ప్రపంచంలో ఫుట్‌బాల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏదైనా ఉందా అంటే నిస్సందేహంగా అది క్రికెట్ అని చెప్పవచ్చు. నిజానికి ఈ ఆట పుట్టింది England లోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన ఇండియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించి ఒక మతంలా మారింది. అయితే ఈ క్రికెట్ పుట్టినప్పుడు దానితో పాటు కొన్ని లాస్ అంటే ఈ ఆటను ఎలా ఆడాలో కొన్ని రూల్స్ ను రూపొందించారు. వాటినే మనం లాస్ ఆఫ్ క్రికెట్ అంటాం. ఇక కాలం గడిచే కొద్ది ఈ రూల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త లాస్ ను రూపొందిస్తూ వచ్చారు.
1877 వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుండి లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానానికి చెందిన ఎంసీసీ అంటే మర్లబొన్ క్రికెట్ క్లబ్ కొన్ని లాస్ ను తయారుచేసి ఒక కోడ్ రూపంలో అమలు పరుస్తువచ్చారు. ఇక ప్రస్తుతానికైతే ఈ ఎంసీసీ, 2017 వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుండి “లాస్ ఆఫ్ క్రికెట్ 2017 కోడ్” అనే పేరుతో మొత్తం 42 లాస్ ను రూపొందించి వాటిని అమలుపరుస్తుంది. సో ఫ్రెండ్స్ నేను మొత్తం ఈ 42 లాస్ ను చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చదివితే ఎన్నో కొత్త విషయాలతో పాటు క్రికెట్ లో ఉండే అన్ని రూల్స్ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది.
42 Laws Of Cricket Explained In Telugu (క్రికెట్ రూల్స్)
లా నెంబర్ 1. The Players
మ్యాచ్ ఆడబోయే ఇరు జట్లు చెరో పదకొండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగాలి. ఈ పదకొండు మంది ఆటగాళ్లలో ఒక కెప్టెన్ మరియు ఒక డిప్యూటీ అంటే వైస్ కెప్టెన్ ఉంటారు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో కెప్టెన్ ఇంజూర్ అవ్వడమో లేదా ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకున్నా టాస్ వేసే ముందు డిప్యూటీగా నామినేట్ చేసిన ఆటగాడు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇక టాస్ వేసే ముందు ఇరుజట్ల కెప్టెన్లు రాతపూర్వకంగా నామినేట్ చేసిన పదకొండు మంది ఆటగాళ్లకు మాత్రమే బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేసే అధికారం ఉంటుంది. అయితే రీసెంట్ గా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ ను తీసుకువచ్చారు. దీని గురించి మనం సబ్‌స్టిట్యూట్ లా లో మాట్లాడుకుందాం.
ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకున్న దాని పూర్తి బాధ్యత కెప్టెన్ పైనే ఉంటుంది. అలాగే మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లైనప్స్ లో ఎలాంటి మార్పులైన చేసే అధికారం కెప్టెన్ కు కలదు. ఒక బ్యాట్సమెన్ మ్యాచ్ మధ్యలో ఇంజురీ కారణం చేత రిటైర్ హార్ట్ గా వెనుతిరగాల్సి వస్తే అంపైర్ తో పాటు గా కెప్టెన్ నిర్ణయం కూడా అవసరం. అలాగే మ్యాచ్ జరిగినప్పుడు అంపైర్ తీసుకున్న LBW మరియు క్యాచ్ అవుట్ నిర్ణయాన్నిరివ్యూ సిస్టం అంటే DRS ద్వారా సవరించుకునే అవకాశం కెప్టెన్ కి ఇవ్వడం జరిగింది.
లా నెంబర్ 2. The Umpires
ప్రతి మ్యాచ్ కు ఇద్దరు అంపైర్లు ఉంటారు. ఒకరేమో మెయిన్ అంపైర్ మరొకరేమో లెగ్ అంపైర్. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రూల్స్ అన్నింటిని వీళ్ళే మైదానంలో అమలుపరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రతి విషయం అంపైర్ చేతుల్లోనే ఉంటుంది. ఇక రూల్స్ ప్రకారం అవసరం లేకపోయినప్పటికీ, ప్రొఫెషినల్ మ్యాచెస్‌లో మాత్రం ఒక టీవీ అంపైర్, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆన్ ఫీల్డ్ అంపైర్స్ కు సలహాలు మరియు సూచనలను అందిస్తాడు. అతన్నే మనం థర్డ్ అంపైర్ అంటాం. ఈ థర్డ్ అంపైర్ రన్ ఔట్స్ మరియు DRS రివ్యూలను టెక్నాలజీ ద్వారా చెక్ చేసి ఆన్ ఫీల్డ్ లో ఉన్న అంపైర్ కు ఫైనల్ డెసిషన్‌ను తెలియజేస్తాడు.
ఇక మ్యాచ్ లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా అంటే అది బ్యాడ్ వెథర్ కావొచ్చు లేదా ప్లేయర్స్ కు ఇంజ్యూరిస్ అయినప్పుడు అంపైర్ లకు మ్యాచ్ ను నిలిపివేసే అధికారం ఉంది. అలాగే మ్యాచ్ లో బాల్ షేప్ మారిన లేదా బాల్ గ్రౌండ్ బయటికి వెళ్లి మిస్ అయినా బాల్ నీ మార్చే అధికారం అంపైర్ కి ఉంటుంది. ఒకవేళ ఏ అంపైర్ కి అయినా ఇంజురీ అయ్యి అతను అంపైరింగ్ చెయ్యలేకపోతే ఆ అంపైర్ ను మార్చడానికి ఇరు జట్ల కెప్టెన్స్ యొక్క అంగీకారం అవసరం. ఇక ప్రతి ఆటగాడి యొక్క కిట్ అంటే బ్యాట్, హెల్మట్, పాడ్స్ మరియు మిగిలినవి అన్ని కూడా రూల్స్ ప్రకారం ఉండేలా చూడవలసిన భాద్యత అంపైర్ పైనే ఉంటుంది. అలాగే బౌలర్ బౌలింగ్ వెయ్యడానికి ముందు గార్డ్ మరియు పోసిషన్ను అంపైర్ కి చెప్పడం తప్పని సరి. అంతే కాకుండా ప్రతి ఓవర్ లో బాల్స్ మరియు స్కోర్ ను కాలుక్యులేట్ చేయవలసిన బాధ్యత కూడా అంపైర్ పైనే ఉంటుంది.
లా నెంబర్ 3. The Scorers
ప్రతి గ్రౌండ్ లోను మాన్యూవల్ గా ఆపరేట్ చేసే ఒక స్కోరుబోర్డు ఉంటుంది. దీన్ని ఆపరేట్ చెయ్యడం కోసం ఇద్దరు వ్యక్తులను నియమిస్తారు. వాళ్ళనే స్కోరర్స్ అంటారు. వీళ్ళు మైదానంలో ఉన్న అంపైర్లు ఇచ్చే సంకేతాలు ఆధారంగా ఎప్పటికప్పుడు స్కోరుబోర్డును అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ స్కోర్ ను రికార్డ్ చేసే వాళ్ళు కూడా అంపైర్స్ లానే ప్రతి నిమిషం అలెర్ట్ గా ఉండాలి.
లా నెంబర్ 4. The Ball
ఈ లా ప్రకారం క్రికెట్ లో వాడే బాల్ యొక్క సర్క్యూఎంఫెరెన్సు అంటే చుట్టుకొలత 8.81 ఇంచెస్ నుండి 9 ఇంచెస్ మధ్యలోఉండాలి. దీనినే సెంటీ మీటర్స్ లో చెప్పాలంటే 22.4 సెంటీ మీటర్స్ నుండి 22.9 సెంటీ మీటర్స్ మధ్యలో ఉండాలి. ఇక బాల్ యొక్క బరువు 155.9 గ్రామ్స్ నుండి 163 గ్రామ్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ మ్యాచ్ ఆడుతున్న సమయంలో బాల్ గనుక దాని యొక్క షేప్ కోల్పోయిన లేదా మరే ఇతర కారణం చేత అయినా బాల్ గానీ డామేజ్ అయితే దానిని అదే Wear and Tear కలిగిన మరో బాల్ తో రీప్లేస్ చేస్తారు.
అయితే ఈ కొత్త బాల్ ను ఇరు జట్ల ప్లేయర్స్ కి చూపించి వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి టీం తమ ఇన్నింగ్స్ ను ఒక కొత్త బాల్ తో ప్రారంభిస్తారు. అయితే టెస్ట్ మ్యాచుల్లో మాత్రం ఫీల్డింగ్ చేసే టీంకు ప్రతి 80 ఓవర్లకు ఒకసారి ఒక కొత్త బాల్ అందుబాటులో ఉంటుంది. ఒన్డే క్రికెట్ లో అయితే ఒక ఇన్నింగ్స్ ను రెండు కొత్త బాల్స్ తో స్టార్ట్ చేస్తారు. అంటే ఒక బౌలింగ్ ఎండ్ నుండి ఒక బాల్ వాడితే మరో బౌలింగ్ ఎండ్ నుండి ఇంకో కొత్త బాల్ ను యూస్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక టీం తమ 50 ఓవర్ల కోటాను రెండు బాల్స్ యూస్ చేసి ఫినిష్ చేస్తారు. కానీ టీ20 క్రికెట్ లో మాత్రం ఒక ఇన్నింగ్స్ కు ఒక్క బాల్ నే వాడతారు.
ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌలింగ్ చేసే సమయంలో తప్ప మరే ఇతర సందర్భంలో అయినా అంటే ఓవెర్స్ మధ్యలో మరియు వికెట్ పడినప్పుడు అలాగే ఏదైనా కారణం వల్ల ఇన్నింగ్స్ కు బ్రేక్ పడినప్పుడు బాల్ పూర్తిగా అంపైర్ ఆధీనంలో ఉంటుంది. అలాగే ఏ కారణంతో అయినా సరే ప్లేయర్స్ కావాలని బాల్ యొక్క షేప్ ను మార్చాలని ట్రై చేస్తే, అంటే బాల్ ను నోటితో కొరకడమో లేదా సాండ్ పేపర్ లాంటివి తీసుకుని బాల్ పై రుద్దడమో చేస్తే ఆ ప్లేయర్స్ పై వేటు వేయడం జరుగుతుంది. దీన్నే మనం బాల్ టాంపరింగ్ అంటాం.
Also Read – Different Types Of Cricket Balls (క్రికెట్ లో వాడే 3 రకాల బాల్స్ గురించి తెలుసుకోండి)
ఇక రూల్స్ ను అతిక్రమిస్తూ బౌలర్ గనుక ఇల్లీగల్ యాక్షన్ తో బౌలింగ్ చేస్తే ఆ బౌలర్ పైన కూడా వేటు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఇల్లీగల్ యాక్షన్ అంటే బాల్ వేస్తున్నప్పుడు బౌలర్ హ్యాండ్ అనేది ఎప్పుడు స్ట్రయిట్ గానే ఉండాలి. అలా కాకుండా ఆ 180 డిగ్రీస్ పోసిషన్ నుండి 15 డిగ్రీస్ కంటే ఎక్కువ తన చేతిని లోపల వైపు కు బెండ్ చేసి బౌలింగ్ చేస్తే దాన్ని చకింగ్ అంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే త్రో బౌలింగ్ అంటాం. ఇక ప్రెసెంట్ లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో వైట్ బాల్ ను టెస్ట్ క్రికెట్ లో రెడ్ మరియు పింక్ బాల్స్ ను ఉపయోగిస్తున్నారు.
ఇక ఉమెన్స్ మరియు జూనియర్ క్రికెట్ లో బాల్ సైజ్ అండ్ వెయిట్ ఈ కింద విధంగా ఉంటాయి.
Women’s Cricket
- Weight: 140 to 151 Grams
- Circumference: 8.25 to 8.88 inches or 21.0 to 22.5 cm
Junior Cricket (Below 13 Years)
- Weight: 133 to 144 Grams
- Circumference: 8.06 to 8.69 inches or 20.5 to 22.0 cm
లా నెంబర్ 5. The Bat
ఒక క్రికెట్ బ్యాట్ ప్రధానంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒక దాన్ని హ్యాండిల్ మరో దాన్ని బ్లేడ్ అంటారు. అయితే ఈ లా ప్రకారం ఈ రెండు పార్ట్స్ ను కేవలం వుడ్ తో మాత్రమే తయారుచేయాలి. ఇక బ్యాట్ యొక్క డైమెన్షన్స్న్ విషయానికొస్తే ఈ లా ప్రకారం క్రికెట్ లో వాడే బ్యాట్ యొక్క పొడవు 38 (96.52 cm) ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే వెడల్పు 4.25 (10.8 cm) ఇంచెస్ ను మించకూడదు.ఇక బ్యాట్ యొక్క స్పైన్ సైజ్ అంటే వెనుక భాగంలో ఎత్తుగా ఉంటుంది కదా అది, 2.64 ఇంచెస్ దాటివుండకూడదు. అలాగే బ్యాట్ యొక్క ఎడ్జ్ థిక్ నెస్ 1.56 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. బ్యాట్ యొక్క బ్లేడ్‌ను కప్పడానికి వాడే స్ట్రోక్ ప్యాడ్ థిక్ నెస్ 0.04 to 0.1 సెంటీమీటర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి.
ఇక బ్యాట్ పట్టుకున్న బ్యాట్సమెన్ యొక్క గ్లోవ్స్ ను కూడా బ్యాట్ గానే పరిగణిస్తారు. అంటే బాల్ బ్యాట్సమెన్ చేతికి వేసుకున్న గ్లోవ్స్ కు తగిలినా అది బ్యాట్ కు తగిలినట్టే పరిగణించి అంపైర్ నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ బ్యాట్ యొక్క సర్ఫేస్ క్రికెట్ రూల్స్ ప్రకారం బంతికి ఎలాంటి డామేజ్ చేసేలా ఉండకూడదు. అలాగే ఒక బ్యాట్సమెన్ తన బ్యాట్ ను ఏ టైమ్ లో అయినా సరే మార్చుకోవచ్చు. ఇక ఈ బ్యాట్ ను వాటి యొక్క క్వాలిటీ ఆధారంగా 4 టైప్స్ గా డివైడ్ గా చేసారు. Type – A, Type – B, Type – C, Type – D. జనరల్ గా Type – A బ్యాట్ ను ప్రొఫెషన్ క్రికెట్ లో ఎక్కువుగా వాడతారు. మిగిలినవి జూనియర్ క్రికెట్ లో ఎక్కువుగా వాడతారు. అయితే ఏ క్రికెట్ లో అయినా గానీ బాట్స్మన్ ఉపయోగించే బ్యాట్ ఈ ఫోర్ టైప్స్ లో ఎదో ఒకటి అయ్యి ఉండాలి. అలా లేకపోతే ఆ బ్యాట్ ను నిషేధించడం జరుగుతుంది.
అయితే కొన్ని షరతులతో కొంత మంది ఆటగాళ్లకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ ను యూస్ చెయ్యడానికి పరిమిషన్ ఇస్తారు. ఫర్ ఎక్సమ్పుల్ క్రిస్ గేల్ వాడే బ్యాట్ మిగతా వాటి కన్నా చాలా బరువుగా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ కూడా లాంగ్ హ్యాండిల్ ఉండే మంగూస్ బ్యాట్ ను యూస్ చేసేవాడు.
లా నెంబర్ 6. The Pitch
మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఇరువురు అంపైర్లు పిచ్ యొక్క ఫిట్నెస్ ను పరిక్షించి ఆ రోజు ఆట ఆడేందుకు అది అనుగుణంగా ఉందో లేదో నిర్దారింఛి మ్యాచ్ ను స్టార్ట్ చేస్తారు. అయితే పిచ్ ను తయారుచేసే పూర్తి బాధ్యత మాత్రం ఆ గ్రౌండ్ యొక్క యాజమాన్యం పైనే ఉంటుంది. కానీ ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తరువాత మాత్రం పిచ్ యొక్క యూసేజ్ మరియు మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఆన్ ఫీల్డ్ అంపైర్స్ చేతుల్లోనే ఉంటుంది. అలాగే పిచ్ అనేది ఆడటానికి డేంజరస్ గా ఉన్న లేదా అన్ ప్లేయుబుల్ గా ఉన్న ఆ పిచ్ ను చేంజ్ చేసే అధికారం అంపైర్ కు ఉంటుంది.
ఇక పిచ్ యొక్క డైమెన్షన్స్న్ విషయానికొస్తే, పొడవు 22 యార్డ్స్ లేదా 20.12 మీటర్స్ లేదా 66 అడుగులు ఉండాలి. అలాగే వెడల్పు 10 అడుగులు లేదా 3.05 మీటర్స్ ఉండాలి. అయితే కొన్ని గ్రౌండ్స్ లో ఆర్టిఫిషల్ పిచ్ ను యూస్ చేస్తారు. వీటినే నాన్ టర్ఫ్ పిట్చెస్ అంటారు. వీటి యొక్క పొడవు కనీసం 58 అడుగులు అలాగే వెడల్పు మినిమం 6 అడుగులైన ఉండాలి. ఇక వీటిని గ్రౌండ్ లో కాకుండా బయట తయారుచేసి మ్యాచ్ ముందు ఆడే గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేస్తారు.
Also Read – About Cricket Pitch In Telugu (క్రికెట్ పిచ్ గురించి పూర్తిగా తెలుసుకోండి)
లా నెంబర్ 7. The Creases
ఈ లా ప్రకారం స్టంప్స్ యొక్క స్థానాన్ని బేస్ చేసుకుని మొత్తం మూడు రకాల క్రీజ్ లు ఉంటాయి. ఒకటి బౌలింగ్ క్రీజ్ రెండు పోపింగ్ క్రీజ్ మూడు రిటర్న్ క్రీజ్. స్టంప్స్ యొక్క పోసిషన్ నుండి అడ్డంగా గీసిన లైన్‌ను బౌలింగ్ క్రీజ్ అంటారు. దీని యొక్క పొడవు 2.64 మీటర్స్ ఉంటుంది. ఇక బౌలింగ్ క్రీజ్ నుండి పిచ్ యొక్క ముందు భాగానికి సమాంతరంగా 1.22 మీటర్స్ దూరంలో ఉండే లైన్‌ను పోపింగ్ క్రీజ్ అంటారు. ఇక ఈ బౌలింగ్ క్రీజ్ మరియు పోపింగ్ క్రీజ్ ను Perpendicular గా జాయిన్ చేసే లైన్‌ని రిటర్న్ క్రీజ్ అంటారు. ఈ రిటర్న్ క్రీజ్ పిచ్ కు ఇరువైపులా మిడిల్ స్టంప్ నుండి 1.32 మీటర్స్ దూరంలో ఉంటుంది.
ఇక ఈ రిటర్న్ క్రిజ్ పిచ్ యొక్క ఎడ్జెస్ ను రెప్రెసంట్ చేస్తుంది. సో బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా ఈ రిటర్న్ క్రీజ్ లోపల మాత్రమే చెయ్యాలి. ఇక లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఉండే వైడ్ క్రీజ్ మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో ఉంటుంది. దీని గురించి మనం వైడ్ బాల్ రూల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
లా నెంబర్ 8. The Wickets
ఈ వికెట్స్ అనేవి మొత్తం రెండు సెట్లు ఉంటాయి. ఈ రెండు సెట్లు పిచ్ కు ఇరువైపులా బౌలింగ్ క్రీజ్ కు మధ్యలో ఒకదానికి ఒకటి ఎదురుగా పెరలాల్ గా పెడతారు. ఇక ఈ వికెట్ అనేది మొత్తం మూడు వుడెన్ స్టిక్స్ మరియు రెండు బెయిల్స్ ను కలిగి ఉంటుంది. ఈ మూడు వుడెన్ స్టిక్స్ ను స్టంప్స్ అంటారు. ఇక ఒక్కో స్టంప్ యొక్క పొడవు 28 ఇంచెస్ ఉంటుంది.అలాగే సీలిండ్రికల్ షేప్ లో ఉండే ఈ స్టంప్ యొక్క డయామీటర్ 1.38 ఇంచెస్ నుండి 1.5 ఇంచెస్ మధ్యలో ఉండాలి. ఇక ఈ మూడు స్టంప్స్ ను ఈక్వల్ డిస్టెన్స్ లో మొత్తంగా 9 అంగుళాల వెడల్పుతో బౌలింగ్ క్రీజ్ పై అమరుస్తారు. ఫైనల్లీ ఈ మూడు స్టంప్స్ పై భాగంలో ఉండే గ్రూవ్స్ మీద రెండు బెయిల్స్ ను అమరుస్తారు. ఇవి స్టంప్ యొక్క పై భాగం నుండి కేవలం హాఫ్ ఇంచ్ ఎత్తులో మాత్రమే ఉండాలి. ఇక ఒక్కో బెయిల్ యొక్క పొడవు 4.31 ఇంచెస్ ఉంటుంది.
లా నెంబర్ 9. Preparation And Maintenance of the Playing Area
ఈ లా ప్రకారం మ్యాచ్ మొదలయ్యే ముందు పిచ్ మరియు ఔట్ఫిల్డ్ యొక్క ప్రిపరేషన్ అండ్ మెయింటనెన్స్ బాధ్యతలు అంటే పిచ్ తాయారు చెయ్యడం, రోల్ చెయ్యడం, అవుట్ ఫీల్డ్ లో ఉన్న గ్రాస్ కట్ చెయ్యడం మరియు పిచ్ కు వాటరింగ్ చెయ్యడం వంటి పనులు పూర్తిగా గ్రౌండ్ యొక్క యాజమాన్యం చేతిలో ఉంటాయి. కానీ ఇవన్నీ మ్యాచ్ మొదలుపెట్టాక ముందే చెయ్యాలి. ఒకసారి మ్యాచ్ మొదలయ్యాక మాత్రం పిచ్ ను రోల్ చెయ్యడం, పిచ్ మీద ఏమైనా పగుళ్లు ఉంటే వాటిని సరిచెయ్యడం మరియు క్రీసెస్ చెరిగిపోతే వాటిని తిరిగి గీయించడం వంటి పనులు పూర్తిగా అంపైర్స్ చేతుల్లో ఉంటాయి. అలాగే కొన్ని సార్లు బ్యాటింగ్ సైడ్ యొక్క కెప్టెన్ కోరిక మేరకు ఇన్నింగ్స్ బ్రేక్ లో పిచ్ ను 7 నిమిషాల పాటు రోల్ చేస్తారు.
లా నెంబర్ 10. Covering The Pitch
మ్యాచ్ ఆడే రోజు తప్ప మారె ఇతర టైంలో అయినా సరే పిచ్ అనేది ఎప్పుడు కవర్స్ తో కప్పి ఉంచబడుతుంది. ఎందుకంటే పిచ్ అనేది మంచు కురిసినప్పుడు మరియు వర్షం వచ్చినపుడు తడవకూడదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం పిచ్ అనేది కవర్ చేసే ఉంటుంది. అయితే మ్యాచ్ రోజు మాత్రం ఇరు జట్ల కెప్టెన్ల కోరిక మేరకు పిచ్ ను కవర్ చేసి ఉంచాలో లేదో అనేది గ్రౌండ్ యాజమాన్యం నిర్ణయిస్తుంది. అలాగే బౌలర్ రన్నింగ్ చేసే ఏరియా కూడా ఎప్పుడు డ్రై గా ఉంచడం కోసం రెండు బౌలింగ్ ఎండ్స్ లో కూడా 30 యార్డ్ సర్కిల్ వరకు ఉన్న అవుట్ ఫీల్డ్ ను కవర్స్ తో కప్పి ఉంచుతారు. ఎందుకంటే బౌలర్ రన్ అప్ ఏరియా అనేది తడిగా ఉంటే బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు గాయపడే అవకాశముంటుంది. ఇక మ్యాచ్ ఆడుతున్న టైంలో అయితే వర్షం వచ్చినప్పుడు మాత్రమే పిచ్ ను కవర్ చేస్తారు. డే అండ్ నైట్ మ్యాచ్ లో డ్యూ ఉన్న గానీ పిచ్ ను కవర్ చెయ్యరు.
Also Read – What Is Dew Factor In Cricket (క్రికెట్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి?)
లా నెంబర్ 11. Intervals
మ్యాచ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఇచ్చే బ్రేక్స్ ను ఇంటెర్వల్స్ అంటారు. వీటిలో ఇన్నింగ్స్ బ్రేక్ మరియు డ్రింక్స్ బ్రేక్ అనేది మూడు ఫార్మాట్లలో కామన్ గా ఉంటుంది. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం వీటితో పాటు లంచ్ బ్రేక్ మరియు టీ బ్రేక్ అనేవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇన్నింగ్స్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ఒన్డే క్రికెట్ లో ఒక టీం మూడున్నర గంటల పాటు ఆడి తమ ఇన్నింగ్స్ ను ముగించిన తరువాత 45 నిమిషాల పాటు మీల్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తరువాత రెండో టీం చేజింగ్ మొదలుపెడుతుంది.ఇక టీ20 క్రికెట్ లో అయితే 90 నిమిషాల పాటు ఒక టీం 20 ఓవర్లు బౌలింగ్ చేసాక 15 మినిట్స్ ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తరువాత రెండో టీం చేజ్ మొదలుపెడుతుంది. ఇక టెస్ట్ క్రికెట్ లో కూడా ఒక టీం ఆలౌట్ అయినా లేదా తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన 10 మినిట్స్ పాటు ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తరువాత రెండో టీం బ్యాటింగ్ మొదలుపెడుతుంది.
ఇక డ్రింక్స్ బ్రేక్ విషయానికొస్తే ఒన్డే మరియు టెస్ట్ క్రికెట్ లో ప్రతి గంటకి ఒకసారి ఈ డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటారు. అలాగే ఈ డ్రింక్స్ బ్రేక్ అనేది కేవలం ఐదు నిముషాలు మాత్రమే ఉంటుంది. ఇక టీ20 క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు ముగిసిన తరువాత ఒకసారి మాత్రమే ఈ డ్రింక్స్ బ్రేక్ఇస్తారు. బట్ ఐపీఎల్ లాంటి టీ20 లీగ్స్ లో స్ట్రాటజిక్ టైం అని చెప్పి రెండు సార్లు డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటారు. ఇక టెస్ట్ క్రికెట్ లో లంచ్ బ్రేక్ 40 నిముషాలు మరియు టీ బ్రేక్ 20 నిముషాలు పాటు ఉంటుంది. అయితే ఈ బ్రేక్స్ అనేవి ఒక్కోసారి ఎర్లీ గా తీసుకుంటారు. ఒక్కోసారేమో లేట్ గా తీసుకుంటారు.
ఫర్ సపోస్ టీ బ్రేక్ 20 మినిట్స్ ఉందనగా వర్షం రావడమో లేదో టీం ఆలౌట్ అవడమో, డిక్లేర్ ఇవ్వడమో చేస్తే ఈ బ్రేక్ ఎర్లీ గా తీసుకుంటారు. అలా కాకుండా టీ బ్రేక్ టైం కు ఒక టీం 9 వికెట్లను కోల్పోయి ఉందనుకో ఆ లాస్ట్ వికెట్ కోసం మరికొంత సమయం వెచ్చించి టీ బ్రేక్ అనేది లేట్ గా తీసుకుంటారు. ఇక ఒక మ్యాచ్ లో ఏ బ్రేక్ అయినా సరే ఎంత సమయం ఉంటుందనేది మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే అంపైర్ ఇరు జట్ల కెప్టెన్లకు చెబుతారు. వీటిని అంగీకరించిన తరువాతే మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అయితే వీటితో పాటు మ్యాచ్ మధ్యలో ఇంజ్యూరిస్ వల్లనో లేదా బ్యాడ్ వెథర్ వల్లనో బ్రేక్స్ అనేవి అనుకోకుండా వస్తాయి. సో అనూహ్యంగా వచ్చే ఈ బ్రేక్స్ ను ఆఫీసియల్ గా మ్యాచ్ ముందే సెట్ చెయ్యలేరు. అందుకే స్లో ఓవర్ రేట్ కేలిక్యులేట్ చేసినప్పుడు వీటి వల్ల వేస్ట్ అయినా టైంను పరిగణలోకి తీసుకోరు.
లా నెంబర్ 12. Start of Play; Cessation of Play
ఈ లా ప్రకారం అంపైర్ ఎప్పుడు మ్యాచ్ ను స్టార్ట్ చెయ్యమంటే అప్పుడు స్టార్ట్ చెయ్యాలి. అలాగే అంపైర్ ఎప్పుడు మ్యాచ్ ను ఆపేయమంటే అప్పుడు మ్యాచ్ ను ఆపేయాలి. అంపైర్ మ్యాచ్ స్టార్ట్ చెయ్యడానికి ప్లే అని నోటితో చెప్తాడు. అలాగే మ్యాచ్ ఆపెయ్యడానికి టైం అని నోటితో చెప్పి వికెట్ పై ఉండే బెయిల్స్ ను క్రిందకు పడగొడతారు. ఇక అంపైర్ బేసిక్ గా ఈ ప్లే అండ్ టైం వర్డ్స్ ను మనం పైన చెప్పుకున్న ఇంటర్వెల్స్ టైం వచ్చినప్పుడు ఎక్కువుగా ఉపయోగిస్తారు.
లా నెంబర్ 13. Innings
ప్రతి మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఒక్కో టీం కు రెండు ఇన్నింగ్స్‌లు చెప్పున ఓవరాల్ గా 4 ఇన్నింగ్స్ లు ఉంటాయి. అలాగే ఒక ఇన్నింగ్స్ ను ఏ టీం స్టార్ట్ చెయ్యాలని అనేదాన్ని మ్యాచ్ కు అరగంట సమయం ముందు టాస్ వేసి నిర్ణయిస్తారు. ఇక లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ ను నెంబర్ ఆఫ్ ఒవెర్స్ తో రిప్రెసెంట్ చేస్తారు. అది ఎలా అంటే టీ20 క్రికెట్ లో అయితే ఒక ఇన్నింగ్స్ కు 20 ఓవర్లు మరియు ఒన్డే క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ కు 50 ఓవర్లు చెప్పున ఉంటాయి. అయితే ఒక టీం ఈ అన్ని ఓవర్లు ఆడకుండా ఆలౌట్ అయితే ఇన్నింగ్స్ లో ఇంకా ఓవర్లు ఉన్నా సరే ఆడటానికి బ్యాట్సమెన్ ఎవరు లేరు కాబట్టి ఆ ఇన్నింగ్స్ ను తొందరగా ముగిస్తారు.
ఇక టీ20 క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ ను బౌలింగ్ చేసే టీం 90 నిమిషాల్లో కంప్లీట్ చెయ్యాలి. అంటే 90 నిమిషాల లోపు 20 ఓవర్లు కంప్లీట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే స్లో ఓవర్ రేట్ అని చెప్పి టీం మొత్తానికి ఫైన్ వేస్తారు. అయితే ఈ 90 నిమిషాల్లో మన ఇంటెర్వల్స్ లా లో చెప్పుకున్న ఏ బ్రేక్ టైంను కూడా ఇంక్లూడ్ చెయ్యరు. అవి సెపెరేట్ గా ఉంటాయి. సేమ్ ఒన్డే క్రికెట్ లో కూడా మూడున్నర గంటల టైంలో బౌలింగ్ టీం 50 ఓవర్లను కంప్లీట్ చెయ్యాలి. లేదంటే స్లో ఓవర్ రేట్ పడుతుంది. ఇక టెస్ట్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ కు ఇన్ని ఓవర్లని చెప్పి ఎలాంటి లిమిట్ లేదు. ఒక టీం ఆలౌట్ అయ్యేంతవరకు బ్యాటింగ్ చెయ్యొచ్చు. లేదా తమకు స్కోర్ బోర్డు మీద సరిపడు రన్స్ ఉన్నాయని అనుకుంటే తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ముగించవచ్చు.
లా నెంబర్ 14. The Follow on
ఈ ఫాలో ఆన్ అనేది ఓన్లీ టెస్ట్ క్రికెట్ కు మాత్రమే వర్తిస్తుంది. సో దీని ప్రకారం ప్రత్యర్థి జట్టును వరుసగా రెండు ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ ఆడించి వాళ్ళను ఆలౌట్ చెయ్యాలి. ఇక ఫాలో ఆన్ రూల్ ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కనీసం 200 పరుగులు లీడ్ ఉంటేనే ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ లోకి నెట్టగలరు. అంటే మొదట బ్యాటింగ్ చేసిన టీం ఎంత స్కోర్ చేసిన ప్రత్యర్థి జట్టు మాత్రం వాళ్ళ మొదటి ఇన్నింగ్స్ లో వాళ్ళకంటే 200 కన్నా తక్కువ పరుగులు చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఈ ఫాలో ఆన్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. అయితే 3 ఆర్ 4 డేస్ ఉండే టెస్ట్ మ్యాచ్స్ లో మాత్రం మొదటి ఇన్నింగ్స్ లీడ్ 150 పరుగులున్న సరే ఆపొనెంట్ టీం ను ఫాలో ఆన్ ఆడించవచ్చు.
లా నెంబర్ 15. Declaration and Forfeiture
డిక్లరేషన్ అండ్ ఫాఫుచర్ అనేవి కూడా టెస్ట్ క్రికెట్ కు చెందినవే. డిక్లరేషన్ అంటే బ్యాటింగ్ చేసే టీం తమకు స్కోర్ బోర్డు పై ఉన్న రన్స్ చాలనుకుంటే ఆలౌట్ అవ్వకుండానే వాళ్ళ ఇన్నింగ్స్ ను ముగించవచ్చు. ఇలా చేస్తే డిక్లరేషన్ అంటారు. అలా కాకుండా అసలు మొత్తం ఇన్నింగ్స్ ను ఆడకుండానే ముగిద్దాం అనుకున్నప్పుడు ఆ టీం తమ ఇన్నింగ్స్ ను ఫాఫుచర్ చెయ్యవచ్చు. అయితే ఇది చాలా రేర్ కేస్. ఇక ఈ రెండిట్లో ఏది చెయ్యాలనుకున్న సరే ఆ టీం కెప్టెన్ అంపైర్ కు చెప్పాలి. ఇక ఒకసారి అంపైర్ కు ఈ డిక్లరేషన్ లేదా ఫాఫుచర్ నిర్ణయం చెప్పిన తరువాత ఏ కెప్టెన్ అయినా సరే తిరిగి ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కుదరదు.
లా నెంబర్ 16. The Result
ఏ ఫార్మాట్లో అయినా సరే ఒక టీం ఇంకో టీం చేసిన దాని కన్నా ఒక్క పరుగు ఎక్కువ సాధించిన ఆ టీం విన్ అయినట్టు ప్రకటిస్తారు. సేమ్ అదే విధంగా ఒక్క పరుగు తక్కువ చేసిన ఆ టీం ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. అలా కాకుండా రెండు టీంలు సమానంగా పరుగులు సాధిస్తే ఆ మ్యాచ్ టై అయినట్టు ప్రకటిస్తారు. ఇక మూడింటితో పాటు టెస్ట్ క్రికెట్ లో డ్రాన్ అనే రిసల్ట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం ఒక టెస్ట్ మ్యాచ్ టైం అంటే 5 రోజులు అయిపోయే సరికి 4 ఇన్నింగ్స్ లు గనుక కంప్లీట్ అవ్వకపోతే ఆ మ్యాచ్ రిసల్ట్ ను డ్రాగా ప్రకటిస్తారు.
లా నెంబర్ 17. The Over
ఒక ఓవర్ లో 6 బాల్స్ వేస్తారు. అలాగే ఈ ఆరు లీగల్ డెలివెరీస్ అయితేనే ఓవర్ కంప్లీట్ అవుతుంది. అంటే వైడ్ బాల్, నో బాల్ మరియు డెడ్ బాల్ ను కౌంట్ లోకి తీసుకోకుండా బాల్స్ ను కాలుక్యులేట్ చేస్తారు. ఇక ఒక ఓవర్ ను ఒక బౌలింగ్ ఎండ్ నుండి వేస్తే మరో ఓవర్ ను ఇంకో బౌలింగ్ ఎండ్ నుండి వెయ్యాలి. కాగా ఏ బౌలర్ ను కూడా వరుసగా రెండు ఓవర్లు పాటు బౌలింగ్ వేసేందుకు అనుమతించారు. అయితే ఒక ఓవర్ వేస్తున్నప్పుడు బౌలర్ గాయపడిన లేదా సస్పెండ్ అయినా వేరే బౌలర్ వచ్చి ఆ మిగతా బాల్స్ వేసి ఓవర్ ను కంప్లీట్ చెయ్యవచ్చు. కానీ ఆ ఓవర్ ముగిసాక నెక్స్ట్ ఓవర్ మాత్రం అతను కంటిన్యూ చెయ్యడానికి ఉండదు. వేరే కొత్త బౌలర్ వెయ్యాలి.
Also Read – Slow Over Rate In Cricket (క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి)
లా నెంబర్ 18. Scoring Runs
ఒక బాట్స్మన్ బాల్ ను కొట్టిన తరువాత ఇద్దరు బాట్స్మన్ ఒకరిని ఒకరు క్రాస్ అయ్యి తమ అపోజిట్ ఎండ్స్ లో ఉన్న పోపింగ్ క్రిజ్ లోకి వెళితే ఒక పరుగు స్కోర్ చేసినట్టు. ఇక ఇలా ఒక బాల్ కు అవుట్ కాకుండా ఎన్ని పరుగులు అయినా తియ్యవచ్చు. అయితే ఒకటి కన్నా ఎక్కువ పరుగులు తీసినప్పుడు ఏ బ్యాట్సమెన్ అయినా సరే తన అపోజిట్ ఎండ్ లో ఉన్న పోపింగ్ క్రిజ్ లోపల బ్యాట్ పెట్టకుండా తిరిగి వస్తే షార్ట్ రన్ ఇస్తారు. ఈవెన్ క్రీజ్ పెట్టిన రన్ ఇవ్వరు. ఇక షార్ట్ రన్ అంటే రెండు పరుగులు తీసిన గానీ ఒక పరుగును మాత్రమే కౌంట్ లోకి తీసుకుంటారు. బట్ బ్యాటింగ్ ను మాత్రం ఇంతకముందు ఎవరైతే స్ట్రైక్ లో ఉన్నారో వాళ్లే కంటిన్యూ చేస్తారు. కౌంట్ అయ్యింది సింగల్ ఏ అయినా బాట్స్మన్ మాత్రం తమ ఎండ్స్ మారరు.
లా నెంబర్ 19. Boundaries
మనం పైన చెప్పుకున్న రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ద్వారానే కాకుండా బౌండరీస్ కొట్టడం ద్వారా కూడా ఒక బాట్స్మన్ రన్స్ స్కోర్ చెయ్యవచ్చు. గ్రౌండ్ ఎండింగ్ లో ఒక రోప్ ను మొత్తం 360 డిగ్రీస్ లో ఒక సర్కిల్ లా పెడతారు. దీనినే బౌండరీ అంటారు. ఈ బౌండరీ లోపల గ్రీన్ కలర్ లో ఉండే ఏరియాను అవుట్ ఫీల్డ్ అంటారు. సో ఒక బాట్స్మన్ బాల్ ను కొట్టిన తరువాత అది అవుట్ ఫీల్డ్ లో పడి బౌండరీ లైన్ దాటితే దానికి 4 రన్స్ ఇస్తారు. అలా కాకుండా బాట్స్మన్ కొట్టిన బాల్ అవుట్ ఫీల్డ్ లో ఎక్కడ పడకుండా నేరుగా బౌండరీ లైన్ అవతల పడితే దానికి 6 రన్స్ ఇస్తారు. ఇక ఒక బౌండరీని ఆపాలకునే ఫీల్డర్ ఆ లైన్ కు తగలకుండా బాల్ ను ఆపాలి. అంటే ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ అవతలికి వెళ్లి బాల్ ను పట్టుకోకుండా ఆ లైన్ లోపల ఉన్నప్పుడు మాత్రమే బాల్ ను పట్టుకోవాలి.
అలాగే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టినప్పుడు ఫీల్డర్ అవుట్ ఫీల్డ్ నుండి జంప్ చేసి పడితేనే కౌంట్ లోకి తీసుకుంటారు. అలా కాకుండా బౌండరీ లైన్ లోపలకి వెళ్లి జంప్ చేసి బాల్ ఆపిన లేదా బౌండరీ పై నిలబడి అక్కడ నుండి జంప్ చేసి బాల్ ఆపిన దాన్ని బౌండరీగానే పరిగణిస్తారు. అంటే బౌండరీ దగ్గర జంప్ చేసి క్యాటచెస్ పట్టినప్పుడు ఆ జంప్ స్టార్టింగ్ పాయింట్ అనేది బౌండరీ లైన్ కు టచ్ అవ్వకుండా అవుట్ ఫీల్డ్ నుండి స్టార్ట్ కావాలి.
లా నెంబర్ 20. Dead Ball
క్రికెట్ లో బాల్ డెడ్ అవ్వడం అనేది చాలా నార్మల్ విషయం. అయితే ఒక బాల్ డెడ్ అవ్వడం అనేది చాలా సార్లు ఆటోమేటిక్ గా జరిగితే కొన్ని సార్లు మాత్రం అంపైర్ డెడ్ బాల్ ను సిగ్నల్ చేస్తారు. సో ఇప్పుడు మీకొక డౌట్ వస్తుంది. బాల్ ఆటోమేటిక్ గా డెడ్ అవ్వడం ఏంటి అంపైర్ కదా డెడ్ బాల్ ను సిగ్నల్ చేస్తాడని. సో ఫ్రెండ్స్ బాల్ ఆటోమేటిక్ గా డెడ్ అవ్వడం అంటే ఒక బాల్ కి యాక్షన్ మొత్తం జరిగిన తరువాత ఫైనల్ గా ఒక ఫీల్డర్ చేతిలోకి వెళ్లి సెటిల్ అవ్వుతుంది కదా, అప్పుడు బాల్ అనేది ఆటోమేటిక్ గా డెడ్ అవుతుంది. మీకు ఎక్సమ్పుల్స్ చెప్తావినండి. ఒక బౌలర్ బాల్ వేసాక అది వెళ్లి వికెట్ కీపర్ చేతిలోనో లేదా ఎవరైనా ఫీల్డర్ చేతిలో సెటిల్ అయ్యింది అనుకోండి ఆ బాల్ కి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ బాల్ డెడ్ అయ్యింది అంటారు.
అలాగే బ్యాట్సమెన్ బౌండరీ కొట్టినప్పుడు బాల్ బౌండరీ రోప్ కు తగలగానే డెడ్ అవుతుంది. అంతేకాకుండా బ్యాట్సమెన్ అవుట్ అయినా వెంటనే కూడా బాల్ డెడ్ అవుతుంది. ఇవి జనరల్ కేసెస్. అయితే ఇవే కాకుండా ఒక బ్యాట్సమెన్ బాల్ ను కొట్టాక అది ఎవరైనా ఫీల్డర్ కు బలంగా తగిలి ఇంజూర్ అయితే బాల్ వెంటనే డెడ్ అవుతుంది. అలాగే బాల్ వెళ్లి బ్యాట్స్‌మన్ యొక్క పాడ్స్ లేదా హెల్మట్ లో ఇరుక్కుపోయిన బాల్ వెంటనే డెడ్ అవుతుంది. సో అప్పుడు బాట్స్మన్ స్వయంగా తన చేతితో బాల్ ను పట్టుకోవచ్చు. అలా కాకుండా యాక్టీవ్ గా ఉన్న బాల్ ను బాట్స్మన్ చేతితో ఆపితే అతన్ని అవుట్ గా ప్రకటిస్తారు.
ఇక బాట్స్మన్ బాల్ కొట్టాక అది వెళ్లి అంపైర్ కు తగిలితే ఆ బాల్ ఇంకా యాక్టీవ్ గానే ఉంటుంది. బాట్స్మన్ రన్స్ పరిగెత్తొచ్చు. ఎందుకంటే అంపైర్ ను కూడా అపోజిట్ ఎండ్ లో ఉన్న స్టంప్స్ లానే పరిగిణిస్తారు. అంటే బాల్ స్టంప్స్ కు తగిలిన అంపైర్ కు తగిలిన ఒకటే. సో ఫీల్డర్స్ కు బాట్స్మన్ ను రన్ అవుట్ చేసే ఛాన్స్ ఇంకా యాక్టీవ్ గానే ఉంటుంది. అయితే బాల్ తగలగానే అంపైర్ కింద పడిపోయిన లేదా బాల్ అంపైర్ యొక్క అవుట్ ఫిట్ లో ఇరుక్కుపోయిన బాల్ అనేది డెడ్ అవుతుంది. అండ్ ఒకసారి బాల్ డెడ్ అయ్యింది అంటే ఆ తరువాత ఎలాంటి యాక్షన్ జరిగిన కౌంట్ లోకి రాదు. ఇక మళ్ళీ బౌలర్ బాల్ వేసిన తరువాతే అది యాక్టీవ్ అవుతుంది.
ఇక అంపైర్ సిగ్నల్ చేసే డెడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే, బౌలర్ రన్ అప్ స్టార్ట్ చేసి బాల్ వెయ్యకుండా ఆపేసినప్పుడో లేదా బాల్ వేసేసరికి బాట్స్మన్ రెడీ గా లేనని పక్కకి వెళ్ళిపోతేనో అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా సిగ్నల్ చేస్తారు. అలాగే బాట్స్మన్ కొట్టిన బాల్ అవుట్ ఫీల్డ్ లో ఉండే స్పైడర్ కామ్ కు తగిలిన లేదా ఆ స్పైడర్ కామ్ కు కోసం కట్టిన రోప్స్ కు తగిలిన అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అలాగే బాల్ డెడ్ అవ్వకముందు గ్రౌండ్ లోకి అనిమల్స్ వచ్చిన లేదా ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి ప్లేను డిస్టర్బ్ చేసిన ఆ బాల్ ను డెడ్ గా ప్రకటిస్తారు. అంటే ఆ బాల్ కు రన్స్ స్కోర్ చేసిన లేదా వికెట్ పడిన ఏవి కౌంట్ లోకి రావు.
అలాగే బాల్ కూడా కౌంట్ చేయబడదు. సో బౌలర్ మళ్ళీ ఆ బాల్ ను వెయ్యాలిసిందే. సో గాయిస్ అంపైర్ డెడ్ బాల్ అని సిగ్నల్ చేసినప్పుడు ఆ బాల్ కి జరిగిన యాక్షన్ కౌంట్ లోకి రాదు. అలాగే బాల్ కూడా కౌంట్ లోకి రాదు. సో బాల్ ఆటోమేటిక్ గా డెడ్ అవ్వడం వేరు, అంపైర్ డెడ్ బాల్ అని ప్రకటించడం వేరు. బాల్ ఆటోమేటిక్ గా డెడ్ అయినప్పుడు ఆ బాల్ తో పాటు ఆ బాల్ కు జరిగిన యాక్షన్ ను కూడా కౌంట్ లోకి తీసుకుంటారు. అలా కాకుండా అంపైర్ బాల్ వేసిన తరువాతో లేదా వెయ్యకముందో దాన్ని డెడ్ బాల్ అని సిగ్నల్ ఇస్తే ఆ బాల్ కౌంట్ కాదు అండ్ ఆ బాల్ కు జరిగిన యాక్షన్ కూడా కౌంట్ కాదు.
లా నెంబర్ 21. No Ball
నో బాల్ అంటే బౌలర్ వేసిన బాల్ కౌంట్ లోకి రాదు గానీ, ఆ బాల్ కు బాట్స్మన్ స్కోర్ చేసిన రన్స్ మాత్రం కౌంట్ లోకి వస్తాయి. అలాగే నో బాల్ కు బాట్స్మన్ అవుట్ అయినా సరే దాన్ని నాటౌట్ గా ప్రకటిస్తారు. అయితే రన్ అవుట్, హిట్టింగ్ ది బాల్ ట్వైస్ మరియు అబ్స్ట్రుక్టింగ్ ది ఫీల్డ్ లాంటి అవుట్స్ మాత్రం ఏ బాల్ కైనా సరే అవుట్ గానే ఇస్తారు. ఇక ఈ నో బాల్ అనేది బౌలర్ తప్పిదం వల్ల జరుగుతుంది కాబట్టి ఈ బాల్ కు స్కోర్ చేసిన రన్స్ అన్ని బౌలర్ అకౌంట్ లోకే వెళ్తాయి. అలాగే నో బాల్ వేసిన ప్రతిసారి బ్యాటింగ్ టీంకు ఒక ఎక్స్ట్రా రన్ అవార్డు చేస్తారు. ఇక క్రికెట్ లో ఏకంగా పదకొండు రకాల నో బాల్స్ ఉన్నాయి. సో నేను ఒక్కోదాని గురించి క్లియర్ గా ఎక్ష్ప్లైన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి.
1. Front Foot No Ball
ఇది అందరికీ తెలిసిందే. బౌలర్ బౌలింగ్ చేస్తున్నపుడు తన ఫ్రంట్ ఫుట్ ను పోపింగ్ క్రీజ్ బయట ల్యాండ్ చేస్తే దాన్ని అంపైర్ నో బాల్ గా ప్రకటిస్తారు. ఇక ఇందులో కొన్ని కేసెస్ చూసుకుంటే బౌలర్ ఫుట్ అనేది పోపింగ్ క్రీజ్ మీద ల్యాండ్ చేసినప్పటికీ తన పాదంలో ఎలాంటి భాగం కూడా ఆ లైన్ కు లోపల వైపు లేకపోతే దాన్ని కూడా నో బాల్ గానే సిగ్నల్ చేస్తారు. సో బౌలర్ ఫుట్ అనేది ఖచ్చితంగా ఈ లైన్ లోపల ఎంతో కొంత ల్యాండ్ చెయ్యాలి.
అయితే ఫాస్ట్ బౌలర్స్ ముందు తమ హీల్ ను ల్యాండ్ చేస్తారు కాబట్టి ఇది ఈజీ గా తెలుస్తుంది. కానీ స్పిన్నర్లు ముందు వాళ్ళ పాదం యొక్క టోను ల్యాండ్ చేస్తారు. సో అలా టో ను ల్యాండ్ చేసే టైం కు గాల్లో ఉన్న తమ హీల్ భాగం ఎంతోకొంత ఖచ్చితంగా పోపింగ్ క్రీజ్ లోపల ఉండాలి. అలా లేకపోతే అది నో బాల్ అవుతుంది. ఇక ఫాస్ట్ బౌలర్ తన హీల్ ను క్రీజ్ లోపల ల్యాండ్ చేసాక అది బాల్ వేసే సరికి క్రీజ్ బయటకు స్లైడ్ అయినా గానీ దాన్ని లీగల్ బాల్ గానే ప్రకటిస్తారు. సో ఫాస్ట్ బౌలర్ తన ఫుట్ ను ఫస్ట్ ఎక్కడ ల్యాండ్ చేసాడు అనేది మాత్రమే కౌంట్ లోకి వస్తుంది.
2. Back Foot No Ball
బౌలర్ బాల్ వేసినప్పుడు తన బ్యాక్ ఫుట్ అనేది రిటర్న్ క్రీజ్ పైన ల్యాండ్ అయినా లేదా రిటర్న్ క్రీజ్ బయట ల్యాండ్ అయినా అంపైర్ దాన్ని నో బాల్ గా సిగ్నల్ చేస్తారు. సో బౌలర్ బాల్ వేసినప్పుడు తన బ్యాక్ ఫుట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ క్రీజ్ కు టచ్ అవ్వకూడదు.
3. High Full Toss No Ball
దీన్నే మనం వెయిస్ట్ హైట్ నో బాల్ అని కూడా అంటాం. సో బౌలర్ వేసిన ఒక టాస్ బాల్ బాట్స్మన్ యొక్క బ్యాట్ ను తాకినప్పుడు అది తన నడుము భాగం కన్నా ఎత్తులో ఉంటే లెగ్ అంపైర్ దాన్ని నో బాల్ గా సిగ్నల్ చేస్తారు. అంటే బౌలర్ వేసే ఫుల్ టాస్ బాల్ బాట్స్మన్ యొక్క బ్యాట్ ను టచ్ అయ్యే టైంకి అది అతని నడుము కన్నా ఎక్కువ హైట్ లో ఉండకూడదు. అయితే ఈ ఫుల్ టాస్ బాల్ బాట్స్మన్ ను రీచ్ అయ్యే టైంకు అతను ఖచ్చితంగా క్రీజ్ లోపల ఉండాలి.
అలాగే బాట్స్మన్ బాడీ బెండ్ అయ్యి ఉండకూడదు. అప్పుడే మాత్రమే నో బాల్ ఇస్తారు. ఇక కొన్ని సార్లు బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బాల్ అనేది తన యాక్షన్ కంప్లీట్ చెయ్యకముందే తన హ్యాండ్ నుండి స్లిప్ అయ్యి ఎక్కడో పడుతుంది. సో ఇలాంటి బాల్ ను అంపైర్ నో బాల్ గా కాకుండా డెడ్ బాల్ గా ప్రకటిస్తాడు. ఎందుకంటే బౌలర్ బౌలింగ్ హ్యాండ్ ను రొటేట్ చేసినప్పుడు తన తలను దాటితేనే బౌలింగ్ యాక్షన్ ను కంప్లీట్ చేసినట్టు.
4. Above Head Height No Ball
ఒన్డే మరియు టెస్ట్ క్రికెట్ లో ఒక బౌలర్ ఒక ఓవర్ కు రెండు బౌన్సర్లు వెయ్యవచ్చు. అయితే బౌలర్ ఈ రెండు బౌన్సర్ల లిమిట్ దాటిన తరువాత కూడా మరో బౌన్సర్ వేస్తే దాన్ని నో బాల్ గా సిగ్నల్ చేస్తారు. అంటే ఒక ఓవర్లో 3rd బౌన్సర్ కు ఒకవేళ బాట్స్మన్ పుల్ షాట్ లేదా హుక్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా గానీ దాన్ని నో బాల్ గా సిగ్నల్ చేసి బాట్స్మన్ ను నాటౌట్ గా ప్రకటిస్తారు.
అయితే కొన్ని సందర్భాల్లో ఈ బౌన్సర్ అనేది మరీ ఎక్కువ హైట్ లో బాట్స్మన్ తల పై నుండి వెళ్తే బౌన్సర్ సిగ్నల్ తో పాటు వైడ్ బాల్ సిగ్నల్ కూడా ఇస్తారు. అయితే టీ20 క్రికెట్ లో ఒక ఓవర్ కు ఒక బౌన్సర్ ను మాత్రమే ఎలావ్ చేస్తారు. ఇక బాట్స్మన్ షోల్డర్ కన్నా ఎక్కువ ఎత్తుతో వచ్చిన బాల్ ను బౌన్సర్ అంటారు. సో ఇలాంటి బాల్ కు బాట్స్మన్ హుక్ షాట్ ఆడిన లేదా బాల్ ను మిస్ అయినా అది బౌన్సర్ గానే కన్సిడర్ చేసి బౌలర్ కు వార్నింగ్ ఇస్తారు.
5. Throwing No Ball
ఒకవేళ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రూల్స్ కి విరుద్దంగా బాల్ ను త్రో చేస్తే ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటిస్తారు. సో రూల్స్ ప్రకారం బౌలింగ్ చేసే బౌలర్ హ్యాండ్ అనేది స్ట్రెయిట్ గా ఉండాలి. అలా కాకుండా బౌలర్ తన హ్యాండ్ ను ఆ 180 డిగ్రీస్ పోసిషన్ నుండి 15 డిగ్రీస్ కంటే ఎక్కువ ఏంగిల్ తో లోపలకు వంచి బౌలింగ్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటారు.
Also Read – Top 10 Throw Bowlers In Cricket (క్రికెట్ లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 10 మంది బౌలర్లు)
6. Breaking the Stumps No Ball
బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన ఎండ్ లో ఉన్న స్టంప్స్ కు గనుక అతని బాడీ టచ్ అయ్యి బెయిల్స్ డీస్లోడ్జ్ అయితే ఆ బాల్ ను నో బాల్ గా సిగ్నల్ చేస్తారు.
7. Double Bounce No Ball
బౌలర్ బాల్ వేసినప్పడు తన యాక్షన్ కంప్లీట్ అయ్యాక బాల్ స్లిప్ అయ్యి బాట్స్మన్ రీచ్ అయ్యేలోపు ఒకటి కన్నా ఎక్కువ సార్లు బౌన్స్ అయితే ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటిస్తారు. సో ఇలాంటి బాల్ కు బాట్స్మన్ ఏదైనా షాట్ ఆడి రన్స్ కూడా స్కోర్ చెయ్యవచ్చు. బట్ బాట్స్మన్ ఇలాంటి బాల్స్ కు షాట్ ఆడినప్పుడు అతని బాడీ ఖచ్చితంగా పిచ్ వారితో కాంటాక్ట్ లో ఉండాలి. అంటే పిచ్ బయటికి వెళ్లి ఇలాంటి బాల్స్ కు షాట్ ఆడకూడదు.
8. Fielding Restrictions No Ball
ఇది ఓన్లీ లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో మాత్రమే ఉంటుంది. సో ఒక బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో 30 యార్డ్ సర్కిల్ బయట అనుమతించిన దాని కంటే ఎక్కువ మంది ఫీల్డర్స్ ను ప్లేస్ చేస్తే ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటిస్తారు.
9. Change of Action No Ball
బౌలర్ ఒక ఓవర్లో కొన్ని బాల్స్ ను ఒక హ్యాండ్ తో వేసి అంపైర్ కు చెప్పకుండా తన హ్యాండ్ ను మార్చి బౌలింగ్ చేస్తే ఆ బాల్ ను నో బాల్ గా సిగ్నల్ చేస్తారు. అంటే ఒక ఓవర్లో కొన్ని బాల్స్ ను కుడి చేత్తో వేసి, మధ్యలో అంపైర్ కు చెప్పకుండా ఎడమ చేత్తో బౌలింగ్ చేస్తే అది నో బాల్ అవుతుంది. అలాగే బౌలర్ అంపైర్ కు చెప్పకుండా తన బౌలింగ్ గార్డ్ మార్చుకుని బౌలింగ్ చేసిన దాన్ని నో బాల్ గానే ప్రకటిస్తారు. ఒకవేళ అంపైర్ పర్మిషన్ తీసుకుంటే మాత్రం దాన్ని నో బాల్ గా సిగ్నల్ చెయ్యరు.
10. Underarm No Ball
ఇది క్రికెట్ లో చాలా రేర్ నో బాల్. బౌలర్ తన నార్మల్ యాక్షన్ తో కాకుండా బాల్ ను తన లెగ్స్ దగ్గర నుండి డెలివర్ చేస్తే దాన్ని అండర్ ఆర్మ్ బౌలింగ్ అంటారు. సో క్రికెట్ లో ఇలా బౌలింగ్ చెయ్యడం నిషేధం. బౌలర్ తన మతి స్థిమితం కోల్పోతే తప్ప మిగతా ఏ సందర్భలోనూ ఇలాంటి బౌలింగ్ చెయ్యడు.
11. Ball Pitching Outside Playing Area
బౌలర్ వేసిన బాల్ పిచ్ పై కాకుండా బయట అవుట్ ఫీల్డ్ లో పిచ్ అయితే దాన్ని నో బాల్ గా ప్రకటిస్తారు. అంటే రిటర్న్ క్రీజ్ బయట బాల్ ను పిచ్ చెయ్యకూడదు.
సో క్రికెట్ లో ఉండే రకాల నో బాల్స్ అయితే ఇవి. వీటితో పాటు వికెట్ కీపర్ నో బల్ కూడా ఉంది దాని గురించి మనం వికెట్ కీపర్ లా డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుందాం. ఇక లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో మనం పై చెప్పుకున్నా వాటిలో ఎలాంటి నో బాల్ వేసిన ఆ తరువాత బాల్ ను ఫ్రీ హిట్ గా ప్రకటిస్తారు. అంటే ఆ బాల్ కు అచ్చం నో బాల్ లాగానే బాట్స్మన్ అవుట్ అయినా గానీ దాన్ని నాటౌట్ గా ప్రకటిస్తారు.
లా నెంబర్ 22. Wide Ball
క్రికెట్ లో జనరల్ గా వైడ్ బాల్ అంటే రిటర్న్ క్రీజ్ కు పెరలాల్ గా ఉండే ఒక వైట్ లైన్ పై నుండో లేదా లైన్ అవతల నుండో బాల్ వెళ్తే దాన్ని వైడ్ బాల్ అంటాం. సో ఈ వైడ్ క్రీజ్ అనేది మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో వికెట్ కు రెండు వైపుల ఉంటుంది. అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బ్యాట్స్‌మన్ యొక్క రీచ్ లో లేకపోతే ఈ వైడ్ లైన్ తో సంబంధం లేకుండా వైడ్ సిగ్నల్ ఇచ్చి బ్యాటింగ్ టీంకు ఒక ఎక్స్ట్రా రన్ ను అవార్డ్ చేస్తారు. సేమ్ అలాగే ఒకవేళ బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో గనుక ఉంటే అది వైడ్ లైన్ బయట నుండి వెళ్లిన దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. కొన్ని ఎక్సమ్పుల్స్ ద్వారా దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ సైడ్ వైడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే, ఒక బాట్స్మన్ బ్యాటింగ్ కు వచ్చి నార్మల్ బ్యాటింగ్ గార్డ్ ను తీసుకుని బ్యాటింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇక్కడ నార్మల్ బ్యాటింగ్ గార్డ్ అంటే మిడిల్ స్టంప్ లేదా లెగ్ అండ్ మిడిల్ స్టంప్ గార్డ్. ఇక ఇప్పుడు బౌలర్ వేసిన బాల్ బాట్స్మన్ కు దూరంగా ఆ వైడ్ లైన్ అవతల నుండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ బాట్స్మన్ తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటకు రాకుండా షాట్ ఆడితే అది అతని రీచ్ లో ఉండదు. దింతో అంపైర్ దాన్ని వైడ్ బాల్ గాసిగ్నల్ చేస్తాడు. అలా కాకుండా బాట్స్మన్ ఆ బాల్ ను కొట్టడం కోసం తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటికి వచ్చి ఆ బాల్ ను తన రీచ్ లోకి తెచ్చుకుని షాట్ ఆడి మిస్ అయితే, అంపైర్ దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తాడు.
దీనికి బెస్ట్ ఎక్సమ్పుల్ ఏబీ డివిలియర్స్ మరియు హార్దిక్ పాంఢ్య లాంటి ఆటగాళ్లు బౌలర్ వైడ్ యోర్కర్లు వెయ్యడానికి ట్రై చేస్తున్నాడని ముందే పసిగట్టి బౌలర్ బాల్ డెలివర్ చెయ్యకముందే ఆ బాల్ ను రీచ్ అవ్వడం కోసం ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడతారు. సో ఇలాంటి టైం లో షాట్ కనెక్ట్ అయితే నో ప్రాబ్లెమ్. అలా కాకుండా ఆ బాల్ మిస్ అయ్యి, వైడ్ క్రీజ్ బయట నుండి వెళ్లిన గాని అంపైర్ దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. అయితే కొన్ని సార్లు బాట్స్మన్ లెగ్ సైడ్ వైపు రూమ్ తీసుకుని బ్యాటింగ్ చేస్తుంటారు. అలాంటప్పుడు బాల్ వైడ్ క్రీజ్ లోపల నుండి వెళ్లిన కొన్ని సార్లు బాట్స్మన్ రీచ్ లో ఉండదు. అయినా గానీ అంపైర్ దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. మరి అదేంటి బాల్ బాట్స్మన్ రీచ్ లో లేదు కదా సో లా ప్రకారం వైడ్ సిగ్నల్ ఇవ్వాలి కదా అని మీకు డౌట్ రావచ్చు.
అయితే ఈ కేస్ లో కూడా బ్యాట్స్‌మన్ తన నార్మల్ గార్డ్ పోసిషన్ నుండి కావాలని లెగ్ సైడ్ వైపు జరిగి బాల్ ను తన రీచ్ లో లేకుండా చేసుకున్నాడు. అదే తన నార్మల్ గార్డ్ పోసిషన్ లో ఉండి అతడు బ్యాటింగ్ చేసి ఉంటె ఆ బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లోనే ఉంటుంది. సో ఒక బాట్స్మన్ తన నార్మల్ గార్డ్ పోసిషన్ నుండి మూవ్ అయ్యి బాల్ ను కావాలని తన రీచ్ లోకి తెచ్చుకున్న లేదా తన రీచ్ లో నుండి పోగొట్టుకున్న వైడ్ లైన్ తో సంబంధం లేకుండా దాన్ని లీగల్ డెలివరీ గా కన్సిడర్ చేస్తారు.
ఇక లెగ్ సైడ్ వైడ్ బాల్ విషయానికొస్తే MCC లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఈ లెగ్ సైడ్ వైడ్ బాల్ కు మినహాయింప తీసుకొచ్చింది. ఎందుకంటే బాట్స్మన్ కు లెగ్ సైడ్ వైపు పెద్దగా రీచ్ ఉండదు. దింతో బాల్ అనేది బ్యాట్సమన్ నార్మల్ గార్డ్ పోసిషన్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెగ్ సైడ్ వైపు డ్రిఫ్ట్అయ్యి బాట్స్మన్ ను మిస్ అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో లేదు కాబట్టి ఆ బాల్ ను అంపైర్ వైడ్ గా సిగ్నల్ చేస్తారు. అయితే బాట్స్మన్ ఇలాంటి బాల్ కు రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ షాట్ ఆడితే మాత్రం ఆ బాల్ ను లీగల్ డెలివరీ గానే కన్సిడర్ చేస్తారు.
ఎందుకంటే బాట్స్మన్ ఆ బాల్ ను కావాలని తన రీచ్ లోకి తెచ్చుకున్నాడు. అలాగే లెగ్ సైడ్ వైపు బాల్ వచ్చినప్పుడు ఒకవేళ బాట్స్మన్ ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆ బాల్ ను మిస్ అయితే దాన్ని కూడా లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మళ్ళి సేమ్ స్టోరీ. బాట్స్మన్ కావాలని ఆ బాల్ తన రీచ్ లో లేకుండా చేసుకున్నాడు. ఒకవేళ బాట్స్మన్ తను తీసుకున్న నార్మల్ బ్యాటింగ్ గార్డ్ పోసిషన్ లో ఉండే ఆ బాల్ ను ఆడి ఉంటె అది ఆతని ప్యాడ్స్ కు తగిలేది. సో బాట్స్మన్ కావాలనే ఆ బాల్ ను మిస్ చేసాడు కాబట్టి బౌలర్ ను పనిష్ చెయ్యరు.
ఇక ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ వైడ్ లతో పాటు లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఏబావ్ హెడ్ హైట్ వైడ్ బాల్ కూడా ఉంటుంది. సో బాట్స్మన్ తన క్రీజ్ లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ బాల్ తన తల పై నుండే వెళ్ళిపోతే ఆ బాల్ ను వైడ్ బాల్ గా ప్రకటిస్తారు. ఇక టెస్ట్ క్రికెట్ లో ఈ వైడ్ బాల్ అనేది చాలా రేర్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో బౌలర్ పరుగులు నియంత్రించడం కన్నా వికెట్ తియ్యడం పైనే కాన్సంట్రేషన్ పెడతాడు. అందుకే ప్రతి బాల్ బాట్స్మన్ ఆడేలా బౌలింగ్ చేస్తారు. సో డాట్ బాల్ అనేది టెస్ట్ క్రికెట్ లో పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. అందుకే వైడ్ క్రీజ్ కూడా పెట్టారు. అయితే బౌలర్ మరి వైడ్ గా రిటర్న్ క్రీజ్ దగ్గరలో బాల్ వేస్తే అది వైడ్ గా సిగ్నల్ చేస్తారు. లెగ్ సైడ్ కూడా సేమ్ రూల్ రిటర్న్ క్రీజ్ దగ్గర నుండి బాల్ వెళ్తేనే వైడ్ బాల్ ఇస్తారు.
లా నెంబర్ 23. Bye And Leg Bye
ఒక బౌలర్ బాల్ వేసాక అది లీగల్ బాల్ అయ్యి ఉండి బాట్స్మన్ మిస్ అయినా గానీ రన్స్ తీస్తే వాటిని బైస్ అంటారు. ఫర్ ఎక్సమ్పుల్ బౌలర్ వేసిన ఒక లీగల్ బాల్ ను బాట్స్మన్ మిస్ అయ్యాడు. అయితే వెనకాల ఉన్న కీపర్ కూడా దాన్ని సరిగ్గా గెథెర్ చెయ్యలేకపోయాడు. దింతో బాట్స్మన్ కు రన్ తీసే ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడు బాట్స్మన్ స్కోర్ చేసిన రన్స్ అన్ని బైస్ లోకి వెళ్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక కరెక్ట్ బాల్ కు బాట్స్మన్ సంబంధం లేకుండా ఫీల్డర్స్ తప్పిదం వల్ల రన్స్ వస్తే వాటిని బైస్ అంటారు.
ఇవి ఫీల్డర్స్ తప్పిదం వల్ల వచ్చాయి కాబట్టి, ఈ బైస్ అనేవి అటు బాట్స్మన్ అకౌంట్ లోకి వెళ్ళవు ఇటు బౌలర్ అకౌంట్ లోకి కూడా వెళ్లవు. ఓన్లీ ప్యూర్ ఎక్సట్రాస్ గా బ్యాటింగ్ టీం టోటల్ లోకి యాడ్ అవుతాయి. ఇక లెగ్ బైస్ విషయానికొస్తే బాట్స్మన్ బ్యాట్ కు కాకుండా తన బాడీ లో ఎక్కడైనా బాల్ తగిలి ఆ బాల్ కు ఏమైనా రన్స్ వస్తే వాటిని లెగ్ బైస్ అంటారు. అయితే బాట్స్మన్ షాట్ అటెంప్ట్ చేసినపుడు మాత్రమే ఈ లెగ్ బైస్ అనేవి స్కోర్ చెయ్యడానికి ఉంటుంది. ఇక బైస్ లనే ఇవి కూడా బాట్స్మన్ లేదా బౌలర్ అకౌంట్ లోకి వెళ్లవు. జస్ట్ టీం టోటల్ కి యాడ్ అవుతాయి.
లా నెంబర్ 24. Fielders Absence; Substitutes
మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డింగ్ టీంలో ఎవరైనా ప్లేయర్ ఇంజూర్ అయినా లేదా వేరే కారణం చేత అందుబాటులో లేకపోతే అతని ప్లేస్ లో ప్లేయింగ్ లెవెన్ లో లేని వేరొక ప్లేయర్ చేత ఫీల్డింగ్ చేయించవచ్చు. అండ్ ఇలా వచ్చిన ఫీల్డర్ ను సబ్సిట్యూట్ ఫీల్డర్ లేదా సబ్ అంటారు. అయితే సబ్ ఫీల్డర్ ను బ్యాటింగ్ లేదా బౌలింగ్ చెయ్యడానికి ఆలావ్ చెయ్యరు. జస్ట్ ఫీల్డింగ్ చెయ్యడానికి మాత్రమే ఎలావ్ చేస్తారు. ఇక ఈ సబ్ ఫీల్డర్లు పట్టిన క్యాచులు మరియు రన్ ఔట్లు వాళ్ళ కెరీర్ ఇండివిడ్యుల్ స్టాట్స్ లోకి వెళ్లవు. అయితే ఐసీసీ 2019వ సంవత్సరంలో కాంకేషన్ సబ్సిట్యూట్ అనే కొత్త రూల్ ను తీసుకొచ్చింది.
ఈ రూల్ ప్రకారం ఒక బ్యాట్సమెన్ తలకు బలంగా బాల్ తాకినప్పుడు అతను కాంకేషన్ కు గురైతే అతని ప్లేసులో వేరే ప్లేయర్ ను డైరక్ట్ గా ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోవచ్చు. అండ్ ఆ ప్లేయర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చెయ్యవచ్చు. అయితే కాంకేషన్ కు గురైన ప్లేయర్ మాత్రం ఆ మ్యాచ్ లో ఇంకా ఆడకూడదు. అసలు కాంకేషన్ అంటే తలకి బలమైం గాయం తగిలి స్పృహ కోల్పోవడం లేదా బ్యాటింగ్ కంటిన్యూ చేయడానికి ఫిట్ గా లేకపోవడం. సో బాట్స్మన్ హెల్మెట్ కు బాల్ తగిలి ఇంజూర్ అయితేనే ఈ కాంకేషన్ సబ్సిట్యూట్ ను వాడుకోవచ్చు. అలా కాకుండా బాట్స్మన్ బాడీ లో తలకు తప్ప ఇంకా ఎక్కడ ఇంజూర్ అయినా ఓన్లీ సబ్ ఫీల్డర్ ను మాత్రమే ఎలావ్ చేస్తారు. ప్లేయర్ రీప్లేస్మెంట్ ను ఎలావ్ చెయ్యరు.
లా నెంబర్ 25. Batsman’s Innings; Runners
ఈ లా ప్రకారం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా బాట్స్మన్ కు ఇంజూర్ అయ్యి పరిగెత్తలేకపోతే అతని ప్లేస్ లో కేవలం రన్నింగ్ కు మాత్రమే ఒక ప్లేయర్ ను ఎలావ్ చేస్తారు. మన భాషలో చెప్పాలంటే ఈ ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్ ను బై రన్నర్ అంటాం. అయితే ఈ రూల్ ను మిస్ యూస్ చేస్తున్నారని చెప్పి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ఈ రన్నర్ రూల్ ను తొలగించింది. సో బాట్స్మన్ కు కాళ్లకు ఇంజుర్ అయితే అతను అలా నొప్పితోనే ఆడాలి. లేదంటే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగి కుంచెం కోలుకున్నాక తిరిగి మళ్ళి బ్యాటింగ్ కు రావచ్చు. అయితే ఐసీసీ ఈ రూల్ ను లోకల్ క్రికెట్ లో యూస్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ రూల్ ప్రకారం బాట్స్మన్ కు పెరలాల్ గా బై రన్నర్ పోపింగ్ క్రీజ్ లోపల ఉండాలి. అలాగే బాట్స్మన్ కొట్టిన షాట్ కు రన్నర్ సింగిల్ తీసిన తరువాత నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రన్నర్ నార్మల్ పోసిషన్ కు వస్తాడు. అప్పుడు స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఇంజురెడ్ బాట్స్మన్ ఇంతకముందు తన రన్నర్ ఉన్న పోసిషన్ లోకి వెళ్తాడు. అయితే బాట్స్మన్ మరియు రన్నర్ కూడా ఇద్దరు బాల్ వేసే సరికి క్రీజ్ లోనే ఉండాలి. అలా కాకుండా బాట్స్మన్ షాట్ ఆడకముందే రన్నర్ పరిగెడితే దాన్ని డెడ్ బాల్ గా సిగ్నల్ చేస్తారు. ఒకవేళ రన్నర్ అలా చేసినప్పుడు బాట్స్మన్ గనుక బాల్ మిస్ అయితే అతన్ని స్టంప్ అవుట్ కూడా చెయ్యవచ్చు.
లా నెంబర్ 26. Practice on the Field
ఈ లా ప్రకారం మ్యాచ్ ఆడే ముందు గానీ, మ్యాచ్ మధ్యలో బ్రేక్స్ ఇచ్చినప్పుడు గానీ, అలాగే మ్యాచ్ అయిపోయాక గానీ పిచ్ పై ఎలాంటి ప్రాక్టీస్ కూడా చెయ్యడానికి అనుమతించరు. ఒకవేళ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటే అవుట్ ఫీల్డ్ లోనే చేసుకోవాలి. అలాగే అంపైర్ పరిమిషన్ తీసుకుని స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఏరియా లో కూడా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీనికి అంపైర్ పరిమిషన్ తప్పనిసరి. అయితే బౌలర్స్ మాత్రం అంపైర్ పరిమిషన్ తో పిచ్ దగ్గర రన్ అప్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ పిచ్ కు మాత్రం ఎలాంటి డామేజ్ చెయ్యకూడదు. అలాగే పిచ్ మీద బౌలింగ్ కూడా చెయ్యకూడదు. కేవలం రన్ అప్ మాత్రమే ప్రాక్టీస్ చెయ్యాలి. ఒకవేళ రూల్స్ ను బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఆపొనెంట్ టీం కు 5 పెనాల్టీ రన్స్ ను వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ చెయ్యకముందే బహుమతిగా ఇస్తారు.
లా నెంబర్ 27. The Wicket Keeper
ఫీల్డింగ్ చేసే టీంలో ఒక్క వికెట్ కీపర్ మాత్రమే గ్లోవ్స్ తో పాటు సేఫ్ గార్డ్స్ ను ధరించడానికి అనుమతిస్తారు. ఇక ఈ వికెట్ కీపర్ పోసిషన్ మీద కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
- బౌలర్ రన్ అప్ స్టార్ట్ చేసి బాల్ వెయ్యకముందు వికెట్ కీపర్ తన ఉన్న పోసిషన్ ను నుండి కదలకూడదు. ఒకవేళ బాల్ డెలివర్ చేయకముందే వికెట్ కీపర్ తన పోసిషన్ నుండి కావాలని కదిలితే దాన్ని అంపైర్ డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అయితే బాల్ వేసాక బాట్స్మన్ ఆడే షాట్ కు అనుగుణంగానో లేదా బాల్ డైరేక్షన్ కు అనుగుణంగానో వికెట్ కీపర్ మూవ్ అవ్వొచ్చు. అలాగే బౌలర్ స్లో బాల్ వేసినప్పుడు వికెట్ కీపర్ కొన్ని స్టెప్స్ ముందుకొచ్చి ఆ బాల్ ను గెథెర్ చెయ్యవచ్చు.
- బౌలర్ వేసిన బాల్ బాట్స్మన్న్ను రీచ్ అవ్వకముందే వికెట్ కీపర్ తన హాండ్స్ ను వికెట్ కు పెరలాల్ గా పెట్టకూడదు. అలాగే బాట్స్మన్ షాట్ ఆడకముందే వొట్టి చేత్తో స్టంప్స్ ను డిస్టర్బ్ చెయ్యకూడదు. అలా చేస్తే ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటిస్తారు.
- వికెట్ కీపర్ బాల్ ను ఎప్పుడు స్టంప్స్ ముందు గెథెర్ చెయ్యకూడదు. తన చేతులని స్టంప్స్ వెనకాల పెట్టి మాత్రమే బాల్ ను పట్టుకోవాలి. అలా కాకుండా స్టంప్స్ ముందుకు తన చేతులని పెట్టి బాల్ ను గెథెర్ చేస్తే దాన్ని కూడా నో బాల్ గా సిగ్నల్ చేస్తారు. అయితే బాల్ అనేది బాట్స్మన్ బాడీ లేదా బ్యాట్ కు తగిలి కింద పడిపోయిన తరువాత మాత్రం వికెట్ కీపర్ స్టంప్స్ ముందుకు వచ్చి బాల్ ను కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బాట్స్మన్ క్రీజ్ లో లేకపోతే స్టంప్ అవుట్ కూడా చెయ్యవచ్చు.
లా నెంబర్ 28. The Fielder
ఫీల్డింగ్ టీంలో ఒక్క వికెట్ కీపర్ తప్ప మారేతర ఫీల్డర్ కూడా గ్లోవ్స్ లేదా గార్డ్స్ ను ధరించడానికి అనుమతించారు. అయితే ఫీల్డర్స్ తమ చేతి వేళ్ళకు అంపైర్ అనుమతితో బ్యాండేజ్స్ ను ధరించవచ్చు. ఇక ఈ ఫీల్డర్ అనే వాడు బౌండరీస్ మరియు రన్స్ ను ఆపేందుకు ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఫీల్డింగ్ అనేది తన చేతులతో లేదా బాడీ తో మాత్రమే చెయ్యాలి. అలా కాకుండా తన పెట్టుకున్న క్యాప్ తోనో లేదా ఇంక ఏదైనా ఎక్స్టర్నల్ థింగ్ తో బాల్ ను ఉద్దేశపూర్వకంగా ఆపితే బ్యాటింగ్ టీం కు 5 రన్స్ ను పెనాలిటీ రన్స్ గా అవార్డు చేస్తారు. అలాగే బ్యాట్స్‌మన్ కొట్టిన బాల్ లేదా మిస్ చేసిన బాల్ వికెట్ కీపర్ తన వెనకాల గ్రౌండ్ మీద పెట్టుకున్న హెల్మట్ కు తగిలిన 5 రన్స్ ను పెనాలిటీ గా ఇస్తారు.
ఇక ఫీల్డర్స్ ఉద్దేశపూర్వకంగా ఇల్లీగల్ ఫీల్డింగ్ లేదా ఫేక్ ఫీల్డింగ్ చేసి బాట్స్మన్ రన్నింగ్ కు ఎలాంటి ఆటంకం కలిగించిన బ్యాటింగ్ టీంకు 5 పెనాలిటీ రన్స్ ను అవార్డు చేస్తారు. సో ఫేక్ ఫీల్డింగ్ అంటే ఫీల్డర్ చేతిలో బాల్ లేకపోయిన ఉన్నట్టు త్రో చేసి బాట్స్మన్ ను కన్ఫ్యూజ్ చెయ్యడం. అయితే బాట్స్మన్ మూవ్మెంట్ కు ఎలాంటి ఆటంకం కలిగించకుండా అలాగే ఫీల్డింగ్ టీంకు ఎలాంటి ఉపయోగం కలిగించని ఫేక్ ఫీల్డింగ్ చేస్తే పరవాలేదు. బాట్స్మన్ తన డైరెక్షన్ మార్చుకుంటేనే అది ఇల్లీగల్ ఫీల్డింగ్ అవుతుంది.
లా నెంబర్ 29. The Wicket is Down
ఈ లా ప్రకారం వికెట్ స్టంప్స్ పైన ఉండే రెండు బెయిల్స్ లో ఎదో ఒకటి కింద పడితేనే బాట్స్మన్ అవుట్ అయినట్టు ప్రకటిస్తారు. అండ్ ఈ వికెట్ కింద పడటం అనేది చాలా రకాలుగా జరుగుతుంది. బౌలర్ బాల్ వేసాక అది స్టంప్స్ కు తగిలినప్పుడు ఈ వికెట్ కింద పడుతుంది. అలాగే స్టంప్స్ కు బాట్స్మన్ బ్యాట్ తగిలిన లేదా అతని బాడీ తగిలిన ఈ వికెట్ అనేది డౌన్ అవుతుంది. అలాగే ఫీల్డర్ రన్ అవుట్ చేసినప్పుడు కూడా ఈ వికెట్ అనేది డౌన్ అవుతుంది. అయితే పైన చెప్పుకున్న అన్ని కేసుల్లో కూడా స్టంప్స్ పైన ఉన్న బెయిల్ ఖచ్చితంగా కింద పడాలి.
అలా కాకుండా జస్ట్ ఆ స్టంప్స్ పైన ఉన్న గ్రూప్స్ లోనే బెయిల్స్ కదిలి కింద పడకపోతే అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటిస్తాడు. ఇక రన్ అవుట్ లేదా స్టంప్ అవుట్ చేసినప్పుడు బెయిల్స్ స్టంప్స్ మీద ఉండే గ్రూవ్స్ నుండి బయటకి వచ్చిన తర్వాతే ఈ రెండు ఔట్లు ఆక్టివేట్ అవుతాయి. ఇక ఒక ఫీల్డర్ రన్ అవుట్ చేసినప్పుడు వికెట్ ను పడగొట్టే టైంకు అతని చేతిలో ఖచ్చితంగా బాల్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే వికెట్ డౌన్ అయినట్టు కన్సిడర్ చెయ్యరు. ఒకవేళ రనౌట్ చేసే సరికి బెయిల్స్ ఆల్రెడీ కింద పడిపోయి ఉంటే అప్పుడు ఫీల్డర్ తను బాల్ పట్టుకున్న చేతితో స్టంప్ ను గ్రౌండ్ నుండి బయటికి తీస్తేనే వికెట్ పడినట్టు కన్సిడర్ చేస్తారు.
లా నెంబర్ 30. Batsman Out of His Ground
ఈ లా అనేది రనౌట్ మరియు స్టంప్ అవుట్ కోసం రూపొందించారు. ఈ లా ప్రకారం ఫీల్డింగ్ టీంలో ఎవరైనా ఫీల్డర్ వికెట్ పడగొట్టే సరికి బాట్స్మన్ బ్యాట్ లేదా అతని బాడీ లో ఏదైనా పార్ట్ పోపింగ్ క్రీజ్ లోపల ఉండే ఏరియా లో ల్యాండ్ అయ్యిఉండకపోతే అతన్ని అవుట్ గా ప్రకటిస్తారు. ఈవెన్ ఆ వైట్ లైన్ మీద ఉన్న గాని అవుట్ గానే ఇస్తారు. సో రన్ అవుట్ లేదా స్టంప్ అవుట్ చేసే సరికి బాట్స్మన్ లేదా అతని బాడీ కు సంబందించిన ఏదొక పార్ట్ ఖచ్చితంగా ఆ లైన్ లోపల నేల మీద పెట్టి ఉండాలి. అలా కాకుండా క్రీజ్ లోపల గాల్లో ఉన్న సరే దాన్ని అవుట్ గానే ప్రకటిస్తారు. అయితే స్టంప్ చేసినప్పుడు బ్యాట్స్‌మన్ రెండు పాదాలు కూడా క్రీజ్ లోపల ఉండి గాల్లో ఉంటే మాత్రం దాన్ని నాటౌట్ గా సిగ్నల్ చేస్తారు.
ఎందుకంటే ఇక్కడ బ్యాట్సమెన్ తన రెండూ పాదాలని క్రీజ్ లో ఉంచే జంప్ చేసాడు గానీ క్రీజ్ బయట ఒక పాదం క్రీజ్ లోపల ఒక పాదం ఉంచి జంప్ చెయ్యలేదు. ఇక రనౌట్ సమయంలో బాట్స్మన్ తన బ్యాట్ లేదా బాడీ ని ఒకసారి గ్రౌండ్ చేసాక వికెట్ పడగొట్టే సమయానికి గాల్లో ఉన్న పరవాలేదు. అయితే బాట్స్మన్, ఫీల్డర్ వికెట్ ను పడగొట్టకముందు తన బ్యాట్ ను పోపింగ్ క్రీజ్ లోపల ఒక్కసారైనా గ్రౌండ్ చేసి ఉండాలి. అప్పుడే మాత్రమే అంపైర్ నాటౌట్ ఇస్తారు. ఇక బాట్స్మన్ వికెట్ల మధ్య పరిగెత్తినప్పుడు వాళ్ళు ఏ బౌలింగ్ ఎండ్ క్రీజ్ కు దగ్గరగా ఉంటే అది వాళ్ళ ఓన్ క్రీజ్ అవుతుంది.
లా నెంబర్ 31. Appeals
బాట్స్మన్ ఎలా అవుట్ అయినా గానీ ఫీల్డర్స్ లేదా బౌలర్ అప్పీల్ చేస్తేనే అంపైర్ అవుట్ ఇస్తాడు. అయితే బాట్స్మన్ అవుట్ అయ్యా అని తనంతట తాను క్రీజ్ వదిలి వెళ్ళిపోతే మాత్రం ఫీల్డర్స్ అప్పీల్ చెయ్యకపోయినా సరే అది అవుట్ గా నిర్దారిస్తారు. బాట్స్మన్ బౌల్డ్ అండ్ క్యాచ్ అవుట్ అయినప్పుడు ఇలాంటిది ఎక్కువగా చూస్తాం. ఇక అప్పీల్ చెయ్యడం కోసం ఫీల్డర్లు Howz that అని అంపైర్ ను అడగాలి. అప్పుడు మాత్రమే అంపైర్ రెస్పాండ్ అవుతాడు. లేదంటే బాట్స్మన్ అవుట్ అయినా సరే అంపైర్ ఏం సిగ్నల్ చెయ్యకుండా అలానే ఉంటాడు. అండ్ ఫీల్డర్లు ఈ అప్పీల్ ను నెక్స్ట్ బాల్ కోసం బౌలర్ రెడీ అయ్యే లోపు చెయ్యాలి.
ఇక ఫీల్డింగ్ టీం కావాలనుకుంటే ఈ అప్పీల్ ను నెక్స్ట్ బాల్ స్టార్ట్ చేసే లోపు వెనక్కి తీసుకోవచ్చు. అండ్ అలా చేస్తే అవుట్ అయ్యి వెళ్ళిపోయినా బాట్స్మన్ ను కూడా అంపైర్ వెనక్కి పిలుస్తాడు. దీనికి బెస్ట్ ఎక్సమ్పుల్ ధోని కి స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు తెచ్చిపెట్టిన ఇయాన్ బెల్ రన్ అవుట్ వివాదం. ఇక బాట్స్మన్ నో బాల్ లేదా డెడ్ బాల్ కు తను అవుటేమో అనుకుని అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా అంపైర్ వెనక్కి పిలుస్తారు. అలాగే ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు అది బాట్స్మన్ కు క్లియర్ గా తెలియక తను అవుటేమో అనుకుని పెవిలియన్ వైపు వెళ్ళిపోయినప్పుడు అతన్ని రన్ అవుట్ చేసిన కౌంట్ లోకి తీసుకోరు. ఎందుకంటే బాట్స్మన్ ఫీల్డర్ క్యాచ్ కంప్లీట్ చేసాడు, సో బాల్ డెడ్ అవుతుందని, తను ఇక అవుట్ అయ్యాయని అపార్థం చేసుకుని క్రీజ్ ను వదిలాడు తప్ప, రన్ కోసం ట్రై చెయ్యలేదు. ఒకవేళ రన్ కోసం ట్రై చేస్తే మాత్రం అది అవుట్ గానే ఇస్తారు.
లా నెంబర్ 32. Bowled
ఈ లా ప్రకారం బౌలర్ వేసిన బాల్ వెళ్లి వికెట్ కు తగిలి బెయిల్స్ కింద పడితే ఆ బాట్స్మన్ ను అవుట్ గా ప్రకటిస్తారు. అయితే దీనికి కూడా రూల్స్ ఉన్నాయి. బాల్ అనేది నేరుగా వెళ్లి స్టంప్స్ కు తగలకుండా బాట్స్మన్ బ్యాట్ లేదా బాడీలో ఎదో ఒక పార్ట్ కు టచ్ అయ్యి ఆ తరువాత స్టంప్స్ కు తగిలిన దాన్ని అంపైర్ అవుట్ గానే సిగ్నల్ చేస్తారు. జనరల్ గా మనం దీన్ని సెల్ఫ్ అవుట్ అంటాం. అయితే బాల్ బాట్స్మన్ కు కాకుండా వేరే ఫీల్డర్ కో లేదా వికెట్ కీపర్ కో టచ్ అయ్యి ఆ తరువాత స్టంప్స్ ను పడగొడితే దాన్ని నాటౌట్ గా సిగ్నల్ చేస్తారు.
లా నెంబర్ 33. Caught
ఈ లా కుంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జాగ్రత్తగా వినండి. బాట్స్మన్ బాల్ హిట్ చేసిన తరువాత ఫీల్డింగ్ టీంలో ఎవరొకరు ఆ బాల్ ను కింద బౌన్స్ అవ్వకుండా పట్టుకుంటే దాన్నిక్యాచ్ అవుట్ అంటాం. అయితే ఏది అందరికి తెలిసిందే. కానీ ఈ క్యాచ్ అవుట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి.
- ఫీల్డర్ బాట్స్మన్ ఇచ్చిన క్యాచ్ ను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉన్న క్యాప్ తోనే, హ్యాండ్ కర్చీఫ్ తోనే లేదా తన దగ్గర ఉన్న ఇంకేదైనా వస్తువుతో క్యాచ్ పట్టిన లేదా బాల్ ను ఆపిన కూడా అది నాటౌట్ గా ప్రకటించడమే కాదు, బ్యాటింగ్ టీంకు 5 పెనాల్టీ రన్స్ ను అవార్డు చేస్తారు.
- ఫీల్డర్ బాట్స్మన్ ఇచ్చిన క్యాచ్ ను ఇంటెన్షనల్ గా కాకుండా ఆ మూమెంట్ లోనే బాల్ వెళ్లి ఫీల్డర్ హెల్మెట్ లోనో లేదా ఏదైనా బాడీ పార్ట్ లో కింద పడకుండా స్ట్రక్ అయిపోతే దాన్ని అవుట్ గా ప్రకటిస్తారు. ఇది ఎక్కువుగా వికెట్ కీపర్ మరియు షార్ట్ పోసిషన్ లో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్స్ దగ్గర చూడవచ్చు.
- బాట్స్మన్ కొట్టిన బాల్ కింద పడకుండా ఫీల్డర్స్ లో ఎవరో ఒకరికి తగిలి ఆ తరువాత మరో ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటే దాన్ని కూడా అవుట్ గానే ప్రకటిస్తారు. ఈవెన్ బాల్ అంపైర్ కు తగిలి ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్న అది అవుట్ గానే ప్రకటిస్తారు.
- ఫీల్డర్ క్యాచ్ పట్టినప్పుడు తన బాడీ లో ఏదోఒక పార్ట్ ఖచ్చితంగా బాల్ కింద ఉండాలి. ముఖ్యంగా లో క్యాచేస్ పట్టినప్పుడు ఫీల్డర్ చేతి వేళ్ళు ఖచ్చితంగా బాల్ కింద ఉండాలి. అప్పుడే మాత్రమే దాన్ని ఫెయిర్ క్యాచ్ గా కన్సిడర్ చేస్తారు.
- ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టినప్పుడు అతని ఫస్ట్ జంప్ చేసే పాయింట్ ఖచ్చితంగా ఇన్సైడ్ బౌండరీ రోప్ లో ఉండే పార్ట్ అయ్యి ఉండాలి. అలాగే జంప్ చేసిన ఫీల్డర్ క్యాచ్ ఫినిష్ చేసినప్పుడు కూడా ఇన్సైడ్ బౌండరీ రోప్ వచ్చి క్యాచ్ ను కంప్లీట్ చెయ్యాలి. ఈ మధ్యలో అతను బౌండరీ లోపలకి వెళ్తే బాల్ ఖచ్చితంగా ఎయిర్ లో ఉండాలి. అలా కాకుండా బౌండరీ లోపలికి వెళ్లి జంప్ చేసిన లేదా బౌండరీ రోప్ కు తగిలిన ప్లేస్ నుండే జంప్ చేసి క్యాచ్ పట్టుకున్న దాన్ని నాటౌట్ గా సిగ్నల్ చేస్తారు.
- బాల్ ముందు బాట్స్మన్ బ్యాట్ కు తగిలి అతని బాడీ కి తగిలిన లేదా ముందు బాట్స్మన్ బాడీ కు తగిలి ఆ తరువాత బ్యాట్ తగిలిన, ఆ బాల్ ను ఫీల్డర్ క్యాచ్ పడితే దాన్ని ఔట్ గా సిగ్నల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే బాల్ బాట్స్మన్ బ్యాట్ కు టచ్ అయితే సరిపోతుంది. అది ముందైనా కావచ్చు వెనుకైనా కావచ్చు. చాలా మంది బాల్ ముందు బాట్స్మన్ బాడీకి టచ్ అయ్యి ఆ తరువాత బ్యాట్ కు తగిలి క్యాచ్ పడితే అది నాటౌట్ అనుకుంటారు. బట్ అది రాంగ్. బాల్ ఎప్పుడైనా సరే బాట్స్మన్ బ్యాట్ కు టచ్ అయితే చాలు దాన్ని క్యాచ్ అవుట్ గా పరిగణిస్తారు.
లా నెంబర్ 34. Hit the Ball Twice
బౌలర్ వేసిన బాల్ ను బాట్స్మన్ ఇంటెన్షనల్ గా రెండు సార్లు కొడితే అతన్ని అవుట్ గా ప్రకటిస్తారు. అయితే ఇందులో కొన్ని ఎక్ససెప్షన్స్ ఉన్నాయి. బాల్ బాట్స్మన్ కొట్టిన తరువాత అది వికెట్ల వైపు వెళ్తుంటే దాన్ని అతన్ని బ్యాట్ తో లేదా కాళ్లతో ఆపొచ్చు. ఈవెన్ తన బాడీ ను కూడా అడ్డుపెట్టి తన వికెట్ ను డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ చేత్తో మాత్రం అసలు ఆపడకూడదు. అలాగే దగ్గరలో ఉన్న ఫీల్డర్ ఎవరైనా క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తే బాట్స్మన్ బాల్ ను తన బ్యాట్ తోనో లేదా బాడీ తోనో ఆపకూడదు. అలా చేస్తే అంపైర్ బాట్స్మన్ ను అవుట్ గా సిగ్నల్ చేస్తారు.
ఇక బాట్స్మన్ బాల్ కొట్టిన తరువాత అది ఆటోమేటిక్ గా బౌన్స్ అయ్యి రెండోసారి బ్యాట్ ను టచ్ చేసిన పరవాలేదు. ఇక బాల్ కు యాక్షన్ కంప్లీట్ అయ్యాక రెస్ట్ లో ఉన్న బాల్ ను ఫీల్డింగ్ టీంలో ఎవరైనా అడిగితే అప్పుడు బాట్స్మన్ చేత్తో లేదా బ్యాట్ తో కొట్టి ఫీల్డర్ కు అందించవచ్చు. ఫీల్డర్స్ అడిగితేనే ఇలా చెయ్యాలి. అలా కాకుండా వాళ్ళు బాల్ దగ్గరకు రీచ్ అయ్యే లోపే బాట్స్మన్ ఇలా చేస్తే, ఫీల్డింగ్ టీం అంపైర్ కు అప్పీల్ చేయవచ్చు. అప్పుడు అంపైర్ బాట్స్మన్ ను ఔట్ గా ప్రకటిస్తాడు.
లా నెంబర్ 35. Hit wicket
ఒక బాట్స్మన్ షాట్ ఆడుతున్నప్పుడు తన బాడీ లో ఏ పార్ట్ అయినా గానీ లేదా బ్యాట్ అయినా సరే వెళ్లి వికెట్లకు తగిలి బెయిల్స్ కింద పడితే దాన్ని హిట్ వికెట్ గా కన్సిడర్ చేసి బ్యాట్స్‌మన్ ను అవుట్ గా ప్రకటిస్తారు. అలాగే షాట్ ఆడినప్పుడు బాట్స్మన్ పెట్టుకున్న సేఫ్టీ గార్డ్స్ అంటే హెల్మెట్, గ్లోవ్స్ లేదా ఇంకేదైనా సరే వెళ్లి వికెట్లకు తగిలితే దాన్ని కూడా అవుట్ గానే సిగ్నల్ చేస్తారు. అయితే ఇదంతా షాట్ ఆడే క్రమంలో జరిగితేనే హిట్ వికెట్ గా కన్సిడర్ చేస్తారు. సో బౌలర్ బాల్ వేసాక బాట్స్మన్ షాట్ ఆడటం స్టార్ట్ చేసిన దగ్గర నుండి షాట్ ను ఫినిష్ చేసి రన్ కోసం అట్టెంప్ చేసే టైం వరకు స్టంప్స్ కు తగలకూడదు.
లా నెంబర్ 36. Leg Before Wicket (LBW)
ఒక బాట్స్మన్ తన వికెట్ ను బ్యాట్ తో కాకుండా తన బాడీతో డిఫెండ్ చేసుకుంటే ఫీల్డింగ్ టీం ఈ Lbw అవుట్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. అయితే ఈ lbw రూల్ లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి.
- బౌలర్ వేసిన బాల్ నో బాల్ అయ్యి ఉండకూడదు.
- బాల్ బాట్స్మన్ బాడీ ని టచ్ చేసే ముందు బ్యాట్ కు అసలు టచ్ అయ్యి ఉండకూడదు. అయితే ముందు బాట్స్మన్ బాడీ ను టచ్ చేసి ఆ తరువాత బ్యాట్ ను టచ్ చేసిన పర్వాలేదు. అయితే అందరికీ మైండ్ లో తిరిగే డౌట్ lbw అంటే బాల్ వెళ్లి బాట్స్మన్ కాళ్లకు తగిలితేనే అవుట్ ఇస్తారా అని. అలా ఏం ఉండదు. బాట్స్మన్ బ్యాట్ కు తప్ప తన బాడీ లో ఏ పార్ట్ కు బాల్ తగిలిన కూడా ఫీల్డర్స్ lbw కోసం అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎక్సమ్పుల్ బాట్స్మన్ ఒక స్పిన్ బౌలర్ ను స్వీప్ షాట్ ఆడినప్పుడు బాల్ మిస్ అయితే అది వెళ్లి అతని పొట్టకు తగులుతుంది. సో అప్పుడు కూడా ఫీల్డింగ్ టీం lbw కు అప్పీల్ చేసుకోవచ్చు.
- బాల్ పిచ్చింగ్ అనేది స్టంప్స్ లైన్ లో ఉండాలి లేదా బాట్స్మన్ కు ఆఫ్ సైడ్ ఉండాలి. అలా కాకుండా బాట్స్మన్ కు లెగ్ సైడ్ ఉన్న పిచ్ ఏరియాలో బాల్ పిచ్ అయితే, అది ఎండ్ ఆఫ్ ది డే రివ్యూ లో బాల్ వికెట్లకు తగిలిన తగలేకపోయిన అంపైర్ నాటౌట్ ఇస్తారు.
- బాల్ బాట్స్మన్ బాడీ ను తాకే ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టంప్స్ లైన్ లో ఉండాలి. అయితే బాట్స్మన్ ఆ బాల్ కు షార్ట్ ఆఫర్ చెయ్యకపోతే ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఉన్న అంపైర్ దాన్ని అవుట్ గా ఇస్తారు.
- బాల్ బాట్స్మన్ బాడీ ను టచ్ చేసిన తరువాత దాని ప్రొజెక్షన్ వికెట్లను తగిలేలా ఉంటేనే అంపైర్ అవుట్ ఇస్తారు.
లా నెంబర్ 37. Obstructing the Field
ఈ డిసిమిస్సల్ గురించి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఈ లా ప్రకారం బాట్స్మన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ టీం చేసే డిసిమిసల్ అట్టెంప్స్ కు అడ్డు వస్తే ఆ బాట్స్మన్ ను అంపైర్ అవుట్ గా ప్రకటిస్తారు. ఫర్ ఎక్సమ్పుల్ బాట్స్మన్ బాల్ కొట్టిన తరువాత అది ఫీల్డర్ పట్టుకుంటున్నప్పుడు కాలుతో తన్నడం, సింగల్ తీస్తూ సరైన రీసన్ లేకుండా తన రన్నింగ్ డైరెక్షన్ మార్చుకుని ఫీల్డర్ రన్ అవుట్ కోసం త్రో చేసే బాల్ కు అడ్డు రావడం, అలాగే ఫీల్డర్ రన్ అవుట్ అట్టెంప్ చేసినప్పుడు బాల్ ను ఆపడానికి చేతులు అడ్డు పెట్టడం వంటి పనులు చేస్తే బాట్స్మన్ ను అవుట్ గా ప్రకటిస్తారు. అలాగే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బాట్స్మన్ కూడా బౌలర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కావాలని అడ్డు పడితే ఈ అవుట్ కోసం వాళ్ళు అంపైర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ఈ టైప్ ఆఫ్ అవుట్ విషయంలో మనం ఎన్ని రూల్స్ చెప్పుకున్న గానీ గ్రౌండ్ లో జరిగిన సంఘటన ఆధారంగా అంపైర్ తన ఫైనల్ డెసిషన్ చెప్తారు.
లా నెంబర్ 38. Run Out
జనరల్ గా రన్ అవుట్ ఎలా చేస్తారో మనందరికీ తెలిసిందే. ఇక రన్ అవుట్ చేసినప్పుడు బాట్స్మన్ ఒకసారి క్రాస్ అయ్యి ఎవరైతే రన్ అవుట్ చేసిన ఎండ్ కు దగ్గర గా ఉంటారో ఆ బాట్స్మన్ ను అవుట్ గా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు బాట్స్మన్ ఒకే ఎండ్ వైపు కు వస్తే ముందు ఎవరు క్రీజ్ లోపల బ్యాట్ పెట్టారు అనేది చెక్ చేసి ఫైనల్ డెసిషన్ చెప్తారు. ఇక నార్మల్ రన్ అవుట్ ఏ కాకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో కూడా బాట్స్మన్ రన్ అవుట్ అవుతాడు.
అది ఎలా అంటే బాట్స్మన్ బాల్ ను డౌన్ ది గ్రౌండ్ కొట్టకా ఆ బాల్ బౌలర్ కు టచ్ అయ్యి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న స్టంప్స్ కు తగిలినప్పుడు ఒకవేళ బాట్స్మన్ గనుక క్రీజ్ లో లేకపోతే అతన్ని అవుట్ గా సిగ్నల్ చేస్తారు. ఇక ఇదే కాకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో మాన్కడింగ్ అనే రన్ అవుట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం బౌలర్ బాల్ వెయ్యకముందే బాట్స్మన్ క్రీజ్ వదిలి బయటికి వెళ్తే బౌలర్ బౌలింగ్ ఆపేసి బాట్స్మన్ ను రన్ అవుట్ చెయ్యవచ్చు. బట్ ఇలాంటి రనౌట్ చేసినప్పుడు బాల్ ను కౌంట్ చెయ్యరు.
లా నెంబర్ 39. Stumped
ఈ టైప్ ఆఫ్ అవుట్ గురించి అందరికీ తెలుసు. ఈ లా ప్రకారం బాట్స్మన్ షాట్ ఆడేందుకు తన ఎండ్ లో ఉన్న పోపింగ్ క్రీజ్ వదిలి బయటికి వస్తే వికెట్ కీపర్ అతన్ని స్టంప్ చెయ్యవచ్చు. అండ్ ఫీల్డింగ్ టీంలో ఒక్క వికెట్ కీపర్ మాత్రమే బాట్స్మన్ ను స్టంప్ అవుట్ చెయ్యగలడు. ఒకవేళ స్లిప్ ఫీల్డర్స్ ఎవరైనా ఇలా చేస్తే అది రనౌట్ లోకి వెళ్తుంది. ఇక కీపర్ తన చేతులతోనే కాకుండా తన బాడీ లో ఏ పార్ట్ కు అయినా సరే బాల్ తగిలి రీబౌండ్ లో అది స్టంప్స్ కు తగిలిన దాన్ని స్టంప్ గానే పరిగణిస్తారు. అండ్ ఆల్రెడీ మనం ఈ స్టంప్ అవుట్ కు సంబందించిన కొన్ని రూల్స్ లా నెంబర్ 27 మరియు 30 లో చెప్పుకున్నాం. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆ రెండు లాస్ ను ఇంకోసారి చూడండి.
లా నెంబర్ 40. Timed out
ఈ లా ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ అవుట్ అయినా తరువాత మరో బాట్స్మన్ 3 నిమిషాల లోపు క్రీజ్ లోకి చేరుకోవాలి. అలా రాలేకపోతే ఆ బాట్స్మన్ ను అవుట్ గా ప్రకటిస్తారు. అండ్ దీనివల్లే నెక్స్ట్ వచ్చే బాట్స్మన్ ఎప్పుడు పాడ్స్, గ్లోవ్స్ మరియు హెల్మెట్ లాంటివి ముందే రెడీగా పెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుంటాడు. అయితే టీ20 క్రికెట్ లో ఈ టైం 90 సెకన్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఆ ఫార్మాట్లో టీం మొత్తం డ్రెస్సింగ్ రూమ్ లో కాకుండా బౌండరీ బయటే డగౌట్ లో కూర్చుంటారు.
లా నెంబర్ 41. Unfair play
ఈ లా ప్రకారం ఆటగాళ్లు ఎవరైనా రూల్స్ విరుద్దంగా గేమ్ ఆడితే వల్ల పై యాక్షన్ తీసుకుంటారు. కొన్ని సార్లు అయితే ఆపొనెంట్ టీంకు 5 రన్స్ ను పెనాల్టీ గా అవార్డు చేస్తారు. సో బాల్ ను డేమేజ్ చెయ్యడం, రాంగ్ యాక్షన్ తో బౌలింగ్ చెయ్యడం, పిచ్ మీద డేంజర్ ఏరియా లో రన్నింగ్ చెయ్యడం, ఫేక్ ఫీల్డింగ్ చెయ్యడం, బౌలర్ రన్నప్ స్టార్ట్ చేసాక ఫీల్డర్స్ కావాలని పొజిషన్ మారడం అండ్ కావాలని టైం వేస్ట్ చెయ్యడం వంటి పనులు చేస్తే ప్లేయర్స్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఒక్క సారి అయితే ఐసీసీ రెండు మూడు మ్యాచ్ ల నిషేధం కూడా విధిస్తుంది. సో ప్లేయర్స్ అంతా అన్ని రూల్స్ ను పాటిస్తూ వాళ్ళ లిమిట్స్ లోనే గేమ్ ఆడాలి.
లా నెంబర్ 42. Player’s Conduct
మైదానంలో ఆటగాళ్ల యొక్క బిహేవియర్ ను ప్లేయర్స్ కండక్ట్ అంటారు. సో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడు తప్పుగా బిహేవ్ చేస్తే అతనికి మ్యాచ్ తరువాత ఫైన్ విధిస్తారు. ఒకవేళ ప్లేయర్స్ గ్రౌండ్ లో మరి అతిగా బెహేవ్ చేస్తే వెంటనే ఫీల్డ్ నుండి బయటికి పంపేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఫుట్ బాల్ లో ఎలా అయితే ప్లేయర్ కు రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపేస్తారో సేమ్ అలానే చేస్తారు. బట్ ఇక్కడ కార్డ్స్ ఉండవ్ అంతే. సో ప్లేయర్స్ ఎప్పుడు రాంగ్ గా బెహవె చెయ్యకూడదు. అంటే అంపైర్ నిర్ణయాలను తప్పుబట్టి వాళ్ళని తిట్టడం లేదా అంపైర్ మీదకు కోపం గా వెళ్లడం వంటి పనులు చెయ్యకూడదు.
అలాగే మరి ఓవర్ గా అప్పీల్ చేసిన కూడా అంపైర్ ను డిస్ రెస్పెక్ట్ చేసినట్టు. సో మనం గల్లీ క్రికెట్ లో అంపైర్ మీద ఎగిరినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎగరకూడదు. ఎందుకంటే అంపైర్ ఇస్ ది బాస్. అతను ఏం చెప్తే అదే ఫైనల్. సో క్రికెటర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పటినుండే అంపైర్ కు రెస్పెక్ట్ ఇస్తూ గేమ్ ఆడండి. ఇక ఇవే కాకుండా మైదానములో ప్లేయర్స్ కొట్టుకున్న తిట్టుకున్నా లేదా ఒకరని ఒకరు ధూషించుకున్నవాళ్ళ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది నాలుగు లెవెల్స్ లో ఉంటుంది. ప్లేయర్ యొక్క యాక్షన్ తీవ్రతను బట్టి అతనికి ఏ లెవెల్లో శిక్ష వెయ్యాలనేది డిసైడ్ చేస్తారు.
ఇవి ఫ్రెండ్స్ క్రికెట్ లో ఉన్న మొత్తం 42 లాస్. అండ్ ఈ ఆర్టికల్ ద్వారా క్రికెట్ పై ఉన్న చాలా సందేహాలకు ఆన్సర్ దొరికిందని ఆశిస్తున్నా. మీరు గానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గానీ క్రికెటర్స్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ లాస్ అఫ్ క్రికెట్ ఆర్టికల్‌ను షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చెయ్యండి.