర్ఫేస్ అనేది ఎక్కువగా హీట్ ను అబ్సర్వ్ చేసుకుని నైట్ టైంలో దాన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. దింతో నైట్ టైం చల్లగా ఉండే ఎయిర్ గ్రౌండ్ నుండి వచ్చే హీట్ కు కోల్డ్ వేపర్ స్టేజ్ నుండి వాటర్ డ్రాప్లెట్స్ గా మారి గ్రౌండ్ పై పడుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గ్రౌండ్ పై ఉండే ఐస్ లాంటి ఎయిర్ పార్టికల్స్ ఎర్త్ సర్ఫేస్ నుండి వచ్చే హీట్ వల్ల వాటర్ గా మారి సర్ఫేస్ పై ఒక తడి లేయర్ ను ఫామ్ చేస్తుంది. దీన్నే మనం క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటాం.
క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ పిచ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇక క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది పిచ్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. జనరల్ గా అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ పై లైట్ గా క్రాక్స్ వస్తాయి. దింతో పిచ్ కుంచెం స్లో అయ్యి బాల్ బ్యాట్ మీదకి రాదు. సో సెకండ్ హాఫ్ లో పిచ్ బౌలర్స్ కు అనుకూలంగా మారడంతో చేసింగ్ అనేది కష్టంగా అనిపిస్తుంది. అదే పిచ్ పై డ్యూ పడితే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న గానీ క్రాక్స్ అనేవి కనిపించవు. సెకండ్ హాఫ్ లో కూడా పిచ్ ఫ్రెష్ గా ఉంటుంది. దింతో బాల్ చాలా ఈజీగా బ్యాట్ పైకి వస్తుంది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకే పిచ్ బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే డ్యూ పడినప్పుడు పిచ్ అయితే చేసింగ్ చేసే టీంకే బాగా అనుకూలిస్తుంది. బట్ స్టిల్ ఇది చేసింగ్ టీంకు ఒక చిన్న అడ్వాంటేజ్ మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే పిచ్ తో సంబంధం లేకుండా కొంత మంది బౌలర్స్ తమ స్కిల్ ను యూస్ చేసి బౌలింగ్ చేస్తారు. అయితే ఆ స్కిల్స్ అన్ని డే టైములో మాత్రమే వర్కౌట్ అవుతాయి.
Also Read – About “Sir” Title In Cricket (క్రికెట్ ఆడే ఆటగాళ్లకు “సర్” అనే బిరుదు ఎలా వస్తుంది?)
క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల బౌలర్స్ కు ఎలాంటి నష్టం కలుగుతుంది
డ్యూ ఉంటే మాత్రం ఎంత పెద్ద స్కిల్ ఉన్న బౌలర్ అయినా సరే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ముఖ్యంగా స్పిన్నర్స్ అయితే తేలిపోతారు. ఎందుకంటే మనం పైన చెప్పుకున్నట్టు అవుట్ ఫీల్డ్ మొత్తం డ్యూ వల్ల తడిగా అయిపోతుంది. సో ఇప్పుడు బాట్స్మన్ బాల్ ను ఆ అవుట్ ఫీల్డ్ లోకి కొడితే అక్కడ ఉన్న తడి మొత్తం బాల్ కు అంటుకుంటుంది. ముఖ్యంగా బాల్ చుట్టూ ఉండే సీమ్ మెత్తగా అయిపోతుంది.
దీనివల్ల ఏ బౌలర్ కూడా బాల్ ను బలంగా గ్రిప్ చెయ్యలేడు. స్పిన్నర్స్ అయితే బాల్ రిలీజ్ చేసినప్పుడు గ్రిప్ దొరకక చాలా ఇబ్బంది పడతారు. ఒక స్పిన్నర్ బాల్ లో రివొల్యూషన్ తీసుకురావాలన్న లేదా స్పిన్ చెయ్యాలన్న గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎప్పుడైతే ఈ డ్యూ వల్ల గ్రిప్ దొరకదో అప్పుడు స్పిన్ బౌలర్స్ అంత సేఫ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా వేరియేషన్స్ ట్రై చెయ్యకుండా వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేస్తారు. దింతో బాట్స్మన్ బౌలర్ ను బాగా రీడ్ చేసి ఈజీగా బ్యాటింగ్ చేస్తూ తన వికెట్ ను కాపాడుకుంటాడు.
ఇక పేస్ బౌలర్స్ విషయానికొస్తే వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బాల్ పై సరైన గ్రిప్ దొరక్క ఒక వేరియేషన్ ట్రై చేయబోయి మరో వేరియేషన్ ను డెలివర్ చేస్తారు. ముఖ్యంగా స్లోవెర్ బాల్స్ వెయ్యడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాగే స్వింగ్ కూడా పెద్దగా దొరకదు. ఎందుకంటే ఔట్ఫిల్డ్ పై ఉండే తడి వల్ల బాల్ రెండు వైపులా షైన్ గా కనపడుతుంది. తడిగా ఉండే బాల్ నుండి స్వింగ్ రాబట్టడం అంటే దాదాపు అసాధ్యం.
దింతో పేసర్లు కూడా తమ ట్రిక్స్ వర్కౌట్ అవ్వకపోవడంతో బౌన్స్ కోసం ఎక్కువగా క్రాస్ సీమ్ వేరియేషన్ తో బౌలింగ్ చేస్తారు. బట్ పిచ్ ఫ్రెష్ గా ఉండటం వల్ల బాట్స్మన్ ఈజీగా బౌన్స్ ను అంచనా వేసి షాట్లడతాడు. సో డ్యూ పడినప్పుడు రాత్రి 9 గంటల తర్వాత బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బౌలింగ్ అనుకూలించిన గానీ డ్యూ పడితే మాత్రం సెకండ్ హాఫ్ లో ఆ పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లి వికెట్ గా మారుతుంది. అదే డ్యూ పడకపోతే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లో అయ్యి సెకండ్ హాఫ్ లో బౌలింగ్ చేసేవాళ్ళకి బాగా అనుకూలిస్తుంది.
Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)
క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ ను జయించడం ఎలా?
సో గాయిస్ చూసారుగా డ్యూ అనే ఒకేఒక్క ఫ్యాక్టర్ మ్యాచ్ ను ఎలా టర్న్ చేస్తుందో. ఇక ఈ డ్యూ నుండి తప్పించుకోవాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడం, అది కుదరకపోతే మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించడం. సో ఈ రెండింట్లో ఎదో ఒకటి జరిగితేనే ఒక టీం డ్యూ అనే 12వ ఆటగాడిని జయించగలుగుతుంది.
ఇక రీసెంట్ గా ఈ డ్యూ ఫ్యాక్టర్ ను ఎలిమినేట్ చేయడం కోసం కొన్ని గ్రౌండ్స్ యాజమాన్యాలు మ్యాచ్ కు ముందు APSA 80 అనే ఒక యాంటీ డ్యూ స్ప్రేను ఔట్ఫిల్డ్ పై కొడుతున్నారు. దీని వల్ల అయితే కొంత వరకు డ్యూ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొన్ని గ్రౌండ్స్ యాజమాన్యాలు ఈ డ్యూ ఫ్యాక్టర్ ను ఎలిమినేట్ చేయడం కోసం కింద ఫొటోలో చూపించినట్టు ఒక తాడుతో ఔట్ఫిల్డ్ లో తడిని పోగెట్టే ప్రయత్నం చేస్తారు. బట్ ఎనీవే ఈ డ్యూ ఫ్యాక్టర్ మొత్తాన్ని అది ఎలిమినేట్ చేస్తుందా అంటే అది అసాధ్యం.
Also Read – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)