Signs Of Fake Friend In Telugu (ఫేక్ ఫ్రెండ్ కి ఉండే 7 లక్షణాలు)

మన జీవితంలో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం. ఎంత ముఖ్యమంటే మనం ఇంట్లో చెప్పుకోలేని చాలా విషయాలను మన ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎటువంటి మొహమాటం లేకుండా మనం మనలా ఉండేది మన స్నేహితుల దగ్గర మాత్రమే. అయితే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నిజమైన మిత్రుడు ఎప్పుడు నీ మేలును కోరుకుంటాడు. కానీ ఒక ఫేక్ ఫ్రెండ్ మాత్రం నిన్ను ఎప్పుడు కిందకి లాగాలనే చూస్తాడు.

మన చుట్టూనే తిరుగుతూ మనకు తెలియకుండానే మనలో ఉన్న శక్తిని మొత్తం ఒక జలగలా పీల్చేస్తాడు. సో మన లైఫ్ లో ఉండే ఇలాంటి ఫేక్ ఫ్రెండ్ ను కనిపెట్టడం చాలా కష్టం. మన స్నేహితుడు మనకు మంచి చేస్తున్నాడా లేదా చెడు చేస్తున్నాడా అని కనిపెట్టే లోపే మన జీవితాన్ని నాశనం చేస్తారు. మరి అలాంటి ఫేక్ ఫ్రెండ్ ను ఎలా కనిపెట్టాలి? మాములుగా మొహం చూసి ఇలాంటి వాళ్ళని కనిపెట్టలేకపోయిన నకిలీ స్నేహితులు మనతో ప్రవర్తించే విధానం బట్టి వాళ్ళు నకిలీనా లేదా నిజమైన మిత్రుల అనేది కనిపెట్టవచ్చు. నేను ఈ రోజు మీకు ఈ పోస్టులో మీ క్లోజ్ ఫ్రెండ్ ఫేక్ ఫ్రెండ్ అయితే మీతో ఎలా బిహేవ్ చేస్తాడో ఒక ఏడూ లక్షణాలు చెప్తాను. వాటిని బట్టి మీరు స్నేహం చేస్తున్నది ఫేక్ ఫ్రెండ్ తోనా లేదా నిజమైన మిత్రునితోనా అనేది మీరే నిర్దారించుకోవచ్చు.

ఫేక్ ఫ్రెండ్ కి ఉండే 7 లక్షణాలు

1. ఫేక్ ఫ్రెండ్ నీ గోల్స్ కు సపోర్ట్ చెయ్యడు

ఒక నిజమైన మిత్రుడు నువ్వు లైఫ్ లో ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. కానీ ఒక ఫేక్ ఫ్రెండ్ మాత్రం నీకు ఎప్పుడు సపోర్ట్ గా నిలబడడు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నీ లైఫ్ లో ఎదగడం కోసం ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలి అనుకుంటున్నప్పుడు ఈ ఫేక్ ఫ్రెండ్ అనే వాడు నిన్ను ఎంకరేజ్ చెయ్యకుండా ఇది చెయ్యడం నీ వల్ల కాదంటూ నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్న పనిని ఇంతకముందు ఎవరైనా చేసి ఫెయిలయ్యి ఉంటే వాళ్ళని ఎక్సమ్పుల్ గా చూపిస్తూ నీ ఎనర్జీ ని తగ్గించే ప్రయత్నమే చేస్తాడు తప్ప సక్సెస్ అయినా వాళ్ళని ఎక్సమ్పుల్ గా చూపించి నిన్ను ఎంకరేజ్ చెయ్యడు.

ఒకవేళ నువ్వు తన మాట కాదని ఆ పనిని మొదలుపెడితే నువ్వు చేస్తున్న పనిని మీ ఇద్దరికి మ్యూచువల్ గా ఉండే ఫ్రెండ్స్ దగ్గర ఎగతాళి చేస్తూ నీ కాన్ఫిడెన్స్ ను పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఫేక్ ఫ్రెండ్ లాజిక్ ఒక్కటే. నువ్వు కూడా తనలాగే లైఫ్ లో ఏమి సాధించకుండా ఉండాలి. ఒక రియల్ ఫ్రెండ్ సరదా సమయాల్లో నీతో ఫన్నీ గా ఉంటూనే, నువ్వు సీరియస్ గా ఏదైనా ఒక కొత్త పనిని మొదలుపెట్టాలనుకుంటే ఎటువంటి స్వార్థం లేకుండా నీకు సపోర్ట్ చేస్తాడు. కానీ ఫేక్ ఫ్రెండ్ మాత్రం నీతో ఎంజాయ్ చేస్తాడు తప్ప నీకు సపోర్ట్ చెయ్యడు.

ఫేక్ ఫ్రెండ్ కి ఉండే 7 లక్షణాలు

2. ఫేక్ ఫ్రెండ్ తన తప్పులను ఎప్పుడు ఒప్పుకోడు

ఫేక్ ఫ్రెండ్ అనేవాడు తాను చేసిన తప్పులను ఎప్పుడు ఒప్పుకోడు. అలాగే తాను చేసిన తప్పులను కప్పి ఉంచడం కోసం మీలో ఉన్న తప్పులను వెతుకుతూ మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేస్తాడు తప్ప తను మాత్రం క్షమాపణలు చెప్పడానికి అస్సలు ఇష్టపడడు. అలాగే ఇలా చేయడాన్ని అతను ఒక ఆటిట్యూడ్ లా ఫీల్ అయ్యి మీకన్నా అతనే గొప్ప అని ప్రూవ్ చెయ్యడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ నిజానికి అది ఆటిట్యూడ్ కాదు, అహంకారం. సో ఫేక్ ఫ్రెండ్ కు మీతో ఫ్రెండ్షిప్ అనే బంధం కన్నా తన అహంకారమే ముఖ్యం. దింతో తప్పు తన వైపే ఉన్న గాని మీరు తనని కించపరిచినట్టు చేసినట్టు ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తాడు.

దీని వల్ల మీరు మానసికంగా కృంగిపోయి నిజంగా తప్పు మీరే చేసారనుకుని ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్షిప్ ను కాపాడుకోవడం కోసం మీ ఆత్మ గౌరవాన్ని పక్కనపెట్టి మరి మీ ఫేక్ ఫ్రెండ్ కు క్షమాపణలు చెప్తారు. ఇదే మీ ఫ్రెండ్షిప్ లో మీకు బలహీనంగా మారీ మీ ఫేక్ ఫ్రెండ్ కు బలంగా మారుతుంది. మీరు తప్పు చెయ్యడం వల్ల గొడవ జరిగినప్పుడు మీరు వెళ్లి క్షమాపనులు చెప్తే ఎలాంటి సమస్య లేదు. అలా చెయ్యాలి కూడా. కానీ గొడవైన ప్రతిసారి మీరే తప్పు చేసినట్టు భావించి మీ ఫేక్ ఫ్రెండ్ కు క్షమాపణలు చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి.

3. ఫేక్ ఫ్రెండ్ నీ సహాయం తీసుకుంటాడు కానీ తిరిగి చెయ్యడు

ఫ్రెండ్షిప్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా సాధారణం. అది మంచిది కూడా. నిజానికి మనం స్నేహం చేసేది కూడా ఎవరితో పంచుకోలేని ఫీలింగ్స్ ను మరియు భాధలను మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడానికే. నిజమైన స్నేహితుడు, తాను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా అయితే తనకి సహాయపడ్డారో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తాను అలానే సహాయం చేస్తాడు. ఒకవేళ తను తిరిగి సహాయం చెయ్యలేని పరిస్థితిలో ఉన్న గానీ మిమ్మల్ని మాత్రం ఒంటరిగా వదిలెయ్యకుండా మీకు సపోర్ట్ గా నిలబడి ధైర్యం చెప్తాడు. కానీ ఫేక్ ఫ్రెండ్ మాత్రం తను కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర నుండి సహాయం పొంది, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి సహాయంచెయ్యడు.

అంతేకాకుండా మీ కష్టాలు మరియు భాదలను అతనికి చెప్పుకుందాం అనుకున్న గానీ వినడానికి సిద్ధంగా ఉండడు. మీరు తనకి ఉపయోగపడినంత కాలం మీతో సన్నిహితంగా ఉంటూ గొడవలు అయినా సరే మిమ్మల్ని వదలడు. కానీ మీరు ఎప్పుడైతే తనకి ఉపయోగపడరని తెలిసిందో, అప్పుడే మీతో కావాలని ఏదొక గొడవ పెట్టుకుని మీ నుంచి దూరంగా వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఇష్టపడింది మిమ్మల్ని కాదు మీ వల్ల తనకి వచ్చే లాభాలను.

4. ఫేక్ ఫ్రెండ్ ఇతర వ్యక్తుల గురించి వాళ్ళ వెనకాల చెడుగా మాట్లాడతాడు

Strong Minds Discuss Ideas
Average Minds Discuss Events
Weak Minds Discuss People

Top 10 Free And Best Android Video Editor Apps 2
A Fake Friend Talk Your Behind Negatively (Image – GBB Studios)

ఇది నా ఫేవరెట్ కొటేషన్. ఒకవేళ మీ ఫ్రెండ్ ఫేక్ ఫ్రెండ్ అయితే అతను ఎప్పుడు మీ దగ్గర ఎదుట వాళ్ళ గురించే చెడుగానే చెప్తాడు. మరి ముఖ్యంగా మీ ఇద్దరి పరిధిలో ఉన్న మిగతా స్నేహితులు గురించి ఎప్పుడు చెడుగానే చర్చిస్తూ ఉంటాడు. అది ఎలా అంటే నీ మిగతా ఫ్రెండ్స్ ముందు నీ ఫేక్ ఫ్రెండ్ నవ్వుతూనే మాట్లాడతూ వాళ్ళు వెళ్ళిపోయాక మాత్రం వాళ్ళని చులకన చేస్తూ నీ దగ్గర వాళ్ళ క్యారెక్టర్ ను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీ దృష్టిలో వాడే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు కాబట్టి.

అయితే ఇక్కడ లాజిక్ ఏటంటే నీ ఫ్రెండ్ నీ దగ్గర ఎలా అయితే మిగతా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నాడో, సేమ్ అలాగే మీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెడుగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి గాసిప్స్ మరియు రూమర్స్ క్రియేట్ చెయ్యడంతో పాటు వాటిని స్ప్రెడ్ చెయ్యడం అంటే చాలా ఇష్టం. అలాగే నెగటివ్ పీపుల్ ఎప్పుడు తమని తాము గొప్ప అని చెప్పుకోవడం కోసం ఎదుట వాళ్ళని జడ్జ్ చేస్తూ వాళ్ళు ఇలాంటోళ్ళు వీళ్ళు ఇలాంటోళ్ళు అని చాడీలు చెప్తూనే ఉంటారు. కాబట్టి లైఫ్ లో ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంతా బాగుటుంది.

5. ఫేక్ ఫ్రెండ్ మీ సీక్రెట్స్ వేరే వాళ్ళకి చెప్తాడు

మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా గొడవ అయితే వెంటనే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని గురించి నెగటివ్ గా చెప్పకండి. అలాగే ఏదైనా గొడవ అయినప్పుడు మీ ఫ్రెండ్ సీక్రెట్స్ కూడా నెగటివ్ గా మార్చి వేరే వాళ్ళ దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే అలా చెయ్యడం వల్ల ఒకవేళ భవిష్యత్ లో మీరు తిరిగి మీ బెస్ట్ ఫ్రెండ్ కు క్లోజ్ అయితే ఆ మూడో వ్యక్తి దగ్గర మీ విలువ మరియు మీ బంధం విలువ పోగవుట్టుకున్న వాళ్ళు అవుతారు.

Fake Friend

ఒక నిజమైన మిత్రుడు తన ఫ్రెండ్ క్యారెక్టర్ ను వేరే వాళ్ళ దగ్గర అస్సలు తగ్గించాడు. కానీ ఫేక్ ఫ్రెండ్ మాత్రం మీతో గొడవ అయితే ఖచ్చితంగా మీ సీక్రెట్స్ ను తనకి అనుగుణంగా మార్చుకుని అందరికీ మీ గురించి చెడుగానే చెప్తాడు. అంతే కాకుండా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే మీకు తెలియకుండా మీ సీక్రెట్స్ ను అందరికీ షేర్ చేస్తాడు. ఎందుకంటే మనం రెండో పాయింట్ లో చెప్పుకున్నట్టే ఈ ఫేక్ ఫ్రెండ్ అనేవాడు మీకు గానీ మీ బంధానికి గానీ వేల్యూ ఇవ్వడు. దింతో తన తప్పులేదని నిరూపించుకోవడం కోసం మీ సీక్రెట్స్ ను ఆయుధంగా వాడుకుని మిమ్మల్ని దోషిగా ముద్రించే ప్రయత్నం చేస్తాడు.

మరి ఇలాంటి వాళ్ళని ఎలా కనిపెట్టొచ్చు అంటే మీ ఫ్రెండ్ వేరే వాళ్లతో గొడవ అయినప్పుడు నీ దగ్గరికి వచ్చి వాళ్ళ సీక్రెట్స్ నీకు చెప్తున్నాడంటే నీ విషయంలో కూడా ఖచ్చితంగా అదే చేస్తాడు అని అర్ధం. కాబట్టి ఇలాంటి చిల్లర మనుషులతో మీ సీక్రెట్స్ షేర్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి.

6. ఫేక్ ఫ్రెండ్ చాలా మానిప్యులేటివ్ గా ఉంటాడు

మానిప్యులేషన్ అంటే తారుమారు చెయ్యడం. ఫేక్ ఫ్రెండ్ అనే వాడు ఎప్పుడు ఒక మాట మీద నిలబడడు. సిట్యుయేషన్ కు తగ్గట్టుగా రంగులు మారుస్తూ, వేరేవాళ్ళ విషయంలో జరిగింది తప్పు అన్నవాడే అలాంటి పరిస్థితి తనకు వచ్చేసరికి మాత్రం తాను తప్పు చేసిన గానీ నేను చేసింది సరైందే అని సమర్ధించుకుంటాడు.

అంతే కాకుండా మీతో ఏదైనా గొడవైనప్పుడు మీరు గతంలో చేసిన పనులన్నింటిని తారుమారు చేసి మిమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే మీ వల్ల తనకి గానీ తన క్యారెక్టర్ కు గానీ ఎలాంటి సమస్య రానంత వరకు మీలో పాజిటివ్ నే చూసే ఈ ఫేక్ ఫ్రెండ్ తన మీదకి వచ్చేసరికి మాత్రం మీ పాజిటివ్ ని కూడా నెగటివ్ గా మానిప్యులేట్ చేసి మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి కూడా ఆలోచించడు.

7. ఫేక్ ఫ్రెండ్ మీతో పోటీ పడతాడు

మీ ఫేక్ ఫ్రెండ్ మీరు ఏదైనా సాధిస్తే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తన రియాక్షన్ మాత్రం తేడగా ఉంటుంది. ఆ సాధించావ్ లే అన్నట్టు ఫార్మల్ గా పైకి అభినందనలు చెప్తూనే లోపల అసూయతో రగిలిపోతాడు. అదే నిజమైన బెస్ట్ ఫ్రెండ్ అయితే మీరు సాధించింది చిన్నదైనా సరే పెద్దదైనా సరే తానే సాధించినట్టు ఫీల్ అయ్యి మొత్తం అందరికీ మీ సక్సెస్ ను గర్వంగా షేర్ చేస్తాడు. ఈవెన్ తన ఫ్యామిలీకు కూడా నా ఫ్రెండ్ ఇది సాధించాడని సంతోషంగా చెప్పుకుంటాడు.

కానీ ఈ ఫేక్ ఫ్రెండ్ అనే వాడు మీకు ఏదైనా రంగంలో మంచి పేరు వస్తుంది అని తెలిస్తే అసూయతో ఆ ఫీల్డ్ తనకు సంబంధించింది కాకపోయినా గానీ మీతో పోటీ పడేందుకు మీరు చేసేది తను చెయ్యాలని చూస్తాడు. అంతేకాకుండా మీరు తనతో పోటీ పడకపోయినా సరే తాను మాత్రం మీతో పోటీ పడాలనే చూస్తాడు. కానీ రియల్ ఫ్రెండ్ మాత్రం ఒకవేళ మీరు చేసే పని తనకి నచ్చితే మీ అభిప్రాయాన్ని అడిగి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తన సొంత ఇష్టంతో మీరు చేసేది తాను చేస్తాడు తప్ప మీతో పోటీ పడాలని ఎప్పుడు ప్రయత్నించడు. కానీ ఫేక్ ఫ్రెండ్ మాత్రం మీ సక్సెస్ ను చూసి అసూయతో మీతో పోటీ పడాలని చూస్తాడు.

మన లైఫ్ లో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా మన ఫ్రెండ్స్ నుండే వస్తాయి కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లతోనే ఫ్రెండ్షిప్ చెయ్యడానికి ట్రై చెయ్యండి. ఒక మంచి మిత్రుడు నీ జీవితాన్ని బాగుచేస్తే, ఒక చెడ్డ మిత్రుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు.

A Bad Company Can Corrupts A Good Character