ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 క్రీడలు గురించి తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో క్రీడల పాత్ర చాలా ఎక్కువ అని మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో కొంతమంది క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. అందుకే ప్రతి యువకుడు కూడా ప్రసిద్ధ క్రీడాకారుడు కావాలని తహతహలాడతాడు. అయితే వాస్తవానికి చాలా రకాల క్రీడలు అందుబాటులో ఉన్నాయి. దింతో ఏ క్రీడను కెరియర్ గా ఎంచుకోవాలనేది ప్రతి ఒక్కరిలో ఉండే సందేహం. కాబట్టి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 క్రీడలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ఇటీవలి కాలంలో కొన్ని పాతకాలపు క్రీడలు కూడా ప్రీమియర్ లీగ్‌ల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందాయి. అలాగే వాటి వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని పాత క్రీడలు మాత్రం ఎప్పటినుండో ఉల్లాసపరుస్తూ బిలియన్ల కొద్దీ అభిమానులను కలిగి ఉన్నాయి. ఏదిఏమైనా ప్రస్తుత తరంలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 క్రీడలు గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 క్రీడలు
- 10. అమెరికన్ ఫుట్‌బాల్ & రగ్బీ – 41 కోట్ల మంది అభిమానులు
- 9. బేస్ బాల్ – 50 కోట్ల మంది అభిమానులు
- 8. కబడ్డీ – 55 కోట్ల మంది అభిమానులు
- 7. టేబుల్ టెన్నిస్ – 85 కోట్ల మంది అభిమానులు
- 6. వాలీబాల్ – 90 కోట్ల మంది అభిమానులు
- 5. టెన్నిస్ – 100 కోట్ల మంది అభిమానులు
- 4. హాకీ – 200 కోట్ల మంది అభిమానులు
- 3. బాస్కెట్ బాల్ – 220 కోట్ల మంది అభిమానులు
- 2. క్రికెట్ – 250 కోట్ల మంది అభిమానులు
- 1. ఫుట్బాల్ – 350 కోట్ల మంది అభిమానులు
10. అమెరికన్ ఫుట్‌బాల్ & రగ్బీ – 41 కోట్ల మంది అభిమానులు
చాలా మంది ఈ రెండు స్పోర్ట్స్ ను ఒకటే అనుకుంటారు. కానీ రగ్బీ వేరు అమెరికన్ ఫుట్బాల్ వేరు. రెండిటికి కుంచెం తేడా ఉంది. రూల్స్ కూడా ఈ రెండు ఆటలకు ఒకేలా ఉండవు. అమెరికన్ ఫుట్బాల్ విషయానికొస్తే ఈ ఆటలో ఒక టీంకు 11 మంది ఆటగాళ్ల చెప్పున ఆడతారు. అదే రగ్బీ అయితే ఒక టీంకు 15 మంది ఆటగాళ్ల చెప్పున ఆడతారు. ఇక అమెరికన్ ఫుట్బాల్ ను 60 నిమిషాల పాటు ఆడితే రగ్బీ ఆటను 80 నిముషాలు పాటు ఆడతారు.
ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే ఈ రెండు ఆటల్లో కొబ్బరికాయ ఆకారంలో ఉండే బంతిని ప్రత్యర్థి టీం యొక్క ఎండ్ లైన్ అవతలకి పట్టుకెళ్లి గోల్ సాధించాలి. అలాగే ఫౌల్స్ ఏమైనా జరిగినప్పుడు ఈ రెండు ఆటల్లో కూడా ఫ్రీ కిక్ ఉంటుంది. ఇక అమెరికా తో పాటు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు యూరప్ వంటి దేశాల్లో ఈ రెండు ఆటలు ఎక్కువ ప్రజాదరణ సంపాదించాయి. అది ఎంతలా అంటే ఈ రెండు ఆటలను ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 41 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
9. బేస్ బాల్ – 50 కోట్ల మంది అభిమానులు
క్రికెట్ ను పోలి ఉండే ఈ ఆటను ఎక్కువగా అమెరికా, జపాన్ మరియు క్యూబా వంటి దేశాల్లో ఆడతారు. ఒక టీంకు 9 మంది చెప్పున ఆడే ఈ ఆటలో మొత్తం 9 ఇన్నింగ్స్ లు నిర్వహించి మ్యాచ్ ఫలితాన్ని రాబడతారు. అంటే ఈ ఆట టైం బేస్ మీద ఆడే ఆట కాదు. కానీ ఒక ఇన్నింగ్స్ ను ఇంత టైంలో కంప్లీట్ చెయ్యాలని కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇన్నింగ్స్ ఆలస్యంగా ముగిస్తే ఆ టీంకు పెనాల్టీ వేస్తారు గానీ ఫైనల్ రిసల్ట్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఈ ఆటలో పిచ్చర్ విసిరిన బాల్ ను బేటర్ బలంగా కొట్టాలి. ఆ తరువాత కౌంటర్ క్లాక్ వైస్ డైరెక్షన్ లో ఒక సిరీస్ లో ఉండే నాలుగు బేసెస్ ను కవర్ చేస్తూ రన్స్ స్కోర్ చెయ్యాలి.
అలాగే ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్ మరియు హోమ్ ప్లేట్ అని పిలిచే ఈ నాలుగు బేసెస్ దగ్గర ఒక్కో బాట్స్మన్ ఉంటాడు. సో స్ట్రైకర్ బాల్ ను కొట్టిన తరువాత మొత్తం నాలుగు బేసెస్ దగ్గర ఉన్న ఆటగాళ్లు రన్నింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి దగ్గరగా ఉండే తరువాత బేస్ కు రీచ్ అవ్వాలి. అయితే ఈ లోపు ఫీల్డింగ్ టీం బాల్ ను పట్టుకుని ఒక బాట్స్మన్ బేస్ దగ్గరికి వెళ్లే లోపే అతన్ని ముట్టుకుంటే ఆ బ్యాట్సమన్ ను అవుట్ గా పరిగణిస్తారు. అలాగే ఆ పరుగును కూడా స్కోర్ బోర్డులో జమ చెయ్యరు. సో చాలా థ్రిల్లింగ్ గా ఉండే ఈ ఆటను ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 50 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమెరికా జాతీయ క్రీడ అయినా ఈ ఆటను ఆ దేశం వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడతారు.
8. కబడ్డీ – 55 కోట్ల మంది అభిమానులు
మన ఆసియా ఖండానికి చెందిన ఈ ఆటకు ఒక దశాబ్దం క్రిందట వరకు పెద్దగా ప్రజాదరణ లేదు. అయితే 2014వ సంవత్సరంలో మొదలైన ప్రో కబడ్డీ లీగ్ ఈ ఆటను వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇండియాలో ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్ గా పేరు సంపాదించిన ఈ ప్రో కబడ్డీ ఆట ప్రస్తుతం ఆసియా దేశాలను ఉర్రుతలూగిస్తుంది. ఒక టీంకు ఏడుగురు ఆటగాళ్ల చొప్పున మొత్తం 40 నిముషాలు పాటు ఆడే ఈ ఆటలో పాయింట్స్ ఆధారంగా మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తారు. ఇక ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే ఈ ఆటలో రైడర్ కూత కూస్తూ ప్రత్యర్థి జట్టు కోట్ లోకి వెళ్లి పాయింట్లు సాధించుకుని రావాలి. అది కూడా 30 సెకండ్స్ లో.
ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఢిఫెండర్లు రైడింగ్ కు వచ్చిన రైడర్ ను తన కోట్ లోకి వెళ్లకుండా పట్టుకోగలిగితే ఆ ఆటగాణ్ణి అవుట్ గా పరిగణిస్తారు. సో కేవలం 40 నిమషాలు మాత్రమే ఉండే ఈ ఆట అభిమానులను ప్రతి సెకండ్ కూడా ఉర్రూతలుగిస్తుంది. ఒక్కోసారి అయితే ఈ ఆట ఆడే ఆటగాళ్ల హార్ట్ బీట్ కన్నా చూసే వాళ్ళ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇక ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 కోట్ల మంది అభిమానులు కలిగి ఉన్న కబడ్డీ ఆట భవిష్యత్తులో ఒలింపిక్స్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. ఒకవేళ అదే గనుక జరిగితే ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రసిద్ధగాంచి ఈ లిస్టులో ఇంకా మెరుగైన స్థానానికి వెళ్లే అవకాశముంది.
ఇంకా చదవండి – Signs Of Fake Friend In Telugu (ఫేక్ ఫ్రెండ్ కి ఉండే 7 లక్షణాలు)
7. టేబుల్ టెన్నిస్ – 85 కోట్ల మంది అభిమానులు
ప్రపంచ క్రీడల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆటను అతి తక్కువ ప్లేయింగ్ ఏరియా ఆడతారు. ఈ టేబుల్ టెన్నిస్ ఆటను పింగ్ పాంగ్ అని కూడా పిలుస్తారు. ఇక మొత్తం ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఈ టేబుల్ టెన్నిస్ ఆడతారు. దాదాపు మూడు (2.74m) మీటర్ల పొడవు మరియు ఒకటిన్నర (1.525m) మీటర్ల వెడల్పు కలిగిన ఒక ప్లే వుడ్ బోర్డ్ పై మధ్యలో ఒక చిన్న నెట్ కట్టి ఈ ఆటను ఆడతారు.
ఒక ప్లేయర్ బాల్ ను సెర్వ్ చేసిన తరువాత అది ప్రత్యర్థి ఆటగాడి కోట్ లో ఒకసారి బౌన్స్ అయినా తరవాతే రెండో ఆటగాడు ఆ బాల్ ను స్ట్రైక్ చెయ్యాలి. సో బాల్ వెనక్కు మరియు ముందుకు ప్రయాణం చేసే ఈ ఆటలో చివరికి ఎవరు ఎక్కువ సెట్లు గెలిచారు అనే దాన్ని బేస్ చేసుకుని ఫలితాన్ని నిర్ణయిస్తారు. అంటే ఈ ఆట కూడా టైం లిమిట్ తో సంబంధం లేకుండా ఆడతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్దిగాంచిన ఉన్న ఈ టేబుల్ టెన్నిస్ ను ఒక అంచనా ప్రకారం మొత్తం 85 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మన ఆసియా దేశాలతో పాటు యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల్లో ఈ టేబుల్ టెన్నిస్ ను ఎక్కువగా ఆదరిస్తారు.
6. వాలీబాల్ – 90 కోట్ల మంది అభిమానులు
మొత్తం 12 మంది ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఆడే ఈ ఆటకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఒలింపిక్స్ లో ఒక పార్ట్ అయినా వాలీబాల్ చాలా రకాల కోర్ట్స్ లో ఆడతారు. కానీ పెద్ద పెద్ద మ్యాచులన్నీ మాత్రం ఒక ఇండోర్ స్టేడియంలో సాధారణంగా ఆడే కోర్ట్ లోనే ఆడతారు. ఇక 18 మీటర్ల పొడవు మరియు 9 మీటర్ల వెడల్పు ఉన్నధీర్ఘ చతురస్ర ప్రాంతాన్ని ఒక నెట్ తో సమానంగా విభజించి ఈ ఆటను ఆడతారు.
ఒక టీం ఆటగాడు తమ కోర్ట్ బయట నుండి బాల్ ను సెర్వ్ చేసాక ప్రత్యర్థి జట్టు మూడు టచెస్ లోపు బాల్ తమ కోర్ట్ లో కింద పడకుండా నెట్ పై నుండి అవతలి టీంకు పంపాలి. ఒకవేళ బాల్ కింద పడిపోతే ప్రత్యర్థి జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. అంటే పాయింట్ల ప్రకారం సెట్స్ వైస్ గా జరిగే ఈ ఆటలో కూడా చివరికి ఏ టీం ఎక్కువ సెట్స్ గెలిచింది అనే దాన్ని బేస్ చేసుకుని విజేతను ప్రకటిస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆడే ఈ ఆటను దాదాపు 90 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాలతో పాటు యూరప్ మరియు అమెరికా ఖండాల్లో ఈ వాలీబాల్ ను చాలా మంది ఇష్టపడతారు.
5. టెన్నిస్ – 100 కోట్ల మంది అభిమానులు
రాయల్ గేమ్ గా పిలుచునే ఈ ఆట గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఈ ఆటకు ఒక గొప్ప చరిత్రే ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో అయితే ఈ ఆటను విపరీతంగా ఫాలో అవుతారు. ఇక ఇది కూడా టేబుల్ టెన్నిస్ లాంటి ఆటే. నిజానికి ఈ రెండు ఆటలు చూడటానికి దాదాపు ఒకేలా కనిపిస్తాయి. అయితే టేబుల్ టెన్నిస్ చిన్న బోర్డు మీద ఆడితే సాధారణ టెన్నిస్ మాత్రం ఒక పెద్ద కోర్ట్ లో ఆడతారు.
ఇక ఈ గేమ్ ను కూడా ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్లు రెండు టీంల గా విడిపోయి విజయం కోసం పోరాడతారు. అలాగే ఎవరైతే పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేసి ఎక్కువ సెట్స్ గెలుస్తారో వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారు. అంటే ఈ ఆటలో కూడా టైం లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఒక్కోసారి అయితే ఫలితం రాబట్టడం కోసం కొన్ని గంటల పాటు ఈ ఆటను ఆడతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన ఈ ఆటను ఒక అంచనా ప్రకారం దాదాపు 100 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యూరప్ దేశాలతో పాటు అమెరికా మరియు ఆసియా ఖండాల్లో ఈ టెన్నిస్ కు పిచ్చ ఫాలోయింగ్ ఉంది.
4. హాకీ – 200 కోట్ల మంది అభిమానులు
హాకీ ఇండియాలో పెద్దగా ప్రజాదరణ పొందకపోయిన గానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా కొన్ని శీతల దేశాల్లో ఐస్ మీద ఆడే ఈ ఆటకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఈ ఆటను అయితే ఫీల్డ్ హాకీ మరియు ఐస్ హాకీ అని రెండు ఫార్మట్ల్స్ లో ఆడతారు. అయితే ఫీల్డ్ హాకీ లో ఒక టీంకు 11 మంది ఆటగాళ్లు చెప్పున ఆడితే ఐస్ హాకీలో మాత్రం ఒక టీంకు ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. కానీ ఈ రెండు రకాల హాకీలో కూడా ఆటగాళ్ల టార్గెట్ ఒక్కటే. తమ దగ్గర హాకీ స్టిక్స్ సహాయంతో గ్రౌండ్ పై ఉండే బాల్ ను ప్రత్యర్థి టీం యొక్క గోల్ పోస్ట్ లోకి పంపించాలి.
ఇక 60 నిమిషాల టైం లిమిట్ ఉండే ఈ ఆటలో సమయం ముగిసేసరికి ఏ జట్టయితే ఎక్కువ గోల్స్ సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఆడే ఈ క్రీడను దాదాపు 200 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా వంటి ఖండాల్లో ఈ హాకీను చాలా మంది ఆదరిస్తున్నారు.
3. బాస్కెట్ బాల్ – 220 కోట్ల మంది అభిమానులు
ప్రతి సెకండ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. 48 నిముషాలు పాటు ఆడే ఈ ఆటలో మొత్తం 10 మంది ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఈ ఆటను ఆడతారు. అలాగే రెండు జట్లు కూడా తమకు కేటాయించిన బాస్కెట్ నుండి బాల్ ను పంపించి పాయింట్స్ స్కోర్ చేస్తారు. అంటే 48 నిమిషాల సమయం ముగిసేసరికి ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ సాధిస్తుందో వాళ్లనే విజేతలుగా ప్రకటిస్తారు.
అయితే ఈ ఆటలో ఫిజికల్ కాంటాక్ట్ నిషేధం. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆటగాడి దగ్గర నుండి బాల్ ను తీసుకునే క్రమంలో పొరపాటున ఆ ప్లేయర్ కు తగిలితే దాన్ని ఫౌల్ గా పరిగిణిస్తారు. దింతో ఈ ఆటకు కేవలం 48 నిమిషాల కాలపరిమితే ఉన్న విరామాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక మ్యాచ్ ను దాదాపు 2 గంటల పాటు ఆడతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బాస్కెట్ బాల్ ను ఒక అంచనా ప్రకారం 220 కోట్లు మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా మరియు చైనా వంటి దేశాల్లో ఈ బాస్కెట్ బాల్ ను అమితంగా ఇష్టపడతారు.
2. క్రికెట్ – 250 కోట్ల మంది అభిమానులు
ఈ ఆటకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రికెట్ ఆడకపోయినా గానీ ఈ ఆట అంటే కొన్ని కోట్ల మంది చొక్కాలు చించుకుంటారు. ఇక 22 గజాలు ఉండే పిచ్ పై బ్యాట్ బాల్ మధ్య జరిగే ఈ మాహా సంగ్రామం ఒలింపిక్స్ లో పార్ట్ కాకపోయినా గానీ ప్రపంచంలో రెండవ అతి పెద్ద క్రీడగా ప్రాచుర్యం సంపాదించింది. ఇక మేజర్ గా మూడు ఫార్మట్ల్స్ లో జరిగే ఈ ఆటను మొత్తం 22 మంది ఆటగాళ్లు రెండు టీమ్స్ గా విడిపోయి ఆడతారు. అలాగే టెస్ట్, ఒన్డే మరియు టీ20 అని మూడు మేజర్ ఫార్మట్స్ లో నిర్వహించే ఈ క్రికెట్ ను ఇన్నింగ్స్ బేస్ మీద ఆడతారు. అంటే ఒక ఇన్నింగ్స్ లో ఒక టీం బౌలింగ్ చేస్తే మరో టీం బ్యాటింగ్ చేస్తుంది. అయితే మ్యాచ్ ఫలితాన్ని మాత్రం ఏ టీం ఎక్కువ పరుగులు చేసింది అనే దాన్ని బేస్ చేసుకుని నిర్ణయిస్తారు.
ఇక ఇంగ్లాండ్ లో పుట్టిన క్రికెట్ ప్రస్తుతం ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తుంది. ఒక అంచనా ప్రకారం కొన్ని దశాబ్దాల తరవాత క్రికెట్ వరల్డ్ నెంబర్ 1 స్పోర్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న ఈ ఆటను ఇప్పటికే దాదాపు 250 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో సగం మంది అభిమానులు ఒక్క ఇండియా నుండే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సో క్రికెట్ ను అయితే ఇండియాతో పాటు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు పాకిస్థాన్ వంటి దేశాల్లో ఒక మతంగా భావిస్తారు.
1. ఫుట్బాల్ – 350 కోట్ల మంది అభిమానులు
ప్రపంచంలో నెంబర్ వన్ స్పోర్ట్ అయినా ఫుట్బాల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దాదాపు 200 దేశాల్లో 25 కోట్ల కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ ఆటను ఆడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఫుట్బాల్ ఎంత పాపులర్ స్పోర్ట్ అనేది. ఒకసారి మీరే ఊహించుకోండి ఈ ఆట ఆడేవాళ్ళే 25 కోట్ల మంది ఉంటె చూసే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో.
ఇక మొత్తం 22 మంది ఆటగాళ్లు రెండు టీమ్స్ గా విడిపోయి ఆడే ఈ ఆటలో చాలా మజా ఉంటుంది. ధీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే ఒక ఎకరం మైదానంలో 22 మంది ఆటగాళ్లు రౌండ్ గా ఉండే ఒక బాల్ ను ప్రత్యర్థి జట్టు యొక్క గోల్ పోస్ట్ లోకి పంపేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే 90 నిముషాలు పాటు సాగే ఈ ఆటలో ప్రతి నిమిషం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటగాళ్లు గోల్ కొట్టే సమయంలో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఆడే ఫుట్బాల్ ను ఒక అంచనా ప్రకారం 350 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు అమెరికా వంటి ఖండాల్లో ఫుట్బాల్ కు పిచ్చ క్రేజ్ ఉంది. నిజానికి ఫుట్బాల్ కూడా ఇండియాలో క్రికెట్ లనే ఖ్యాతి సంపాదించి ఉండుంటే ఈ పాటికి 500 కోట్ల మంది అభిమానుల మార్క్ను దాటేసి ఉండేది.