N Tilak Varma Biography In Telugu (తిలక్ వర్మ బయోగ్రఫీ)

తిలక్ వర్మ బయోగ్రఫీ – మన తెలుగు గడ్డ పై నుండి అజారుద్దీన్, VVS లక్ష్మణ్, అంబటి రాయుడు మరియు హనుమ విహారి లాంటి ఎంతో మంది టాలెంటెడ్ బాట్స్మన్ ఇండియా తరుపున ఆడి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే వీరిలో కామన్ గా ఉన్న పాయింట్ అందరూ రైట్ హ్యాండ్ బాట్స్మన్. కానీ రీసెంట్ గా ఇదే తెలుగు నేల పై నుండి హైదరాబాద్ కు చెందిన ఒక లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ ఐపీఎల్లో తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపిస్తున్నాడు.

ముంబై ఇండియన్స్ తరుపున డెబ్యూ చేసి తానాడిన రెండో మ్యాచులోనే ఒక అదిరిపోయే హాఫ్ సెంచరీ కొట్టిన ఆ ప్లేయర్ తెలుగు నేల పై నుండి మరో క్రికెటర్ ఇండియన్ టీంలోకి వెళ్ళబోతున్నాడని సంకేతాలు పంపుతున్నాడు. అతనే N తిలక్ వర్మ. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి కోచింగ్ తీసుకోవడం కోసం డబ్బులు లేకపోయినా తన టేలంట్ తో క్రికెటర్ గా మారిన తిలక్ వర్మ బయోగ్రఫీ గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

తిలక్ వర్మ బయోగ్రఫీ N Tilak Varma Biography In Telugu
తిలక్ వర్మ బయోగ్రఫీ

తిలక్ వర్మ బయోగ్రఫీ

తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. అలాగే అందరూ అతన్ని ముద్దుగా తిలక్ అని పిలుస్తారు. ఇక తిలక్ 2002వ సంవత్సరం నవంబర్ 8వ తేదీన హైదరాబాద్ లోని కూకట్ పల్లి అనే ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు నంబూరి నాగరాజు. ఈయన ఒక ఎలక్ట్రీషియన్. తల్లి పేరు గాయత్రీ దేవి. ఈమొక హౌస్ వైఫ్. అలాగే అతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.

N Tilak Varma Biography In Telugu
తిలక్ వర్మ బయోగ్రఫీ – కుటుంబం

తిలక్ వర్మ బయోగ్రఫీ (బాల్యం)

ఇక తిలక్ వాళ్ళ కుటుంబం ఒక మధ్య తరగతి కుటుంబం. ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. తన తండ్రి సొంతూరు మేడ్చల్ అయితే తల్లి సొంతూరు భీమవరం. అలాగే వీళ్లిద్దరికీ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మరీముఖ్యంగా తిలక్ వర్మ తల్లి ఒక మంచి అథ్లెట్. నేషనల్ లెవెల్లో కొన్ని రన్నింగ్ పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసారు. అలాగే అతని తండ్రి కూడా ఒక మంచి అథ్లెట్. తిలక్ వాళ్ళ అన్నయ్య కూడా ఒక రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. దింతో తిలక్ వాళ్ళ ఫ్యామిలీ ఒక స్పోర్ట్స్ బాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో అతనికి చిన్న వయసు నుండే మంచి సపోర్ట్ దొరికేది.

తిలక్ కూడా చిన్నప్పుడు ఒక అథ్లెట్ లా అన్ని రకాల స్పోర్ట్స్ ను బాగా ఆడేవాడు. బట్ వయసు పెరిగే కొద్దీ సచిన్ టెండూల్కర్ మరియు రాహుల్ ద్రావిడ్ నుండి స్ఫూర్తి పొందిన తిలక్ క్రికెట్ వైపు తన ధ్యాసను మళ్లించాడు. ఏడేళ్ల వయసు నుండే టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసి గల్లీ లెవెల్లో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు.

Also Read – Ambati Rayudu Biography In Telugu (అంబటి రాయుడు బయోగ్రఫీ)

తిలక్ వర్మ బయోగ్రఫీ (క్రికెట్ కోచింగ్)

ఇక ఆ తరువాత మెల్లగా ప్రొఫెషనల్ క్రికెట్ వైపు అడుగులేద్దాం అనుకున్న తిలక్ 10 ఏళ్ల వయసులో ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతా అని తన తండ్రిని అడిగాడు. ఇరుగుపొరుగువాళ్ళు కూడా మీ అబ్బాయి గేమ్ బాగా ఆడుతున్నాడు అకాడమీలో జాయిన్ చెయ్యండి అంటూ నాగరాజు గారికి సలహాలు ఇచ్చేవారు. బట్ ఏం చేస్తాం, కొడుకుని అకాడమీలో లో జాయిన్ చెయ్యాలని తన తండ్రి ఆశపడ్డ, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు బిన్నంగా ఉండేది.

అయితే కొడుకు జీవితమే ముఖ్యమనుకున్న అతని తండ్రి ఏదోలా డబ్బులు పొదుపు చేయడం స్టార్ట్ చేసారు. పగలంతా పని చెయ్యడంతో పాటు రాత్రి సమయాల్లో కూడా ఓవర్ డ్యూటీలు చేస్తూ కొడుకు భవిష్యత్ కోసం డబ్బును కూడబెట్టారు. దింతో నాగరాజు గారు కొద్దీ రోజుల్లోనే 5999 రూపాయిల విలువ గల SS బ్యాట్ ను కొని తన కొడుక్కు అందించారు. అలాగే తిలక్ ను లింగంపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసారు. అయితే అతను అకాడమీలో జాయిన్ అయినా గానీ తన అవసరాలకు సరిపడు డబ్బు అతని తండ్రి దగ్గర ఉండేది కాదు. దింతో తిలక్ కోచింగ్ కు తరుచుగా చాలా ఎక్కువ ఆటంకాలు వచ్చేవి.

సరిగ్గా ఈ సమయంలోనే తన చిన్ననాటి కోచ్ అయినా సలాం బయాశ్ గారు అతనికి అండగా నిలిచారు. తిలక్ లోని టేలంట్ ను గుర్తించి మీ అబ్బాయి గొప్ప క్రికెటర్ అవుతాడని అతని తండ్రికి ధైర్యం చెప్పాడు. అలాగే వర్మకు కావాల్సిన వసతులతో పాటు అన్ని రకాలుగా అతనికి అవసరమయ్యే వస్తువులను సమకూర్చి ఎంతగానో సహాయం చేసారు. అంతేకాకుండా తన తండ్రి కొనిచ్చిన బ్యాట్ పాడైపోతే సలాం గారే ఆయన దగ్గర ఉన్న ఓకే స్పేర్ బ్యాట్ ను తిలక్ వర్మకు అందించారు.

తిలక్ వర్మ బయోగ్రఫీ
తిలక్ వర్మ బయోగ్రఫీ – చిన్ననాటి కోచ్ సలాం బయాశ్

ఇక అతనితో పాటు తిలక్ చదువుకుంటున్న క్రేసేంట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినా డాక్టర్ ఫహీముద్దీన్ ఖాజా గారు అతనికి ఎంతో అండగా నిలిచారు. తిలక్ మరియు సలాం కలిసి తమ స్కూల్ తో పాటు దేశానికీ కూడా మంచి పేరు తీసుకురావాలని వీళ్ళిద్దరిని బాగా ఎంకరేజ్ చేసారు. ఇక సలాం గారి దగ్గరే కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తిలక్ మొదట్లో బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేసేవాడు. అయితే అతని ఫాస్ట్ బౌలింగ్ సరిగ్గా లేదని, స్పిన్ బౌలింగ్ వేస్తే నీకు మంచి రిసల్ట్ వచ్చే ఛాన్స్ ఉందని తిలక్ చేత ఎక్కువగా స్పిన్ బౌలింగ్ వేయించేవారు.

Also Read – Why CSK And RR Banned For 2 Years From IPL (CSK & RR ఎందుకు ఐపీఎల్ నుండి 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి)

తిలక్ వర్మ బయోగ్రఫీ (జూనియర్ క్రికెట్ కెరియర్)

ఇక ఆ తరువాత కొద్దీ రోజులకే మంచి టేలంట్ ఉన్న ప్లేయర్ గా గుర్తింపు సాధించిన తిలక్ ను స్టేట్ అండర్ 14 ప్రాబబుల్స్ లో సెలెక్ట్ చేసారు. బట్ మెయిన్ స్క్వాడ్ లో మాత్రం స్థానం దొరకలేదు. కానీ నెక్స్ట్ సీజన్లో మాత్రం నేరుగా స్టేట్ అండర్ 14 కెప్టెన్ గా సెలెక్ట్ అయినా తిలక్ తానాడిన అన్ని టోర్నమెంట్స్ లో కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే మొత్తం సౌత్ జోన్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచినా వర్మకు బెస్ట్ కెప్టెన్ తో బెస్ట్ ఫీల్డర్ అవార్డులు దక్కాయి.

ఇక చిన్న వయసులోనే ఇండియా తరుపున ఆడాలని గట్టిగా సంకల్పించుకున్న తిలక్ అండర్ 14 తరువాత అండర్ 16 లో కూడా తన దూకుడును కొనసాగించాడు. మరీముఖ్యంగా దాదాపు ప్రతి మ్యాచులో కూడా గంటల తరబడి బ్యాటింగ్ చేస్తూ తన జట్టును గెలిపించే వరకు క్రీజ్ లోనే ఉండేవాడు. దింతో అతనికి 17 ఏళ్ళ వయసులోనే హైదరాబాద్ టీం తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే ఛాన్స్ వచ్చింది.

5
తిలక్ వర్మ బయోగ్రఫీ – జూనియర్ క్రికెటర్

తిలక్ వర్మ బయోగ్రఫీ (అండర్ 19 మరియు డొమెస్టిక్ కెరియర్)

ఇక తిలక్ 2018వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన ఆంధ్ర పై తన రంజీ డెబ్యూ చేసాడు. అలాగే మరుసటి ఏడాదే తన లిస్ట్ A డెబ్యూ తో పాటు సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన టీ20 డెబ్యూ కూడా చేసాడు. బట్ మొదట్లో అతనికి పెద్దగా పేరు రాలేదు. కానీ ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ కళ్ళలో పడ్డాడో అతని లైఫ్ మొత్తం మారిపోయింది. డొమెస్టిక్ లెవెల్లో తిలక్ వర్మ టేలంట్ చూసి ద్రావిడ్ సార్ అతన్ని ఇండియా అండర్ 19 టీంలోకి సెలెక్ట్ చేసారు.

ఇక అక్కడి నుండి మెల్లగా తన కెరియర్ ను బిల్డ్ చేసుకున్న తిలక్ ద్రావిడ్ సార్ కోచింగ్ లో ఒక క్వాలిటీ ప్లేయర్ గా తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన క్వాడ్రంగులర్ సిరీస్ లో 181 పరుగులు చేయడంతో పట్టు బౌలింగ్ లో కూడా నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

అయితే 2020వ సంవత్సరంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో తిలక్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. దింతో అదే వరల్డ్ కప్ లో బాగా ఆడిన బిష్ణోయ్ మరియు యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఐపీఎల్లోకి త్వరగా వచ్చారు గానీ తిలక్ వర్మ ఎంట్రీ మాత్రం లేట్ అయ్యింది. సో తిలక్ ను అయితే ఐపీఎల్ ఆక్షన్ లో ఎవరు కొనుక్కోలేదు.

అయితే 2021వ సంవత్సరంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన తిలక్ 5 మ్యాచులోనే 97 సగటుతో 391 పరుగులు సాధించాడు. అలాగే గతేడాది జరిగిన సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తన ఫామ్ ను కొనసాగించిన తిలక్ 7 మ్యాచుల్లో 215 పరుగులు సాధించాడు. సరిగ్గా ఇదే టైములో ఐపీఎల్ ఆడించేందుకు యంగ్ ప్లేయర్స్ కోసం స్కౌటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మలోని టేలంట్ ను గుర్తించింది.

Also Read – Syed Mushtaq Ali Trophy History In Telugu (సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్ర)

తిలక్ వర్మ బయోగ్రఫీ (IPL కెరియర్ ఆరంభం)

ఈ ఏడాది జరిగిన మెగా ఆక్షన్ లో CSK తో పోటీ పడి మరి 20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న తిలక్ ను ఏకంగా 1.7 కోట్ల రూపాయిల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. దింతో తిలక్ లైఫ్ ఒక్క సారిగా మారిపోయింది. ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద జట్టు అతన్ని పిక్ చేసారని తెలిసాక తిలక్ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అతని కుటుంబం ఒక్కసారిగా కోటీశ్వరుల ఫ్యామిలీ గా మారిపోయింది. అలాగే ఆక్షన్ లో వచ్చిన డబ్బుతో తన పేరెంట్స్ కు ఒక సొంత ఇల్లు కట్టించి బహుమతిగా ఇస్తా అని తిలక్ చెప్పాడు.

తిలక్ వర్మ బయోగ్రఫీ – Celebrating IPL Contract

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ పై తన డెబ్యూ చేసిన తిలక్ మొదటి మ్యాచులోనే 15 బంతుల్లో 22 పరుగులు సాధించి మంచి కేమియో ఇన్నింగ్స్ ఆడాడు. బట్ రాజస్థాన్ తో జరిగిన రెండో మ్యాచులో తన అసలైన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన తిలక్ ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఉతికారేసి ఐపీఎల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. మరీముఖ్యంగా ఒత్తిడి సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతను 19 ఏళ్ల వయసులోనే ఎదో 100 మ్యాచుల అనుభవం ఉన్న ఆటగాడిలా చాలా కూల్ గా సిక్సర్లు బాదేశాడు. 33 బంతుల్లోనే 61 పరుగులు సాధించి దాదాపు ముంబైను గెలిపించినంత పని చేసాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ ఆ మ్యాచులో అతను అవుట్ అయినా తరువాత మిగతా బాట్స్మన్ ఫెయిల్ అవ్వడం వల్ల ముంబై టీం ఓడిపోయింది.

తిలక్ వర్మ ఆటతీరు చూస్తుంటే చాలా తక్కువ రోజుల్లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలా కనబడుతున్నాడు. మరి ముఖ్యంగా పప్రెసెంట్ అతను ఆడుతున్న ముంబై టీం కెప్టెన్ మరియు మన టీమిండియా కెప్టెన్ ఒకరే కాబట్టి, తిలక్ గనుక ఈ సీజన్ మొత్తం నిలకడగా ఆడి రోహిత్ ను ఇంప్రెస్స్ చేయగలిగితే ఈ ఏడాది వరల్డ్ కప్ లోనే అతనికి ఛాన్స్ రావొచ్చు. ఇక తిలక్ వర్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అతను లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసిన బౌలింగ్ మాత్రం రైట్ హ్యాండ్ తో వేస్తాడు. సో తన ఫేవరిట్ క్రికెటర్ అయినా సురేష్ రైనా ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తిలక్ అతనిలానే టీమిండియా తరుపున ఒక గొప్ప క్రికెటర్ గా పేరు సంపాదించాలని కలలు కంటున్నాడు. చూడాలి మరి మన తెలుగు తేజం తిలక్ వర్మ తన అనుకున్న డ్రీంను చేరుకుంటాడో లేదో.

Also Read – Watch 10 Rare Funny Moments In Cricket