అంబటి రాయుడు బయోగ్రఫీ – అది 2019వ సంవత్సరం. ఇంగ్లాండ్ లో జరగబోయే ఒన్డే వరల్డ్ కప్ కు ఇండియా జట్టును ప్రకటించారు. ఊహ తెలిసిన దగ్గర నుండి క్రికెట్ నే ప్రాణంగా భావిస్తూ ఎప్పటికైనా ఇండియా తరుపున వరల్డ్ కప్ ఆడాలని కలలు కన్నా ఒక ఆటగాడు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు, నా పేరు ఎప్పుడు వస్తుందా అని. కానీ ఆ ప్లేయర్ కన్నా కలలను తునాతునకలు సెలెక్టర్స్ అతనికి షాక్ ఇచ్చారు. వరల్డ్ కప్ లో ఆడేందుకు అన్ని అర్హతలు ఉన్న గానీ నీ కంటే మాకు 3 డైమెన్షనల్ ఆటగాడే ముఖ్యమంటూ అతన్ని టీం నుండి తప్పించారు. ఈవెన్ వరల్డ్ కప్ మధ్యలో కొంతమంది ఆటగాళ్ళకు గాయాలైన స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న అతన్ని కాదని మరో కొత్త ప్లేయర్ ను టీంలోకి తీసుకున్నారు. దింతో తన కల ఎప్పటికి నెరవేరదని గ్రహించిన ఆ ఆటగాడు విరిగిన మనసుతో 33 ఏళ్లకే తాను ప్రాణంగా భావించిన ఆటకు వీడ్కోలు పలికాడు.
అపారమైన ప్రతిభ, టన్నుల కొద్దీ పరుగులు, ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు ఇలా ఎంత టాలెంట్ ఉన్న గానీ బీసీసీఐ లో జరిగిన కొన్ని పాలిటిక్స్ కారణంగా తన క్రికెట్ కెరియర్ ను కోల్పోయిన ఆ ఆటగాడే మన తెలుగు తేజం అంబటి రాయుడు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి 16 ఏళ్లకే తన రంజీ డెబ్యూ చేయడంతో పాటు 18 ఏళ్లకే మన టీమిండియా అండర్ 19 కెప్టెన్ గా మారిన రాయుడు ఒకానొక టైంలో అయితే జూనియర్ సచిన్ టెండూల్కర్ గా పేరు సంపాదించాడు. మరి అలాంటి రాయుడుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఒక లెజెండ్ గా మారాల్సిన క్రికెటర్ ఎందుకు 33 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలు రాయుడు తన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఫేస్ చేసాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మనం అంబటి రాయుడు బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం.
అంబటి రాయుడు బయోగ్రఫీ
అంబటి రాయుడు బయోగ్రఫీ – బాల్యం
రాయుడు పూర్తి పేరు అంబటి తిరుపతి రాయుడు. అలాగే అతన్ని అందరూ ముద్దుగా అంబ అని పిలుస్తారు. ఇక రాయుడు 1985వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు అంబటి సాంబశివ రావు. ఈయన పురాతన డాక్యూమెంట్లు భద్రపరిచే ఆర్కైవ్స్ డిపార్టుమెంట్ లో ఒక ఎంప్లొయ్ గా పనిచేసేవారు. తల్లి పేరు విజయలక్ష్మి. ఈమొక హౌస్ వైఫ్. ఇక రాయుడు ఈ దంపతులకు జన్మించిన ఒకే ఒక్క సంతానం. దింతో అతన్ని చిన్న వయసునుండే చాలా గారాబంగా పెంచారు. ఇక రాయుడు తండ్రి సాంబశివ రావు గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. రాయుడు పుట్టినప్పుడే తన కొడుకుని ఒక గొప్ప క్రికెటర్ గా చూడాలనుకున్నాడు. అలాగే తన కొడుక్కి ఊహ తెలియని వయసు నుండే రాయుడు చేతిలో బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడమని బాగా ఎంకరేజ్ చేసేవారు. దింతో రాయుడు కూడా చిన్న వయసు నుండే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసి తన బ్యాటింగ్ తో అతని తండ్రిని ఎంతోగానో సంతోషపెట్టేవాడు.
ఇక కొడుకు ఆట చూసి మురిసిపోయిన సాంబశివ రావు గారు రాయుడు కు ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ప్రొఫెషనల్ క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించాలని బలంగా ఫిక్స్ అయ్యారు. దింతో హైదరాబాద్ ఫార్మర్ క్రికెటర్ అయినా విజయ్ పాల్ గారి ఆద్వర్యంలోని ఒక కోచింగ్ కాంప్ లో రాయుడుని జాయిన్ చేసారు. అంతేకాకుండా ప్రతి రోజు స్కూటర్ పై తన కొడుకుని అకాడమీ కు తీసుకొచ్చి ఎంతో శ్రద్దగా రాయుడు బ్యాటింగ్ ను వీక్షించేవారు.
ఇక చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగిన రాయుడు కు కుంచెం పౌరుషం ఎక్కువ. ఎంతైనా గుంటూరు మిర్చి కారం తిన్న కుర్రాడు కదా ఆ మాత్రం ఉంటుంది. బట్ ఆట దగ్గరకి వచ్చే సరికి మాత్రం రాయుడు చాలా సిన్సియర్ గా ఉండేవాడు. తన కోచ్ ఒక బ్యాటింగ్ టెక్నీక్ చెప్పి దాన్ని ప్రాక్టీస్ చెయ్యమంటే, ఎండను సైతం లెక్కచెయ్యకుండా గంటల తరబడి నెట్స్ లో ప్రాక్టీస్ చేసేవాడు. రాయుడు పట్టుదల చూసి ఒక్కోసారి అతని కోచ్ కూడా ఆశ్చర్యపడేవాడు. అంత చిన్న వయసులోనే ఇంత డెడికేషన్ తో ఆట నేర్చుకుంటున్నాడంటే మీ కొడుకు ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ అవుతాడని రాయుడు తండ్రికి చెప్పేవారు.
ఇక రాయుడు డెడికేషన్ దెబ్బకి కేవలం 10 ఏళ్ల వయసులోనే అతనొక ప్రొఫెషనల్ బాట్స్మన్ అయిపోయాడు. బ్యాటింగ్ లో తన కోచ్ చెప్పిన టెక్నీక్స్ అన్నింటిని ఒడిసిపట్టుకున్న రాయుడు బౌలర్స్ ను ఉతికి ఆరేసేవాడు. ఇక అతని బ్యాటింగ్ చూసి అబ్బురపడిన పాల్ గారు రాయుడును అండర్ 13 విభాగంలో ఆడించడం స్టార్ట్ చేసారు. అలాగే అతనికి 13 ఏళ్ల వయసు వచ్చేసరికి డైరెక్ట్ గా అకాడమీలోని సీనియర్ ప్లేయర్స్ తో కలిపి క్రికెట్ ఆడించేవారు. ఇక సికింద్రాబాద్ లోని Bhavan’s Sri Ramakrishna Vidyalaya అనే స్కూల్లో చదువుకున్న రాయుడు అండర్ 15 విభాగంలో పరుగులు వరద పారించాడు. 2000వ సంవత్సరంలో అయితే ACC టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా నిలిచి అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే తనకున్న అపారమైన ప్రతిభ కారణంగా కేవలం 16 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ ఆడేందుకు హైదరాబాద్ టీంలో స్థానం దక్కించుకున్నాడు.
Also Read – 5 Habits Of Mentally Strong People (ఈ ఐదు అలవాట్లు ఉంటే మీకు బలమైన మానసిక శక్తి ఉందని అర్ధం)
అంబటి రాయుడు బయోగ్రఫీ – డొమెస్టిక్ కెరియర్
ఇక 2002వ సంవత్సరం జనవరి నెలలో తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన రాయుడు ఆ ఏడాది ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ అతని బ్యాటింగ్ ఎబిలిటీను గుర్తించిన సెలెక్టర్లు రాయుడును ఇండియా అండర్ 17 మరియు అండర్ 19 టీమ్స్ లో ఆడేందుకు ఎంపిక చేసారు. సరిగ్గా ఈ సమయంలోనే 2002 రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన రాయుడు ఏకంగా 69.8 ఏవరేజ్ తో 698 పరుగులు సాధించాడు. అలాగే ఆంధ్ర పై ఒకే టెస్ట్ మ్యాచులో డబుల్ సెంచరీ తో పాటు సెంచరీ కూడా సాధించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసాడు. అలాగే 2003వ సంవత్సరంలో ఇండియా A టీం తరుపున 82 పరుగుల ఏవరేజ్ తో బ్యాటింగ్ చేసి టీమిండియా భవిష్యత్తు స్టార్ గా పేరు సంపాదించాడు.
ఇక రాయుడు బ్యాటింగ్ చూసి ఇంప్రెస్స్ అయినా ఇండియన్ సెలెక్టర్స్ అతన్ని అండర్ 19 టీంకు కెప్టెన్ గా నియమించారు. అయితే 2004వ సంవత్సరంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియాను సెమీ ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన రాయుడు బ్యాట్ తో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక ఆ అండర్ 19 వరల్డ్ కప్ లో సురేష్ రైనా, శిఖర్ ధావన్, RP సింగ్, రాబిన్ ఊతప్ప మరియు దినేష్ కార్తీక్ లాంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు మన రాయుడు కెప్టెన్సీ లో ఆడారు. సో 2004వ సంవత్సరం వరకు రాయుడు క్రికెట్ కెరియర్ చాలా ఉన్నత స్థాయిలో సాగింది.
కానీ 2005వ సంవత్సరం నుండి రాయుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ టీంలో అతనంటే నచ్చని కొంతమంది లోకల్ ప్లేయర్స్ రాయుడు వీక్నెస్ అయినా తన కోపాన్ని ఒక ఆయుధంగా వాడుకుని అతన్ని తొక్కేసి ప్రయత్నం చేసారు. సరిగ్గా ఈ సమయంలోనే హైదరాబాద్ కోచ్ అయినా రాజేష్ యాదవ్ మరియు రాయుడు మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. ఇక గొడవలన్నింటి మధ్య హైదరాబాద్ టీం నుండి బయటకి వచ్చేయాలని ఫిక్స్ అయినా రాయుడు ఆంధ్రా టీంలో చేరాడు.
ఇక 2006వ సంవత్సరంలో హైదరాబాద్ తో జరిగిన ఒక రంజీ మ్యాచులో ఆ టీం కెప్టెన్ గా ఉన్న అర్జున్ యాదవ్ రాయుడు తో కావాలని గొడవ పెట్టుకుని అతని పై స్టంప్ తో దాడి చేసాడు. అంతేకాకుండా వీళ్లిద్దరు గ్రౌండ్ లోనే కొట్టుకున్నారు. దింతో ఈ గొడవ కాస్త బీసీసీఐ వరకు వెళ్లి రాయుడు కెరియర్ కు చాలా డేమేజ్ చేసింది. అయితే అర్జున్ యాదవ్ తండ్రి శివలాల్ యాదవ్ అప్పటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ కావడంతో అతను ఈజి గా ఈ గొడవ నుండి తప్పించుకున్నాడు. ఇక కొన్ని రోజులు తరువాత ఈ గొడవ సద్దుమణగడంతో రాయుడు మళ్ళీ హైదరాబాద్ టీంలో జాయిన్ అయ్యాడు. కానీ ఆ టైములో అతనికి Knee ఇంజురీ కావడంతో ఎక్కువ మ్యాచులు ఆడలేకపోయాడు. అలాగే ఆ తరువాత జరిగిన డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో కూడా బ్యాట్ తో ఫెయిల్ అయ్యాడు.
ఇక 2007వ సంవత్సరంలో లెజెండరీ క్రికెటర్స్ అంత కలిసి మారుమూల ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ ను వెలికి తియ్యడం కోసం ది రెబెల్ ఇండియన్ క్రికెట్ లీగ్ ను ఇంట్రడ్యూస్ చేసారు. ఇంటర్నేషనల్ లెజెండరీ క్రికెటర్స్ అంత ఆడుతున్నారు కాబట్టి ఈ లీగ్ లో ఆడేందుకు రాయుడు తో పాటు మరికొంత మంది డొమెస్టిక్ క్రికెటర్లు ముందుకొచ్చారు. అయితే ఈ లీగ్ కు బీసీసీఐ కు వ్యతిరేకం. ఎందుకంటే ఇదొక నాన్ ప్రాఫిటబుల్ టోర్నమెంట్. దీని నుండి బీసీసీఐకు ఒక్క పైసా కూడా వెళ్ళదు. అంతేకాకుండా ఈ లీగ్ ఐడియాను కాపీ కొట్టిన బీసీసీఐ సేమ్ ICL బ్లూ ప్రింట్ తోనే ఐపీఎల్ అనే లీగ్ ను స్టార్ట్ చేసింది. అలాగే ICL ను తొక్కేయడం కోసం ఆ లీగ్ లో ఆడే ఆటగాళ్లను బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అన్ని టోర్నీల నుండి బ్యాన్ చేస్తామని ఒక కండిషన్ పెట్టింది. దింతో చాలా మంది లోకల్ ప్లేయర్స్ ఈ లీగ్ నుండి తప్పుకున్నారు.
కానీ రాయుడు మాత్రం ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 ఏళ్ల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడేకన్నా, మూడేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, అలాగే తన ప్రతిభ ను టీవీల్లో జనాలు కళ్లారా చూస్తారని బీసీసీఐకు వ్యతిరేకంగా హైదరాబాద్ హీరోస్ తరుపున ICL లో ఆడాడు. ఇక బీసీసీఐ చెప్పినట్టే రాయుడు తో పాటు మరో 79 మంది ఆటగాళ్ళని బ్యాన్ చేసింది. ఇక ఐపీఎల్ స్టార్ట్ అయినా తరువాత icl కూడా తన ప్రాముఖ్యతను కోల్పోయి అది స్టార్ట్ అయినా మూడు సంవత్సరాలకే నామరూపాలు లేకుండా పోయింది. దింతో బీసీసీఐ కూడా 2009వ సంవత్సరంలో ఆ 79 ఆటగాళ్ల పై నిషేధం ఎత్తివేసింది. ఇక ఆ తరువాత డొమెస్టిక్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రాయుడు హైదరాబాద్ తరుపున డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. దింతో 2010వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ ఆక్షన్ లో రాయుడు ను కొనుగోలు చేసింది.
ఇక ఆ సీజన్లో మొత్తం 356 పరుగులు సాధించిన రాయుడు ముంబై ఇండియన్స్ సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. బట్ స్టిల్ అతన్ని నేషనల్ టీంలోకి సెలెక్ట్ చెయ్యలేదు. దింతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉంటె నన్ను ఎలానూ తొక్కేస్తారని భావించిన రాయుడు బరోడా తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. అలాగే జట్టులో స్థానం కోసం వికెట్ కీపింగ్ కూడా నేర్చుకున్నాడు.
Read More – Top 10 Most Popular Sports In The World Telugu (ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు)
ఇక 2010-11 రంజీ సీజన్లో బరోడా తరుపున బరిలోకి దిగిన రాయుడు ఏకంగా 56 సగటుతో బ్యాటింగ్ చేసాడు. అలాగే ఆ మరుసటి ఏడాది కూడా 48 సగటుతో బ్యాటింగ్ చేసి పరుగులు వరద పారించాడు. ఇక ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రాయుడు మరోసారి టీమిండియా తలుపు తట్టాడు. బట్ సెలెక్టర్స్ అతని పై కరుణ చూపించలేదు. 2012 టీ20 వరల్డ్ కప్ కోసం 30 మంది ప్రాబబుల్స్ లో అతన్ని సెలెక్ట్ చేసిన గానీ మెయిన్ స్క్వాడ్ నుండి తప్పించారు. అయితే తొక్కేసి కొద్దీ ఎగసిపడే అలల బౌన్స్ బ్యాక్ అయినా రాయుడు 2012 రంజీ సీజన్లో ఏకంగా 60 సగటుతో 666 పరుగులు సాధించాడు. సరిగ్గా ఇదే టైములో ICL లో ఒకప్పుడు మెంబెర్ గా ఉన్న సందీప్ పాటిల్ టీమిండియా సెలెక్టర్ గా బాధ్యతలు చెప్పట్టారు. దింతో రాయుడుకు ఎట్టకేలకు మన టీమిండియాలో చోటు దొరికింది. బట్ ఇనీషియల్ గా అతనికి అవకాశాలు రాలేదు. టీంతో పాటు ఎంత కాలం ఉన్న గానీ ప్లేయింగ్ 11 లో మాత్రం చోటు దొరికేది కాదు.
అంబటి రాయుడు బయోగ్రఫీ – అంతర్జాతీయ కెరియర్
2013వ సంవత్సరంలో మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత సీనియర్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చినప్పుడు రాయుడు జింబాబ్వే పై తన ఒన్డే డెబ్యూ చేసాడు. 18 ఏళ్లకే టీమిండియా అండర్ 19 కెప్టెన్ గా మారిన రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేసేందుకు ఒక దశాబ్ద కాలం పాటు బీసీసీఐ తో పోరాడాల్సి వచ్చింది. ఇక ఆ ఏడాది జూలై 24వ తేదీన జింబాబ్వే పై తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రాయుడు ఆ మ్యాచ్ల్లో 63 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. బట్ మళ్ళీ సేమ్ స్టోరీ.
మిడిలార్డర్ లో రాయుడు ఎంత నిలకడగా రాణించిన టీం మేనేజ్మెంట్ మాత్రం అతనికి ప్లేయింగ్ 11 లో ఆడేందుకు ఛాన్స్ ఇచ్చేది కాదు. ఎవరైనా ప్లేయర్ గాయపడితేనో లేదా ఎవరికైనా రెస్ట్ ఇచ్చినప్పుడో అతనికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వచ్చేది. అయితే ఐపీఎల్లో మాత్రం ముంబై టీం అతన్ని బాగా గ్రూమ్ చేసింది. రాయుడుకు తరుచుగా అవకాశాలు కలిపిస్తూ అతన్ని ఒక మంచి ఫినిషర్ గా తీర్చిదిద్దింది. దింతో రాయుడు మన టీమిండియా టీ20 టీంలో చోటు సంపాదించి 2014వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఇంగ్లాండ్ పై తన టీ20 డెబ్యూ చేసాడు. అలాగే అదే ఏడాది శ్రీలంక తో జరిగిన ఒక ఒన్డే మ్యాచ్ తన మొట్టమొదటి సెంచరీని కూడా సాధించాడు. దింతో అతను టీంఇండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడని అందరూ భావించారు. అయితే బ్యాడ్ లక్ కొద్దీ అతనికి మరోసారి knee ఇంజురీ అయ్యింది. దింతో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి రాయుడును పూర్తిగా పక్కన పెట్టేసారు.
అతనికి వన్డేల్లో దాదాపు 50 సగటు ఉన్న గానీ సరైన అవకాశాలు ఇచ్చేవారు కాదు. దింతో దాదాపు మూడేళ్ళ పాటు టీంలోకి వస్తూ పోతూ సాగిన రాయుడు ప్రయాణం 2018వ సంవత్సరంలో ఊపు అందుకుంది. ఆ ఏడాది ఐపీఎల్లో csk టీం తరుపున 600 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రాయుడు మన టీమిండియాను నెంబర్ 4 సమస్యకు ఒక పరిష్కారంల కనిపించాడు. దింతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 2019 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రాయుడు ను బ్యాక్ చేసాడు. ఇక అతను కెప్టెన్ నమ్మకాన్ని వొమ్ము చెయ్యకుండా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా తో జరిగిన ఒన్డే సిరీస్ లో ఒక మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి అతన్ని వరల్డ్ కప్ కు సెలెక్ట్ చెయ్యలేదు.
మన టీమిండియా చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ మాకు వరల్డ్ కప్ కు బ్యాటింగ్ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో ఆడగలిగే సత్తా ఉన్న 3d ప్లేయర్ కావాలని విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేసారు. దింతో ఆ టైంలో తన కల చెదిరిపోయిందనే బాధలో రాయుడు 3d ట్వీట్ పెట్టడం, బీసీసీఐ ఇంకా అతని పై పగ పెంచుకుని మెయిన్ టీంలో ధావన్ మరియు శంకర్ గాయపడ్డ గాని స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న రాయుడు ను టీంలోకి తీసుకోకుండా ఒక్క ఒన్డే మ్యాచ్ అనుభవం కూడా లేని మయాంక్ అగర్వాల్ ను స్క్వాడ్ లోకి తీసుకోవడం జరిగిపోయింది. దింతో తీవ్ర మనోవేదనకు గురైన రాయుడు ఆ వరల్డ్ కప్ జరుగుతున్నప్ప్పుడే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో 47 ఏవరేజ్ ఉన్న గానీ టీంలో ప్లేస్ ఎందుకు ఇవ్వలేదంటూ అప్పట్లో సెలెక్టర్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బట్ ఎన్ని జరిగిన వరల్డ్ కప్ లో ఆడాలనే రాయుడు కల మాత్రం నెరవేరలేదు.
ఎంత టాలెంట్ ఉన్న బోర్డులో పాలిటిక్స్ కారణంగా అర్దాంతరంగా తన కెరియర్ ను ముగించవల్సి వచ్చింది. ఇక ప్రెసెంట్ డొమెస్టిక్ క్రికెట్ వరకు తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న రాయుడు ఐపీఎల్లో CSK తరుపున ఆడుతున్నాడు. ఏదిఏమైనా మన ఇండియన్ క్రికెట్ మంచి టాలెంట్ ఉన్న ఒక మిడిలార్డర్ బాట్స్మన్ ను కోల్పోయింది.
అంబటి రాయుడు బయోగ్రఫీ – పర్సనల్ లైఫ్
ఇక రాయుడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2009వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన చెన్నుపల్లి విద్య అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు. రాయుడుకి చిన్న వయసు నుండి కోపం అనే వీక్నెస్ ఉండటంతో చాలా సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. తోటి ప్లేయర్స్ రెచ్చగొట్టినప్పుడు వాళ్ళతో గొడవకు దిగడం, అంపైర్ తప్పుడు నిర్ణయాలు ఇచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం వంటి పనులు చేసేవాడు. దీని వళ్ళైతే రాయుడు తన కెరియర్లో చాలా సమస్యలు ఎదుర్కున్నాడు. అదే తను గనుక తన వీక్నెస్ ను జయించి ఉండుంటే వన్ ఆఫ్ ది లెజెండరీ బాట్స్మన్ గా చరిత్రలో నిలిచిపోయేవాడు. ఇక రాయుడుకు క్రికెట్ తో పాటు మ్యూజిక్ వినడం మరియు ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక అతని క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, VVS లక్ష్మణ్ మరియు స్టీవ్ వా. సో ఇది గాయిస్ మన తెలుగు తేజం అంబటి రాయుడు యొక్క అంటోల్డ్ లైఫ్ స్టోరీ.