క్రికెట్ లో మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. కొన్ని మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని భాదను కలిగిస్తాయి. కానీ ఒక్కోసారి మనం ఊహించని సంఘటనలు చోటు చేసుకుని మనలని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంటాయి. అసలు క్రికెట్ లో ఇంతకముందు ఇలా జరిగిందా అనేటట్టు అబ్బురపరుస్తాయి. మరి అలాంటి క్రికెట్ లో 10 అరుదైన సంఘటనలు గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
10 Rare Funny Moments In Cricket (క్రికెట్ లో 10 అరుదైన సంఘటనలు)
10. Deadly Bouncer By A Spinner
క్రికెట్ లో స్పిన్ బౌలర్ బౌన్సర్ వెయ్యడం అనేది చాలా అరుదు. ఒకవేళ వేసిన గానీ మరి హెడ్ హైట్ లో డెడ్లి బౌన్సర్ వెయ్యరు. కానీ అఫ్గాన్ యంగ్ బౌలర్ కైస్ అహ్మద్ ఒకసారి రస్సెల్ కు ఒక డెడ్లి బౌన్సర్ వేసాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేస్తున్న రస్సెల్ కు సడెన్ గా బౌన్సర్ రావడంతో దాని నుండి తప్పించుకోవడం కోసం వెనక్కి వాలిపోయాడు. అండ్ వికెట్ కీపర్ తన తలపైన చేతులు పెట్టి ఈ బాల్ ను పట్టుకున్నాడంటే అది ఎంత డెడ్లి బౌన్సర్ అనేది మీరే అర్ధం చేసుకోవచ్చు. నిజంగా ఈ బాల్ ను లీవ్ చెయ్యడంలో రస్సెల్ చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా అతని తలకు బాల్ తగిలి ఉండేది.
9. Shahid Afridi The Pace King
క్రికెట్ లో స్పిన్ బౌలర్ నార్మల్ గా వేసే బౌలింగ్ స్పీడ్ అనేది అరౌండ్ 90 కిలోమీటర్స్ పర్ హౌర్ ఉంటుంది. కానీ పాకిస్థాన్ కు చెందిన స్పిన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఒకసారి ఏకంగా 134 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసాడు. న్యూజీలాండ్ తో జరిగిన ఒక టీ20 మ్యాచులో 14వ ఓవర్ 5 బంతిని టిమ్ సౌథీకు వేసినప్పుడు ఈ రికార్డు నమోదైంది. నార్మల్ గా భువీ లాంటి పేస్ బౌలర్ వేసే వేగాన్ని ఆఫ్రిది స్పిన్ బౌలింగ్ లోనే అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అండ్ ఇప్పటికి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక స్పిన్నర్ వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే. ఇక ఇలాంటి అనూహ్యమైన బాల్ ను ఎక్సపెక్ట్ చెయ్యని టిమ్ సౌథీ ఆఫ్రిది వేసిన రికార్డు బ్రేకింగ్ బాల్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
8. Russell Magic Run Out
క్రికెట్ లో మీరు ఇలాంటి రనౌట్ ఎప్పుడు చూసుండరు. ఒకసారి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మినిస్టర్ ఢాకా బాట్స్మన్ ఆండ్రే రస్సెల్ గల్లీ వైపు బాల్ కొట్టి సింగిల్ కోసం వెళ్ళాడు. అయితే అక్కడ ఫీల్డర్ బాల్ అందుకుని స్ట్రైకర్ ఎండ్ లో రన్ అవుట్ కోసం ట్రై చేసాడు. బట్ ఆ బాట్స్మన్ అప్పటికే క్రీజ్ లోకి వచ్చేసాడు. కానీ స్ట్రైకర్ ఎండ్ లో స్టంప్స్ కు తగిలిన బాల్ ఎదో మ్యాజిక్ చేసినట్టు రీబౌండ్ లో వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న స్టంప్స్ కు తగిలింది. దింతో బాల్ ను కొట్టి నెమ్మదిగా క్రీజ్ లోకి వెళ్తున్న బాట్స్మన్ అనుకోని రీతిలో రనౌట్ అయ్యాడు. నిజంగా క్రికెట్ లో ఇలాంటి రనౌట్ చాలా అంటే చాలా అరుదు.
7. Sehwag Kicks The Ball Over Boundary Line
2010వ సంవత్సరంలో మన టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఆమ్లా కొట్టిన ఒక బాల్ ను సెహ్వాగ్ కావాలని బౌండరీ లోపలకి కిక్ చేసాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం అప్పటికే 9 వికెట్లు కోల్పోయింది. దింతో సచిన్ వేసిన 130వ ఓవర్లో 5వ బంతికి 122 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న ఆమ్లా సింగిల్ తీసుకుందాం అని చెప్పి బాల్ ను స్లో గా ఆడాడు. కానీ ఆ బాల్ ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వెళ్ళిపోయింది. దింతో దాన్ని చేస్ చేసిన సెహ్వాగ్ ఆ బాల్ కు బౌండరీ వస్తే ఆమ్లా స్ట్రైక్ మారాడని చెప్పి బాల్ ను కావాలని బౌండరీ లోపలికి కిక్ చేసాడు.
Also Read – Top 10 High IQ Moments In Cricket (10 తెలివైన క్రికెటర్లు)
దింతో అంపైర్ సెహ్వాగ్ రూల్స్ కి విరుద్ధంగా ఫీల్డింగ్ చేసాడని చెప్పి సౌత్ ఆఫ్రికా టీంకు 5 పెనాల్టీ రన్స్ ను అవార్డుగా ఇచ్చారు. అంతేకాకుండా ఆ బాల్ కు సింగిల్ ఇవ్వడంతో పాటు ఆ ఓవర్ లాస్ట్ బాల్ కు మోర్కెల్ స్ట్రైక్ లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఎనీవే సెహ్వాగ్ చేసిన ఈ పని కారణంగా ఆ బాల్ కు మొత్తం 6 పరుగులు వచ్చాయి.
6. Umpire Cover Drive
2017వ సంవత్సరంలో మన టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు హేజెల్వుడ్ బౌలింగ్ లో పుజారా హుక్ షాట్ ఆడబోయి కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు. దింతో అంపైర్ పుజారా అవుటని చెప్పి తన ఫింగర్ ను పైకి రైజ్ చేసాడు. బట్ ఫీల్డింగ్ టీం నుండి ఎవరు అప్పీల్ చేయకపోవడంతో వెంటనే తన చేతిని టోపీ మీదకి పెట్టుకుని ఎదో గోక్కుంటున్నట్టు కవర్ చేసాడు. అయితే నిజానికి ఆ బాల్ బ్యాట్ కు తగల్లేదు.
అంపైర్ తగిలిందేమో అనుకుని అవుట్ ఇవ్వబోయాడు. బట్ ఎవరు అప్పీల్ చేయకపోవడంతో దాన్ని ఈ విధంగా కవర్ చేసాడు. ఎనీవే ది అంపైర్స్ లా ప్రకారం బాట్స్మన్ అవుటైనప్పుడు బౌలింగ్ టీం అప్పీల్ చేస్తేనే అంపైర్ బాట్స్మన్ ను అవుట్ ఇస్తాడు. లేకపోతే బాట్స్మన్ నిజంగా అవుటైనా సరే అవుట్ ఇవ్వడు. కానీ బాట్స్మన్ తనంతట తాను పెవిలియన్ కు వెళ్ళిపోతే మాత్రం అప్పీల్ చెయ్యనవసరం లేదు. బాట్స్మన్ ను అవుట్ గానే పరిగణిస్తారు. సో బాట్స్మన్ బౌల్డ్ లేదా క్లియర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు ఫీల్డింగ్ టీం అప్పీల్ చేయకుండానే తాను అవుటని తెలిసి పెవిలియన్ కు వెళ్ళిపోతాడు.
5. Did Babar Azam Forget Rules
పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్మన్ బాబర్ అజాం చేసిన ఒక వింతైన పని తన టీం పై 5 పరుగులు పెనాల్టీ పడేలా చేసింది. క్రికెట్ రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ టీంలో వికెట్ కీపర్ తప్ప మారే ఇతర ఫీల్డర్ గ్లోవ్స్ వేసుకుని ఫీల్డింగ్ చెయ్యకూడదు. అలా చేస్తే అది ఇల్లీగల్ ఫీల్డింగ్ అవుతుంది. కానీ వెస్టిండీస్ తో జరిగిన ఒక ఒన్డే మ్యాచ్ల్లో బాబర్ అజాం ఈ రూల్ ను అతిక్రమించాడు. ఆ మ్యాచులో బాట్స్మన్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన బాల్ ను తెచ్చేందుకు పాకిస్థాన్ వికెట్ కీపర్ ఒక గ్లొవ్ ను స్టంప్స్ దగ్గరలో పడేసి బాల్ కోసం వెళ్ళాడు. ఇక స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ సరదాగా ఆ గ్లోవ్ ను తీసుకుని తన చేతికి తొడుకున్నాడు.
Also Read – Virat Kohli Top 5 Revenge Moments (విరాట్ కోహ్లీ టాప్ 5 రివెంజ్ మూమెంట్స్)
అంతేకాకుండా వికెట్ కీపర్ విసిరిన త్రో ను క్యాచ్ పట్టాడు. దింతో అంపైర్ వెంటనే పాకిస్థాన్ టీం పై 5 రన్స్ పెనాల్టీ విధించి ఆ 5 పరుగులను వెస్టిండీస్ స్కోర్ కార్డుకు యాడ్ చేసారు. అయితే బాబర్ అజాం రూల్స్ తెలియక ఈ పని చేశాడా లేదా రూల్స్ తెలిసిన సరదా కోసం ఈ పని చేశాడా అనేది అతనికే తెలియాలి. ఎనీవే బాబర్ అజాం ఈ పని చేసే టైంకు పాకిస్తాన్ టీం గెలిచే పోజిషన్ లో ఉంది కాబట్టి ఈ పెనాల్టీ రన్స్ ఈ మ్యాచ్ ఫలితం పై ఎలాంటి ప్రభావం చూపించలేదు.
4. Amit Mishra Funny Run out
క్రికెట్ లో అదృష్టం దురదృష్టం అనేవి సెకండ్స్ లో మారిపోతాయి అనడానికి బెస్ట్ ఎక్సమ్పుల్ ఈ రనౌట్. 2014వ సంవత్సరంలో SRH బాట్స్మన్ అమిత్ మిశ్రా ఒకే బాల్ కు రెండు లైఫ్లు దక్కిన కూడా సేమ్ అదే బాల్ కు అవుట్ అయ్యాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో ఫాల్కనర్ వేసిన బాల్ ను మిస్ చేసిన మిశ్రా రన్ కోసం ట్రై చేసాడు. దింతో సంజు శాంసన్ అతన్ని రనౌట్ చేద్దాం అని బాల్ ను త్రో చేసాడు. బట్ అది వికెట్లను మిస్ అయ్యింది.
అయితే ఆ బాల్ ఫాల్కనర్ కు దొరకడంతో మళ్లీ రనౌట్ చేయడం కోసం బాల్ ను త్రో చేసాడు. బట్ బాట్స్మన్ అదృష్టం కొద్దీ ఆ బాల్ మళ్ళీ స్టంప్స్ ను మిస్ అయ్యింది. దింతో మిశ్రా కుంచెం రిలాక్స్ అయ్యాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సంజు మళ్లీ ఆ బాల్ ను అందుకుని ఈ సారి మిస్ అవ్వకుండా మిశ్రాను రనౌట్ చేసాడు. ఇక ఈ రనౌట్ చూసాక ప్లేయర్స్ తో కామెంటేటర్స్ కూడా నవ్వగాలేదు.
3. Inzamam-ul-Haq Have No Idea
ఒకసారి మన టీమిండియా మరియు పాకిస్థాన్ జట్ల మధ్య ఒన్డే మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్థాన్ బాట్స్మన్ ఇంజమాముల్ హాక్ మిడ్ ఆఫ్ వైపు బాల్ కొట్టి రన్ కోసం ట్రై చేసాడు. అయితే ఫీల్డర్ వేగంగా బాల్ అందుకుని వికెట్ల వైపు త్రో చేసాడు. బట్ ఇంజమమ్ కన్ఫ్యూషన్ లో బాల్ తనకి తగలకుండా బ్యాట్ అడ్డుపెట్టాడు. దింతో మనవాళ్ళు అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అవుట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ అతన్ని అవుట్ గా ప్రకటించాడు. సో ఫీల్డర్ వేసిన త్రోకు బాట్స్మన్ కావాలని అడ్డురాకూడదు. అలా వస్తే ఆ బ్యాట్సమన్ అవుట్. అయితే మ్యాచ్ తరువాత దీని గురించి ఇంజమూమ్ ను అడగగా నాకు ఈ రూల్ అర్థంకాలేదని వాపోయాడు.
ఇంతకముందు ఇంగ్లాండ్ పై ఇదే సిట్యుయేషన్ లో నేను కావాలని పక్కకి తప్పుకున్న. అప్పుడు నన్ను రన్ అవుట్ అన్నారు. ఇప్పుడేమో రనౌట్ అవకూడదని అడ్డు వస్తే మళ్ళీ నన్ను అవుట్ అన్నారు. ఈ రూల్స్ చాలా కంఫ్యూషన్ గా ఉన్నాయని తన భాదని చెప్పుకున్నాడు. అయితే నిజానికి ఫస్ట్ ఇన్సిడెంట్ లో అతను రనౌట్ అయితే సెకండ్ ఇన్సిడెంట్ లో అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అవుట్ గా వెనుతిరిగాడు. కానీ అతని మైండ్ లో రన్ అయ్యింది ఒక్కటే. మొన్న తప్పుకోవడం వల్ల అవుట్ అయ్యా సో ఇప్పుడు తప్పుకోకూడదని డిసైడ్ అయ్యాడు. ఏది ఏమైనా ఇంజమూమ్ ఇన్నోసెన్స్ వల్ల అతను రెండు సార్లు అనుకోని రీతిలో అవుట్ అయ్యాడు.
2. Chandimal Sixer Hurt A Teenager On Road
మాములుగా బాట్స్మన్ 6 కొట్టినప్పుడు ఆ బాల్ క్రౌడ్ లో ఎవరొకరికి తగలడం మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఒక్కోసారి అయితే గ్రౌండ్ బయట ఉండే వెహికల్స్ కూడా బాల్ తగులుతుంది. రీసెంట్ గా మన రోహిత్ కొట్టిన సిక్సర్ ఒకటి క్రౌడ్ లో ఉన్న చిన్నారికి తగిలింది. బట్ శ్రీలంక బాట్స్మన్ కొట్టిన ఒక సిక్స్ మాత్రం అసలు మ్యాచ్ తో సంబంధం లేకుండా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక కుర్రాడికి తగిలింది. సో రీసెంట్ గా ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ మ్యాచులో మంచి ఊపు మీద ఉన్న దినేష్ చండీమల్ స్టార్క్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ ను స్లాగ్ చేసాడు.
Also Read – About Ashes Series In Telugu (యాషెస్ సిరీస్ చరిత్ర)
దింతో ఆ బాల్ స్టేడియం బయట ఉన్న రోడ్ పై బౌన్స్ అయ్యి అక్కడే నడుస్తున్న ఒక కుర్రాడికి తగిలింది. అయితే లక్కీ గా ఆ బాల్ బౌన్స్ అయ్యి రావడంతో అతనికి బలంగా దెబ్బ తగలలేదు. దింతో పక్కనే అతని ఫ్రెండ్ బాల్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి మరో ఫ్రెండ్ ను అడిగాడు. బట్ ఆ ఫ్రెండ్ వద్దని చెప్పడంతో ఆ బాల్ ను తిరిగి స్టేడియంలోకి త్రో చేసాడు. ఎనీవే ఏదైతే చాలా రేర్ ఇన్సిడెంట్. మరి మీరు ఈ సిట్యుయేషన్ లో ఉంటె ఏం చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
1. Rashid Khan Broke The Stump
మనం మాములుగా ఒక ఫాస్ట్ బౌలర్ స్టంప్స్ విరిగిపోయేలా బౌలింగ్ చేయడం చూస్తుంటాం. కానీ 2017వ సంవత్సరంలో ఒక స్పిన్ బౌలర్ స్టంప్ విరిగిపోయేలా బౌలింగ్ చేసాడు. ఆ ఏడాది జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అఫ్గాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ CTG బాట్స్మన్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. అయితే రషీద్ స్పిన్ బౌలింగ్ దెబ్బకి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది. దింతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగా ఒక స్పిన్ బౌలర్ బౌలింగ్ లో ఇలా స్టంప్ బ్రేక్ అవ్వడం అనేది చాలా అంటే చాలా రేర్ ఇన్సిడెంట్. మే బీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ లో బడ్జెట్ లో లీగ్ నిర్వహించడం కోసం చైనా నుండి ఈ స్టంప్స్ ను తెచ్చి ఉంటారు. ఏదిఏమైనా రషీద్ ఖాన్ మాత్రం స్టంప్స్ ను బ్రేక్ చేసిన అరుదైన స్పిన్నర్ గా తన పవర్ చూపించాడు.