Legendary Cricketers Who Retired Too Early – క్రికెట్ లో ఒక్కోసారి బాగా ఆడుతున్న ప్లేయర్ ఏదొక ఇంజురీ అయ్యి దాని కారణంగా తన కెరియర్ ను ముగించవల్సి వస్తుంది. అయితే ఇది కొంతవరకు దురదృష్టంతో కూడుకుంది. కానీ ఒక్కోసారి కొంతమంది ఆటగాళ్లు తమ క్రికెట్ కెరియర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలతో రిటైర్మెంట్ ప్రకటించి తమ అభిమానులకు షాక్ ఇస్తారు. ఎవరు ఊహించని విధంగా క్రికెట్ నుండి తప్పుకుని కంటతడి పెట్టిస్తారు. ఇక ఈ రోజు మనం అలాంటి కొంతమంది క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
5 Legendary Cricketers Who Retired When They Were In Their Prime
5. Ambati Rayudu (India)
మన టీమిండియాకు చెందిన ఈ క్లాసికల్ బ్యాట్సమెన్ తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కసారైనా ఇండియా తరుపున వరల్డ్ కప్ ఆడాలని బలంగా సంకల్పించుకున్నాడు. దానికి తగట్టు గానే తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాయుడు 2002వ సంవత్సరంలో జరిగిన ఒక రంజీ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించి అలా చేసిన మొట్టమొదటి బ్యాట్సమెన్ గా రికార్డును క్రియేట్ చేసాడు. అలాగే ఆ తరువాత 2004వ సంవత్సరంలో టీం ఇండియా U19 జట్టుకు నాయకత్వం వహించి ఒక మంచి ప్లేయర్ గా కూడా పరిణితి చెందాడు.
ఇక తన కల కోసం నేషనల్ టీంలో చోటు సంపాందించేందుకు ఎన్నో కష్టాలను మరియు అవమానాలను ఎదుర్కున్న రాయుడు ఎట్టకేలకు 2013వ సంవత్సరం జూలై 24వ తేదీన జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ కెరియర్ ను స్టార్ట్ చేసాడు. ఇక తాను ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే 84 బంతుల్లో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన రాయుడు ఒక విలువైన హాఫ్ సెంచరీ సాధించి మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆ తరువాత టీంలోకి వస్తూ పోతు సాగిన రాయుడు కెరియర్ 2018వ సంవత్సరంలో గాడిన పడి వరల్డ్ కప్ లో ఆడాలనే తన కలకు చేరువ చేసింది.
ఇక అప్పట్లో వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో భాగంగా రాయుడు అత్యుత్తమ ప్రదర్శనకు గాను టీం లో నాలుగో స్థానం నీదే అంటూ టీమిండియా తన కలకు భరోసా ఇచ్చింది. కానీ అనూహ్యంగా 2019వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ కు సెలక్షన్ కమిటీ రాయుడుని టీంలోకి ఎంపిక చెయ్యకుండా అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే టీంలో ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాయుడు ని ఒక ప్రత్యామ్న్యాయ ఆటగాడిగా ఎంపిక చేసారు. ఇక ఆ ఏడాది వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు టీంఇండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ మరియు ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాలు కారణంగా తప్పుకోవడం తో తనకి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వస్తుందని అలాగే తన కల నెరవేరబోతుందని రాయుడు ఆశించాడు.
కానీ సెలెక్షన్ కమిటీ అనూహ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు జట్టులో చోటు కల్పించి రాయుడు ఆశలపై నీళ్లు చల్లింది. దీనితో తీవ్ర మనస్తాపానికి లోనైన రాయుడు, వరల్డ్ కప్ లో ఆడాలి అనే తన కల ఇక నెరవేరదు అని భావించి కేవలం 33 ఏళ్ల వయస్సులోనే తన తన వ్యక్తిగత ప్రదర్శన ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక ఈ నిర్ణయం చాలా మంది క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లకు సైతం కూడా ఎంతో భాదను కలిగించింది.
4. Kumar Sangakkara (Sri Lanka)
శ్రీలంకకు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తరువాత అత్యధిక పరుగులు సాధించిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్సమెన్. అలాగే తనకు మాత్రమే సాధ్యమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసిన వన్ అఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ కుమార సంగక్కార. ఇక 2000వ సంవత్సరం జూలై 5వ తేదీన పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంగక్కార కొద్ది రోజులకే తన బ్యాటింగ్ ప్రతిభ చూపించి జట్టులో తన స్థాన్నాన్ని సుస్థిరపరుచుకున్నాడు.
ఇక ఆ తరువాత టెస్ట్ క్రికెట్లో కూడా సత్తా చాటిన ఈ ఆటగాడు 2005వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం వరకు అంటే దాదాపు 11 ఏళ్ళ పాటు ఐసీసీ టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్సమెన్ ర్యాంక్ ను డామినెట్ చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసాడు. ఇక 2006వ సంవత్సరంలో అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ల్లో తన సహచర ఆటగాడు అయిన మహేళ జయవర్ధనే తో కలసి 3వ వికెట్ కు ఏకంగా 624 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఏర్పరిచి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసాడు. ఇప్పటికి టెస్ట్ క్రికెట్ లో ఏ వికెట్ అయిన ఇదే బెస్ట్ పార్ట్నెర్షిప్.
ఇక లిమిటెడ్ ఓవెర్స్ ఫార్మాట్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సంగక్కార శ్రీలంక జట్టు రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2014వ సంవత్సరంలో శ్రీలంక జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కూడా కీ రోల్ ప్లే చేసిన సంగక్కార ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ సాధించి, ఒక మెమరబుల్ నాక్ ఆడాడు. ఇక 2015వ సంవత్సరంలో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో వరుసగా నాలుగు సెంచరీలను సాధించి ఒక అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన సంగక్కార ఏజ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు.
అయితే అదే ఏడాది మన ఇండియాతో టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పేనాటికి సంగక్కార వయస్సు 37 సంవత్సరాలు అయినప్పటికీ తన బ్యాటింగ్ ఫామ్ మాత్రం ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. కావాలనుకుంటే సంగక్కార మరో మూడేళ్ళ పాటు తన జట్టు తరుపున ఆడే అవకాశం ఉన్న తను మాత్రం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నప్పుడు 16 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు.
3. Michael Clarke (Australia)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ దిగ్గజ ఆటగాడు 2003వ సంవత్సరం జనవరి 19వ తేదీన ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ కెరియర్ ను ప్రారంభించాడు. ఇక తన కెరియర్ స్టార్టింగ్ డేస్ నుండే తన అద్భుతమైన బ్యాటింగ్ తో నిలకడగా రాణిస్తూ వచ్చిన క్లార్క్ అనతి కాలంలోనే టీంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఇక ఆ మరుసటి ఏడాదే ఇండియా పై తన టెస్ట్ డెబ్యూ కూడా చేసిన క్లార్క్ తాను ఆడిన మొట్టమొదటి టెస్ట్ లోనే ఒక అదిరిపోయే సెంచరీ సాధించి తన టీంకు ఘనవిజయాన్ని అందించాడు.
Also Read – Most ICC Trophy Wins By A Team
సరిగ్గా ఇదే సమయంలో అప్పటి ఆస్ట్రేలియా టీం కెప్టెన్ పాంటింగ్ యొక్క సలహాలు మరియు సూచనలతో ఒక మంచి ప్లేయర్ గా పరిణితి చెందిన క్లార్క్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఇక పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ భాద్యతలను అందుకొన్న క్లార్క్ తన తన పదునైన వ్యూహాలు మరియు ఎత్తుగడల తో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. ఇక 2015వ ససంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించిన క్లార్క్ న్యూజీలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ల్లో ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి తన జట్టు ఏకంగా 5వ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో కెప్టెన్ గా దూసుకుపోతున్న క్లార్క్ కు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఊహించని పరాజయాలు ఎదురయ్యేవి.
ముఖ్యంగా తమ చిరకాల ప్రత్యర్థి అయిన ఇంగ్లాంగ్ తో జరిగే ప్రెస్టీజియస్ యాషెస్ సిరీస్ లో వరుస ఓటములు క్లార్క్ ను ఎంతో ఒత్తిడికి గురి చేసాయి. దీనితో వరల్డ్ కప్ అనంతరం 2015 సంవత్సరంలో జరిగిన యాషెస్ సిరీస్ లో తన టీంకు ఎదురైనా ఘోర పరాజయానికి ఎంతో రిగ్రెట్ ఫీల్ అయిన క్లార్క్ తన 13 ఏళ్ళ క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తినట్టు ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయం ఎంతో మంది క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల కు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే క్లార్క్ తన రిటైర్మెంట్ ప్రకటించే సరికి అతని బ్యాటింగ్ ఫామ్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది అలాగే అతని వయస్సు కూడా కేవలం 34 సంవత్సరాలు మాత్రమే.
2. Brendon McCullum (New Zealand)
వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ బ్యాట్సమెన్ లిస్ట్ అంటూ ఒకటి తయారుచేస్తే అందులో ఖచ్చితంగా టాప్ 5 లో ఉండే ఈ న్యూజీలాండ్ విద్వాంస్కర ఆటగాడు తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో ఎంతో మంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే ఫార్మాట్ తో సంబంధం లేకుండా తమదైన స్టయిల్లో డెస్ట్రుక్టీవ్ బ్యాటింగ్ చేసే అతి తక్కువ మంది ఆటగాళ్లలో మెక్కల్లమ్ ఒకడు. ఇక 2002వ సంవత్సరం జనవరి 17వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన మెక్కల్లమ్ మొదట్లో ఓపెనర్ గా విఫలమయ్యాడు. దీనితో మెకల్లమ్ దాదాపు 4 ఏళ్ళ పాటు మిడిల్ ఆర్డర్ లోనే అది కూడా నెంబర్ 7 మరియు నెంబర్ 8 స్థానాల్లో బ్యాటింగ్ చెయ్యవలసివచ్చింది. అండ్ మెకల్లమ్ తన కెరియర్ ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
కానీ మెల్లగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించడం మొదలుపెట్టిన మెకల్లమ్ తిరిగి ఓపెనర్ గా మారి టీంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక 2007వ సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో 20 బంతుల్లో అర్ద సెంచరీ సాధించిన మెకల్లమ్ అప్పట్లో వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 సాధించి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో కూడా తన విద్వాంస్కర బ్యాటింగ్ తో అలరించిన మెకల్లమ్ మొత్తం 107 సిక్సర్లను సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసాడు.
ఇక కెప్టెన్ గా కూడా న్యూజిలాండ్ జట్టుకు ఎన్నో మధురమైన విజయాలను అందించిన మెకల్లమ్ 2015వ సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ టీంను ఫైనల్స్ వరకు తీసుకువెళ్లి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి న్యూజిలాండ్ కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. అయితే 2016వ సంవత్సరంలో నేనింక క్రికెట్ కు ఇవ్వవలసింది ఏమి లేదంటూ, ఇక మిగిలిన తన జీవితాన్ని తన కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటునని తెలియచేసి తన బ్యాటింగ్ ఫామ్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, కేవలం 34 సంవత్సరాలకే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక టెస్ట్ క్రికెట్లో కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచిన మెకల్లమ్, ఈ అద్భుతమైన రికార్డును తాను ఆడిన చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ల్లో సాధించడం విశేషం.
Also Read – How To Become A Cricketer (క్రికెటర్ ఎలా అవ్వాలి) In Telugu
1. AB de Villiers (South Africa)
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ అద్భుతమైన ఆటగాడు అసలు వరల్డ్ క్రికెట్ లో ఏ బ్యాట్సమెన్ కు సాధ్యంకాని అరుదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్ లో ఏబీ లాంటి ఆటగాడు నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకంటే డివిలియర్స్ లో ఉన్న స్పెషాలిటీ డెస్ట్రుక్టీవ్ బ్యాటింగ్ విత్ మోర్ కన్సిస్టెన్సీ. అంటే ఏబీ సెహ్వాగ్ లా దూకుడైన బ్యాటింగ్ చేస్తూనే కోహ్లీ అంత నిలకడగా ప్రతి మ్యాచ్ల్లో పరుగులు సాధించగలడు. అంతే కాకుండా టెస్ట్ క్రికెట్ లో మన వాల్ రాహుల్ ద్రవిడ్ లా రోజులు తరబడి క్రిజ్ లో పాతుకుపోయి బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఏకైక ఆటగాడు మన ఏబీ.
ఇక తన కెరీర్ ప్రారంభ దశలో అంతగా ఆకట్టుకోని AB మొదట్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నింటినీ ఎంతో మనోధైర్యంతో ఎదుర్కున్న ఏబీ తన బ్యాటింగ్ ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఒక యూనిక్ బ్యాటింగ్ స్టైల్ ను అలవరుచుకుని మిస్టర్ 360 గా పేరు సంపాదించాడు. ఇక వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ 50, 100 మరియు 150 సాధించిన ఏబీ తన వన్డే కెరియర్లో తాను స్కోర్ చేసిన ప్రతి సెంచరీని 100 బంతుల్లో లోపు సాధించి ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్రియేట్ చేసాడు. అలాగే వన్డే క్రికెట్ లో 50 కన్నా ఎక్కువ సగటు మరియు 100 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన ఒకేఒక్క ఆటగాడు ఏబీ.
ఇక కెప్టెన్ మరియు వికెట్ కీపర్ గా కూడా మూడు ఫార్మాట్లలో సౌత్ ఆఫ్రికా జట్టు కు ఎన్నో గొప్ప విజయాలను అందించిన ఏబీ ఆ దేశం తరుపున ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. ఇక మన కింగ్ విరాట్ కోహ్లీ తో పోటీ పడి పరుగులు చేస్తూ దాదాపు వరల్డ్ నెంబర్ బ్యాట్సమెన్ గా సత్తాచాటుతున్న సమయంలో అనుహ్యంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక దీనికి కారణం విపరీతమైన క్రికెట్ ఆడుతుండటం వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అలాగే తీరిక లేని షెడ్యూల్ కారణంగా తన కుటుంబంతో గడపలేకపోతున్నాని తెలిపిన ఏబీ 2018 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్నాడు.
ఇక ఏబీ తన రిటైర్మెంట్ ప్రకటించే సరికి తన వయస్సు కేవలం 34 సంవత్సరాలు అలాగే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 6వ స్థానం మరియు వన్డే ర్యాకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏబీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక ఈ సంఘటన చాలా మంది క్రికెట్ అభిమానులు కంటతడి పెట్టుకునేలా చేసింది.
Honorable Mentions
ఇక ఈ లిస్ట్ లో ఉన్న ఆటగాళ్లతో పాటు మన టీమిండియా లెజెండరీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లాండ్ కు చెందిన డేంజరస్ బ్యాట్సమెన్ కెవిన్ పీటర్సన్, సౌత్ ఆఫ్రికా లెజెండరీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ మరియు వన్ అఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కూడా తమ కెరియర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు వేరువేరు కారణాల వల్ల తక్కువ వయస్సులోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
Other Legendary Cricketers Who Retired Too Early
- Sourav Ganguly
- Kevin Pietersen
- Graeme Smith
- Glenn McGrath
- Shane Watson